Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

ప్రస్తుత చట్టం కింద నమోదు చేసుకోబడి ఉన్న ఒక వ్యాపారంగా మీకు ఉండే అన్నింటికంటే మొదటి విధి ఏంటంటే, జిఎస్టి కి పరివర్తనం చెందటం. జీఎస్టీ యొక్క ముఖ్యాంశాలు తెలుసుకోవడం ముఖ్యమై ఉండగా, మీకు అందుబాటులో ఉన్న జిఎస్టి పరివర్తన నిబంధనలు అర్థం చేసుకోవడం, మరియు జిఎస్టి మృదువైన పరివర్తనాన్ని నిర్దారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం మరియు బదిలీ ప్రయోజనాలను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవడం కూడా చాలా కీలకం. మీరు తగిన జిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకునేందుకు ముందుగానే మీ అకౌంటింగ్ మరియు నివేదన పద్దతులు, సేకరణ, లాజిస్టిక్ నిర్ణయాలు మొదలైనటువాటిని సమీక్షించడం అవసరం.

నేడు, తయారీ, అమ్మకాలు మరియు సేవా కార్యకలాపాలు ఒక ప్రత్యేక పరోక్ష పన్ను విధానం చేత నిర్వహించబడతాయి. తయారీ కార్యకలాపం సెంట్రల్ ఎక్సైజ్ ద్వారా కవర్ చేయబడుతుంది, అమ్మకాలు రాష్ట్ర వేట్ / సిఎస్టి కింద కవర్ చేయబడతాయి, మరియు సేవలు కార్యకలాపం సేవా పన్ను చట్టం క్రింద కవర్ చేయబడి ఉంటుంది.

అవగాహనలో మెరుగుదల మరియు సౌలభ్యం కోసం, మేము క్రింద పన్ను రకాల్లో ప్రతిదానికి పరివర్తన నిబంధనలు వర్గీకరించాము:

  • సెంట్రల్ ఎక్సైజ్
  • వేట్
  • సేవా పన్ను (సర్వీస్ టాక్స్)

మీకు ఉండి ఉండగల కొన్ని ప్రశ్నలు:

  • జిఎస్టి అమలు చేయడానికి ముందు, చివరి రోజున అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ ఇన్పుట్ పన్ను క్రెడిట్ కు ఏమవుతుంది?
  • క్యాపిటల్ గూడ్స్ పై ఇంకా వినియోగించుకోవలసి ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఏమౌతుంది?

మేము ఈ ప్రశ్నలకు దృష్టాంతం వారీగా సమాధానం ఇస్తాము.

సినారియో 1: సెన్వాట్ (CENVAT) మరియు ఇన్పుట్ వేట్ క్రెడిట్ వినియోగించుకున్నారు

సెంట్రల్ ఎక్సైజ్

తయారీదారు

ఒక తయారీదారు జిఎస్టి అమలుచేయబడిన తేదీకి పూర్వపు చివరి రోజున అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ సెన్వాట్ క్రెడిట్ ని ఇన్పుట్ క్రెడిట్ గా ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు,

దీని అర్థం ఏమిటి?

  • సెన్వాట్ క్రెడిట్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ మీరు ఫైల్ చేసిన చివరి రిటర్న్ లో చూపబడి ఉండాలి, మరియు
  • అది జిఎస్టి కింద ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అనుమతించబడి ఉండాలి.

నేడు, చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎస్ఐ -వారి టర్నోవర్ 4 కోట్లకు మించని) కంటే ఇతరమైన ఒక తయారీదారు వారి నెలసరి రిటర్నులను ఫారం ఇఆర్ -1 లో మరియు ఎస్ఎస్ఐ త్రైమాసిక రిటర్నులను ఫారం ఇఆర్ -3 లో ఫైల్ చేయాలి. చివరి రోజున అనగా జిఎస్టి అమలుకు ముందు రోజునాటికి ఫారం ఇఆర్ -1 లేదా ఫారం ఇఆర్ -3 లో క్యారీ ఫార్వర్డ్ చేయబడిన సెన్వాట్ మొత్తం, సిజిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా క్యారీఫార్వర్డ్ చేసుకోబడేందుకు అనుమతించబడతాయి.

మనం దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్రంలోని ఒక కారు తయారీదారు, ఎక్సైజ్ అండ్ కర్నాటక వేట్ కింద నమోదు చెయ్యబడి ఉన్నారు. 31 మార్చి, 2017 నాటికి సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఫారం ఇఆర్ -1 కింద ఇవ్వబడిన విధంగా ఉంది:

ఫారం ఇ.ఆర్-1

మార్చి నెల మరియు 2017 సంవత్సరం కోసం ఎక్సైజ్ విధించబడదగిన సరుకు రిటర్న్ మరియు సెన్వాట్ క్రెడిట్ వినియోగించుకోవడం
క్రెడిట్ వివరాలు
సెన్వాట్
ఎఇడి_టిటిఎ
ఎన్ సిసిడి
ఎడి ఇ-ఎల్విడి_సిఎల్_85
ఎడి సి-ఎల్విడి_సిటి_75
ఎడ్యు_సెస్
సెక్_ ఎడ్యు_సెస్
సర్వీస్ పన్ను
ఎడ్యు_సెస్ టి
సెక్_ ఎడ్యు_సెస్ ఎస్టి
క్లోజింగ్ బ్యాలెన్స్25,000.000.000.000.000.000.000.000.000.000.00

మార్చి 2017 నాటి ఫారం ఇఆర్ -1 ప్రకారం, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ .25,000 క్లోజింగ్ సెన్వాట్ బ్యాలెన్స్ ఉంది.

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెన్వాట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలదా?

అవును రూ .25,000 క్లోజింగ్ సెన్వాట్ బ్యాలెన్స్ సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ చేసుకోబడేటందుకు పూర్తిగా అర్హత కలిగి ఉంటుంది. ఇది ఎందుకంటే, దిగువన వివరించబడిన అన్ని షరతులను సూపర్ కార్స్ లిమిటెడ్ సంతృప్తిపరుస్తుంది కాబట్టి:

  • రూ. 25,000 సెన్వాట్ రిటర్న్ లో చూపించబడి ఉండాలి, మరియు
  • జిఎస్టి లో అదే దానిని ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అనుమతించడం జరుగుతుంది.

ఇప్పుడు, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సెన్వాట్ ఒక సిజిఎస్టి క్రెడిట్ గా ఉంటుంది. సూచించబడిన క్రమంలో బాధ్యతలు ఎత్తివేసేందుకు దీనిని వినియోగించుకోవచ్చు.

ఎక్సైజ్ డీలర్

ఒక డీలర్ గా, మీరు ఎక్సైజ్ విధించదగిన సరుకుల్లో వాణిజ్యం చేస్తూ ఉన్నట్లయితే మీరు సెంట్రల్ ఎక్సైజ్ కింద నమోదు చేసుకునేందుకు బాధ్యులు. నేడు, మీరు చెల్లించే ఎక్సైజ్ సుంకం మీకు క్రెడిట్ గా అందుబాటులో వుండదు. ఒక మొదటి దశ లేదా రెండవ దశలో డీలర్ గా చెల్లించబడే ఎక్సైజ్ సుంకం ఉత్పత్తి యొక్క ధరకు జోడించబడుతుంది. అది గనక ఒక తయారీదారుకి అమ్మబడి ఉంటే, పాస్ ఆన్ చేయబడిన ఎక్సైజ్ సుంకం, కొనుగోలు చేస్తున్న తయారీదారు ద్వారా సెన్వాట్ (CENVAT) క్రెడిట్ గా క్లెయిమ్ చేయబడుతుంది.

జిఎస్టి కి పరివర్తనం చెందే తేదీన, మీ ద్వారా ఉంచుకోబడి ఉన్న క్లోజింగ్ స్టాక్ కు సంబంధించి చెల్లించే ఎక్సైజ్ సుంకం, సిజిఎస్టి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ గా క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు అనుమతించబడుతుంది.

వాట్

వాట్ కింద నమోదు చేసుకోబడిన ఒక వ్యాపారం ఆయా రాష్ట్రాల్లో సూచించిన విధంగా, నెలసరి లేదా త్రైమాసిక వేట్ రిటర్న్ ఫారంలను ఫైల్ చేయవలసిన అవసరం ఉంటుంది. వేట్ రిటర్న్ ఫారంల్లో ఇన్పుట్ వేట్ క్రెడిట్ ఎస్జిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా కారీ ఫార్వర్డ్ చేయబడుతుంది.

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్రంలోని ఒక కారు తయారీదారు, కర్ణాటక వేట్ కింద నమోదు చెయ్యబడి ఉంది. 31 మార్చి, 2017నాటికి సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వేట్ ఫారం 100 (కర్ణాటక నెలవారీ రిటర్న్ ఫారం) కింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది:

ఫారం వాట్ 100 (నియమం 138 చూడండి)

రిటర్న్

పన్ను వ్యవధి (నెల/త్రైమాసికం)

మార్చ్, 2017
క్యారీ ఫార్వర్డ్ చేయబడిన క్రెడిట్/ మితిమీరిన చెల్లింపు5,000.00

మార్చ్ 2017 నాటి వేట్ ఫారం 100 ప్రకారం, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఉన్న ఇన్పుట్ వాట్ క్రెడిట్ బ్యాలెన్స్ రూ. 5,000.

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్పుట్ వేట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలదా?

అవును, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్లోజింగ్ ఇన్పుట్ వేట్. రూ. 5,000 పూర్తిగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోబడవచ్చు. ఇది ఎందుకంటే సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద వివరించబడిన అన్ని పరిస్థితులను సంతృప్తిపరుస్తుంది కాబట్టి:

  • ఇన్పుట్ వేట్ 5,000 రిటర్న్ లో చూపబడిఉంది మరియు
  • జిఎస్టి లో అదే దానిని ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అనుమతించడం జరుగుతుంది.

ఇప్పుడు, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, ఎస్జిఎస్టి క్రెడిట్ గా ఇన్పుట్ వేట్ క్యారీ ఫార్వార్డ్ చేయబడుతుంది. సూచించిన క్రమంలో బాధ్యతలు ఎత్తివేసుకోవడానికి దీనిని వినియోగించుకోవచ్చు.

సర్వీస్ పన్ను

పన్ను పరిధిలోకి వచ్చే తన సేవల సగటు విలువ 10 లక్షలకు మించితే, నేడు, ఒక సర్వీస్ ప్రొవైడర్ కి నమోదు చేసుకోవలసిన బాధ్యత ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే సేవలపై విధించబడే సర్వీస్ ట్యాక్స్ రకాలు కింది విధంగా ఉంటాయి:

పన్ను పన్ను రేటు ఇన్పుట్ క్రెడిట్ అందుబాటులో ఉందా? దేనికి ప్రతిగా ఎత్తివేయాలి?
సర్వీస్ పన్ను

14%

ఉందిసర్వీస్ పన్ను మరియు ఎక్సైజ్ బాధ్యత
స్వచ్ఛ భారత సెస్

0.5%

లేదు

క్రిషి కళ్యాణ్ సెస్

0.5%

ఉంది

కృషి కళ్యాణ్ సెస్ బాధ్యత మాత్రమే

 

ఒక సర్వీస్ ప్రొవైడర్ గా మీరు ఫారం ST -3 లో అర్ధవార్షిక రిటర్న్ ఫైల్ చేయాలి. సర్వీస్ పన్ను ఇన్పుట్ క్రెడిట్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్, సిజిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా క్యారీ ఫార్వర్డ్ చేయబడుతుంది.

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.

సూపర్ కార్స్ లిమిటెడ్ కర్నాటకలో ఒక కార్ తయారీ యూనిట్. వారికి కర్ణాటక రాష్ట్రంలో నెలకొల్పబడి ఉన్న సేవా విభాగాలు కూడా ఉన్నాయి. 31 మార్చి, 2017 నాటికి సూపర్ కార్స్ లిమిటెడ్ యొక్క ST -3 రిటర్న్ ఫారం క్రింద ఇవ్వబడింది:

నాటి ఫారం ST-3 ప్రకారం, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక రూ 30,000 క్లోజింగ్ సెన్వాట్ (సర్వీస్ టాక్స్ ఇన్పుట్ క్రెడిట్) ఉంది.

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెన్వాట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలదా?

అవును, క్లోజింగ్ సెన్వాట్ బ్యాలెన్స్ అయిన రూ. 30,000 సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ చేసుకోబడేటందుకు పూర్తిగా అర్హమై ఉంటుంది. ఇది ఎందుకంటే సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద వివరించిన షరతులు అన్నింటినీ పూర్తిగా సంతృప్తి పరుస్తుంది కాబట్టి:

  • రూ 30,000 సెన్వాట్ రిటర్న్ లో చూపించబడి ఉంది మరియు
  • జిఎస్టి లో అదే దానిని ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ గా అనుమతించడం జరుగుతుంది.

ఇప్పుడు, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, కి సెన్వాట్ ఒక సిజిఎస్టి క్రెడిట్ అవుతుంది. సూచించిన క్రమంలో బాధ్యతలను సెట్ ఆఫ్ చేసుకునేందుకు దీనిని వినియోగించుకోవచ్చు.

సినారియో 2: వినియోగించుకోని సెన్వాట్ క్రెడిట్ మరియు క్యాపిటల్ సరుకు పై ఇన్పుట్ వేట్

ప్రస్తుతం, సెంట్రల్ ఎక్సైజ్ కింద, సెన్వాట్ క్రెడిట్ ప్రస్తుత సంవత్సరంలో 50% మేరకు వినియోగించుకోవాలి, మరియు మిగిలినదానిని తదుపరి సంవత్సరంలో వినియోగించుకోవాలి. అదేవిధంగా, క్యాపిటల్ సరుకు కొనుగోలుపై చెల్లించిన వేట్ వెంటనే ఇన్పుట్ వేట్ గా పూర్తిగా అందుబాటులో వుండదు. రాష్ట్ర వ్యాట్ చట్టాలు, మరియు కొనుగోలు చేయబడిన క్యాపిటల్ సరుకు రకం మీద ఆధారపడి, ఇన్పుట్ వేట్ వినియోగించుకోవచ్చు,

  • వివిధ ఆర్థిక సంవత్సరాల వ్యాప్తంగా విస్తరించిన వాయిదాలలో
  • వాణిజ్య ఉత్పత్తి మొదలైనవి ప్రారంభించిన తర్వాత క్రెడిట్ గా.

క్యాపిటల్ సరుకుపై సెన్వాట్ క్రెడిట్ వినియోగించుకోవడం పై ఈ అమలులో ఉన్న ఆంక్ష కారణంగా, జిఎస్టి కు పరివర్తనం చెందే తేదీ నాటికి కొన్ని వినియోగించుకోబడని సెన్వాట్ మరియు ఇన్పుట్ వేట్ ఉండవచ్చు.

మెరుగ్గా అర్ధం చేసుకునేందుకు మనం ఒక ఉదాహరణతో చర్చిద్దాం.

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 ఫిబ్రవరి 2017 నాడు యంత్రాంగం కొనుగోలు చేసింది. లావాదేవీ వివరాలు కింద చూపించబడ్డాయి:

వివరాలు మొత్తం (రూ)
యంత్రాంగం1,00,000
ఎక్సైజ్ సుంకం@12.5%12,500
వాట్ 14.5%16,313
మొత్తం1,28,813

ప్రస్తుత సెన్వాట్ నిబంధనల ప్రకారం, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుత సంవత్సరంలో 50% సెన్వాట్, మరియు తదుపరి సంవత్సరాలలో మిగిలిన దానిని వినియోగించుకోవడానికి అనుమతించబడుతుంది. మరియు కర్నాటక వేట్ నియమాల ప్రకారం, ఇన్పుట్ వేట్ క్రెడిట్ వాణిజ్య ఉత్పత్తి మొదలయిన తరువాత మాత్రమే వినియోగించుకోవచ్చు. వాణిజ్యపరమైన ఉత్పత్తి జూన్’17 నెలలో ప్రారంభించబడుతుందని భావించుదాం.

దృష్టాంతాన్ని పరిగణనలోకి తీసుకున్న మీదట- సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వినియోగించుకున్నది

  • 50% సెన్వాట్ అనగా ప్రస్తుత సంవత్సరం (2016-17) లో రూ 6,250.
  • మిగిలిన రూ 6,250 సెన్వాట్ తదుపరి సంవత్సరం (2017-18) లో.
  • వాణిజ్య ఉత్పత్తి మొదలైన తరువాత ఇన్పుట్ వేట్ క్రెడిట్, 2017-18 లో అర్హత కలుగుతుంది

జిఎస్టికి పరివర్తనం చెందిన మీదట, సూపర్ కార్స్ లిమిటెడ్ వినియోగించుకోకుండా ఉన్న రూ. 6,250 సెన్వాట్, మరియు రూ 16,313 ఇన్పుట్ వేట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు అనుమతించబడుతుందా?

అవును, సూపర్ కార్స్ లిమిటెడ్, క్యాపిటల్ సరుకుపై వినియోగించుకోకుండా ఉన్న సెన్వాట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు అనుమతించబడుతుంది, అయితే ఈ షరతులను సంతృప్తి పరచవలసి ఉంటుంది:

  • ప్రస్తుత చట్టం కింద సెన్వాట్ మరియు ఇన్పుట్ వేట్ కూడా ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అనుమతించబడతాయి.
  • జిఎస్టిలో అది ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా స్వీకరించబడుతుంది.

సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్ని షరతులను సంతృప్తిపరుస్తుంది, మరియు వారు సెన్వాట్ మరియు ఇన్పుట్ వేట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు అర్హులు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6