మా మునుపటి బ్లాగు జిఎస్టిలో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ఐఎస్డి) ని అర్ధంచేసుకోవడం, మేము జిఎస్టి లో ఐఎస్డి యొక్క పాత్ర గురించి చర్చించాము. ఈ బ్లాగ్లో, క్రెడిట్ పంపిణీ మరియు విభిన్న యూనిట్లకు (శాఖలు) క్రెడిట్ పంపిణీ పద్ధతికి వర్తించే విభిన్న పరిస్థితులను మేము చర్చిస్తాము.

ఒక ఐఎస్డి ద్వారా ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ కోసం షరతులు

ఒక ఐఎస్డి ద్వారా ఇన్పుట్ క్రెడిట్ పంపిణీ కోసం వర్తించే షరతులు కింద ఇవ్వబడ్డాయి:

1. క్రెడిట్ గ్రహీతకు ‘ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీకి మాత్రమే జారీ చేయబడినది’ అని స్పష్టంగా సూచిస్తూ ఒక ఐఎస్డి ఇన్వాయిస్, పంపిణీదారు ద్వారా జారీ చేయబడాలి. ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ చేయబడిన యూనిట్ ని ‘క్రెడిట్ గ్రహీత’ గా సూచిస్తారు. పన్ను ఇన్వాయిస్ కింది వివరాలను కలిగి ఉండాలి;
• ఇన్పుట్ సేవా పంపిణీదారు పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్
• ఒక ఆర్ధిక సంవత్సరానికి ప్రత్యేకమైన అక్షరమాలలు మరియు/లేదా సంఖ్యలను కలిగి ఉన్న వరుస క్రమ సంఖ్య
• జారీచేయబడి తేదీ
• సేవల సరఫరాదారు పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్, పంపిణీ చేయబడుతున్న దానికి సంబంధించి క్రెడిట్, మరియు అటువంటి సరఫరాదారు ద్వారా జారీ చేయబడిన క్రమ సంఖ్య మరియు ఇన్వాయిస్ యొక్క తేదీ
• క్రెడిట్ పంపిణీ చేయబడుతున్న గ్రహీత యొక్క పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్
• పంపిణీ చేయబడిన క్రెడిట్ మొత్తం, మరియు
• సరఫరాదారు లేదా అతని అధీకృత ప్రతినిధి యొక్క సంతకం లేదా డిజిటల్ సంతకం

2. పంపిణీ కోసం అందుబాటులో ఉన్న రుణ మొత్తాన్ని వితరణ చేయబడిన క్రెడిట్ మొత్తం మించకూడదు

3. ఒక నెలలో పంపిణీ కోసం అందుబాటులో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ అదే నెలలో పంపిణీ చేయబడుతుంది, మరియు దాని యొక్క వివరాలు ఫారం జిఎస్టిఆర్ -6 లో సమకూర్చబడతాయి.

4. ఇన్పుట్ సేవలను వినియోగించిన ఆ శాఖకు మాత్రమే ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ చేయాలి. దీన్ని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం:

ఉదాహరణకు, టాప్-ఇన్-టౌన్ హోమ్ అప్లయన్సెస్ లిమిటెడ్, కర్ణాటకలో బెంగుళూరులో ఉంది. వారికి మైసూర్ (కర్ణాటక), చెన్నై (తమిళనాడు) మరియు ముంబై (మహారాష్ట్ర) లో కూడా శాఖలు ఉన్నాయి. బెంగుళూరులోని యూనిట్ ప్రధాన కార్యాలయం సాధారణ సేవలను పెద్దమొత్తంలో సమకూర్చుకుంటారు, అవి ఇతర విభాగాల ద్వారా కూడా ఉపయోగించబడుతూ ఉంటాయి.

మైసూర్ బ్రాంచికి ప్రత్యేకంగా అందించబడిన ప్రకటన సేవలకు గాను టాప్-ఇన్-టౌన్ హౌమ్ అపప్జైన్స్ లిమిటెడ్ (హెచ్ఒ) రూ. 1,00,000 + జిఎస్టి 18,000 కి ఒక ఇన్వాయిస్ అందుకుంటుంది.

రూ. 18,000 మొత్తం క్రెడిట్ మైసూర్ శాఖకు మాత్రమే పంపిణీ చేయబడుతుంది.

5. ఒకరికి మించిన క్రెడిట్ గ్రహీత లేదా అందరి ద్వారా వినియోగించుకోబడిన ఇన్పుట్ సేవలపై చెల్లించే పన్ను క్రెడిట్ ని అటువంటి గ్రహీతల మధ్య లేదా మొత్తం గ్రహీతలలో మాత్రమే పంపిణీ చేయాలి.
ఇన్పుట్ పన్ను పంపిణీ విధానం

అటువంటి గ్రహీతల మునుపటి సంవత్సరంలో టర్నోవర్ ఆధారంగా దామాషా (ప్రో రేటా) ప్రాతిపదికన పంపిణీ ఉంటుంది.
మునుపటి ఆర్ధిక సంవత్సరంలో టర్నోవర్ లేని పక్షంలో, ఐటీసీ పంపిణీ చేయబడిన నెల చివరి త్రైమాసికంలో టర్నోవర్ పరిగణనలోకి తీసుకోబడుతుంది.
పై ఉదాహరణను మనం పరిగణిద్దాం మరియు వివరంగా అర్థం చేసుకుందాం.

పంపిణీ చేయవలసిన క్రెడిట్ మొత్తంరూ.90,000
క్రెడిట్ గ్రహీతల సంఖ్యమైసూర్ మరియు చెన్నై
మునుపటి ఆర్థిక సంవత్సరంలో మైసూర్ యూనిట్ యొక్క సరాసరి టర్నోవర్ (పివై)రూ.60 లక్షలు
మునుపటి ఆర్థిక సంవత్సరంలో చెన్నై యూనిట్ యొక్క సరాసరి టర్నోవర్ (పివై)రూ.90 లక్షలు
క్రెడిట్ గ్రహీతలు అందరి యొక్క సరాసరి టర్నోవర్రూ..150 లక్షలు

రూ .90,000 క్రెడిట్ ఈ క్రింది పద్ధతిలో పంపిణీ చేయబడుతుంది:

Distribution of ITC by an ISD Example

6. ఐఎస్డి కి పంపిణీదారుడిచే ఒక ‘డెబిట్ నోట్’ జారీయబడిన కారణంగా ఏదైనా అదనపు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అనేది అసలైన ఇన్వాయిస్లో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ చేయబడిన అదే నిష్పత్తిలో ప్రతి గ్రహీతకు విభజించి పంచడం జరుగుతుంది. ఈ పంపిణీ పాయింట్ 5 లో వివరించిన పద్ధతి ఆధారంగా ఉండాలి

7. ఇప్పటికే పంపిణీ చేయబడిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ఏ కారణం చేతనైనా తగ్గించబడితే, క్రెడిట్ తగ్గింపుకు ఐఎస్డి క్రెడిట్ నోట్ జారీ చేయబడాలి. క్రింది వివరాలను ఐఎస్డి క్రెడిట్ నోట్ లో చేర్చాలి:

• ఐఎస్డి యొక్క పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్
• ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకమై ఉండే అక్షరాలు లేదా అంకెలు లేదా “-“ “/” గా సూచింపబడే హైఫన్ లేదా డాష్ లేదా స్లాష్ వంటి ప్రత్యేక అక్షరాలు, మరియు వాటి యొక్క ఏదైనా సమ్మేళనం కలిగి ఉండే వరుస క్రమ సంఖ్య
• జారీ చేయబడిన తేదీ
• క్రెడిట్ పంపిణీ చేయబడుతున్న గ్రహీత యొక్క పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్
• పంపిణీ చేయబడిన క్రెడిట్ మొత్తం, మరియు
• ఐఎస్డి లేదా అతని అధికార ప్రతినిధి యొక్క సంతకం లేదా డిజిటల్ సంతకం

8. ఐఎస్డి కి పంపిణీదారుడిచే ఒక ‘క్రెడిట్ నోట్’ జారీయబడిన కారణంగా తగ్గించబడవలసిన ఏదైనా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అనేది, అసలైన ఇన్వాయిస్లో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ చేయబడిన అదే నిష్పత్తిలో ప్రతి గ్రహీతకు విభజించి పంచడం జరగాలి. ఈ పంపిణీ పాయింట్ 5 లో వివరించిన పద్ధతి ఆధారంగా ఉండాలి
9. ఆ విధంగా విభజించి పంచబడిన తగ్గింపు మొత్తం ఇలా ఉండాలి:
• ఫారం జిఎస్టిఆర్ – 6 లో రిటర్న్ లో క్రెడిట్ నోట్ చేర్చబడిన నెలలో పంపిణీ చేయవలసిన మొత్తాం నుంచి తగ్గించబడాలి మరియు
• ఆ విధంగా విభజించి పంచబడిన మొత్తం గనక ప్రతికూలంగా ఉన్నట్లయితే గ్రహీత యొక్క అవుట్పుట్ పన్ను బాధ్యతకు జోడించబడాలి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6