మా క్రిందటి బ్లాగ్ పరిగణన లేకుండా సరఫరా మరియు సేవల దిగుమతి పై జిఎస్టి ప్రభావంలో మేము పరిగణన లేకుండా సరఫరా మరియు సేవల దిగుమతి గురించి చర్చించాము.

ఈ బ్లాగ్ లో, వీటి మధ్య పరిగణన లేకుండా సరఫరాను సవివరంగా చర్చిస్తుంది:
• సంబంధిత వ్యక్తి
• విభిన్న వ్యక్తి

సంబంధిత వ్యక్తి

“సంబంధిత వ్యక్తి” యొక్క నిర్వచనం ప్రస్తుత కస్టమ్స్ మూల్యాంకన నియమాల మాదిరిగానే ఉంటుంది. వస్తువుల లేదా సేవల సరఫరా వీరి మధ్య చేయబడినప్పుడు మాత్రమే సరఫరా సంబంధిత వ్యక్తుల మధ్య జరిగినదిగా పరిగణించబడుతుంది:

1.ఒకరికొకరి వ్యాపారాల యొక్క అధికారులు లేదా డైరెక్టర్లు: ఒక సరఫరాలో, సరఫరాదారు మరియు గ్రహీత నిజానికి ఇతర వ్యాపారానికి అధికారులు లేదా

పైన వివరించిన విధంగా, గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో శ్రీ.గణేష్ డైరెక్టర్ గా ఉన్నారు, మరియు రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో ఒక అధికారిగా ఉన్నారు. రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో శ్రీ.రాకేష్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇంకా గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో రాకేష్ ఒక అధికారిగా ఉన్నారు. అందువల్ల వారి మధ్య ఏ సరఫరానైనా, సంబంధిత వ్యక్తులు మధ్య సరఫరాగా వ్యవహరించబడుతుంది.
2. వ్యాపారంలో చట్టపరంగా గుర్తించబడిన భాగస్వాములు: సరఫరాదారు మరియు గ్రహీత అదే వ్యాపారం లేదా సంబంధిత వ్యాపారంలో భాగస్వాములు.


పైన వివరించిన విధంగా, గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో శ్రీ.గణేష్ మరియు శ్రీ.రాకేష్ భాగస్వాములై ఉన్నారు. శ్రీ. గణేష్ మరియు శ్రీ. రాకేష్ మధ్య ఏదైనా సరఫరా సంబంధిత వ్యక్తుల మధ్య సరఫరాగా వ్యవహరించబడుతుంది.

3. యజమాని మరియు ఉద్యోగి: యజమాని మరియు ఉద్యోగి మధ్య ఏదైనా వస్తువుల మరియు సేవ యొక్క సరఫరా.
గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ యొక్క ఒక ఉద్యోగి శ్రీ. రాకేష్. గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ నుండి శ్రీ. రాకేష్ కి చేసే ఏదైనా సరఫరా సంబంధిత వ్యక్తుల మధ్య సరఫరాగా పరిగణించబడుతుంది.

4. సరఫరాదారు లేదా గ్రహీత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యాజమాన్యం కలిగి ఉంటారు, అధీకృత ఓటింగ్ స్టాక్ లేదా షేర్లలో ఇరవై అయిదు శాతం లేదా అంతకంటే ఎక్కువని నియంత్రిస్తారు లేదా కలిగి ఉంటారు.

ఉదాహరణకు, సరఫరాదారు వ్యాపారంలో గ్రహీత 25% ఈక్విటీ కలిగి ఉంటారు.

55. వారిలో ఒకరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మరొకరిని నియంత్రిస్తారు: ఏదైనా ఒక సరఫరాలో గనక, సరఫరాదారు లేదా గ్రహీత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మరొకరిని నియంత్రిస్తే, అప్పుడు అది సంబంధిత వ్యక్తుల మధ్య సరఫరాగా పరిగణించబడుతుంది.

పరోక్ష నియంత్రణ


పైన వివరించిన విధంగా, గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ వారు రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో ఈక్విటీని కలిగి ఉన్నారు. గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ వారు ప్రత్యక్షంగా రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ యొక్క వ్యాపారాన్ని నియంత్రిస్తున్నారు కాబట్టి గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ మరియు రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ ల మధ్య సరఫరా సంబంధించినదై ఉంటుంది.
.

6. అవి రెండూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మూడవ వ్యక్తి ద్వారా నియంత్రించబడి ఉంటాయి ఒకవేళ ఏదైనా సరఫరాలో, సరఫరాదారు మరియు గ్రహీత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మూడవ వ్యక్తి ద్వారా నియంత్రించబడి ఉన్నట్లయితే.
పై ఉదాహరణలో, గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ వారు రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో మరియు మాక్స్ ట్రేడింగ్ లో ఈక్విటీని కలిగి ఉన్నారు. రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ మరియు మాక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ ల మధ్య సరఫరా సంబంధితమైనవి ఎందుకంటే అవి రెండూ కూడా ప్రత్యక్షంగా గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ ద్వారా నియంత్రించబడి ఉంటాయి కాబట్టి.
7. అవి రెండూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మూడవ వ్యక్తిని నియంత్రిస్తాయి ఒకవేళ ఏదైనా సరఫరాలో, సరఫరాదారు మరియు గ్రహీత, కలిసి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక మూడవ వ్యక్తిని నియంత్రిస్తూ ఉన్నట్లయితే.

పైన వివరించిన విధంగా, రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ వారు మాక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ లో 80% ఈక్విటీ మరియు గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో 30% ఈక్విటీ కలిగి ఉన్నారు.

మాక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ వారు’గణేష్ ట్రేడింగ్ లిమిటెడ్ లో 70% ఈక్విటీని కలిగి ఉన్నారు. ఇప్పుడు, కలిసి, రాకేష్ ట్రేడింగ్ లిమిటెడ్ వారికి గణేష్ ట్రేడింగ్ లిమిటెఢ్ పై నియంత్రణ ఉంది మరియు వారి మధ్య సరఫరా అనేది సంబంధిత వ్యక్తుల మధ్య సరఫరాగా పరిగణించబడుతుంది.

8. వారు ఒకే కుటుంబ సభ్యులు: ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య చేయబడే సరఫరా సంబంధిత వ్యక్తుల మధ్య సరఫరాగా పరిగణించబడుతుంది.

విభిన్న వ్యక్తి

ఒక విభిన్న వ్యక్తిని అదే రాష్ట్రం లేదా వేరొక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను పొందిన లేదా పొందవలసి ఉన్న ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తిగా నిర్వచించవచ్చు. లేదా ఒక రిజిస్ట్రేషన్ పొందిన లేదా పొందవలసి ఉన్న, మరియు మరొక రాష్ట్రంలో కూడా సంస్థాపన కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క సంస్థాపన

అతని/ఆమె యొక్క ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ మరియు సంస్థాపనని ఒక విభిన్న వ్యక్తిగా వ్యవహరించడం జరుగుతుంది మరియు వారి మధ్య జరిగే ఏదైనా సరఫరా పన్ను విధించదగినదై ఉంటుంది.
అందువలన, ఏదైనా స్టాక్ బదిలీ లేదా శాఖ బదిలీలు క్రింది రెండు సందర్భాలలో పన్ను విధించబడదగినవి అయి ఉంటాయి:

1. 1. రాష్ట్రంలోపల (ఇంట్రా స్టేట్) స్టాక్ బదిలీ: ఒక సంస్థకి ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే.

ఉదాహరణకు

సూపర్ కార్స్ లిమిటెడ్ అనేది కర్నాటకలో ఉన్న కార్ల తయారీ యూనిట్. వారికి కర్ణాటకలో ఒక సర్వీస్ యూనిట్ కూడా ఉంది. సూపర్ కార్స్ లిమిటెడ్ వారు తయారీ మరియు సర్వీస్ యూనిట్ కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్లను పొందారు.
సూపర్ కార్స్ లిమిటెడ్ వారి తయారీ యూనిట్ మరియు సర్వీస్ యూనిట్ విభిన్న వ్యక్తులుగా పరిగణించబడతాయి, మారియు వాటి మధ్య ఏదైనా సరఫరా పరిగణన లేకుండా అయినప్పటికీ కూడా పన్ను విధించదగినదై ఉంటుంది.

2. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి (ఇంటర్ స్టేట్) స్టాక్ బదిలీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెండు సంస్థల మధ్య బదిలీ పన్ను విధించదగినదై ఉంటుంది.For Example

సూపర్ కార్స్ లిమిటెడ్ అనేది కర్నాటకలో ఉన్న ఒక కార్ల తయారీ యూనిట్. వారికి ఢిల్లీలో ఒక సర్వీస్ యూనిట్ కూడా ఉంది.
సూపర్ కార్స్ లిమిటెడ్ యొక్క తయారీ యూనిట్ మరియు ఢిల్లీలో ఉన్న సర్వీస్ యూనిట్ లని విభిన్న వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది, మరియు వాటి మధ్య ఏదైనా సరఫరా పరిగణన లేకుండా అయినప్పటికీ కూడా పన్ను విధించదగినదై ఉంటుంది.
గమనిక: ఒకసారి పూర్తి నియమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత, అటువంటి సరఫరా యొక్క పన్ను పరిధిలోకి వచ్చే విలువను ఎలా లెక్కగట్టాలి అనే దానిపై మరింత స్పష్టత అందుబాటులోకి వస్తుంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6