Goods and Services Tax

GST Simplified for your Business

1
జిఎస్టి కింద చార్టర్డ్ అకౌంటెంట్ల జీవితం
2
పరిగణన అనేది డబ్బుగా లేనప్పుడు సరఫరా యొక్క విలువను నిర్ణయించడం ఎలాగ
3
జిఎస్టి రేట్లు – సిద్ధంగా అంచనా (రెడీ రెకనర్)
4
రాష్ట్రాల వ్యాప్తంగా వినియోగదారులను కలిగి ఉన్నారా? జిఎస్టి మిమ్మల్ని ఎలాగ ప్రభావితం చేస్తుందో చూడండి
5
జిఎస్టి ఎలా చెల్లించాలి?
6
ప్రత్యేక వ్యాపార కేసుల్లో జిఎస్టి ఇన్వాయిస్ చేయడం
7
జిఎస్టి మరియు జిఎస్టి సిధ్ధమైన ఉత్పత్తి నుండి ఏమి ఆశించాలి?
8
జిఎస్టి కింద ఇ-వే బిల్లు గురించి మీరు తెలుసుకోవలసినది అంతా
9
‘నిర్దిష్ట’ సేవల సరఫరా ప్రదేశాన్ని ఎలా నిర్ధారించాలి
10
టాలీ సొల్యూషన్స్ ద్వారా రిప్రెసెంటేషన్లు – జిఎస్టి చట్టాలు మరియు నియమాలలో సమస్యలు

జిఎస్టి కింద చార్టర్డ్ అకౌంటెంట్ల జీవితం

Last updated on June 27th, 2017 at 10:05 am

జిఎస్టి ని గనక చూచినట్లయితే, వినియోగదారులకు – తక్కువ ధరల వాగ్దానంతో; వ్యాపారాలకు – సరళీకృత పరోక్ష పన్ను వ్యవస్థ వాగ్దానంతో; మరియు భారత ప్రభుత్వానికి – అధిక పన్ను ఆదాయం వాగ్దానంతో, అది ఒక వరంలాగా కనిపిస్తుంది. అయితేమరి, వ్యాపార పర్యావరణ వ్యవస్థలో జిఎస్టి ప్రవేశపెట్టబడటంతో మరియు క్రమక్రమంగా వ్యాపింపజేయబడటంతో విపరీతంగా ప్రయోజనం పొందే మరొక వాటాదారు ఉన్నారు, అది ఎవరంటే – చార్టర్డ్ అకౌంటెంట్.
Read More

పరిగణన అనేది డబ్బుగా లేనప్పుడు సరఫరా యొక్క విలువను నిర్ణయించడం ఎలాగ

Last updated on June 28th, 2017 at 03:43 pm

వస్తువుల మరియు సేవల యొక్క వెలకట్టడం అనేది చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశం. వస్తువులు మరియు సేవలు గనక తక్కువగా వెలకట్టబడినట్లయితే, ఇది తక్కువ పన్ను చెల్లింపుకు దారితీస్తుంది, ఇది అసంబద్ధతకు మరియు ఫలితంగా చట్టబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. మితిమీరి వెలకట్టడం అనేది అదనపు పన్నుల రూపంలో వ్యాపారాలకు ఆదాయం కోల్పోవడంగా పరిణమిస్తుంది. వస్తువులు మరియు సేవల యొక్క సరికాని లేదా దోషపూరిత వెలకట్టడం కారణంగా అస్పష్టతలను తొలగించడం మరియు చట్టపరమైన చర్యలను నివారించడం కోసం ఖచ్చితమైన పన్ను విధించదగిన విలువను నిర్ణయించేటప్పుడు వ్యాపారాలకు మార్గదర్శకాల వలె వ్యవహరించే వెలగట్టే పద్ధతులు చట్టం ద్వారా అందించబడ్డాయి.
మా పూర్వపు బ్లాగ్ వస్తువులు & సేవల విలువ జిఎస్టి కింద ఎలాగ నిర్ధారించబడుతుంది? లో మేము ప్రస్తుత వ్యవస్థలోని వివిధ వెలకట్టే పద్ధతులను గురించి, మరియు జిఎస్టి కింద లావాదేవీ ప్రాతిపదికన పన్ను విధించదగినది అయిన సరఫరా యొక్క విలువను నిర్ణయించడం గురించి కూడా చర్చించాము. సరఫరా కోసం ధర అనేది ఏకైక పరిగణనగా ఉన్నప్పుడు మరియు సరఫరాదారు మరియు గ్రహీత ఇద్దరికీ మధ్య సంబంధం లేనప్పుడు లావాదేవీ విలువని వెలగట్టే విధానంగా వర్తింపజేయవచ్చు. (ఈ బ్లాగ్ పోస్ట్ ని జిఎస్టి కింద సంబంధిత పక్షాల లావాదేవీలు పై చదవండి).
అయితే, ధర అనేది ఏకైక పరిగణనగా లేని సందర్భాల్లో లేదా సంబంధిత వ్యక్తులు లేదా విభిన్న వ్యక్తులు (అదే పాన్(PAN)కు చెందిన 2 యూనిట్ల మధ్య) మధ్య సరఫరా జరిగి ఉన్నచోట, లావాదేవీ విలువ పద్ధతి వర్తింపజేయడం వీలుకాదు. అటువంటి సందర్భాల్లో, సరఫరా యొక్క పన్ను పరిధిలోకి వచ్చే విలువను నిర్ణయించడానికి వెలకట్టడం నియమాల క్రింద వివిధ కొలమానాలు నిర్వచించబడ్డాయి. ఈ క్రిందివి వివిధ దృష్టాంతాలు:
1. పరిగణన అనేది పూర్తిగా డబ్బుగా లేని చోట వస్తువులు లేదా సేవల సరఫరా విలువ
2. వేర్వేరు లేదా సంబంధిత వ్యక్తుల మధ్య వస్తువుల లేదా సేవలు లేదా రెండింటి సరఫరా విలువ
3. ఒక ఏజెంట్ ద్వారా చేయబడిన వస్తువుల సరఫరా విలువ
ఈ బ్లాగులో, పరిగణన అనేది పూర్తిగా డబ్బుగా లేని చోట వస్తువులు లేదా సేవల సరఫరా విలువ

Valuation of supply of goods or services where the consideration is not wholly in moneyClick To Tweet సరఫరా కోసం పరిగణన పూర్తిగా డబ్బుగా లేకపోవడాన్ని’ మనం భావించే ముందు, వర్తకం అనేది, ప్రముఖంగా ‘బార్టర్ సిస్టమ్’ అని పిలువబడే వస్తువుల మార్పిడి కోసం చేయబడిన నాగరికత ప్రారంభ రోజులలోకి మనం వెనక్కి వెళ్దాము.. ‘ఈ విధానంలో, ప్రజలు డబ్బుపరంగా ఎలాంటి పరిగణన లేకుండా, వస్తువులను లేదా/మరియు సేవలను అందుకు బదులుగా ఇతర వస్తువులను లేదా/మరియు సేవల కోసం మార్పిడి చేసుకునేవారు. ఈ రోజు శతాబ్దం క్రితపు మార్పిడి వ్యవస్థ అధునాతన మార్గం -” ఎక్స్చేంజ్ ఆఫర్” లో మళ్ళీ తిరిగొచ్చింది. ఈ పథకం కింద, వస్తువులు పాక్షికంగా డబ్బుని పరిగణనగా మరియు పాక్షికంగా పాత వస్తువుల మార్పిడికి వస్తువులు విక్రయించబడతాయి. ఉదాహరణకు, ఒక పాత వాషింగ్ మెషిన్ తో మార్పిడి చేసిన తర్వాత ఒక వాషింగ్ మెషీన్ రూ.25,000 కు విక్రయించబడింది.
పైన చెప్పిన ఉదాహరణలో రూ.25,000 లావాదేవీ విలువ అని మీరు అనుకుంటే, మీరు ఇబ్బందుల్లో ఉంటారు మరియు ఇది సంభావ్యంగా వ్యాజ్యానికి దారి తీయవచ్చు. ఇది ఎందుకంటే వాషింగ్ మెషీన్ సరఫరా కోసం పరిగణనలోకి తీసుకున్న ధరలో రూ.25,000 కేవలం ఒక భాగం మాత్రమే మరియు అది లావాదేవీ విలువను వర్తింపచేయడానికి అవసరమైన సంపూర్ణ ధర కాదు.అందువల్ల, అటువంటి రకాలైన సరఫరాల కోసం, క్రింది విలువలను వర్తింపజేయడం ద్వారా సరఫరా విలువను పొందాలి:
1. అటువంటి సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ
2. ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనట్లయితే, సరఫరా సమయంలో అటువంటి డబ్బుపరమైన విలువ గనక తెలిసి ఉన్నట్లయితే, డబ్బుపరంగా పరిగణన మరియు డబ్బుపరంగా లేని పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ మొత్తాల యొక్క మొత్తం.
దశలు 1 మరియు 2 వర్తింపజేయడం ద్వారా విలువ గనక నిర్ణయించబడలేకపోతే, అటువంటి రకమైన మరియు నాణ్యతగల వస్తువుల లేదా/ మరియు సేవల సరఫరా విలువ పరిగణించబడుతుంది

ఉదాహరణలతో సరఫరా విలువను కట్టేందుకు మనం ఈ కొలమానాల్లో ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుందాం.

1. సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ

వస్తువులు లేదా సేవల సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అనేది జిఎస్టి మరియు లావాదేవీ కోసం ఒక వ్యక్తి చెల్లించదగిన సుంకాన్ని మినహాయించి డబ్బుపరంగా పూర్తి విలువ అయి ఉంటుంది.
మనం ఒక వాషింగ్ మెషీన్ ఉదాహరణను పరిశీలిద్దాం. ఒక వాషింగ్ మెషీన్ తో మార్పిడితో రూ. 25,000కు ఒక వాషింగ్ మెషీన్ సరఫరా చేయబడింది. మార్పిడి లేకుండా వాషింగ్ మెషీన్ ధర రూ.30,000 రూపాయలు ఉంటే, అప్పుడు ఓపెన్ మార్కెట్ విలువ రూ .30,000 ఉంటుంది, అందువలన, ఈ విలువపై జిఎస్టి విధించబడుతుంది.

2. డబ్బులో పరిగణన యొక్క పూర్తి మొత్తం మరియు డబ్బులో కాకుండా పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ

వస్తువుల లేదా సేవల యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనప్పుడు ఈ వెలకట్టే పద్ధతి వర్తిస్తుంది. పన్ను విధించదగిన విలువకు రావడానికి, డబ్బులో అందుకున్న మొత్తం పరిగణనగా తీసుకున్న ఉత్పత్తులు లేదా సేవల యొక్క డబ్బుపరమైన విలువతో జోడించబడుతుంది.

పన్ను పరిధిలోకి వచ్చే విలువ = డబ్బులో పరిగణన + డబ్బులో లేని పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ

ఉదాహరణ

ప్రెస్టీజ్ ఇన్నోవేటర్స్ ఒక పాత ఎసి మార్పిడి చేసుకునే ఒక ఆఫర్ తో ఒక విశ్వసనీయ వినియోగదారునికి ఒక కొత్త ఇన్వర్టర్ ఎసిని అది లాంచ్ చేయబడటానికి పూర్వం రూ.45,000 కి సరఫరా చేసింది. సరఫరా సమయంలో పాత ఎసి యొక్క విలువ రూ.10,000, కానీ సరఫరా చేయబడిన ఇన్వర్టర్ ఎసి యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేదు.
పన్ను విధించబడదగిన విలువకు చేరడం కోసం, ప్రెస్టీజ్ ఇన్నోవేటర్స్ లావాదేవీ విలువను వర్తింపజేయలేదు ఎందుకంటే ధర ఒక్కటే పరిగణన కాదు కాబట్టి. మార్కెట్ విలువ అందుబాటులో లేనందున ఓపెన్ మార్కెట్ విలువ కూడా వర్తింపజేయబడలేదు. అటువంటి సందర్భంలో, పన్ను పరిధిలోకి వచ్చే విలువ అనేది డబ్బులో స్వీకరించిన పరిగణన మొత్తం యొక్క మొత్తం ప్లస్ పరిగణనగా పొందబడిన ఉత్పత్తి లేదా సేవల యొక్క డబ్బుపరమైన విలువ అయి ఉంటుంది. అందువల్ల, ఎసి యొక్క సరఫరా చేయదగిన పన్ను విలువ ఇలా ఉంటుంది:

డబ్బులో పరిగణన అనేది రూ 45,000 + ఎసి యొక్క డబ్బుపరమైన విలువ రూ 10,000 = రూ.55,000

3. అదే రకం మరియు నాణ్యత గల వస్తువుల మరియు/లేదా సేవల సరఫరా విలువ

వస్తువులు లేదా సేవల యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనప్పుడు మరియు డబ్బులో పరిగణనను వర్తింపజేయడం ద్వారా విలువ నిర్ధారించబడలేనప్పుడు మరియు పరిగణన యొక్క విలువ డబ్బుపరమైన విలువ డబ్బుగా లేనప్పుడు ఈ పద్ధతి వర్తిస్తుంది. అటువంటి సందర్భంలో, వస్తువుల మరియు / లేదా సేవల సరఫరా విలువ అనేది సరఫరా చేయబడుతున్న ఉత్పత్తి యొక్క ‘ అదే రకమైన మరియు నాణ్యతగల’ ఉత్పత్తుల ధరల ఆధారంగా నిర్ణయించబడుతుంది. సరఫరా చేయబడే వస్తువులు మరియు సేవలు అదే రకం అదే లక్షణాలు, నాణ్యత, పరిమాణం, పనిచేసే భాగాలు, పదార్థాలు మరియు ఖ్యాతిని కలిగి ఉండాలి లేదా సదరు వస్తువులు లేదా సేవలతో సన్నిహితంగా లేదా గణనీయంగా సమానంగా ఉండాలి అనే లాంటి కారకాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ‘అదే రకమైన మరియు నాణ్యత గల’ ఉత్పత్తుల విలువ నిర్ణయించబడుతుంది.

ఉదాహరణ

మోడరన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఒక కొత్త ఉత్పత్తి ‘ఐఒటి-యూనివర్సల్ రిమోట్ ఆర్గనైజర్’ ను ప్రవేశపెట్టింది, ఇది ఉత్పత్తి ప్రమోషన్లో భాగంగా వినియోగదారులకు అందించబడుతోంది. ఈ సందర్భంలో, ఉత్పత్తి మొదటిసారిగా ప్రవేశపెట్టబడుతోంది కాబట్టి, ‘ఓపెన్ మార్కెట్ విలువ’ పద్ధతిని ఉపయోగించడం ద్వారా లేదా ‘డబ్బులో పరిగణన మరియు డబ్బులో లేని పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ’ను పరిగణించడం ద్వారా విలువ నిర్ణయించబడలేదు. ఈ సందర్భంలో, విలువను నిర్ణయించడానికి, చివరి పద్ధతి – ‘అదేరకం మరియు నాణ్యత గల’ ఒక ఉత్పత్తితో సరిపోల్చడం వర్తింపజేయవచ్చు.
ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వద్ద రూ. 10,000 కు విక్రయించబడుతున్న ఒక ఉత్పత్తి ఉంది, ఇది అదేరకం ఆకృతీకరణ మరియు పనితీరుతో అదనపు యుఎస్బి పోర్టు కలిగి ఉంది. అందువల్ల, ‘’ఐఒటి-యూనివర్సల్ రిమోట్ ఆర్గనైజర్’ యొక్క విలువ పన్ను మదింపు అవసరాల కోసం రూ .10,000 గా వెలకట్టబడుతుంది.

ఉపయోగించడం ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది మా రాబోయే బ్లాగ్లలో మరింత వివరంగా వివరించబడుతుంది.

రాబోయే బ్లాగులు

1. వేర్వేరు లేదా సంబంధిత వ్యక్తుల మధ్య వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా యొక్క విలువ
2. ఏజెంట్ ద్వారా చేయబడిన వస్తువుల సరఫరా విలువ

జిఎస్టి రేట్లు – సిద్ధంగా అంచనా (రెడీ రెకనర్)

Last updated on June 27th, 2017 at 01:27 pm

2017 మే 18నాడు, జిఎస్టి కౌన్సిల్ 98 కేటగిరీల్లో 1211 వస్తువుల కోసం ఎంతగానో ఎదురుచూసిన జిఎస్టి రేట్లను నిర్ధారించి ఖరారు చేయడానికి సమావేశమైంది. సరిగ్గా ఆ మరుసటిరోజు, 36 వర్గాల సేవల కోసం జిఎస్టి రేట్లను ఖరారు చేయడానికి కౌన్సిల్ తిరిగి సమావేశమైంది.
ప్రారంభించడానికి, , భారతప్రభుత్వపు ఆర్ధిక మంత్రిత్వశాఖ, రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆధియా దాదాపు 81% వస్తువులు 18% జిఎస్టి రేటు స్లాబ్ మరియు అంతకు తక్కువగా వర్గీకరించబడతారని పేర్కొన్నరు; మిగిలిన 19% అంశాలకి 28% ఇంకా ఆపైన పన్ను విధించబడతాయి Read More

రాష్ట్రాల వ్యాప్తంగా వినియోగదారులను కలిగి ఉన్నారా? జిఎస్టి మిమ్మల్ని ఎలాగ ప్రభావితం చేస్తుందో చూడండి

Last updated on June 27th, 2017 at 09:46 am

ప్రతి వ్యాపారం యొక్క అంతిమ కల పెరుగుదల మరియు విస్తరణ. ఒకరు ఒక వ్యాపారం ప్రారంభించి, లాభాన్ని సంపాదించి, తిరిగి పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభం సంపాదిస్తారు – మరియు ఆ చక్రం కొనసాగుతుంది. మీకు మీ మొదటి కస్టమర్ వస్తారు, అప్పుడు 10 ఆ తర్వాత 100 మందిని పొందుతారు. మీరు మీ తక్షణ ప్రాంతం నుండి మొదలుపెడతారు, మరియు మీరు పెరిగేకొద్దీ మీ కార్యకలాపాలను మీ నగరం, మీ రాష్ట్రం, పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తారు – మొత్తం దేశం మీ ప్లేగ్రౌండ్ అయ్యేంతవరకు విస్తరిస్తారు. Read More

జిఎస్టి ఎలా చెల్లించాలి?

Last updated on June 27th, 2017 at 10:00 am

ప్రతి రిజిస్టర్ చేయబడిన రెగ్యులర్ పన్ను చెల్లింపుదారు నెలవారీ ప్రాతిపదికన జిఎస్టి రిటర్న్ లను సమకూర్చాలి మరియు ఆ నెల 20 వ తేదీ నాటికి పన్ను చెల్లించాలి. ఒక పన్ను చెల్లింపుదారు గనక బాకీ ఉన్న పన్ను చెల్లించకపోతే, చెల్లించవలసిన పన్ను పై పన్ను చెల్లించవలసిన గడువు తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది.
Read More

ప్రత్యేక వ్యాపార కేసుల్లో జిఎస్టి ఇన్వాయిస్ చేయడం

Last updated on June 23rd, 2017 at 07:32 pm

జిఎస్టి వ్యవస్థలో విస్తారంగా రెండు రకాల ఇన్వాయిస్లు జారీ చేయబడతాయి – పన్ను ఇన్వాయిస్ మరియు సరఫరా యొక్క బిల్లు. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల లేదా సేవల సరఫరా కోసం ఒక నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ద్వారా పన్ను ఇన్వాయిస్ జారీ చేయబడాలి. మినహాయింపు వస్తువులు లేదా సేవల సరఫరా కోసం ఒక నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ద్వారా మరియు సరఫరాల కోసం ఒక కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారుల ద్వారా సరఫరా యొక్క బిల్లు జారీచేయబడవలసి ఉంటుంది.
ఈ బ్లాగ్లో, జిఎస్టి చట్టంలో తాజా చేర్పులను పరిశీలిస్తే, నిర్దిష్ట వ్యాపార కేసుల్లో జారీచేయబడవలసిన ఇన్వాయిస్లు మరియు ఈ ఇన్వాయిసుల్లో పేర్కొనవలసిన వివరాలను మనం అర్థం చేసుకుందాం. Read More

జిఎస్టి మరియు జిఎస్టి సిధ్ధమైన ఉత్పత్తి నుండి ఏమి ఆశించాలి?

Last updated on June 28th, 2017 at 03:12 pm

జిఎస్టి రోల్-ఔట్ కి సిద్ధం కావడానికి మీకు కేవలం కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు మిమ్మల్ని మీరు వేసుకునే అనేక ప్రశ్నల్లో, ‘ జిఎస్టి కోసం మెరుగ్గా సిద్ధమై ఉండేటందుకు నా సిస్టమ్లో, నా పన్ను కన్సల్టెంట్ నుండి, లేదా వ్యాపార ప్రక్రియలలో నేను ఏ మార్పుల కోసం చూడాలి? అనేది బహుశా జాబితా పైన ఉండి ఉంటుంది.
Read More

జిఎస్టి కింద ఇ-వే బిల్లు గురించి మీరు తెలుసుకోవలసినది అంతా

Last updated on June 23rd, 2017 at 07:19 pm

భారతదేశం ఒక ఫెడరల్ దేశం అయి ఉండటంతో, ఉత్పాదన మరియు సేవలను అందించడం పై విధులు మరియు పన్నులను విధించేందుకు రాజ్యాంగం ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారం పొంది ఉంది. రాష్ట్ర పరిధులలో వస్తువుల తరలింపు కలిగి ఉండే రాష్ట్ర అంతర్గత విక్రయాలపై పన్ను విధింపుకు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు అధికారం కలిగివున్నాయి. వస్తువుల విక్రయం వేర్వేరు రాష్ట్రాల మధ్య వస్తువులు తరలింపు కలిగి ఉన్నప్పుడు, అలాంటి అమ్మకాలపై పన్ను విధించేందుకు కేంద్రం అధికారం కలిగి ఉంటుంది మరియు ఆ విధంగా సేకరించిన ఆదాయం కేంద్రం మరియు రాష్ట్రం ద్వారా పంచుకోబడుతుంది. Read More

‘నిర్దిష్ట’ సేవల సరఫరా ప్రదేశాన్ని ఎలా నిర్ధారించాలి

GST - Supply of Specific Services

Last updated on June 28th, 2017 at 04:20 pm

మా పూర్వ బ్లాగులో సేవల సరఫరాను నిర్ణయించడానికి సాధారణ నియమాల గురించి మేము చర్చించాము. నిర్దిష్ట సేవల విషయంలో సరఫరా స్థలాలను ఎలా నిర్ధారించాలో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.
(more…)

టాలీ సొల్యూషన్స్ ద్వారా రిప్రెసెంటేషన్లు – జిఎస్టి చట్టాలు మరియు నియమాలలో సమస్యలు

Last updated on June 27th, 2017 at 10:13 am

గడుస్తున్న ప్రతి రోజుతోను, జిఎస్టి వాస్తవికతగా మారేందుకు దగ్గర అవుతోంది. చట్టం తయారుచేసేవారు, జిఎస్టి చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రక్రియలో భాగంగా, ప్రజాభిప్రాయము కొరకు ముసాయిదా చట్టం యొక్క నకలును ప్రభుత్వం బహిరంగ డొమైన్ లో అందుబాటులో ఉంచటం జరిగింది. టాలీ వద్ద మేము చట్టాన్ని, నియమాలని మరియు విధానాలని వివరంగా పరిశీలించాము. మేము చదివి అర్ధము చేసుకున్నదాని ప్రకారం, చట్టంలోని అనేక అంశాలని పునః సందర్శించి మరియు మార్పుచేయవలసి ఉన్నది అని తోస్తుంది ఎందుకంటే వాటి ప్రస్తుత రూపంలో అవి సంభావ్యంగా దేశంలోని చిన్న మరియు మధ్యమ వ్యాపారస్తులకు తద్వారా ఆర్ధిక వ్యవస్తకు బలమైన హాని కలిగించేవిగా ఉన్నట్లున్నాయి కాబట్టి.
Read More

© Tally Solutions Pvt. Ltd. All rights reserved - 2017