మీరు అందరు జిఎస్టి. గురించిన గురించిన టాలీ యొక్క పోస్టు చేయబడిన వరస క్రమాన్ని అనుసరిస్తున్నారు. మేము ఇటీవలే మా ఉత్పత్తి రోడ్ మ్యాప్ ని పోస్ట్ చేసాము మరియు రిలీజ్ 6.0 మా జిఎస్టి- రెడీ సాఫ్ట్వేర్ అవుతుంది అని ప్రకటించాము !
దేశంలో జరుగనున్న జిఎస్టి అమలుకు అనుగుణంగా, మేము మా జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ విడుదల చేసేందుకు చాలా దగ్గరగా ఉన్నాము .

టాలీ తో మిమ్మల్ని జిఎస్టి-సంసిధ్ధంగా చేయడానికి మా వివరణాత్మక ప్రణాళిక ఇది:
– జిఎస్టి ఎనేబుల్ చెయ్యబడ్డ సాఫ్ట్ వేర్ టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6 (బీటా) డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు జిఎస్టి తో సౌకర్యవంతంగా ఉండటానికి అనుమతించే ఒక ప్రివ్యూ కార్యక్రమం
– టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6 (గోల్డ్) యొక్క తుది ఆవిష్కరణతో ప్రత్యక్షంగా పని ప్రారంభించండి –
ఈ ముఖ్యమైన సమయ రేఖలను గమనించండి.
ప్రివ్యూలో ఇంకా టాలీ.డెవలపర్ 9, టాలీ. సర్వర్ 9, మరియు షోపర్ 9 లు కూడా ఉంటాయి.
ప్రివ్యూ విడుదల అంటే ఏమిటి?
ఒక ప్రివ్యూ విడుదల అనేది మీరు ముందుగా దానిని ఉపయోగించి మరియు సౌకర్యవంతంగా అలవాటుపడేందుకు ఒక ఉత్పాదనకు ముందస్తుగా ప్రాప్యతని ఇస్తుంది.
మీ సమాచారము యొక్క ఒక ప్రతిని రూపొందించి ఉత్పత్తితో మీ అంతట మీరు బాగా పరిచయం చేసుకోండి. జిఎస్టి ప్రారంభం అవటానికి ముందు ఉన్న పరిమిత సమయంలో, ఈ ప్రివ్యూ మీ అంతట మీరుగా బాగా సిధ్ధం అవడానికి సహాయపడుతుంది.
గమనిక: ఒక ప్రివ్యూ విడుదల ‘ఒక గోల్డ్ వెర్షన్ కాదు’, మరియు మీరు దీన్ని మీ ప్రత్యక్ష సమాచారముతో ఉపయోగించకూడదు.

ప్రివ్యూ విడుదలతో నేను ఎలా ప్రారంభించగలను?

మా ప్రివ్యూ విడుదల మా వెబ్సైట్. లో అందుబాటులో ఉంది. టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6.0 (బీటా) ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎప్పటిలాగే కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.

ఈ అవకాశాన్ని మేము మీలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయటానికి ఉపయోగించుకుంటున్నాము. మీ సహకారం నిజంగా అంతర్ దృష్టిని కలగజేసేదిగా ఉండి మేము మెరుగైన ఉత్పత్తిని చేయడానికి మాకు సహకరించింది.

టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6.0 (బీటా) లోకి విహంగ వీక్షణం కోసం వీడియోని తప్పక చూడండి!

అప్డేట్: టాలీ.ఇఆర్పి 9 రిలీజ్ 6 (జిఎస్టి – రెడీ సాఫ్ట్వేర్) ఇప్పుడు అందుబాటులో ఉంది. దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఈ పోస్ట్ కి ప్రత్యుత్తరం ఇవ్వడం ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6