ఇటీవలి డిమానిటైజేషన్ షాక్ లో, మరింత డిజిటల్, మరింత కట్టుబడిఉండే మరియు తదనంతరం భారతదేశాన్ని ఒక మరింత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ దిశగా తరలించడానికి భారత ప్రభుత్వం ముందుకు నెట్టే ప్రయత్నం, బడ్జెట్ నుండి స్పష్టమవుతోంది. డిమానిటైజేషన్ తోటి బాగా దెబ్బతిని ఉన్నవి ఎంఎస్ఎంఇలు అవడంతో- ఫిబ్రవరి 1 న ప్రకటించబడిన బడ్జెట్ –భారతదేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఉంటాయనే స్పష్టమైన ప్రశంసతో, ఎంఎస్ఎంఇ రంగం అభివృధ్ధిని ప్రోత్సహించడానికి కొన్ని మంచి ప్రోత్సాహకాలు తీసుకువచ్చింది.

ఎంఎస్ఎంఇ రంగంలోకి అభివృద్ధిని ప్రవేశపెట్టే దిశగా మరియు ఎంఎస్ఎంఇల్లో డిజిటైజేషన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడిన కింది కార్యక్రమాల రూపురేఖలను ఆర్థిక మంత్రి అందించారు.

కార్పొరేట్ పన్ను తగ్గింపు

50 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆదాయం పన్ను 30% నుండి 25% కి తగ్గించబడింది.

ఎంఎస్ఎంఇల్లో మెజారిటీ ఈ స్థాయికి కింద ఉంటాయి కాబట్టి ఈ 5% తగ్గింపు, వారు స్వాగతించే ఒక చర్య. వారి వ్యాపార అభివృద్ధి కోసం ఇది అదనపు నగదు ద్రవ్యాన్ని ఇస్తుంది. ఈ ప్రయోజనం ఎంఎస్ఎంఇలకు ఒక సరసమైన

సరసమైన వేదిక అందిస్తుంది, మరియు ఎంఎస్ఎంఇలు మరియు పెద్ద కంపెనీల మధ్య అంతరాన్ని తక్కువ చేస్తుంది. మరింత పెద్ద కంపెనీలు వివిధ ప్రోత్సాహకాలు, మినహాయింపులు, ఇంకా అటువంటి అందుబాటులోఉన్న వాటిని వినియోగించుకోవడంలో వారికిగల మెరుగైన వేదిక మరియు నైపుణ్యం కారణంగా ఒక సూక్ష్మ ప్రయోజనం ఆనందించాయి.

ఆ విధంగా, ఈ పన్ను రేటు తగ్గింపు, సూక్ష్మ మరియు చిన్న వ్యాపార ఉత్పాదనలను మార్కెట్లో మరింత పోటీకి తగినవిగా, తక్కువ వ్యయంతో కూడినవిగా, మరియు వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేసేట్లుగా చేస్తుంది.

కల్పిత (ప్రిజంప్టివ్) పథకంలో డిజిటల్ టర్నోవర్

సక్రియంగా ముందుకు వచ్చి డిజిటల్ మోడ్ ద్వారా చెల్లింపులు అంగీకరించేలాగా ఎంఎస్ఎంఇలను ప్రోత్సహించడానికి, డిజిటల్ టర్నోవర్ భావన అనేది కల్పిత పథకం (ప్రిజంప్టివ్ స్కీమ్) లో చేర్చబడి ఉంది.
ఇది 2 కోట్ల కంటే ఎక్కువ కాని టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారాలకు వర్తిస్తుంది. ఈ పథకం కింద, ప్రస్తుతం అమలులో ఉన్న భావించబడిన 8% లాభాన్ని మొత్తం టర్నోవర్ మొత్తం లేదా డిజిటల్ మోడ్ ద్వారా అందుకున్న స్థూల రసీదులకు సంబంధించి 6% కు తగ్గించబడింది. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న భావించబడిన 8% లాభం రేటు టర్నోవర్ లేదా నగదులో చేయబడిన రసీదుల పై వర్తించడం కొనసాగుతుంది

దీని వ్యాపార ప్రయోజనాలను మనం 3 వివిధ దృశ్యాలలో విశ్లేషిద్దాం.

దృశ్యాలు100 % నగదు టర్నోవర్ తో వ్యాపారం50 % డిజిటల్ టర్నోవర్ తో వ్యాపారం100 % డిజిటల్ టర్నోవర్ తో వ్యాపారం
టర్నోవర్ 2 కోట్లు 2 కోట్లు 2 కోట్లు
నగదు టర్నోవర్2 కోట్లు 1 కోట్లు ఏమీలేదు
డిజిటల్ టర్నోవర్ఏమీలేదు1 కోట్లు2 కోట్లు
నగదు టర్నోవర్ పై భావించబడిన లాభం 8%16 లక్షలు 8 లక్షలు ఏమీలేదు
డిజిటల్ టర్నోవర్ పై భావించబడిన లాభం 6 % ఏమీలేదు6 లక్షలు 12 లక్షలు
మొత్తం లాభం ( నగదు + డిజిటల్ )16 లక్షలు 14 లక్షలు 12 లక్షలు
పన్ను*
చెల్లించదగినది
సంస్థలు (@ 25%)4 లక్షలు 3.5 లక్షలు 3 లక్షలు
యాజమాన్యపు సంస్థలు
(ఆదాయపు పన్ను స్లాబ్స్ ప్రకారం)
2,54,9251,93,1251,31,325
పన్ను ఆదాచేయబడినదిసంస్థలుఏమీలేదు50,0001,00,000
యాజమాన్యపు సంస్థలుఏమీలేదు61,8001,23,600

*పన్ను లెక్కింపు ఆర్ధిక సంవత్సరం 2017-18 ఆధారితమైనది

మనం దీనిని మరింత వివరంగా అర్ధం చేసుకుందాం.

వ్యాపారస్థుడు పూర్తి లావాదేవీని నగదులో చేసినప్పుడు, అతని లాభం 2 కోట్లకి 8% చొప్పున 16 లక్షలు అని భావించబడుతుంది. అయితే, అతను డిజిటల్ విధానాలని (చెక్ లేదా ఏదైనా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా) ఉపయోగించి మొత్తం లావాదేవీ చేసేందుకు ఎంచుకుంటే, అతని లాభం 2 కోట్లకి 6% చొప్పున 12 లక్షలు అని భావించబడుతుంది.. దీని ఫలితంగా సంస్థలకు రూ.1,00.000 మరియు యాజమాన్య సంస్థలకు రూ. 1,23,600 పన్ను ఆదా అవుతుంది.

వ్యాపారాలకి టర్నోవర్ లో లేదా రసీదుల్లో సగమైనాసరే డిజిటల్ మోడ్ లేదా బ్యాంకుల ద్వారా ఉంటే, సంస్థలకు ఒక రూ. 50,000 (14,00.000 పై 25%) మరియు యాజమాన్య సంస్థలకు రూ. 61.800 ఆదా చేసుకోవచ్చు. ఇది ఎంఎస్ఎంఇ లకు ఒక ప్రయోజనం. అందువలన, ప్రయోజనాల నుండి పరపతి పొందటానికి, ఎంఎస్ఎంఇలు డిజిటల్ వేదిక స్వీకరించవలసి ఉంటుంది.

వ్యాపార డిజిటైజేషన్ సులభతరం చేసేందుకు ప్రారంభ యత్నాలు

డిజిగావ్ యత్నం 2017-18 చివరి నాటికి 1,50,000 కంటే ఎక్కువ గ్రామ పంచాయతీల్లో అధిక వేగం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించేసే, మరియు డిజిటల్ సాంకేతికతపై విద్య మరియు నైపుణ్యాలు అందజేసే లక్ష్యం కలిగి ఉంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎస్ఎంఇలు డిజిటల్ గా అవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు నైపుణ్యం సెట్ లభ్యతపరంగా ఉండే సవాళ్ళను పరిష్కరించడానికి ఇది చాలా దూరం సహాయపడుతుంది. వ్యాపారులకు నగదు వాపసు పథకాలు మరియు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ యొక్క వర్తకుని వెర్షన్ అయిన ఆధార్ పే ప్రవేశపెట్టడం ద్వారా భీమ్ యాప్ స్వీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్ కేటాయింపుల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు, ఈ వివిధ యత్నాలు, మరియు పట్టణ ప్రాంతాల్లో మరియు చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను భారీగా సురక్షితంగా మరియు దృఢంగా చేయడం ఒక నగదురహిత ఆర్ధికవ్యవస్థ వైపుకి తరలించడానికి ఎంఎస్ఎంఇ లకు సహాయపడతాయి.

స్టార్ట్-అప్ సంస్థలకు తియ్యని పన్ను శెలవు

వ్యాపారం నుంచి పొందిన లాభం మరియు ఆర్జనలకు సంబంధించి మినహాయింపు క్లెయిమ్ చేసేందుకు స్టార్ట్-అప్ సంస్థలకు పన్ను సెలవు విండో ఇప్పటికే ఉన్న 5 సంవత్సరాల పరిమితి నుండి 7 సంవత్సరాల్లో నుండి 3 వరుస సంవత్సరాలకు విస్తరించబడింది. ఇది పెట్టుబడి పెంచుతుంది మరియు మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడానికి దారి తీస్తుంది.

నగదు చెల్లింపు కోసం తక్కువ పరిమితి

ఒక వ్యక్తికి ఒకే రోజులో నగదు చెల్లింపు పరిమితి రూ 20,000 నుండి రూ 10,000 కు తగ్గించబడింది. దీని అర్ధం ఏమిటంటే ఒక రోజులో ఒక వ్యక్తికి పది వేల రూపాయల పైగా చేసిన నగదు చెల్లింపు ఏదైనా వ్యాపారం లేదా వృత్తి యొక్క లాభాలు మరియు ఆదాయం నుండి ఆదాయం లెక్కింపులో మినహాయింపుగా అనుమతించబడదు అని. వాటి అసంఘటిత మరియు అనధికారిక పనితీరు కారణంగా మరియు అవి ఎక్కువగా వాటి రోజువారీ చెల్లింపుల కోసం నగదు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది ఎంఎస్ఎంఇ ల పై ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది.
రెండవది, ఎంఎస్ఎంఇల ద్వారా చెల్లించబడే వేతనాలు మరియు జీతాలు రూ 8,000 నుంచి రూ 15,000 శ్రేణి మధ్యలో ఉంటాయి. ఇప్పుడు, 1 ఏప్రిల్ 2017 నుంచి, క్రెడిట్ పొందడానికి, ఈ చెల్లింపులు ఒక బ్యాంకు ద్వారా లేదా డిజిటల్ మోడ్ ద్వారా చేయవలసి ఉంటుంది.

నగదు లావాదేవీలను నిరుత్సాహపరిచేందుకు మరియు ఎంఎస్ఎంఇలను డిజిటైజేషన్ స్వీకరించే దిశగా నడపడం కోసం ఇది ఒక బలవంతపు ప్రయాస.

మెరుగైన నిధి ప్రాప్యత

రూ .2 కోట్లు (గతంలో 1) వరకు రుణాల కోసం 31 డిసెంబర్, 2016 నాడు ప్రధాన మంత్రి ద్వారా ప్రకటించబడిన ఎంఎస్ఎంఇల కోసం క్రెడిట్ హామీ పథకం మెరుగుదల, వారి వ్యాపారం పెంచుకునేందుకు ఎక్కువ నిధులకు ప్రాప్యతని ఇస్తుంది.

ఎంఎస్ఎంఇల కోసం అందించబడిన బడ్జెట్ ప్రోత్సాహకాలు డిమానిటైజేషన్ తర్వాతి పరిణామాలని పాక్షికంగా తగ్గిస్తాయి, మరియు డిజిటలైజేషన్ కోసం వివిధ ప్రోత్సాహకాల ద్వారా ఎంఎస్ఎంఇలు మెరుగ్గా కట్టుబడి ఉండేలాగా దోహదపడతాయి, ఆ విధంగా ఎంఎస్ఎంఇల కోసం ఒక ఆచరణీయమైన మరియు శక్తివంతమైన అభివృద్ధి పథం సృష్టిస్తాయి.

బడ్జెట్లో అందించే ప్రయోజనాలు మరియు అవకాశాల పరపతి పొందేందుకు డిజిటల్ గా అవండి, సాంకేతికత కలిగి ఉండండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

74,787 total views, 2 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.