Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

తాజా మార్పులు పొందుపరచడానికి ఈ పోస్ట్ 2 డిసెంబర్ 2016 నాడు నవీకరించబడింది.

ప్రస్తుత రాష్ట్ర పరోక్ష పన్ను వ్యవస్థ చిన్న డీలర్ల కోసం కాంపొజిషన్ పథకం అనబడే ఒక సులభమైన అనువర్తనాన్ని అందించింది.

ఈ పథకం కింద మీరు,
కాంపొజిషన్ పథకం ఎలా భిన్నంగా ఉంటుందో కింది ఉదాహరణతో అర్థం చేసుకుందాం:

  • కొంత శాతం టర్నోవర్ వద్ద మాత్రమే పన్నులు చెల్లిస్తారు
  • పీరియాడిక్ రిటర్న్స్ (సాధారణంగా త్రైమాసిక ప్రాతిపదికన) మాత్రమే ఫైల్ చేస్తారు
  • సవివరమైన రికార్డులు నిర్వహించవలసిన లేదా పన్ను ఇన్వాయిసింగ్ నియమాలు పాటించవలసిన అవసరం లేకుండా ఉండే ఒక ఎంపికను కలిగి ఉంటారు
  • ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) తీసుకోవడానికి అనుమతించబడరు
  • అమ్మకాల పై పన్ను వసూలు చేయడానికి అనుమతించబడరు

ఆ విధంగా చిన్న వ్యాపారాలకు, పన్ను బాధ్యత లెక్కించడం సులభం. సవివరమైన రికార్డులు నిర్వహణకి పట్టే సమయాన్ని మరియు శక్తిని ఇది ఆదా చేస్తుంది.

కాంపొజిషన్ పథకం ఎలా భిన్నంగా ఉంటుందో కింది ఉదాహరణతో అర్థం చేసుకుందాం:

GST composition levy explained

జిఎస్టి వ్యవస్థలో కాంపొజిషన్ విధింపు

అదేవిధంగా, జిఎస్టి వ్యవస్థలో అదే ప్రయోజనం అందించబడింది. చిన్న డీలర్లు మరియు వ్యాపారులు ( కాంపొజిషన్ లెవీగా పిలువబడే కాంపొజిషన్ పథకం కోసం ఎంచుకోవచ్చు. ఈ పథకం కింద, ఒక కాంపొజిట్ పన్ను చెల్లింపుదారుడు తన టర్నోవర్ యొక్క కొంత శాతం వద్ద మాత్రమే పన్ను చెల్లిస్తారు.

ప్రారంభ పరిమితి (థ్రెష్హోల్డ్ లిమిట్)

  • ఈశాన్య భారతదేశం + సిక్కిం, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ – గత ఆర్థిక సంవత్సరంలో అదే పాన్ కలిగి ఉన్న వ్యక్తి యొక్క సరాసరి టర్నోవర్ రూ.10 లక్షలకు మించి కానీ రూ .50 లక్షలకు మించనిది అయి ఉండాలి.
  • మిగతా భారతదేశం – గత ఆర్థిక సంవత్సరంలో అదే పాన్ కలిగి ఉన్న వ్యక్తి యొక్క సరాసరి టర్నోవర్ రూ. 20లక్షలకు మించి కానీ రూ .50 లక్షలకు మించనిది అయి ఉండాలి.

విధించబడే రేటు

  • విధించబడే రేటు ఇంకా తెలియజేయబడవలసి ఉంది
  • రేటు
    • తయారీదారు – ఆ సంవత్సరంలో ఒక రాష్ట్రంలో టర్నోవర్ లో 2.5% కంటే తక్కువ ఉండదు
    • తయారీదారు కాక ఇతరులు- ఆ సంవత్సరంలో ఒక రాష్ట్రంలో టర్నోవర్ లో 1% కంటే తక్కువ ఉండదు

కాంపొజిట్ (అవిభక్త) పన్ను చెల్లింపుదారుకు షరతులు

ప్రారంభ పరిమితి కాకుండా, మిశ్రమ పన్ను చెల్లింపుదారుకి కింది పరిస్థితులు వర్తిస్తాయి:

  • సేవల సరఫరాలో నిమగ్నమవడం సాధ్యం కాదు
  • నిర్దిష్ట నోటిఫై చేయబడిన వస్తువుల తయారీలో నిమగ్నమవడం సాధ్యం కాదు
  • జిఎస్టి కింద పన్ను విధింపబడతగని సరుకుల సరఫరా చేయడం సాధ్యం కాదు
  • ఒక ఇ- కామర్స్ ఆపరేటర్ ద్వారా సరుకు సరఫరా చేయడం సాధ్యం కాదు
  • అంతర్ రాష్ట్ర సరఫరా చేయకూడదు – ఒక అవిభక్త పన్ను చెల్లింపుదారు అంతర్ రాష్ట్ర సరుకు మరియు/లేదా సేవల సరఫరా మరియు దిగుమతులు చేయకూడదు
  • అవిభక్త పన్ను చెల్లింపు – అవిభక్త పన్ను చెల్లింపుదారు గనక సరుకు మరియు సేవలు సరఫరా వ్యాపారంలో ఉంటే, అప్పుడు కాంపొజిషన్ లెవీ సరుకు సరఫరాకు మరియు సేవల సరఫరాకు రెండింటికి వర్తిస్తుంది.
  • పన్ను సేకరించవలసిన పని ఉండదు – అవిభక్త పన్ను చెల్లింపుదారు తాను బయటికి సరఫరా చేసే సరుకు మరియు/లేదా సేవలు అన్నింటిపై పన్ను సేకరించవలసిన పని ఉండదు.
  • అదే పాన్ కింద ఉండే అన్ని వ్యాపార వర్టికల్స్ కు వర్తిస్తుంది – కంపోజిషన్ లెవీ అనేది అదే పాన్ క్రింద రాష్ట్రములోపల లేదా అంతర్రాష్ట్ర పరిధిలో నడపబడుతున్న అన్ని వ్యాపార అంశాలకు వర్తిస్తుంది.

    దీని అర్ధం ఏమిటి?
    ఇటువంటి విభిన్న వ్యాపార వర్టికల్స్ కలిగి ఉన్న ఒక వ్యక్తి:

    • మొబైల్ ఫోన్లు & ఉపకరణాలు
    • స్టేషనరీ
    • ఫ్రాంచైజీ

    పైన కంపోజిషన్ లెవీ అనేది అదే పాన్ క్రింద రాష్ట్రములోపల లేదా అంతర్రాష్ట్ర పరిధిలో నడపబడుతున్న అన్ని వ్యాపార అంశాలకు వర్తిస్తుంది. దృష్టాంతంలో, కాంపొజిషన్ పథకం అన్ని మూడు వ్యాపార వర్టికల్స్ కు వర్తిస్తుంది. ఏదైనా ఒక వ్యాపార వర్టికల్ కాంపొజిషన్ పథకం కిందికి రావాలి అని డీలర్ ఎంచుకోవడం వీలు కాదు. ఉదాహరణకు, ఒకే పాన్ కు వ్యాపార వర్టికల్ యొక్క వ్యాపార స్థానం కర్ణాటక & కేరళ లో ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రతిఒక్క వ్యాపార వర్టికల్, కేవలం “అంతర్-రాష్ట్ర (రాష్ట్రంలో) సరఫరాలు మాత్రమే కలిగి ఉండాలి.

  • ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయడం వీలుకాదు- అవిభక్త పన్ను చెల్లింపుదారుకు తన వ్యాపారం లోపలికి సరఫరా చేయబడే అన్ని సరుకు మరియు/లేదా సేవల పై ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసేందుకు అర్హత ఉండదు.

    దీని అర్ధం ఏమిటి?
    ఒక డీలర్ గనక ఒక అవిభక్త పన్ను చెల్లింపుదారుగా ఉండాలని ఎంచుకుంటే, అతను ఒక సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే డీలర్ నుండి కొనుగోళ్లు చేసినప్పటికీ కూడా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేడు.. ఆదర్శవంతంగా, పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం అవిభక్త పన్ను చెల్లింపుదారు యొక్క ధరకు జోడించబడుతుంది.

అవిభక్త పన్ను చెల్లింపుదారుకు రిటర్న్ ఫారంలు

అవిభక్త పన్ను చెల్లింపుదారు త్రైమాసిక రాబడి మరియు వార్షిక రాబడి ఫైల్ చేయవల్సిన అవసరం ఉంటుంది. సమర్పించవలసిన రిటర్న్స్ రకాలు మరియు వివరాలు క్రింద వివరించబడ్డాయి:

రిటర్న్ రకం తరచుదనం గడువు తేది సమర్పించవలసిన వివరాలు
ఫారం GSTR-4A త్రైమాసికంసరఫరాదారు ద్వారా సమర్పించబడిన ఫారం GSTR-1 ఆధారంగా కాంపొజిషన్ పథకం క్రింద నమోదుచేసుకోబడిన గ్రహీతకు అందుబాటులో ఉంచబడే ( inward supplies) లోపలికి సరఫరాల వాటంతట అవే నింపబడే వివరాలు.
ఫారం GSTR-4త్రైమాసికంతదుపరి నెల యొక్క 18వ తేది ఫారం GSTR-4A నుంచి వాటంతట అవే నింపబడే వివరాలతో సహా సరుకు మరియు సేవల అన్ని ( outward supplies) బయటికి సరఫరాలు మరియు చెల్లించదగిన పన్ను వివరాలు. ఫారం GSTR-4A లోని ఏవైనా చేర్పులు, మార్పులు లేదా మినహాయింపులు వివరాలని ఫారం GSTR-4 లో కూడా సమర్పించాలి.
ఫారం GSTR-9A వార్షికంతదుపరి ఆర్ధిక సంవత్సరపు డిసెంబర్ 31వ తేదిపన్ను చెల్లింపు వివరాలతోపాటుగా ఫైల్ చేయబడిన త్రైమాసికపు రిటర్న్స్ యొక్క సమగ్ర వివరాలు

ప్రస్తుత కాంపొజిషన్ పథకంలో, ఒక అవిభక్త డీలర్ కేవలం సమగ్ర టర్నోవర్ అమ్మకాలు మాత్రమే ప్రకటించవలసి ఉంటుంది.. అతను ఇన్వాయిస్ వారీగా వివరాలు ప్రకటించవలసిన అవసరం లేదు. జిఎస్టిలో బయటి సరఫరాల సగటు టర్నోవర్ తో పాటుగా అతని సరఫరాదారు ఫైల్ చేసిన ఫారం GSTR-1 ఆదారంగా దానంతట అదే నింపబడే ( inward supplies) లోపలికి సరఫరాల ఇన్వాయిస్ వారీగా వివరాలతో అవిభక్త పన్ను చెల్లింపుదారు తన రిటర్న్ ఫైల్ చేస్తారు.

దయచేసి మరింత సమాచారం కోసం జిఎస్టి బ్లాగ్ ను సందర్శించండి

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6