బ్రాంచ్ బదిలీ అనేది ఒకే వ్యాపార సంస్థకు చెందిన వస్తువులను ఒక యూనిట్ / స్థానం నుంచి మరొక యూనిట్ / స్థానానికి బదిలీ చేయడాన్ని సూచిస్తుంది. దీనిని స్టాక్ బదిలీలు అని కూడా పిలుస్తారు. బ్రాంచ్ బదిలీలు వివిధ కారణాల వల్ల జరుగుతాయి, అవి:

 • ఉత్పాదక యూనిట్ నుండి పాక్షికంగా పూర్తిచేయబడిన సరుకులను మరింతగా ప్రాసెస్ చేయడం కోసమని మరొక యూనిట్ కు బదిలీ చేయడం
 • మరింత సరఫరా కోసం సరుకును గిడ్డంగులకు /వేర్ హౌసులకు బదిలీ చేయడం
 • డిమాండ్ కారణంగా వర్తకుడు మరొక బ్రాంచీకి వస్తువులను బదిలీ చేయవచ్చు
 • అనువర్తనం దృష్ట్యా – వినియోగదారులు (బి2బి) ఇన్పుట్ పన్ను క్రెడిట్, వినియోగించుకోగలిగేందుకు వీలుకల్పించడానికి బ్రాంచ్ బదిలీలు జరుగుతుంటాయి, తర్వాత అమ్మకం ప్రభావితమవుతుంది.


వస్తువుల బదిలీకి కారణం ఏమైనా, అటువంటి బదిలీలపై పన్ను ప్రభావాన్ని వ్యాపారాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది.

 • చట్టబద్ధమైన అనువర్తన కోసం ఈ బదిలీలు ఎలాగ వ్యవహరించబడతాయి? అవి పన్ను విధించదగినవా?
 • పన్ను విధించదగినవి అయినట్లయితే, పన్ను విధింపు కొరకు పరిగణించవలసిన విలువ ఏమిటి?

ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థ మరియు జిఎస్టిలో బదిలీలు ఎలాగ వ్యవహరించబడతాయో మనం అర్థం చేసుకుందాం

ప్రస్తుత వ్యవస్థ

సెంట్రల్ ఎక్సైజ్

సెంట్రల్ ఎక్సైజ్ కింద, స్టాక్ బదిలీల యొక్క మూల్యాంకన అనేది అది తయారీదారుచే బదిలీ చేయబడిన స్వభావం మరియు ప్రయోజనం మీద ఆధారపడి ఉంటుంది. ఒక బదిలీ క్రింది కారణాల్లో దేనికోసమైనా కావచ్చు:

 • మరొక తయారీ యూనిట్ కు మరింత ప్రాసెసింగ్ కోసం
 • ఒక డిపోకు బదిలీ
 • ఏ ఇతర ప్రాంగణం నుంచి అమ్మకం జరుగుతుందో అక్కడికి బదిలీ.
బదిలీ రకం మూల్యాంకన ఉదాహరణ
పూర్తి అయిన సరుకు తయారీ యూనిట్ నుంచి వీటికి బదిలీ చేయబడుతుంది
ఒక డిపో:

 • పంపిన సరుకుల ఏజెంట్ యొక్క ప్రాంగణము
 • ఎక్సైజ్ విధించబడతగిన వస్తువులు ఎక్కడి నుంచి అయితే విక్రయించబడాలో ఆ ఏదైనా ఇతర స్థలం లేదా ప్రాంగణం
విలువ అనేది అటువంటి ప్రదేశం నుంచి లేదా అదే సమయంలో విక్రయించబడే వస్తువుల సాధారణ లావాదేవీ విలువ అయి ఉండాలి. ఢిల్లీలో ఒక రిజిస్టర్ చేయబడిన తయారీ సంస్థ అయిన రోజ్ పాలిమర్స్, ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న వారి డిపోకి పూర్తయిన వస్తువులను బదిలీ చేశారు. తొలగింపు జరిగే సమయంలో, డిపో వద్ద పూర్తైన వస్తువుల విక్రయ ధర రూ .20000 ఉంది. అందువల్ల, ఉత్పత్తి యూనిట్ నుంచి నోయిడాలోని వారి డిపోకు పూర్తయిన వస్తువుల బదిలీ విలువ రూ .20000 అవుతుంది.
పాక్షికంగా పూర్తిచేయబడిన సరకులు ఉత్పాదక యూనిట్ నుంచి మరొక యూనిట్ కు మరింతగా ప్రాసెసింగ్ కోసం తరలించబడతాయి, లేదా పూర్తి చేయబడిన వస్తువుల తయారీలో ఉపయోగించబడతాయి బదిలీ విలువ అటువంటి వస్తువుల ఉత్పత్తి ధర యొక్క 110% వద్ద ఉంటుంది.ఢిల్లీలో ఒక ఢిల్లీలో ఒక రిజిస్టర్ చేయబడిన తయారీ సంస్థ అయిన రోజ్ పాలిమర్స్, పాక్షికంగా తయారు చేయబడిన వస్తువులను మరింతగా ప్రాసెసింగ్ కోసం ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న మరో ఉత్పాదక ప్లాంట్ కు బదిలీ చేసారు.
పాక్షికంగా తయారు చేయబడిన వస్తువుల ఉత్పత్తి ధర రూ .25,000. బదిలీ చేయబడిన వస్తువుల విలువ 27,500 రూపాయలు (25,000 * 110/100)ఉంటుంది.
వాట్ (VAT)

వేట్ పరిధిలో, ‘ఫారం ఎఫ్’ సమకూర్చిన మీదట స్టాక్ బదిలీలు పన్ను విధించబడవు. అయితే, వస్తువుల కొనుగోలుపై ఇన్పుట్ వేట్ అనేది రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉండే ఒక నిర్దిష్ట శాతం దగ్గర రివర్స్ చేయబడాలి. ఉదాహరణకు, కొనుగోలు పై చెల్లించిన వాట్ 12.5%అయితే, అప్పుడు 4% కి అదనంగా ఉన్నది అనగా, 8.5% ఇన్పుట్ వేట్ క్రెడిట్ గా అనుమతించబడుతుంది మరియు 4% రివర్స్ చేయబడుతుంది.

వివరాలు మూల్యాంకన ఉదాహరణ
ఒక శాఖ నుంచి మరొక శాఖకి వస్తువుల బదిలీ ఫారం ఎఫ్ సమకూర్చిన మీదట, స్టాక్ బదిలీలు మినహాయించబడతాయి. కర్ణాటకలో ఉన్న గణేష్ ట్రేడింగ్, మహారాష్ట్రలోని మరో శాఖకు వస్తువులను బదిలీ చేసింది.
ఫారం ఎఫ్ సమకూర్చిన మీదట, స్టాక్ బదిలీ మినహాయించబడుతుంది

జిఎస్టి వ్యవస్థలో స్టాక్ బదిలీ

జిఎస్టి , పరిధిలో, పన్ను విధింపు అనేది సరఫరా పై ఉంటుంది, ఇందులో విభిన్న వ్యక్తులకు బదిలీలు ఉంటాయి, మరియు క్రింది రెండు సందర్భాల్లో బదిలీలు పన్ను విధించబడదగినవి అవుతాయి:

 • రాష్ట్రం లోపల స్టాక్ బదిలీ: సంస్థకి ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే పన్ను విధించబడుతుంది. ఈ సంస్థలు ‘విభిన్న వ్యక్తులుగా’ పరిగణించబడతాయి.
 • రాష్ట్రాల మధ్య స్టాక్ బదిలీ:

ఇప్పుడు, స్టాక్ బదిలీల యొక్క పన్ను విధింపు మనకు తెలుసు. జిఎస్టి విధించబడే స్టాక్ బదిలీల విలువ లెక్కింపుని గురించి చర్చిద్దాము.

ఇది కూడా చదవండి: జిఎస్టి కింద వస్తువులు & సేవల విలువ ఎలాగ నిర్ధారించబడుతుంది?

విస్తృతంగా, సరఫరా కోసం అందుకునే ఏకైక పరిగణనగా ధర ఉన్నచోట మరియు సంబంధిత లేదా ప్రత్యేక వ్యక్తుల మధ్య సరఫరా లేనప్పుడు లావాదేవీ విలువపై జిఎస్టి విధించబడుతుంది.
దీని ఫలితంగా, స్టాక్ బదిలీపై, లావాదేవీ విలువ వర్తింపజేయడం వీలుకాదు, ఎందుకంటే ఇది ఒకే సంస్థ యొక్క, ప్రత్యేక వ్యక్తిగా సూచించబడే 2 శాఖల మధ్య సరఫరా అవుతుంది కాబట్టి. అందువల్ల, స్టాక్ బదిలీల కోసం, క్రింది విలువలను వర్తింపజేయడం ద్వారా సరఫరా విలువ లెక్కించబడాలి:

క్ర.సం మూల్యాంకన రకం వివరణ
1 ఓపెన్ మార్కెట్ విలువ వస్తువుల లేదా సేవల సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అనేది ఒక లావాదేవీ కోసం ఒక వ్యక్తి చెల్లించాల్సి ఉన్న జిఎస్టి మరియు సెస్ మినహా డబ్బులో పూర్తి విలువ అయి ఉంటుంది.
గ్రహీత గనక పూర్తి ఇన్పుట్ పన్ను క్రెడిట్ కి అర్హత కలిగి ఉంటే, అప్పుడు ఇన్వాయిస్ లో ప్రకటించబడిన విలువ ఓపెన్ మార్కెట్ విలువగా పరిగణించబడుతుంది..
2 అదే రకమైన మరియు అదే నాణ్యతగల వస్తువులు మరియు/లేదా సేవల సరఫరా యొక్క విలువ వస్తువులు లేదా సేవల ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనప్పుడు ఈ పద్ధతి వర్తిస్తుంది.
3 అదే రకమైన మరియు నాణ్యత గల వస్తువుల మరియు / లేదా సేవలను సరఫరా చేయడానికి సంబంధిత వ్యక్తి కాని అతని కస్టమర్ కు గ్రహీత ద్వారా ఛార్జి చేయబడే 90 శాతం ధర ఈ విలువలు అనేవి సరఫరాదారు యొక్క ఎంపికతో ఉంటుంది మరియు గ్రహీత ద్వారా మరింత సరఫరా కోసం వస్తువులు ఉద్దేశించబడినట్లయితే మాత్రమే వర్తిస్తుంది.

వివిధ దృష్టాంతాల్లో మనం పై లెక్కింపు వర్తించే విధానాన్ని అర్ధం చేసుకుందాం

దృష్టాంతం ఉదాహరణ మూల్యాంకన
పూర్తిగా తయారు చేయబడిన వస్తువులు, తయారీ యూనిట్ నుండి ఆ వస్తువులు ఎక్కడి నుంచి అయితే విక్రయించబడవలసి ఉంటుందో, ఆ డిపోకు బదిలీ చేయబడతాయి ఢిల్లీలో ఒక రిజిస్టర్ చేయబడిన తయారీ సంస్థ అయిన రోజ్ పాలిమర్స్, ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న వారి డిపోకి పూర్తయిన వస్తువులను బదిలీ చేశారు. బదిలీ జరిగే సమయంలో, పూర్తైన వస్తువుల ఓపెన్ మార్కెట్ విలువ రూ.
.20,000 ఉంది. అంతేకాకుండా, డిపో అదే రకం మరియు నాణ్యతగల వస్తువులను రూ .22,000 ల ధరకు సరఫరా చేసింది.
రూ.20,000ఓపెన్ మార్కెట్ విలువ వద్ద స్టాక్ బదిలీ విలువ కట్టబడుతుంది. అయితే, అదే రకమైన మరియు నాణ్యతగల వస్తువుల సరఫరా కొరకు ఛార్జి చేయబడిన ధర యొక్క 90%, అనగా రూ. 19,800, చెల్లించటానికి రోజ్ పాలిమర్స్ ఇష్టపడవచ్చు. ఇది ఎందుకంటే, పూర్తయిన వస్తువులు మరింతగా సరఫరా కోసం బదిలీ చేయబడ్డాయి కాబట్టి.
పాక్షికంగా పూర్తిచేయబడిన వస్తువులను తయారీ యూనిట్ నుండి మరింత. ఢిల్లీలో ఒక రిజిస్టర్ చేయబడిన తయారీ సంస్థ అయిన రోజ్ పాలిమర్స్, ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో రిజిస్టర్ చేయబడిన వారి తయారీ యూనిట్ నోయిడాలో రిజిస్టర్ చేయబడి మరియు ఇన్పుట్ పన్ను క్రెడిట్ కు పూర్తిగా అర్హత కలిగి ఉంది కాబట్టి, ఇన్వాయిస్ విలువ అయిన.
ప్రాసెసింగ్ కోసం మరొక యూనిట్ కు తరలించబడతాయి. మరొక తయారీ ప్లాంట్ కి పాక్షికంగా పూర్తిచేయబడిన వస్తువులను మరింత ప్రాసెసింగ్ కోసం బదిలీ చేశారు. అటువంటి వస్తువుల ఇన్వాయిస్ విలువ రూ. 18,000. రూ.18,000 ఓపెన్ మార్కెట్ విలువగా పరిగణించబడుతుంది మరియు రోజ్ పాలిమర్స్ రూ.18,000 పై జిఎస్టి చెల్లించవలసి ఉంటుంది.
పూర్తయిన వస్తువులను తయారీ యూనిట్ నుండి 100% మినహాయింపు వస్తువుల తయారీ మరియు సరఫరాలో నిమగ్నమైన మరొక యూనిట్ కు బదిలీ చేయబడతాయి.ఢిల్లీలో ఒక రిజిస్టర్ చేయబడిన తయారీ సంస్థ అయిన రోజ్ పాలిమర్స్, హర్యానాలో రిజిస్టర్ చేయబడిన మరొక తయారీ ప్లాంట్ కి, పూర్తయిన వస్తువులను బదిలీ చేశారు హర్యానాలోని యూనిట్, మినహాయించబడిన వస్తువుల తయారీలో నిమగ్నమై ఉంది.
బదిలీ సమయంలో మార్కెట్ విలువ అందుబాటులో లేదని మరియు అదే రకమైన మరియు నాణ్యతగల వస్తువుల ధర రూ. 25,000 అని అనుకోండి
అటువంటి బదిలీల యొక్క పన్ను విధించదగిన విలువను చేరుకోవడంలో, రోజ్ పాలిమర్స్ వారు అదే రకం మరియు నాణ్యత గల వస్తువుల మరియు / లేదా సేవల సరఫరా విలువను అంచనా వేయాలి. అందువల్ల, బ్రాంచ్ బదిలీ రూ. 25,000 వద్ద వెలకట్టబడుతుంది మరియు దానిపై జిఎస్టి విధించబడుతుంది.
ఇక్కడ, ఇన్వాయిస్ విలువని ఓపెన్ మార్కెట్ విలువగా పరిగణించడం వీలుకాదు ఎందుకంటే హర్యానాలో రిజిస్టర్ చేయబడిన తయారీ యూనిట్ 100% మినహాయింపు వస్తువుల సరఫరాలో నిమగ్నమై ఉంది మరియు దానికి ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందేందుకు అర్హత లేదు.

ఏ కారణం చేతనైనా, సరఫరా యొక్క విలువను నిర్ణయించటానికి పై పధ్ధతులు వర్తింపజేయలేకపోతే, అది ఉత్పత్తి యొక్క వ్యయం + 10% లేదా మిగిలి ఉన్న (రెసిడ్యువల్) పద్ధతిని ఉపయోగించడం ద్వారా నిర్ణయించబడుతుంది. మా రాబోయే బ్లాగ్లలో ఇది సవివరంగా వివరించబడుతుంది.

రాబోయే బ్లాగులు

ప్రిన్సిపల్ మరియు ఏజెంట్ల మధ్య విలువ సరఫరాను నిర్ణయించడం

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

59,909 total views, 103 views today