పరిచయం

“సరిగ్గా అర్ధరాత్రి సమయంలో, ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు, భారతదేశం జీవితం మరియు స్వేచ్ఛకు మేల్కొంటుంది.”

బ్రిటీష్ పాలన నుండి స్వతంత్రాన్ని స్వాగతించడానికి భారతదేశం సంసిద్ధపపడుతూ ఉండగా ఆగస్టు 14, 1947 నాడు అర్ధరాత్రిన మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాట్లాడిన ఈ మాటలు – 70 సంవత్సరాల తరువాత, పన్ను కపటత నుంచి స్వాతంత్ర్యం, పన్ను సమస్యల నుండి స్వాతంత్ర్యం, మరియు పన్ను అవినీతి నుండి స్వాతంత్ర్యం కలిగి ఉన్న ఒక కొత్త యుగాన్ని స్వాగతించడానికి దేశం సంసిధ్ధమవుతుండగా, ఇప్పుడు మళ్ళీ నిజమవనున్నాయి..

ప్రధాని శ్రీ నరేంద్రమోడీ మరియు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ఒక గంట మోగించడం ద్వారా జూన్ 30 అర్ధరాత్రి సమయంలో జిఎస్టి ను అధికారికంగా ఆహ్వానిస్తారు. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు జిఎస్టి యుగంలో మీ వ్యాపారాన్ని సజావుగా కొనసాగించడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు అనేది? మీరు 00:01 నుండి మీ మొదటి జిఎస్టి ఇన్వాయిస్ ని పాస్ చేయగలరా? చిన్న జవాబు ఏమిటంటే- అవును!

ఇక్కడ జూన్ 30 అర్ధరాత్రి నుండి మీ జిఎస్టి ఇన్వాయిస్ ప్రారంభించటానికి ఒక శీఘ్ర చెక్ లిస్ట్ ఉంది – మీ ఇన్వాయిస్ టాలీ యొక్క జిఎస్టి-రెడీ ప్రాడక్ట్ – టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6 లో ఎలా కనిపిస్తుందో కూడా మీకు మేము చూపించాము

జిఎస్టి వ్యవస్థలో ఇన్వాయిస్ చేయడం

ఈ వ్యాసంలో, మీకు జిఎస్టి వ్యవస్థలో ఎదురుపడే ఈ కింది ఇన్వాయిస్ల ద్వారా మిమ్మల్ని మేము తీసుకు వెళ్తాము:

 • పన్ను ఇన్వాయిస్
 • రివర్స్ ఛార్జ్ ఇన్వాయిస్
 • రసీదు వౌచర్
 • ఎగుమతి ఇన్వాయిస్
 • డెలివరీ ఛలాన్
 • సరఫరా బిల్లు
 • డెబిట్ గమనిక
 • క్రెడిట్ గమనిక

పన్ను ఇన్వాయిస్

ఒక నమోదైన పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులను లేదా సేవలను సరఫరా చేసినప్పుడు – ఒక పన్ను ఇన్వాయిస్ జారీ చేయబడుతుంది. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) ను క్లెయిమ్ చేయడానికి ఒక జిఎస్టికి కట్టుబడి ఉండే ఇన్వాయిస్ జారీచేయడం మరియు అందుకోవడం అవసరం అవుతుంది. ఒక డీలర్ తన వినియోగదారు (ఒక నమోదిత పన్నుచెల్లింపుదారుడు అయిన వ్యక్తి) కు అలాంటి ఇన్వాయిస్ ను జారీ చేయకపోతే – అతని కస్టమర్ క్లెయిమ్ చేయదగిన ఐటిసి కోల్పోతారు మరియు డీలర్ తన వినియోగదారులను కోల్పోతాడు.

మీరు పన్ను ఇన్వాయిస్ లో కింది సమాచారాన్ని తప్పనిసరిగా సంగ్రహిస్తున్నారని నిర్ధారించుకోండి

   • ఇన్వాయిస్ సంఖ్య మరియు తేదీ

 

   • వినియోగదారుని పేరు

 

   • షిప్పింగ్ మరియు బిల్లింగ్ చిరునామా

 

   • వినియోగదారు మరియు పన్ను చెల్లింపుదారుని జిఎస్టిఐఎన్

 

   • సరఫరా స్థలం

 

   • హెచ్ఎస్ సి/ఎస్ఎసి కోడ్

 

   • పన్ను విధించదగిన విలువ మరియు తగ్గింపులు

 

   • పన్నుల రేటు మరియు మొత్తం, అంటే సిజిఎస్టి + ఎస్జిఎస్టి (రాష్ట్రం లోపలివాటి కోసం) & ఐజిఎస్టి (రాష్ట్రాల మధ్యవాటి కోసం)

 

  • వస్తువు వివరాలు అనగా వివరణ, యూనిట్ ధర, పరిమాణము

మీరు పన్ను ఇన్వాయిస్ ని ఎప్పటికల్లా జారీ చేయాలి?

వస్తువుల సరఫరా కోసం

పన్ను ఇన్వాయిస్ దీనికి ముందు లేదా ఆ సమయంలో జారీ చేయాలి

   • వస్తువుల యొక్క తొలగింపు, సరఫరాలో వస్తువుల తరలింపు భాగమై ఉన్నచోట

 

   • గ్రహీతకు వస్తువుల పంపిణీ, సరఫరాకు వస్తువుల తరలింపు అవసరం లేనిచోట

 

  • ఖాతా ప్రకటన / చెల్లింపు జారీ చేయడం, నిరంతర సరఫరా ఉన్నచోట

సేవల సరఫరా కోసం

పన్ను ఇన్వాయిస్ ఈ సమయం లోపల జారీ చేయాలి

 • సేవ యొక్క సరఫరా తేదీ నుండి 30 రోజులు
 • సరఫరాదారు ఒక బీమా సంస్థ లేదా బ్యాంకింగ్ సంస్థ లేదా ఆర్థిక సంస్థ అయి ఉన్న చోట, సేవ యొక్క సరఫరా తేదీ నుండి 45 రోజులు

పన్ను ఇన్వాయిస్ యొక్క ఎన్ని కాపీలు అవసరం?

వస్తువుల సరఫరా కోసం

ఇన్వాయిస్ యొక్క మూడు కాపీలు అవసరం –ఒరిజినల్(అసలు), డూప్లికేట్(నకిలీ) మరియు ట్రిప్లికేట్(మూడవది).

 • ఒరిజినల్ ఇన్వాయిస్: : అసలు ఇన్వాయిస్ గ్రహీతకు జారీ చేయబడుతుంది మరియు ‘గ్రహీత కొరకు ఒరిజినల్’ గా గుర్తు పెట్టబడి ఉంటుంది.
 • డూప్లికేట్ కాపీ:
 • ట్రిప్లికేట్ కాపీ: ఈ కాపీ పంపిణీదారు దగ్గర అట్టిపెట్టుకోబడుతుంది, ‘సరఫరాదారు కోసం ట్రిప్లికేట్ ‘ గా గుర్తు పెట్టబడి ఉంటుంది.

సేవల సరఫరా కోసం

ఇన్వాయిస్ యొక్క రెండు కాపీలు అవసరం:

 • ఒరిజినల్ ఇన్వాయిస్: అసలు ఇన్వాయిస్ గ్రహీతకు జారీ చేయబడవలసి ఉంటుంది మరియు ‘గ్రహీత కొరకు ఒరిజినల్’ గా గుర్తు పెట్టబడి ఉంటుంది.
 • డూప్లికేట్ కాపీ: నకిలీ కాపీ సరఫరాదారు కోసం, మరియు ‘సరఫరాదారు కొరకు డూప్లికేట్’ గా గుర్తు పెట్టబడి ఉంటుంది

మీరు పన్ను ఇన్వాయిస్ లేవనెత్తగల కనీస మొత్తం ఏమిటి?

సరఫరా చేయబడిన వస్తువుల లేదా సేవల విలువ ఐఎన్ఆర్ 200 కన్నా తక్కువగా ఉన్నప్పుడు పన్ను ఇన్వాయిస్ జారీ చేయవలసిన అవసరం ఉండదు ఒకవేళ:

   • గ్రహీత రిజిస్టర్ చేసుకోబడనివారు అయి

 

  • గ్రహీతకు ఇన్వాయిస్ అవసరం లేదు (ఇన్వాయిస్ కోసం గ్రహీత డిమాండ్ చేసినట్లయితే, పన్ను ఇన్వాయిస్ జారీ చేయబడాలి)

అయితే, పన్ను ఇన్వాయిస్ జారీ చేయబడని అన్ని వస్తువుల కోసం ప్రతి రోజు ముగింపులో కన్సాలిడేటెడ్ (ఏకీకృత) పన్ను ఇన్వాయిస్ లేదా ఎగ్రిగేట్ (సమిష్టి) ఇన్వాయిస్ సిద్ధం చేయాలి.

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో రాష్ట్రంలోపలి లావాదేవీల కొరకు పన్ను ఇన్వాయిస్

రాష్ట్రం లోపలి లావాదేవీల సందర్భంలో, సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టిలు వసూలు చేయబడతాయి. రాష్ట్రం లోపలి లావాదేవీల కోసం మీ పన్ను ఇన్వాయిస్ ఫార్మాట్ క్రింది విధంగా ఉంటుంది –

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో రాష్ట్రాల మధ్య లావాదేవీల కొరకు పన్ను ఇన్వాయిస్

రాష్ట్రాల మధ్య లావాదేవీల విషయంలో, ఐజిఎస్టి వసూలు చేయబడుతుంది. రాష్ట్రాల మధ్య లావాదేవీల కోసం మీ పన్ను ఇన్వాయిస్ ఫార్మాట్ ఈ క్రింది విధంగా ఉంటుంది –

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో బిల్-టు-షిప్-టు (వీరికి-బిల్లు-వీరికి-షిప్ చేయండి) లావాదేవీల కొరకు పన్ను ఇన్వాయిస్

3 వ పార్టీ సూచనపై సరుకు గ్రహీతకు పదార్థం పంపబడిన సందర్భంలో, ఒక బిల్-టు-షిప్-టు దృష్టాంతం ఉత్పన్నమవుతుంది. మూడవ పక్షం గనక అదే రాష్ట్రంలో ఉన్నట్లయితే, ఆ పదార్థం మరొక రాష్ట్రానికి రవాణా చేయబడినప్పటికీ సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి వసూలు చేయబడతాయి.

యుఆర్డి నుండి కొనుగోళ్ళను నిర్వహించుకోవడం– రివర్స్ ఛార్జి ఇన్వాయిస్

ఒక ‘రిజిస్టర్ చేసుకోబడని డీలర్’ నుంచి ఒక రిజిస్టర్ చేసుకోబడిన వ్యక్తి కొనుగోలు చేసినట్లయితే, గ్రహీత ద్వారా పన్ను చెల్లించబడుతుంది మరియు గ్రహీత వస్తువుల లేదా సేవలను అందుకున్న తేదీలో ఇన్వాయిస్ జారీ చేయాలి.

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో రివర్స్ ఛార్జి ఇన్వాయిస్

అడ్వాన్స్ చెల్లింపులని నిర్వహించడం –రసీదు వౌచర్

ఒక రిజిస్టర్ చేయబడిన డీలర్ ఒక సరఫరా కోసం ముందస్తు చెల్లింపును స్వీకరిస్తున్న సందర్భంలో, గ్రహీత చెల్లించిన ముందస్తు చెల్లింపు కోసం డీలర్ ఒక రసీదు వోచర్ ని జారీ చేయాలి.

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో రసీదు వోచర్

ఎగుమతులను సమర్ధవంతంగా నిర్వహించుకోవడం – ఎగుమతి ఇన్వాయిస్

ఒక ఎగుమతి ఇన్వాయిస్, పన్ను ఇన్వాయిస్ లో అవసరమైన వివరాలతో పాటుగా, తప్పనిసరిగా క్రింది వివరాలను కలిగి ఉండాలి:

   • “ఐజిఎస్టి చెల్లింపు చేసిన మీదట ఎగుమతి కోసం ఉద్దేశించబడిన సరఫరా” లేదా “ఐజిఎస్టి చెల్లింపు లేకుండా అండర్టేకింగ్ బాండ్ లేదా లేఖ కింద ఎగుమతి కోసం ఉద్దేశించిన సరుకు” అనే పదాలు కలిగి ఉండాలి.

 

   • గ్రహీత పేరు మరియు చిరునామా

 

   • గమ్య దేశం పేరు

 

  • అందజేయవలసిన చిరునామా

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో ఎగుమతి ఇన్వాయిస్

డెలివరీ చలాన్ ఎప్పుడు జారీ చెయ్యాలి?

కొన్ని ప్రత్యేక వ్యాపార కేసులలో డెలివరీ చలాన్ జారీ చేయవచ్చు, అవి ఈ విధంగా ఉంటాయి-

   • సరఫరాదారు యొక్క వ్యాపార స్థలము నుండి తొలగింపు సమయంలో పరిమాణం తెలియని ద్రవ వాయువు సరఫరా,

 

   • ఉద్యోగ పని కోసం వస్తువుల రవాణా

 

   • సరఫరా కాకుండా ఇతర కారణాల కోసం వస్తువుల రవాణా

 

  • ఏవైనా ఇతర నోటిఫైడ్ సరఫరాలు

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో డెలివరీ చలాన్

సరఫరా బిల్లుని ఎప్పుడు జారీ చెయ్యాలి?

కింది సందర్భాలలో ఒక రిజిస్టర్ చేసుకోబడిన సరఫరాదారుచే సరఫరా జారీ చేయవలసి ఉంటుంది:

   • మినహాయించిన వస్తువులు లేదా సేవల సరఫరా

 

  • సరఫరాదారు కాంపొజిషన్ పథకం కింద పన్ను చెల్లిస్తూ ఉండటం

పన్ను ఇన్వాయిస్ లాగానే, గ్రహీత బిల్లు కోసం పట్టుబడితే తప్ప, సరఫరా చేయబడిన వస్తువులు లేదా సేవల విలువ ఐఎన్ఆర్ 200 కంటే తక్కువగా ఉన్నప్పుడు, సరఫరా బిల్లు జారీ చేయబడవలసిన అవసరం ఉండదు. అయితే, సరఫరా బిల్లు జారీ చేయబడని అన్ని వస్తువుల సరఫరా యొక్క ఏకీకృత బిల్లుని వ్యాపార రోజు చివరిలో సిద్ధం చేయాలి.

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో సరఫరా బిల్లు

ఇప్పటికే జారీచేయబడిన పన్ను ఇన్వాయిస్ యొక్క విలువలని సవరణ చేయడం ఎలాగ?

ఒక ఇన్వాయిస్ లో పన్ను విధించదగిన విలువ లేదా ఛార్జి చేయబడిన జిఎస్టి ను సవరించడానికి, సరఫరాదారు డెబిట్ నోట్ లేదా సప్లిమెంటరీ ఇన్వాయిస్ లేదా క్రెడిట్ నోట్ జారీ చేయాలి.
డెబిట్ నోట్ / సప్లిమెంటరీ ఇన్వాయిస్ – ఇవి అసలు ఇన్వాయిస్లో పన్ను విధించదగిన విలువ &/లేదా ఛార్జి చేయబడిన జిఎస్టిని పెంచడాన్ని రికార్డు చేసేందుకు ఒక సరఫరాదారుచే జారీ చేయబడవలసి ఉంటాయి.

క్రెడిట్ నోట్ / రివైజ్ (సవరణ) చేయబడిన ఇన్వాయిస్ – ఇవి అసలు ఇన్వాయిస్లో పన్ను విధించదగిన విలువ &/లేదా ఛార్జి చేయబడిన జిఎస్టిని తగ్గించడాన్ని రికార్డు చేసేందుకు ఒక సరఫరాదారుచే జారీ చేయబడవలసి ఉంటాయి. ఒక క్రెడిట్ నోట్ – సరఫరా చేయబడిన ఆర్ధిక సంవత్సరం ముగింపు అనంతరం సెప్టెంబరు 30 వ తేదీన లేదా అంతకు ముందుగాని లేదా సంబంధిత వార్షిక రిటర్న్ ఫైల్ చేసిన తేదీ, ఏది ముందైతే అప్పుడు, జారీ చేయబడాలి.

డెబిట్ నోట్లు మరియు క్రెడిట్ నోట్లలో కవర్ చేయబడవలసిన వివరాలు:

డెబిట్ నోట్లు, సప్లిమెంటరీ ఇన్వాయిస్లు మరియు క్రెడిట్ నోట్లు ఈ క్రింది వివరాలను తప్పక కలిగి ఉండాలి:

   • డాక్యుమెంట్ యొక్క స్వభావం, ‘సవరించబడిన ఇన్వాయిస్’ లేదా ‘సప్లిమెంటరీ ఇన్వాయిస్’ లాగా తప్పక ప్రముఖంగా సూచించబడి ఉండాలి,

 

   • సరఫరాదారు యొక్క పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్

 

   • ఆర్థిక సంవత్సరానికి ఏకైకమై ఉండే కేవలం అక్షరాలు మరియు/లేదా అంకెలు లేదా ప్రత్యేక అక్షరాలు హైఫన్ “-“ లేదా స్లాష్ “/”, కలిగి ఉండే వరుసక్రమంలో ఉండే ఒక క్రమ సంఖ్య

 

   • డాక్యుమెంట్ జారీచేయబడిన తేదీ

 

   • గ్రహీత గనక రిజిస్టర్ చేయబడినట్లయితే – గ్రహీత యొక్క పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్ / ప్రత్యేక ఐడి సంఖ్య

 

   • గ్రహీత గనక రిజిస్టర్ చేయబడి ఉండకపోతే- గ్రహీత యొక్క పేరు, చిరునామా మరియు రాష్ట్రం పేరు మరియు కోడ్ తో అందజేయవలసిన చిరునామా

 

   • అసలు పన్ను ఇన్వాయిస్ లేదా సరఫరా బిల్లు యొక్క క్రమసంఖ్య మరియు తేదీ

 

   • వస్తువులు లేదా సేవల యొక్క పన్ను విధించదగిన విలువ, పన్ను రేటు మరియు గ్రహీతకు జమ చేయబడిన లేదా వసూలు చేసిన పన్ను మొత్తం

 

  • సరఫరాదారు లేదా అతని అధీకృత ప్రతినిధి యొక్క సంతకం లేదా డిజిటల్ సంతకం

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో క్రెడిట్ నోటు

జిఎస్టి- రెడీ టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 లో డెబిట్ నోటు

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6