జిఎస్‌టి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లభ్యత కోసం మీ చెక్‌లిస్ట్

Last updated on August 3rd, 2017 at 06:42 pm

Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

ప్రస్తుత పన్ను సరళిలో, న్పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికోసం వివిధరకాల నిబంధనలు వర్తిస్తాయి. వాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ క్రింద ఇవ్వబడింది:

ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రకము ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందడానికి నిబంధనలు (ఐటిసి)
వ్యాట్ వ్యాట్ డీలర్ గా, వ్యాపారం జరుగునప్పుడు కొనుగోలుచేసిన వస్తువులపై , తిరిగి విక్రయం కొరకు లేదా వస్తువుల తయారీకి చెల్లించబడిన వ్యాట్ యొక్క క్రెడిట్ ను, మీరు షరతులకు లోబడి పొందవచ్చు. రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోబడిన డీలర్స్ నుండి చేసిన కొనుగోళ్లకు మాత్రమే ఐటిసి కొరకు అర్హత ఉంటుంది.
సిఇఎన్‌విఎటి/సర్వీస్ టాక్స్ తయారీదారుని లాగా, మీరు సిఇఎన్‌విఎటి క్రెడిట్ ను, తుది ఉత్పాదనల తయారీకి సంబంధించిన ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వినియోగించబడిన అన్ని ఇన్పుట్స్ పై అందుకోవచ్చు.
మీరు ఒక టాక్సబుల్ సర్వీస్ ను అందించే ఒక సర్వీస్ అందించేవారైతే, మీరు టాక్సబుల్ సర్వీసులను అందించుట కొరకు వినియోగించే ఇన్పుట్ సర్వీసులపై చెల్లించబడిన సర్వీస్ టాక్స్ పై ఐటిసిని పొందవచ్చు.

జిఎస్‌టి నిర్వహణ క్రింద, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అనేది వినియోగించబడిన లేదా వ్యాపారం జరుగునప్పుడు లేదా ముందు భవిష్యత్తులో వినియోగించాలనే ఉద్దేశం ఉన్న రిజిస్టర్ చేసుకోబడిన అన్ని ఇన్పుట్స్ పై టాక్స్ చెల్లింపు ప్రతి వ్యక్తి ద్వారా అందుకోబడవచ్చు.

ఇది, కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. జిఎస్‌టి క్రింద ఇన్పుట్ క్రెడిట్ ను అందుకోవడానికి సంతృప్తి పరచాల్సిన కొన్ని షరతులు ఈ క్రింద తెలుపబడ్డాయి:

  1. మీ వద్ద ఒక రిజిస్టర్డ్ వ్యక్తి ద్వారా జారీ చేయబడిన టాక్స్ ఇన్వాయిస్/డెబిట్ లేక క్రెడిట్ నోట్ ఉండాలి.
  2. వస్తువులు/సర్వీసులు అందుకోబడి ఉండాలి.
  3. సంబంధిత నెల కొరకు మీరు జిఎస్టిఆర్-3 ను ఫైల్ చేసి ఉండాలి
  4. ఛార్జ్ చేయబడిన టాక్స్, సరఫరాదారుని ద్వారా ప్రభుత్వానికి నగదు రూపంలో లేదా ఐటిసి వినియోగం ద్వారా చెల్లించబడాలి.

conditions for availing GST Input Tax Credit

జిఎస్‌టి క్రింద ఐటిసి అందుకోవడానికి మీరు అర్హత పొందగల పరిస్థితులను మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం.

జిఎస్‌టి క్రింద ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అందుకోగల పరిస్థితులు

మీరు జిఎస్‌టి క్రింద రిజిస్ట్రేషన్ కొరకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి

మీరు జిఎస్‌టి క్రింద 2 పద్ధతులలో రిజిస్ట్రేషన్ కొరకు దరఖాసు చేసుకోవచ్చు:

  1. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కట్టుబడి ఉన్నారు
    లేదా
  2. మీరు రిజిస్ట్రేషన్ కొరకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవాలి
  • మీరు జిఎస్‌టి క్రింద రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, రిజిస్టర్ చేసుకోవడానికి బాధ్యత వహించినప్పుడు

రిజిస్టర్ చేసుకోవడానికి బాధ్యత వహించినప్పుడు జిఎస్‌టి క్రింద రిజిస్ట్రే షన్ కొరకు దరఖాస్తుచేసుకున్నప్పుడు, మీరు స్టాక్ లోని పాక్షికంగా పూర్తయిన లేదా పూర్తయిన వస్తువులలో ఉన్న అవుట్ పుట్స్ మరియు ఇన్పుట్స్ పై ఐటిసిని, మీరు టాక్స్ చెల్లించాల్సిన తేదీకి ఒక రోజు ముందు పొందవచ్చు, అయితే మీరు వీటిని కలిగి ఉండాలి:

      • మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అర్హత పొందిన తేది నుండి 30 రోజులు రోలుల లోపల రిజిస్ట్రేషన్ కు దరఖాసు చేసి ఉండాలి మరియు
      • రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడి ఉండాలి

ఉదాహరణ: మీరు దుస్తుల తయారీదారు మరియు రిజిస్ట్రేషన్ పరిమితిని 1 అక్టోబర్ 2017 నాటికెల్లా దాటేసారు. ఈ రోజుకు మీవద్ద రూ. 5,00,000 ల విలువగల ముడిసరుకుల స్టాక్ ఉంది మరియు మీరు వాటిపై @18% జిఎస్‌టి (రూ;.90.000) చెల్లించారు. మీరు 1 అక్టోబర్ 2017 నుండి 30 రోజుల లోపల రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సినదిగా నిర్ధారించుకోవాలి. లేకపోతే, మీరు స్టాక్ లో ఉన్న ముడిసరుకులపై రూ.90,000 ల యొక్క ఐటిసి అర్హతను కోల్పోతారు.

  • మీరు రిజిస్ట్రేషన్ కొరకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు

మీరు రిజిస్ట్రేషన్ కొరకు ప్రవేశ పరిమితిని దాటకపోయినా కూడా, చట్టంయొక్క నియమాలు, ’స్వచ్ఛంద రిజిస్ట్రేషన్ ’ కొరకు అనుమతిస్తాయి. మీరు apply జిఎస్‌టి రిజిస్ట్రేషన్ కొరకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేస్తే, మీరు స్టాక్ లో ఉన్న ఇన్పుట్స్ మరియు స్టాక్ లో ఉన్న పాక్షికంగా పూర్తయిన లేదా పూర్తయిన ఇన్పుట్స్ పై ఐటిసిని, మీకు రిజిస్ట్రేషన్ మంజూరుచేయడానికి ముందు రోజు పొందవచ్చు.
ఉదాహరణ: మీరు ఎలెక్ట్రానిక్ ఉత్పత్తుల డీలర్ మరియు మీ వ్యాపార నిర్వహణల వలన, ప్రవేశ పరిమితి దాటకున్నా కూడా, మీరు రిజిస్ట్రేషన్ కొరకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారు. మీరు 10 సెప్టెంబరు 2017 న రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడినది మరియు మీ వద్ద స్టాక్ లో రూ. 2,00,000 ల విలువగల ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులున్నాయి, వీటిపై జిఎస్‌టి @18% (రూ. 36,000) చెలిఇంచబడింది. మీరు స్టాక్ లోని ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులపై రూ 36,000 ల ఐటిసిని పొందవచ్చు.

మీరు మేళవింపు పథకాన్ని వదిలి, ఒక క్రమవారీ డీలర్ అయినప్పుడు

మీరు మేళవింపు పథకం క్రింద రిజిస్టర్ చేసుకుని ఉంటే మరియు మీ టోకు టర్నోవర్ రూ.50 లక్షలు దాటితే, మీరు మేళవింపు పథకం నుండి వెళ్ళిపోయి, ఒక క్రమవారీ డీలర్ గా మారాల్సి ఉంట్ఘుంది. మీరు మేళవింపు పథకం వదిలివేసినప్ ప్పుడు మరియు ఒక క్రమవారీ డీలర్ గా మారినప్పుడు, ఇన్పుట్స్ పైన, స్టాక్ లో ఉన్న పాక్షికంగా పూర్తయిన లేదా పూర్తయిన వస్తువులలో ఉన్న ఇన్పుట్స్ పైన, మరియు మీరు టాక్ చెల్లించాల్సిన తేదీకి ముందు రోజు మూల వస్తువులపైన ఐటిసిని పొందవచ్చు. మూలవస్తువులపైన క్రెడిట్, పాయింట్ల శాతం ద్వారా తగ్గించబడతాయి, ఇది తెలపబడుతుంది.

ఉదాహరణ: మీరు ఒక మేళవింపు డేఎలర్ గా జిఎస్‌టి క్రింద రిజిస్టర్ చేసుకున్నారు మరియు మీ టర్నోవర్ ఇప్పుడు రూ. 50 లక్షలు దాటింది. అందుచేత, మీరు మేళవింపు పథకాన్ని వదిలి, ఒక క్రమవారీ డీలర్ అయ్యారు. మీ టర్నోవర్ 10 అక్టోబర్ 2017 కు రూ. 50 లక్షలు దాటింది మరియు 9 అక్టోబర్ 2017 న మీ స్టాక్ లో ఈ క్రింది ఇన్పుట్స్ ఉన్నాయి-

ఇన్పుట్ రకము విలువ (రూ.) GST చెల్లింపు @ 18% (రూ.)
ముడి సరుకులు 1,00,000 18,000
పాక్షికంగా-పూర్తయిన వస్తువులలో ఇన్పుట్స్ 50,000 9,000
పూర్తయిన వస్తువులలో ఇన్పుట్స్ 1,50,000 27,000
మొత్తం చెల్లించబడిన ఇన్పుట్ ట్యాక్స్ 54,000

మీరు రూ. 54,000 ల పూర్తి ఐటిసిని మరియు మూల వస్తువులపై ఐటిసిని పొందవచ్చు (నోటిఫై చేయబడిన పాయింట్ల శాతం ద్వారా తగ్గించబడింది).

మినహాయించబడిన వస్తువులు లేదా సర్వీసులు టాక్స్ చేయదగినవైనప్పుడు

జిఎస్టి నుండి మినహాయించినట్లుగా ప్రకటించబడిన వస్తువులు లేదా సర్వీసులు టాక్స్ చెల్లించబడాలని చేసినప్పుడు, మీరు ఆ సరఫరా టాక్స్ చెల్లించేందిగా మారే ముందురోజు ఈ క్రింది వాటిపై ఐటిసి ని పొందవచ్చు.

  • స్టాక్ లోని ఇన్పుట్స్ మరియు స్టాక్ లోని పాక్షికంగా పూర్తయిన లేదా పూర్తయిన వస్తువులలో ఉన్న ఇన్పుట్స్, ఇవి సరఫరా మినహాయింపుకు సంబంధించి ఉండాలి
  • మూల వస్తువులు ప్రత్యేకంగా సరఫరా మినహాయింపు కొరకు వినియోగించబడ్డాయి. మూల వస్తువుల పై క్రెడిట్, పాయింట్ల శాతం ద్వారా తగ్గించబడి, తెలుపబడతాయి.

ఉదాహరణ:ఉదాహరణ: మీరు ఒక మినహాయించబడిన వస్తువును తయారు చేస్తారు. ఈ మినహాయించబడిన వస్తువు 5 డిసెంబరు 2017 న టాక్స్ వేయడానికి సిద్ధంచేయబడింది. మీ వద్ద స్టాక్ లో 4 డిసెంబర్ 2017 నాటికి ఈ క్రింది ఇన్పుట్స్ (మినహాయించబడిన వస్తువును తయారు చేయడానికి వాడబడినవి) ఉన్నాయి-

క్లోజింగ్ స్టాక్ – 4.12.2017
ఇన్పుట్ విలువ (రూ.) చెల్లించిన జిఎస్‌టి@ 18% (రూ.)
ముడి సరుకు ఎ 3,00,000 54,000
ముడి సరుకు బి 30,000   5,400
మొత్తం 3,30,000 59,400

మీరు టాక్స్ వేయదగినదిగా చేసిన మినహాయింపు వస్తువులను తయారు చేయడానికి వినియోగించబడిన ఇన్పుట్స్ పై రూ. 59,400 ల పూర్తి ఐటిసిని పొందవచ్చు. మీరు మినహాయించబడిన సరఫరా కోసం ప్రత్యేకంగా వినియోగించబడిన మూల వస్తువులపై కూడా ఐటిసిని పొందవచ్చు, ఇవి పాయింట్ల శాతం ద్వారా తగ్గించబడతాయి, మరియు తెలపబడతాయి.

వ్యాపారం యొక్క విక్రయం / విలీనం / విభజన / సమ్మేళనం / లీజు / బదిలీ సంభవించినప్పుడు

వీటిలో ఏ సందర్భంలోనైనా, బాధ్యతల బదిలీ కొరకు ఒక నిర్ధిష్ట నిబంధన ఉంటే, వినియోగించబడని ఐటిసిని ఆ విక్రయించబడిన, విలీనం చేయబడిన, విభజించబడిన, సమ్మేళించబడిన, లీజు ఇవ్వబడిన, లేదా బదిలీ చేయబడిన వ్యాపారానికి బదిలీ చేయవచ్చు.
ఉదాహరణ: ఉదాహరణ: మోహన్ ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన వ్యాపారన్ని రాం ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించింది. విక్రయ సమయంలో, మోహన్ ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద రూ. 2,50,000 ల వినియోగించబడని ఐటిసి ఉంది. విక్రయ ఒప్పందంలో, మోహన్ ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అన్ని బాధ్యతలు మరియు ఆస్తులు కూడా రాం ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేయాలనే ఒప్పందం జరిగింది. ఈ సందర్భంలో మోహన్ ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తన వినియోగించబడని రూ. 2,50,000 ల ఐటిసిని రాం ఎలెక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేయవచ్చు.

వ్యాపారం కొరకు మరియు ఇతర ఉద్దేశాల కొరకు, వస్తువులు మరియు/లేదా సర్వీసులు పాక్షికంగా వినియోగించబడినప్పుడు

వ్యాపారం కొరకు మరియు ఇతర ఉద్దేశాల కొరకు, వస్తువులు మరియు/లేదా సర్వీసులు పాక్షికంగా వినియోగించబడినప్పుడు, వ్యాపార ఉద్దేశం కొరకు వినియోగించబడిన భాగంపై మాత్రమే ఐటిసి పొందవచ్చు.
ఉదాహరణ:

మీరు ఒక ఎలెక్ట్రానిక్ వస్తువుల డీలర్ మరియు మీరు రూ. 3,00,000 ల విలువగల కంప్యూటర్లను ఒక తయారీదారు నుండి కొనుగోలు చేసారు, దీనిపై రూ. 54,000 ల (@18%) జిఎస్‌టిని చెల్లించారు. కొనుగోలు చేయబడిన కంప్యూటర్లలో రూ. 1,00,000 ల విలువగల కంప్యూటర్లను మీ వ్యక్తిగత వినియోగం కొరకు తీసుకున్నారు. మిగిలిన కంప్యూటర్లను వినియోగదారులకు విక్రయించారు. ఈ సందర్భ్ంలో, ఐటిసిని, కేవలం వ్యాపార ఉద్దేశాల కొరకు వినియోగించబడిన భాగంపై మాత్రమే పొందవచ్చు, అంటే, రూ. 2,00,000. అందుచేత, అర్హత పొందిన ఐటిసి రూ. 36,000 (2,00,000*18%).

టాక్స్ వేయదగిన సరఫరాల కొరకు మరియు మినహాయించబడిన సరఫరాల కొరకు, వస్తువులు మరియు/లేదా సర్వీసులు పాక్షికంగా వినియోగించబడినప్పుడు

వస్తువులు మరియు/లేదా సర్వీసులను, టాక్స్ వేయదగిన సరఫరాలు మరియు మినహాయించబడిన సరఫరాల కొరకు పాక్షింకంగా వినియోగించబడినప్పుడు, ఐటిసిని కేవలం టాక్స్ వేయదగిన సరఫరాలు తయారు చేయడం కొరకు మరియు జీరో రేటెడ్ సరఫరలా కొరకు మాత్రమే పొందవచ్చు. ఐటిసి అనేది మినహాయించబడిన అసరఫరాల కొరకు వినియోగించబడిన భాగంపై అనుమతించబడదు, మరియు రివర్స్ ఛార్జ్ ఆధారంపై గ్రహీత టాక్స్ ను చెల్లించిన సరఫరాలపై అనుమతించబడదు.
ఉదాహరణ: మీరు ఒక తయారీదారు. మీరు రూ. 1,00,000 ల విలువగల ముడిపదార్థాలను కొనుగోలు చేసి, రూ. 18,000 (@18%) ల జిఎస్‌టిని చెల్లించారు. ఈ ముడిపదార్థాలు వస్తువు ఎ తయారు చేయడానికి పాక్షికంగా వినియోగించబడ్డాయి, ఇది టాక్స్ వేయదగినది మరియు వస్తువు బి, మినహాయించబడినది. వివారాలు ఈ క్రించ చూపబడినవి-

ఇన్పుట్ విలువ (రూ.) వస్తువు ఎ ను తయారుచేయుటకు వాడిన భాగం (టాక్స్ వేయదగినది) (రూ.) వస్తువు బి ను తయారుచేయుటకు వాడిన భాగం (టాక్స్ మినహాయించబడినది(రూ.) ఇన్పుట్ పై చెల్లించబడిన జిఎస్‌టి (రూ.) వస్తువు ఎ ను తయారుచేయుటకు వాడిన భాగంపై చెల్లించబడిన జిఎస్‌టి యొక్క యుక్తభాగము (టాక్స్ వేయదగినది) (రూ.) వస్తువు బి ను తయారుచేయుటకు వాడిన భాగంపై చెల్లించబడిన జిఎస్‌టి యొక్క యుక్తభాగము (టాక్స్ మినహాయించబడినది) (రూ.)(Rs.)
ముడిపదార్థం 1,00,000 60,000 40,000 18,000 10,800 7,200

మీరు వస్తువు ఎ ను తయారు చేయడానికి వినియోగించబడిన ముడిసరుకుల భాగం పై ట్యాక్స్ విధించదగిన రూ. 10,800 ల ఐటిసిని పొందవచ్చు. వస్తువు బి ను తయారు చేయడానికి వినియోగించబడిన భాగంపై రూ. 7,200 ల ఐటిసిని మీరు అందుకోలేరు, ఎందుకంటే వస్తువు బి మినహాయించబడినది.

అసాధారణమైన దృశ్యాలు

ఐటిసిని కొన్ని షరతులకు లోబడి అందుకోవడంలో కొన్ని అపూర్వమైన దృశ్య వివరణలు ఈక్రింద ఇవ్వబడ్డాయి.

వస్తువులను లాట్స్ లో లేదా వాయిదాలలో అందుకున్నప్పుడు

వస్తువులు లాట్స్ లో లేదా వాయిదాలలో అందుకున్నప్పుడు, ఐటిసిని కేవలం చివరి లాట్ లేదా వాయిదా యొక్క రసీదుపైన మాత్రమే పొందగలరు.
ఉదాహరణ: మీరొక మొబైల్ ఫోన్ డీలర్. 1 ఆగస్టు 2017 న, ఒక తయారీదారుని నుండి, మీరు ఒక్కొక్కటి రూ. 5,000ల విలువగల, 50 మొబైల్ ఫోన్స్ కొనుగోలుచేసారు. తయారీదారుని నుండి మొబైల్ ఫోన్స్ మీకు ఒక్కొక్క లాట్ లో 25 మొబైల్ ఫోన్స్ ప్రకారం, రాబోవు రెండు నెలలలో 1 వ తారీఖున 2 లాట్లలో పంపడానికి అంగీకారం కుదిరింది. మీ ఇన్వార్డ్ సరఫరాల రిజిస్టర్ లో ఇలా ఉంది:

ఇన్‌వార్డ్స్ సరఫరా రిజిస్టర్

తేది వస్తువుల వివరణ పరిమాణం రేటు మొత్తం సిజిఎస్‌టి ఎస్‌జిఎస్‌టి

ఐజిఎస్‌టి

రేటు మొత్తం రేటు మొత్తం రేటు మొత్తం
1 సెప్టెంబరు-17 Èమొబైల్ ఫోన్స్ 50 5,000 2,50,000 9% 22,500 9% 22,500  –  –
1 అక్టోబర్ -17 మొబైల్ ఫోన్స్  50  5,000  2,50,000  9% 22,500 9% 22,500  –  –
మొత్తం 100 5,00,000 45,000 45,000  –

ఇక్కడ మొబైల్ ఫోన్లలో ఒక భాగం 1 సెప్టెంబరు, 2017 న అందుకున్నా కూడా, మీరు 1 అక్టోబర్ 2017 న గల చివరి లాట్ యొక్క రసీదుపై రూ. 90,000లకు మాత్రమే ఐటిసిని అందుకోవచ్చు.

పైప్‌లైన్స్ మరియు టెలికమ్యూనికేషన్ టవర్స్‌పై ఐటిసి

కొనుగోలు చేయబడిన పైప్‌లైన్స్ మరియు టెలికమ్యూనికేషన్ టవర్స్‌పై ఐటిసిని ఈ క్రింది పద్ధతిలో పొందవచ్చు:

సంవత్సరం గరిష్టంగా పొందగల ఐటిసి
పైప్‌లైన్ మరియు/లేదా టెలికమ్యూనికేషన్ టవర్ అందుకోబడిన ఆర్థిక సంవత్సరం చెల్లించబడిన మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ లో 1/3 వవంతు
తదుపరి సంవత్సరం గత సంవత్సరంలో అందుకున్న క్రెడిట్‌తో సహా, మొత్తం ఇన్పుట్ ట్యాక్స్ లో 2/3 వవంతు
ఏదైనా తదుపరి ఆర్థిక సంవత్సరం మిగులు ఇన్పుట్ క్రెడిట్

ఉదాహరణ: ఎబిసి టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ రూ. 30 లక్షల విలువగల ఒక టెలికమ్యూనికేషన్ టవర్ ను, ఏప్రిల్ 2017 న కొనుగోలు చేసింది. వారు ఈ క్రింది పద్ధతిలో టవర్ పైన ఐటిసిని పొందవచ్చు:

సంవత్సరం గరిష్టంగా పొందగల ఐటిసి
2017 10 లక్షలు
2018 10 లక్షలు
2019 10 లక్షలు

ఈ వ్యాసంలో, మనం ఐటిసిని పొందగల దృశ్యరూపాల గురించి మరియు ఈ ప్రతి ఒక్క దృశ్యరూపాలలో వర్తించగల నిబంధనల గురించి తెలుసుకున్నాం. మన తదుపరి బ్లాగ్ లో, మనం ఐటిసి పొందలేని పరిస్థుల గురించి చూద్దాం.
రాబోవునవి:

ఐటిసి యొక్క నాన్-ఎంటైటిల్మెంట్

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

About the author

Pugal T & Anisha K Jose

76 Comments

© Tally Solutions Pvt. Ltd. All rights reserved - 2017