ప్రస్తుతం అమలులో ఉన్న పరోక్ష పన్ను వ్యవస్థ క్రింద నమోదైన పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు అందరూ కూడా ఆటోమేటిగ్గా జిఎస్టి కు మార్చబడతారు మరియు ఒక తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వబడుతుంది.
నమోదు సమయంలో సమర్పించిన వివరాల ధ్రువీకరణ తరువాత, చివరి రిజిస్ట్రేషన్ ఐడిలు జారీ చేయబడతాయి. అదేవిధంగా, కాంపొజిషన్ విధింపుని ఎంచుకున్న వ్యాపారులు, జిఎస్టి కు ఆటోమేటిగ్గా బదిలీ చేయబడతారు.

జిఎస్టి కింద, తమ మొత్తం టర్నోవర్ ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల రూపాయలు మించని ఒక నమోదుచేయబడిన పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి, కాంపొజిషన్ లెవీని ఎంచుకోవచ్చు. ఇది మళ్ళీ కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. దీని ప్రకారంగా, జిఎస్టి కు మారినప్పుడు, ఒక కాంపోజిషన్ డీలర్ రెగ్యులర్ డీలర్ గా మారవచ్చు.

ఒక కాంపోజిషన్ డీలర్ గా ఉండటం నుండి జిఎస్టి కింద ఒక రెగ్యులర్ డీలర్ గా మారడంతో, మీరు రెగ్యులర్ డీలర్ యొక్క అనువర్తన అవసరాలకు అనుగుణంగా ఉంటారు. మీ లోపలికి సరఫరాపై ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకోవడానికి మరియు బయటి సరఫరాలపై జిఎస్టి ను వసూలు చేయటానికి మిమ్మల్ని అనుమతిస్తారు.
ఇదంతా వినడానికి బాగానే ఉన్నప్పటికీ, జిఎస్టి కింద ఒక కాంపోజిషన్ డీలర్ గనక ఒక రెగ్యులర్ డీలర్ గా మారితే స్టాక్ ముగింపులో చెల్లించిన పన్నుకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకు ఉండవచ్చు? ‘
?’.

దీనిని మనం వివరంగా అర్థం చేసుకుందాం.

కింది కారణాల్లో దేనివల్లనైనాగాని ఒక కంపోజిషన్ డీలర్ రెగ్యులర్ డీలర్ గా మారవచ్చు:
• ఒక రెగ్యులర్ డీలర్ గా మారడానికి స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు
• చట్టం అమలు ద్వారా: మొత్తం టర్నోవర్ సూచించిన 50 లక్షల రూపాయల పరిమితిని మించిపోయి ఉండటం లేదా నిర్దేశించబడిన షరతుల ప్రకారం, అతను జిఎస్టి కింద కాంపొజిషన్ విధింపు ఎంచుకునేందుకు అర్హులు అయి ఉండకపోవచ్చు.
• రెగ్యులర్ డీలర్ అవడంతో, మీరు ముగింపు స్టాక్ లో ఉన్న ఇన్పుట్ల (ముడి పదార్థాలు), సెమీ ఫైనల్ వస్తువులు మరియు పూర్తైన వస్తువులలో ఉన్న పన్ను క్రెడిట్ వినియోగించుకునేందుకు అనుమతించబడతారు. అయితే, మీ ముగింపు స్టాక్ లో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందేందుకు మీరు నెరవేర్చవలసిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి.

మీ ముగింపు స్టాక్లో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందేందుకు అర్హత పరిస్థితులు

మీరు క్రింది పరిస్థితులలో మీ ముగింపు స్టాక్లో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకోవచ్చు:

  • ముడి పదార్ధాలు, సెమీ ఫైనల్ వస్తువులు లేదా పూర్తైన వస్తువుల రూపంలోగాని ఉన్న ముగింపు స్టాక్లో స్టాక్ ను పన్ను విధించదగిన సరఫరాలకు వాడాలి Conditions for availing GST ITC on closing stock
  • ముగింపు స్టాక్లో ఉంచిన ఇన్పుట్ల పై చెల్లించిన వేట్(VAT) అనేది ఇంతకు ముందరి చట్టం ప్రకారం క్రెడిట్ గా అనుమతించబడాలి. ఇది వేట్(VAT) క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి మాత్రమే వర్తిస్తుంది.
  • ఇన్పుట్ల (సెమీ-ఫైనల్ సరుకులు మరియు పూర్తైన సరుకుతోతో సహా) ముగింపు స్టాక్ విషయంలో మీ వద్ద ఇన్వాయిస్లు లేదా ఏదైనా ఇతర సూచించబడిన డ్యూటీ / పన్ను చెల్లింపు పత్రాలు ఉండాలి.
  • Tax documents needed for claiming GST Input tax credit

  • ఇన్వాయిస్లు లేదా ఏదైనా ఇతర సూచించబడిన డ్యూటీ / పన్ను చెల్లింపు పత్రాల తేదీ జిఎస్టి కు మారిన తేదీ నుండి 12 నెలల్లోపు ఉండాలి.
  • Carry forward Input tax credit to GST
    ఒకసారి పై పరిస్థితులు నెరవేరితే, ఇంకా సూచించబడవలసి ఉన్న పద్ధతిలో అనుమతించవలసిన క్రెడిట్ మొత్తం లెక్కించబడుతుంది.

మాకు మీ సహాయం అవసరం
దయచేసి క్రింది ఉన్న వ్యాఖ్యలను ఉపయోగించి ఈ బ్లాగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇంకా జిఎస్టి సంబంధిత విషయాలు మీరు ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు తెలియజేయండి, మా కంటెంట్ ప్రణాళికలో వాటిని మేము చేర్చడానికి సంతోషిస్తాము.
ఇది ఉపయోగకరంగా ఉందా? దిగువ సోషల్ షేర్ బటన్లను ఉపయోగించి ఇతరులతో దీనిని పంచుకోండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6