మోడల్ జిఎస్టి చట్టం యొక్క షెడ్యూల్-II సరఫరా రకాన్ని నిర్ణయించటంలో సరుకు సరఫరా లేదా సేవల సరఫరాగా స్పష్టత అందిస్తుంది. ఇది ప్రస్తుత పరోక్ష పన్నుల విధానంలో ఉండే గందరగోళాన్ని తొలగించడం లక్ష్యంగా కలిగి ఉంది, ఉదాహరణకు, పనుల కాంట్రాక్టు, ఎసి రెస్టారెంట్ సేవ, సాఫ్ట్వేర్, మొదలైనవాటి పై సర్వీస్ టాక్స్ వర్సెస్ వాట్.

అందువలన, సరఫరా అనేది సరుకు సరఫరానా లేక సేవల సరఫరానా అనేది తెలుసుకోవడం మరియు సరఫరాను అందుకు తగినట్లుగా వ్యవహరించడం అనేది వ్యాపారాలకు ముఖ్యం.

బదిలీలు, భూమి మరియు భవనం, వ్యవహరించడం (ట్రీట్మెంట్) లేదా ప్రక్రియ (ప్రాసెస్)కు (మూడవ పార్టీ సరుకుకు వర్తించేది) సంబంధించిన లావాదేవీలను, మరియు నిర్మాణం మరియు పనుల కాంట్రాక్ట్, అద్దెకు, మొదలైనవాటికి సంబంధించిన లావాదేవీలను చట్టం విస్తారంగా జాబితా చేస్తుంది

ఉదాహరణలతో మనం కొన్ని ముఖ్యమైన సరఫరాలను చర్చిద్దాం.

క్ర.సంసరఫరా రకాలు…సరఫరాగా వ్యవహరించబడతాయి?ఉదాహరణ
1సరుకులో టైటిల్ ఏదైనా బదిలీసరుకుఫర్నిచర్ హౌస్ గణేష్ గారికి ఫర్నిచర్ విక్రయించింది. అమ్మకం జరిగిన మీదట ఫర్నిచర్ యొక్క టైటిల్ గణేష్ గారికి బదిలీచేయబడుతుంది కాబట్టి, ఇది సరుకు సరఫరాగా వ్యవహరించబడుతుంది.
2సరుకులో ఏదైనా బదిలీ టైటిల్ బదిలీ లేకుండాసేవలుఫర్నిచర్ హౌస్ రాకేష్ గారికి ఫర్నీచర్ అద్దె ప్రాతిపదికన, ఒక 3 నెలల వ్యవధి కోసం సరఫరా చేసింది.

ఫర్నిచర్ రాకేష్ గారి ఉపయోగం కోసం బదిలీచేయబడుతుంది మరియు ఫర్నిచర్ యొక్క టైటిల్ ఇప్పటికీ ఫర్నిచర్ హౌస్ తోనే ఉన్నది కాబట్టి, ఇది సేవ సరఫరాగా వ్యవహరించబడుతుంది.

3ఆస్తి సరుకు యొక్క టైటిల్ లో ఏదైనా బదిలీ భవిష్యత్తు తేదినాడు పాస్ అవుతుందని నిర్దేశించే ఒక ఒప్పందం కింద అంగీకరించిన విధంగా పూర్తి పరిగణన చెల్లించిన మీదటసరుకు6 వాయిదాల్లో చెల్లింపులు అందుకునే ఒక ఒప్పందం పై రమేష్ గారికి ఫర్నీచర్ హౌస్ ఫర్నీచర్ సరఫరా చేసింది.

6 వాయిదాల చెల్లింపు పూర్తవడంతో ఫర్నిచర్ యొక్క టైటిల్ రమేష్ గారికి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి ఇది సరుకు సరఫరా క్రిందికి వస్తుంది.

సాధారణంగా, అన్ని కిరాయి కొనుగోలు కూడా ఈ విభాగం కింద అర్హత కలిగి ఉంటాయి.

4భూమి ఆక్రమించేందుకు ఏదైనా కౌలు (లీజ్), అనుభోగ హక్కు (ఈజ్మెంట్), అద్దె (టెనన్సీ), మరియు లైసెన్స్సేవలుసురేష్ గారు ఫర్నిచర్ హౌస్ కు భూమి లీజుకి ఇచ్చారు. లీజుకు భూమిని ఇవ్వడం అనేదానిని సేవల సరఫరాగా పరిగణిస్తారు.
5వ్యాపారం లేదా వాణిజ్యం కొరకు ఒక వాణిజ్య, పారిశ్రామిక లేదా నివాస భవన కాంప్లెక్స్ తో సహా ఒక భవనాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా గాని ఏదైన లీజుకి లేదా అద్దెకు ఇవ్వడం.సేవలుసురేష్ గారు ఒక ఫర్నీచర్ హౌస్ కు ఒక భవనం అద్దెకు ఇచ్చారు. ఆ భవనాన్ని ఫర్నీచర్ హౌస్ ప్రదర్శించేందుకు మరియు ఫర్నీచర్ విక్రయించడానికి ఉపయోగించుకున్నారు.

ఇది సేవల సరఫరా అవుతుంది.

6ఉద్యోగ పని – మరొక వ్యక్తి యొక్క సరుకుకు వర్తింపజేయబడుతూ ఉన్న ఏదైనా వ్యవహారం (ట్రీట్మెంట్) లేదా ప్రక్రియ (ప్రాసెస్)సేవలుఫర్నిచర్ హౌస్, వారి వినియోగదారులకు ఫర్నిచర్ మరమ్మత్తు పనులు మరియు పాలిషింగ్ పనులు కూడా చేపడుతుంది.

మరమ్మత్తు మరియు పాలిషింగ్ పని సేవ యొక్క సరఫరాగా వ్యవహరించబడుతుంది.

7పరిగణతో లేదా లేకుండా బదిలీ చేయబడిన వ్యాపార ఆస్తుల శాశ్వత బదిలీ లేదా విసర్జనసరుకుపరిగణన లేకుండా సరఫరా & సేవల దిగుమతి పై జిఎస్టి ప్రభావం అనే ఈ బ్లాగ్ పోస్ట్ లో మేము దీనిని సవివరంగా చర్చించాము.
8ఒక పరిగణన కోసం అయినా కాకపోయినా ప్రైవేట్ ఉపయోగానికి లేదా వ్యాపారం-కాని ఉపయోగానికి వాడుకోబడిన వ్యాపార ఆస్తులుసేవలువ్యాపారం కోసం ఉపయోగించబడే కారుని వ్యక్తిగత ఉపయోగానికి వాడుకున్నారు. ఇది సేవల సరఫరా అవుతుంది.
9స్థిర ఆస్తిని అద్దెకు ఇవ్వడంసేవలుదుకాణం ప్రాంగణాన్ని అద్దెకు ఇవ్వడం అనేది సేవల సరఫరాగా పరిగణించబడుతుంది.
10అభివృద్ధి, డిజైన్, ప్రోగ్రామింగ్, అనుకూలీకరణ (కస్టమైజేషన్), అన్వయింపు (అడాప్టేషన్),అప్ గ్రేడేషన్, అభివృద్ది, సమాచార సాంకేతిక సాఫ్ట్వేర్ అమలుసేవలుమాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫర్నిచర్ హౌస్ కోసం ఒక పేరోల్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసింది. సాఫ్ట్వేర్ అభివృద్ధి అనేది సేవల సరఫరా అవుతుంది.
11స్థిర ఆస్తి యొక్క పనుల కాంట్రాక్ట్ అమలులో ఇమిడి ఉన్న సరుకుల ఆస్తి బదిలీతో సహా (సరుకుగా లేదా మరొక రూపంగా గాని) పనుల కాంట్రాక్ట్, ఒప్పందం అమలు చేరి సరుకు ఆస్తి బదిలీ సహా, ఒప్పందం పనిచేస్తుందిసేవలుమురళి కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ పదార్థం మరియు కార్మికుల ప్రమేయం ఉన్న ఒక వాణిజ్య కాంప్లెక్స్ నిర్మించారు.

ఇది సేవల సరఫరా అవుతుంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6