భారతీయ ఆర్ధిక వ్యవస్థ యొక్క చిన్న మరియు మధ్యస్థ వ్యాపార విభాగం దాని హృదయంగా ఉంటుంది. నేడు మనకి దేశంలో – పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 37% మరియు భారతదేశపు మొత్తం ఎగుమతులలో 46% వాటాకు దోహదపడే దాదాపుగా 50 మిలియన్ల ఎస్ఎంఈలు ఉన్నాయి. ఎస్ఎంఇ భారతదేశం 10% కు పైగా స్థిరమైన వృద్ధిరేటుతో, గొప్పగా 120 మిలియన్ల మందికి ఉద్యోగం కల్పించింది మరియు సంవత్సరాలుగా ప్రముఖ ఉపాధి కల్పనా రంగంగా అభివృద్ధి చెందింది. జిఎస్టి రూపంలో భారీ పన్నుల వ్యవస్థ మార్పు దిశగా పొలిమేరల్లో ఉన్నప్పుడు – ఎస్ఎంఇల జీవనంపై దాని ప్రభావం మొత్తంగా దేశానికి చాలా కీలకమైనదని విడిగా చెప్పనవసరం లేదు.

11 జూన్, 2017 నాడు జరిగిన 16 వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం వద్ద – కాంపొజిషన్ పథకానికి టర్నోవర్ పరిమితి ప్రస్తుత ఐఎన్ఆర్ 50 లక్షల నుండి ఐఎన్ఆర్ 75 లక్షలకు పెంచాలని సిఫార్సు చేయబడింది. ఈ ఇటీవలి అభివృద్ధి సందర్భంలో, ఎన్నో ఎస్ఎంఇలు, ప్రస్తుత వ్యవస్థలో కాంపొజిషన్ పధకం కింద ఉండి జిఎస్టి కింద ఉండటం కొనసాగించేవి; మరియు ముఖ్యంగా, రిజిస్టర్ చేసుకుందామని చూస్తున్న, కాని అకస్మాత్తుగా, ఐఎన్ఆర్ 25 లక్షలకు పరిమితిలో పెరుగుదలకు ధన్యవాదాలతో కాంపొజిషన్ పధకం తీసుకునే వికల్పం కలిగి ఉన్నవి అయిన రెండింటిపైనా కాంపొజిషన్ అంశం ప్రభావం ఏమిటో మనం మళ్ళీ చూద్దాం.

ప్రయోజనాలు

పెంచబడిన ప్రవేశ పరిమితి

ప్రస్తుత వ్యవస్థలో, అనేక రాష్ట్రాల వ్యాప్తంగా కాంపొజిషన్ పథకం కోసం నిష్క్రమణ పరిమితి ఐఎన్ఆర్ 50 లక్షలు. జిఎస్టి , కింద, ఈ పరిమితి మొదట్లో ఐఎన్ఆర్ 50 రూపాయల వద్ద ఉంచబడినప్పటికీ ఇప్పుడు ఐఎన్ఆర్ 75 లక్షల రూపాయలకు (ప్రత్యేక శ్రేణి రాష్ట్రాలకు – ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు 7 ఈశాన్య రాష్ట్రాల్లో మినహా –తదుపరి చర్చవరకు వీటికి పరిమితి ఐఎన్ఆర్ 50 లక్షలు ఉంటుంది) పెంచబడింది. కాంపొజిషన్ పథకం యొక్క ప్రయోజనాన్ని మరిన్ని ఎస్ఎంఇలు పొందేందుకు అర్హత కలిగిస్తుందనేది స్పష్టమవుతోంది. జిఎస్టి కౌన్సిల్ సిఫార్సులపై, పరిమితి గరిష్ట స్థాయి ఐఎన్ఆర్ 1 కోటికి పెంచబడే అవకాశం ఉండటంతో, ఎస్ఎంఇలు మరిన్ని శుభవార్తల కోసం ఎదురుచూడవచ్చు.

తక్కువ పన్ను రేటు

రిజిస్టర్ చేసుకోవలసిన బాధ్యతగల డీలర్లతో పోలిస్తే, ఒక కాంపొజిట్ డీలర్ తక్కువ పన్ను రేటును చెల్లించే ప్రధాన ప్రయోజనాన్ని పొందుతారు.తయారీదారుకు 2%, ఒక వ్యాపారికి 1%, మరియు – మానవ వినియోగం కోసం ఆహార ఆహారాన్ని మరియు పానీయాల సరఫరాలో ఉండే చిన్న రెస్టారెంట్లకు 5% గా పన్ను రేటు నిర్ణయించబడింది.

తక్కువ అనువర్తన కార్యకలాపం

రిజిస్టర్డ్ డీలర్లతో పోలిస్తే, ఒక కాంపొజిట్ డీలర్ 3 నెలవారీ రిటర్నుల భారం నుంచి మినహాయించబడతారు – అందుకు బదులుగా అతను ప్రతి 3 నెలలకు ఒక త్రైమాసిక రిటర్న్ మరియు 1 వార్షిక రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక కాంపొజిట్ డీలర్ కోసం చాలా సమయాన్ని ఆదా చేస్తుంది, తననుతాను మార్కెట్లో చెలామణీ అయేలా ఉంచుకోవడానికి కీలకమైన ముఖ్య వ్యాపార కార్యకలాపాలపై దృష్టిసారించడానికి ఇది అనుమతిస్తుంది.

అప్రయోజనాలు

వస్తువుల స్వభావం & సేవలపై ఆంక్షలు

ప్రభుత్వం మరియు జిఎస్టి కౌన్సిల్ పేర్కొనే కొన్ని నోటిఫైడ్ వస్తువుల తయారీలో ఒక కాంపొజిట్ డీలర్ తనను తాను నియోగించుకోలేరు. దానిపై మరింత స్పష్టత కోసం మనం ఎదురుచూస్తుండగా, సేవల పరంగా పరిమితి చక్కగా స్పష్టంగా ఉంది – మానవ వినియోగం కోసం ఆహారం మరియు పానీయాల సరఫరా కాకుండా ఒక కాంపొజిట్ పన్ను చెల్లింపుదారుడు మరి ఏ ఇతర సేవలోనూ నిమగ్నమవలేరు – మరొక విధంగా చెప్పాలంటే, ఒక కాంపొజిట్ డీలర్, మహా అయితే ఒక చిన్న రెస్టారెంట్ ఏర్పాటు గురించి ఆలోచించవచ్చు. అంతేకాకుండా, కాంపొజిట్ పన్ను చెల్లింపుదారు జిఎస్టి యొక్క పరిధికి బయట వస్తువులను సరఫరా చేయలేరు.

వర్తకం చేసే విధానం పై ఆంక్షలు

జిఎస్టి చట్టం ప్రకారం, ఒక కాంపొజిట్ డీలర్, ఇ-కామర్స్ వేదికలపై వ్యాపారం చేయలేరు ఇంకా అంతేకాకుండా వస్తువుల లేదా సేవల అంతరాష్ట్రాల బయటికి సరఫరాలో పాల్గొనలేరు. మరో విధంగా చెప్పాలంటే, ఆన్లైన్ మార్గంలో వెళ్లడం ద్వారా వారి సీమలను అధిగమించాలని, ఇతర రాష్ట్రాల్లో వినియోగదారులను సేవ చేయాలని కోరుకునే ఎస్ఎంఇలకు, టర్నోవర్ తో సంబంధం లేకుండా కాంపొజిషన్ పథకం ఆనందించేందుకు ఎంపికే ఉండదు.

ఏ ‘ఎంపికచేసుకునే’ కాంపొజిషన్ పధకం ఉండదు

ప్రస్తుత రిజిస్ట్రేషన్ వ్యవస్థలో, అనేక రిజిస్ట్రేషన్లతో పలు నిలువుగా నడిచే వ్యాపారాలు మరియు సంస్థల యొక్క ప్రామాణిక అభ్యాసం ఉంది – ఇది ఎంపిక చేసుకున్న వ్యాపారాల కోసం కాంపొజిషన్ పథకం వినియోగించుకునే అవకాశం కల్పించేది. కానీ జిఎస్టి కింద, రిజిస్ట్రేషన్ పాన్(PAN) ఆధారితమైనది. అతి ముఖ్యంగా, ఒకే పాన్(PAN) తో నమోదు చేయబడిన అన్ని నిలువుగా నిడిచే వ్యాపారాలకు – రాష్ట్రంలోపల లేదా రాష్ట్రాల మధ్య – కాంపొజిషన్ పథకం వర్తిస్తుంది. ఈ విధంగా, ఒక ఎస్ఎంఇకి వివిధ నిలువుగా నడిచే, అనేక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిన వ్యాపారాల వరుసలు ఉండవచ్చు – కానీ కంపోజిషన్ పథకం కోసం నిర్దిష్ట నిలువులను మరియు/ లేదా శాఖలను ఎంచుకోవడం వీలుకాదు. దీని అర్ధం ఇంకా ఏమిటంటే – బహుళ రాష్ట్రాలలో కార్యకలాపాల ఒకే పాన్ కలిగిన ఒక రిజిస్టర్ చేసుకోబడిన వ్యక్తి, దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాల కోసం అయితే “కాంపొజిషన్ పథకం” ఎంపిక చేసుకోవాలి లేదా రెగ్యులర్ డీలర్షిప్ ఎంపిక చేసుకోవాలి అని.

ఏ పన్ను వసూలు ఉండదు, ఐటిసి ఉండదు

ఒక కాంపొజిట్ డీలర్ తాను బయటికి సరఫరా చేసే వస్తువులు లేదా సేవల పై పన్ను వసూలు చేయనవసరం లేదు. కానీ, అతి ముఖ్యమైనది ఏమిటంటే, అతను ఒక సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే డీలర్ నుండి ఒక పన్ను విధించదగిన కొనుగోలు చేసినప్పటికీ కూడా కాంపొజిట్ పన్ను చెల్లింపుదారు తన లోపలికి వస్తువుల మరియు/లేదా సేవల సరఫరా – మొత్తం పైనా ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసేందుకు అర్హత కలిగి ఉండరు. దీని ఫలితంగా, పన్ను విధించదగిన మొత్తం కాంపొజిట్ డీలర్ యొక్క వ్యయంలోకి జోడించబడుతుంది, చివరికి తన వినియోగదారులకి ఖర్చు పెరుగుతుంది. ఇది సాధారణ పోటీదారులతో పోలిస్తే, తన పోటీతత్వాన్ని ఖచ్ఛితంగా దెబ్బతీస్తుంది.

అనువర్తించడంలో మరింత లోతు

ప్రస్తుత కాంపొజిషన్ పథకంలో, ఒక కాంపొజిట్ డీలర్ అమ్మకాల మొత్తం టర్నోవర్ మాత్రమే ప్రకటించవలసి ఉంటుంది; అతను ఇన్వాయిస్ వారీగా వివరాలను ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అయితే జిఎస్టిలో, కాంపొజిట్ పన్ను చెల్లింపుదారు, బయటికి సరఫరా యొక్క మొత్తం టర్నోవర్ తోపాటుగా లోపలికి సరఫరాల యొక్క ఇన్వాయిస్ వారీగా వివరాలతో (తన సరఫరాదారు దాఖలు చేసిన ఫారం జిఎస్టిఆర్-1 ఆధారంగా దానంతట అదే నింపబడేది) జిఎస్టి రిటర్నులను ఫైల్ చేయవలసి ఉంటుంది. అందువలన, అతని ఖాతా మరియు లావాదేవీల రికార్డులను సరిగా నిర్వహించడానికి ఇందుకు కాంపొజిషన్ పథకం కింద ఒక ఎస్ఎంఇ అవసరం అవుతుంది.
ఇది కూడా చదవండి జిఎస్టి కింద మీరు నిర్వహించవలసిన ఖాతాలు మరియు ఇతర రికార్డులు ఏమిటి

ముగింపు

చూడటానికైతే, అది పోనుపోను ఎక్కువ వ్యాపార ప్రయోజనాలుగా మారవచ్చు కాబట్టి దాని అర్ధం పెరిగిన అనువర్తన అయినప్పటికీ కూడా కాంపొజిషన్ ఎంపిక చేసుకోవడం ఒక ఎస్ఎంఇకి ఒక మంచి ఆలోచనగా అనిపించకపోవచ్చు, అయితే, ఒక ఎస్ఎంఇ పూర్తిగా బి2సి వ్యాపారంలో ఉండి, కాంపొజిషన్ రేటు తక్కువగా ఉండి మరియు నికర మార్జిన్లు ఎక్కువగా ఉంటే, కాంపొజిషన్ అనేది ఒక ఆచరణీయ ఎంపికగా మారవచ్చు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

36,764 total views, 3 views today