Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati
ఒక ఆర్ధిక వ్యవస్థలో వినియోగించబడే అన్ని వస్తువుల మరియు సేవల విలువ కొన్ని కొలమానాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. భారతదేశంలో ప్రస్తుత పన్ను వ్యవస్థలో, ఈ విలువ రకరకాల మార్గాల్లో లెక్కించబడుతుంది. క్రింది పట్టికలో ఒక అవలోకనం ఇవ్వబడింది:

పన్ను సరుకు / సేవల విలువ
ఎక్సైజ్లావాదేవీ విలువ లేదా సరుకు పరిమాణం లేదా ఎంఆర్పి ఆధారంగా
వేట్అమ్మకం విలువ ఆధారంగా
సేవా (సర్వీస్) పన్నుఅందజేసిన సేవ యొక్క పన్ను విలువ ఆధారంగా

సరుకు మరియు సేవల విలువ కట్టడం

ప్రస్తుత పన్ను వ్యవస్థ

ఒక ఉదాహరణ సహాయంతో, ప్రస్తుత వ్యవస్థలో సరుకు మరియు సేవల విలువ ఎలా లెక్కిస్తారో చూద్దాం:

సూపర్ కార్స్ లిమిటెడ్, ఒక కారు తయారీదారు, వారి డీలర్లు రవీంద్ర ఆటోమొబైల్స్ కు రూ. 6,000 కోసం విడిభాగాలు విక్రయిస్తుంది. విడిభాగాల ఎంఆర్పి రూ 10,000. రవీంద్ర ఆటోమొబైల్స్ కు జారీ చేయబడిన ఇన్వాయిస్ క్రింద వివరించబడింది:

Current-Tax-Regime_Telugu

జిఎస్టి వ్యవస్థ క్రింద

జిఎస్టి వ్యవస్థలో సరుకు మరియు సేవల వెలకట్టే పద్ధతి వర్ణించేందుకు పైన చెప్పిన ఉదాహరణనే మేము ఉపయోగించాము:

GST-Regime_Telugu
* ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ పై జిఎస్టి 18% అని భావిస్తూ

జిఎస్టి వ్యవస్థలో సరఫరా చేయబడిన సరుకు / లేదా సేవల విలువ అనేది లావాదేవీ విలువ, అంటే చెల్లించవలసిన / చెల్లించిన ధర, ఇది ఉదాహరణలో రూ 6,000 ఉంది.

జిఎస్టి వ్యవస్థ కింద అదనపు ఛార్జీలు మరియు ఖర్చులు

జిఎస్టి వ్యవస్థలో తగ్గింపు (డిస్కౌంట్), ప్యాకేజింగ్ ఛార్జీలు వంటి అదనపు ఛార్జీలు మరియు ఖర్చులు ఎలా వ్యవహరించబడతాయి? వాటిని లావాదేవీని విలువలో చేర్చాలా లేక మినహాయించాలా?

మనం ఈ ఉదాహరణ పరిశీలిద్దాం.

సూపర్ కార్స్ లిమిటెడ్ రూ. 4,00,000 విలువ గల ఒక కారును రవీంద్ర ఆటోమొబైల్స్ కు విక్రయిస్తుంది.

  • వాళ్ళకి కారు పై రూ. 5,000 ప్యాకింగ్ ఖర్చులు అవుతాయి
  • దీపావళి పథకంలో భాగంగా వాళ్ళు ధరపై 1% డిస్కౌంట్ అందిస్తారు
  • రవీంద్ర ఆటోమొబైల్స్ నెల 31 నాటికి నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేస్తే వారికి 0.5% మరింత తగ్గింపు అందిస్తామని సూపర్ కార్స్ లిమిటెడ్ అంగీకరిస్తారు. రవీంద్ర ఆటోమొబైల్స్ నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తూ నెల 31 నాటికి చెల్లింపు చేస్తుంది.

జిఎస్టి కింద, రవీంద్ర ఆటోమొబైల్స్ కి జారీచేయబడిన ఇన్వాయిస్, చూడటానికి ఇలా ఉంటుంది:

Registration_Part-A_Invoice_Telugu
*కారు పై జిఎస్టి 18% అని భావిస్తూ

ఇన్వాయిస్ లో,

  •  ప్యాకింగ్ ఛార్జ్ రూ 5,000 లావాదేవీ విలువలో చేర్చబడింది.
    ప్యాకింగ్ ఛార్జీలు లేదా సరుకు లేదా సేవలు సరఫరా చేసేముందు లేదా చేసే సమయంలో ఛార్జి చేయబడే ఏవైనా ఆకస్మిక ఖర్చులను లావాదేవీ విలువలో తప్పకుండా చేర్చాలి.
  • 1% డిస్కౌంట్ లావాదేవీ విలువ నుంచి తగ్గించబడింది.
    సరఫరా చేసేముందు లేదా చేసే సమయంలో ఇవ్వబడిన మరియు ఇన్వాయిస్ లో నమోదుచేయబడిన డిస్కౌంట్, లావాదేవీ విలువ నుండి మినహాయించబడవచ్చు.
  • 0.5% డిస్కౌంట్ ఇన్వాయిస్ నుండి మినహాయింపబడలేదు. 0.5% డిస్కౌంట్ సరఫరా తరువాత ఇవ్వబడినందున, అది ఇన్వాయిస్ లో చూపబడదు. అయితే, సరఫరా చేయబడే సమయంలో డిస్కౌంట్ తెలిసి ఉన్నందున, మరియు ఈ నిర్దిష్ట ఇన్వాయిస్ కు లింక్ చేయబడవచ్చు కాబట్టి, డిస్కౌంట్ మొత్తాన్ని లావాదేవీ విలువ నుండి మినహాయించవచ్చు. ఇందు కోసం, సూపర్ కార్స్ లిమిటెడ్ రూ 2,360 (రూ. 4,00,000 యొక్క 0.5% = రూ 2,000+ రూ 2,000 పై జిఎస్టి@ 18% = రూ 360), కోసం రవీంద్ర ఆటోమొబైల్స్ కు ఒక క్రెడిట్ నోట్ జారీ చేస్తుంది మరియు అదే విషయం సంబంధిత పన్ను ఇన్వాయిస్ కు తప్పక లింక్ చేయబడాలి.
    సరఫరా తర్వాత ఇవ్వబడిన కానీ సరఫరాకు ముందు లేదా సరఫరా సమయంలో అంగీకరించబడిన మరియు నిర్దిష్టంగా సంబంధిత ఇన్వాయిస్లకు లింక్ చేయబడగల డిస్కౌంట్, లావాదేవీ విలువ నుండి మినహాయించబడవచ్చు.

ఈ నిబంధనకు మినహాయింపులు ఏమిటి?

జవాబు: సరఫరా తర్వాత ఇవ్వబడిన, మరియు సరఫరా సమయంలో తెలియని డిస్కౌంట్.

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.

సూపర్ కార్స్ లిమిటెడ్ రూ. 4,00,000 కు రవీంద్ర ఆటోమొబైల్స్ కు ఒక కారు విక్రయిస్తుంది. స్టాండింగ్ ఒప్పందం ప్రకారం చెల్లింపు విషయంలో ఒక 30 రోజుల క్రెడిట్ వ్యవధి అనుమతించబడుతుంది. అయితే, తీవ్రమైన నగదు కొరత కారణంగా, రవీంద్ర ఆటోమొబైల్స్ 2 రోజుల్లో చెల్లింపు చేయవలసిందిగా సూపర్ కార్స్ లిమిటెడ్ అభ్యర్ధించింది, మరియు అలా చేసిన మీదట 2% డిస్కౌంట్ కు హామీ ఇచ్చింది. రవీంద్ర ఆటోమొబైల్స్ 2 రోజుల్లో ఆ చెల్లింపు చేస్తుంది.

ఈ నేపథ్యంలో, సరఫరా సమయంలో డిస్కౌంట్ తెలియలేదు కాబట్టి, అది జిఎస్టి లెక్కింపు కోసం లావాదేవీ విలువ నుండి మినహాయింపు కింద క్లెయిమ్ చేయడం వీలుకాదు.

లావాదేవీ విలువ పై డిస్కౌంట్ ప్రభావం యొక్క ఒక సారాంశం కింద ఇవ్వబడింది –

డిస్కౌంట్ రకం లావాదేవీ విలువపై ప్రభావం
డిస్కౌంట్ సరఫరాకు ముందు లేదా చేసే సమయంలో ఇవ్వబడి ఉంటే, మరియు ఇన్వాయిస్ లో నమోదు చేయబడి ఉంటేలావాదేవీ విలువ నుండి మినహాయింపు కింద క్లెయిమ్ చేయబడవచ్చు
సరఫరా తర్వాత ఇవ్వబడిన కానీ సరఫరాకు ముందు లేదా సరఫరా సమయంలో అంగీకరించబడిన మరియు నిర్దిష్టంగా సంబంధిత ఇన్వాయిస్లకు లింక్ చేయబడగల డిస్కౌంట్ అయి ఉంటేలావాదేవీ విలువ నుండి మినహాయింపు కింద క్లెయిమ్ చేయబడవచ్చు
సరఫరా తర్వాత ఇవ్వబడిన, మరియు సరఫరా సమయంలో తెలియని డిస్కౌంట్ అయి ఉంటేలావాదేవీ విలువ నుండి మినహాయింపు కింద క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు

 

లావాదేవీ విలువ పై సరఫరా యొక్క వివిధ ఛార్జీలు/ఖర్చుల ప్రభావం కింద చూపబడింది –

సరఫరాకు సంబంధించిన ఛార్జీలు/ఖర్చులు లావాదేవీ విలువపై ప్రభావం
కమిషన్ మరియు ప్యాకింగ్ వంటి ఆకస్మిక ఖర్చులలావాదేవీ విలువలో చేర్చబడతాయి
వడ్డీ / ఆలస్యపు రుసుము / ఆలస్యంగా చెల్లింపు చేసినందుకు సరఫరాదారు వసూలు చేసే జరిమానాలావాదేవీ విలువలో చేర్చబడతాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేవి మినహాయించి రాయితీలు (సబ్సిడీలు)లావాదేవీ విలువలో చేర్చబడతాయి
జిఎస్టి కంటే ఇతరమైన ఏదైనా పన్నులావాదేవీ విలువలో చేర్చబడతాయి
సరఫరాదారు చెల్లించవలసిన కానీ గ్రహీతకు ఖర్చు అయ్యే ఏదైనా మొత్తంలావాదేవీ విలువలో చేర్చబడతాయి

జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) దేశంలో పన్ను విషయంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని ఆశించబడుతోంది. పన్ను వ్యవస్థ సరళీకృతం చేయబడింది కాబట్టి ఉత్పాదన వెలకట్టడం, సరుకు మరియు సేవల విలువ కట్టడం, ఇంకా ఇతరమైన వాటి యొక్క వివిధ కోణాలు గణనీయమైన పరిణామాన్ని చవిచూడగలవు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6