ఇప్పటికే ఉన్న పన్ను చట్టాల ప్రకారం ఇప్పటికే నమోదు చేసుకోబడిన వ్యాపారాల కోసం తీసుకోదగిన తక్షణ చర్యలు ఏమిటంటే ఒక తాత్కాలిక జిఎస్టి రిజిస్ట్రేషన్ ను పొందడం; జిఎస్టి కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన బాధ్యత వారికి ఇంకా ఉంటుందా అనేది అంచనా వేసుకోవడం – మరియు దాని ప్రకారంగా, జిఎస్టి రిజిస్ట్రేషన్ కు మారిపోండి లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ ను రద్దు చేసుకునే ఎంపికను వినియోగించుకోండి.

అయితే, మీరు ఒక కొత్త వ్యాపారం అయితే, లేదా మీరు ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకోకపోయి ఉండి, కానీ ఇప్పుడు సూచించిన ప్రవేశ పరిమితుల కారణంగా రిజిస్టర్ చేసుకోవలసిన బాధ్యత కలిగి ఉంటే, మీ కోసం ముందుకున్న మార్గం – కొత్త జిఎస్టి రిజిస్ట్రేషన్.

ఇది కూడా చదవండి: రిజిస్టర్ చేసుకోబడిన డీలరా? జిఎస్టికి పరివర్తన చెందడం ఎలాగో నేర్చుకోండి

మీరు కొత్త జిఎస్టి రిజిస్ట్రేషన్ పొందడానికి ఎలా ముందుకు సాగాలో ఇక్కడ ఇవ్వబడింది-

దశ 1: మీ రాష్ట్రంలో ప్రవేశ పరిమితులను తనిఖీ చేయండి

జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ప్రవేశ పరిమితి ఈ క్రింది విధంగా ఉంటుంది:

 • ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు
 • మిగతా భారత దేశం –ఐఎన్ఆర్ 20 లక్షలు

గమనిక: జమ్మూ & కశ్మీర్, ప్రారంభంలో జిఎస్టి పరిమితి కింద లేకపోయినా, జులై 5 న జిఎస్టి తీర్మానాన్ని స్వీకరించింది. జ & క లో ప్రవేశ పరిమితి చాలావరకు ఐఎన్ఆర్ 10 లక్షల వద్ద ఉంటుంది.

దశ 2: క్రొత్త జిఎస్టి రిజిస్ట్రేషన్ ను పొందండి

మీరు రెగ్యులర్(సాధారణ) డీలర్షిప్ లేదా కాంపొజిట్ స్కీమ్ , (మిశ్రమ పథకం) ఎంచుకున్నా కొత్త జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం మీరు క్రింది దశలను ఆచరించవలసి ఉంటుంది:

  • సాధారణ జిఎస్టి పోర్టల్ కు ప్రాప్యత పొందండి.
  • మీరు పాన్ (PAN), మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడిలను అందించడం ద్వారా ఫారం జిఎస్టి రిజ్-01 యొక్క భాగం-ఎ ని నింపి సమర్పించాలి. పాన్ జిఎస్టి పోర్టరులో ధృవీకరించబడుతుంది, మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడి ఒక-సమయం పాస్వర్డ్ (ఒటిపి) ద్వారా ధృవీకరించబడతాయి.
  • ఒకసారి మీరు అలా చేసిన తర్వాత మీ మొబైల్ నంబరు మరియు ఇ-మెయిల్ లో ఒక దరఖాస్తు సూచన సంఖ్యను మీరు అందుకుంటారు.
  • అప్పుడు మీరు ఫారం జిఎస్టి రిజ్-01 యొక్క భాగం-బి నింపి అందుకున్న దరఖాస్తు సంఖ్యను పేర్కొనవలసి ఉంటుంది. అలాగే, ఫారం సమర్పించే ముందుగా, మీరు అవసరమైన ఇతర పత్రాలను, ఈ క్రింది విభాగంలో పేర్కొన్నట్లుగా, జోడించాలి.
  • అదనపు సమాచారం అవసరమైతే, పోర్టల్ నుంచి ఫారం జిఎస్టి రిజ్-03 జారీ చేయబడుతుంది. ఫారం జిఎస్టి రిజ్-03 అందుకున్న తేదీ నుండి 7 పని రోజులలో మీరు ఫారం జిఎస్టి రిజ్-04 ద్వారా అవసరమైన సమాచారంతో మీరు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.

 

 • ఫారం జిఎస్టి రిజ్ -01 లేదా ఫారం జిఎస్టి రిజ్ -04 ద్వారా అవసరమైన సమాచారం మొత్తం గనక మీరు అందించినట్లయితే, ఫారం జిఎస్టి రిజ్ -01 లేదా ఫారం జిఎస్టి రిజ్ -04 అందుకున్న తేదీ నుంచి 3 రోజులలోపుగా ఫారం జిఎస్టి రిజ్ -06 జారీ చేయబడుతుంది. అయితే సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా లేనట్లయితే, రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫారం జిఎస్టి రిజ్-05 ద్వారా తిరస్కరించబడుతుంది.

 

కొత్త జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల చెక్ లిస్ట్

మీరు క్రింది జిఎస్టి రిజిస్ట్రేషన్ అవసరాలను నెరవేర్చుతారని నిర్ధారించుకోండి.

 • పాన్ (PAN)
 • సంప్రదింపు వివరాలు – – ఇమెయిల్ ఐడి, సంప్రదింపు నంబర్
 • ఫొటోలు: యజమాని, భాగస్వాములు, మేనేజింగ్ ట్రస్టీ, కమిటీ మొదలైనవారివి మరియు అధికారిక సంతకం చేసే వ్యక్తిది.
 • పన్ను చెల్లింపుదారుల అమరిక (కాన్స్టిట్యూషన్ : భాగస్వామ్య ఒప్పందం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా కాన్స్టిట్యూషన్ యొక్క ఇతర ప్రమాణం
 • ప్రధాన / ప్రత్యామ్నాయ వ్యాపార స్థలాల యొక్క రుజువు::

  • స్వంత ప్రాంగణం కోసం – ఇటీవలి ఆస్తి పన్ను రసీదు లేదా పురపాలక ఖాతా నకలు లేదా విద్యుత్ బిల్లు నకలు వంటి ఆవరణ యాజమాన్యానికి మద్దతుగా ఏదైనా పత్రం.
 • బ్యాంకు ఖాతా సంబంధిత రుజువు బ్యాంకు పాస్ బుక్ యొక్క మొదటి పేజీ లేదా బ్యాంకు స్టేట్మెంట్ యొక్క స్కాన్ చేసిన కాపీ
 • అధీకృత పత్రాలు: ప్రతి అధీకృత సంతకదారులకు, సూచించిన ఫార్మాట్లో అధీకృతం నకలు లేదా మేనేజింగ్ కమిటీ లేదా డైరెక్టర్ల బోర్డు యొక్క తీర్మానం యొక్క నకలు అప్లోడ్ చేయండి.
నిర్ధారిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఫారంలు
ఫారం నం. ఫారం రకం
ఫారం జిఎస్టి రిజ్-07మూలం వద్ద పన్ను మినహాయింపుదారు లేదా పన్ను వసూలుదారుగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు
ఫారం జిఎస్టి రిజ్-09ప్రవాస (నాన్-రెసిడెంట్) పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తికి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు
ఫారం జిఎస్టి రిజ్-09A భారతదేశం వెలుపల ఒక ప్రదేశం నుంచి ఆన్లైన్ సమాచారం మరియు డేటా బేస్ ప్రాప్యత లేదా తిరిగి పొందటం సేవలను సరఫరా చేస్తున్న ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

29,058 total views, 94 views today