(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

మా మునుపటి పోస్ట్స్‌లో, మేము జిఎస్‌టి రిజిస్టర్డ్ డీలర్ గా ఏ విదంగా మార్పుచెందవచ్చు, మరియు ఒక కొత్తజిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి అన్నది చర్చించాము.

ఒకవేళ మీ నమోదు (రిజిస్ట్రేషన్) రద్దుఅయినట్లయితే,

  • మీ నమోదు వివరాల సవరణ
  • రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు
  • దానినిఉపసంహరించుకోవడం ఎలా అన్నది అర్ధం చేసుకుందాం

మీ నమోదు వివరాల సవరణ

  • రిజిస్ట్రేషన్ సమయంలో నమోదిత వివరాలలోఏదైనా మార్పుఉన్నట్లయితే, ఇలాంటి మార్పులు జరిగిన తేదీ నుంచి ౧౫ రోజులలోపు ఫారం GST REG-11లో సమర్పించాలి.
  • ఫారంGST REG -11లో వ్యాపార పేరు, భాగస్వామి వివరాలు, మేనేజింగ్ కమిటీ కి సంబంధించిన ప్రత్యేక మార్పుల కోసం ఒక అధికారి నుండి అనుమతి అవసరం.ధృవీకరణ తర్వాత, అధికారి ఆమోద ఆర్డర్ GST REG -12లో వివరాల సవరణ కొరకు పంపబడుతుంది.
  • నమోదిత పన్నుచెల్లింపుదారు యొక్క వ్యాపార వివరాల మార్పుల ఫలితంగా PAN సంఖ్యలో మార్పు ఉంటే, ఫారం GST REG -01 తాజాగా నమోదు అవసరం.

GST-Amending-GST-Registration-Details-_Telugu_02-03-2017

రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు

  • రిజిస్ట్రేషన్ రద్దుచేయాలని కోరుతూ ఒక నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి, ఫారం GST REG -14 ను స్టాక్ క్లోజింగ్ వివరాలు మరియు ఇతర సంబంధిత పత్రాలతోపాటు సమర్పించవలెను
  • పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి కి GST REG -15లో రద్దు ఏ కారణంనిమిత్తమైందోతెలిపే నోటీసు (షోకాజ్) ౭ రోజులలోపు జారీ చేయబడుతుంది.
  • అధికారి ద్వారా ధ్రువీకరణ మరియు ఆమోదం తర్వాత, GST REG -15 ఫారం యొక్క రసీదులు జారీ చేసిన తేదీ లేదా షోకాజ్ తేదీ నుండి ౩౦ రోజులలోపు, GST REG -16లో రద్దు ఆర్డర్ జారీ చేయబడుతుంది.

GST-Applying-for-Cancellation-of-Registration_Telugu_02-03-2017

స్వచ్ఛందంగా నమోదు చేసిన ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత రద్దు కోసం దరఖాస్తుచేయడానికి అనుమతించబడింది.ఒక అధికారి, పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తికి ఏవైనా పన్నుబకాయిలు మరియు పెనాల్టీలుఉంటే వాటిని క్లియర్ చేయించి న తర్వాత సమర్థవంతంగా రద్దుతేదీని నిర్ణయిస్తారు.

ఒక రద్దయిన నమోదునుఉపసంహరించడం

  • అధికారి ద్వారా రిజిస్ట్రేషన్ రద్దుఅయిన సందర్భంలో, ఆర్డర్ రద్దుచేయబడిన తేదీ నుంచి ౩౦ రోజులలోపలGST REG -17 ఫారంను సమర్పించడం ద్వారా రద్దు ఉపసంహరించడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆఫీసర్ కి అదనపు వివరాలులేదా స్పష్టీకరణ అవసరం అయినట్లయితే, ఫారం GST REG -3,౩ పని దినములలోపల జారీ చేయబడుతుంది
  • పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ఫారం GST REG -4 అవసరమైన వివరాలను (ఏడు పని దినములలోపల ) అందించడం ద్వారా స్పందించవలసి ఉంటుంది.
  • ఆఫీసర్ సంతృప్తిచెందినట్లయితే అప్లికేషన్ యొక్క తేదీ నుంచి ౩౦ దినములలోపు ఫారమ్ GST REG -18లో ఆర్డర్ జారీ చేయడంద్వారా రద్దుఉపసంహరించబడింది.
  • అధికారి సంతృప్తిచెందని యెడల, రద్దుఅప్లికేషన్ ఫారం GST REG-5లో నిరాకరిస్తారు. ఈ నిరాకరణకు ముందు పన్ను విధించదగిన వ్యక్తి ఫారం GST REG -19లో ఒక షోకాజ్ నోటీసు జారీ చేయబడుతుంది మరియు హియరింగ్ జరుగుతుంది.

GST-Revoking-a-Cancelled-Registration_Telugu_02-03-2017

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

100,669 total views, 2 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.