ప్రతి వ్యాపారం యొక్క అంతిమ కల పెరుగుదల మరియు విస్తరణ. ఒకరు ఒక వ్యాపారం ప్రారంభించి, లాభాన్ని సంపాదించి, తిరిగి పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభం సంపాదిస్తారు – మరియు ఆ చక్రం కొనసాగుతుంది. మీకు మీ మొదటి కస్టమర్ వస్తారు, అప్పుడు 10 ఆ తర్వాత 100 మందిని పొందుతారు. మీరు మీ తక్షణ ప్రాంతం నుండి మొదలుపెడతారు, మరియు మీరు పెరిగేకొద్దీ మీ కార్యకలాపాలను మీ నగరం, మీ రాష్ట్రం, పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తారు – మొత్తం దేశం మీ ప్లేగ్రౌండ్ అయ్యేంతవరకు విస్తరిస్తారు.

అయితే, ప్రస్తుత పన్నుల వ్యవస్థలో, ఇది చేయడం కంటే చెప్పడం సులభం అవుతుంది. పలు రాష్ట్రాల్లోని వినియోగదారులతో వ్యాపారాలు పెట్టుబడి పెట్టే స్పష్టమైన ఆర్ధికపరమైన మరియు ప్రయత్నాలతో పాటు, విక్రేత మరియు కొనుగోలుదారు ఇద్దరి ద్వారా సంభవించే సమ్మతి ఖర్చులు మరియు సంక్లిష్టతలు కూడా చెప్పుకోతగిన మొత్తంలోనే అవుతాయి.

ఇతర రాష్ట్రాల్లోని వినియోగదారులకు వస్తువులని అమ్మడం

ప్రస్తుత వ్యవస్థ జిఎస్టి వ్యవస్థ
రాష్ట్రాంతర (ఇంటర్ స్టేట్) విక్రయాలపై కేంద్రం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సిఎస్టి) విధిస్తుంది, విక్రయించడం జరిగిన రాష్ట్రం ద్వారా ఇది సేకరించబడి ఉంచుకోబడుతుంది.రాష్ట్రాంతర (ఇంటర్ స్టేట్) విక్రయాలపై ఐజిఎస్టి విధించబడుతుంది. ఇక్కడ, పన్నుల విధించబడే ఘటన “అమ్మకం” నుండి “సరఫరా” కు మారుతుంది.
వస్తువులు ఒకసారి రాష్ట్ర సరిహద్దులను దాటిన తర్వాత, సరిహద్దు చెక్ పోస్ట్ల వద్ద అది ధృవీకరణలు మరియు తనిఖీలకు లోబడి ఉంటుంది. అంతేకాకుండా, ఎంట్రీ పన్నులు విధించబడతాయి, ఇది కొనుగోలుదారు, అంటే మీ కస్టమర్, ద్వారా భరించబడుతుంది. వస్తువులు ఒకసారి రాష్ట్ర సరిహద్దులను చేరి మరియు దాటిన తర్వాత, – సాపేక్షంగా తక్కువ ధృవీకరణలు మరియు తనిఖీలు ఉంటాయి మరియు ఎంట్రీ పన్ను ఏదీ విధించబడదు. ఇది కొనుగోలుదారుడు, అంటే మీ కస్టమర్, కోసం ధరను తగ్గిస్తుంది.
మీరు మీ బి2బి కస్టమర్ కు ఒక అంతర్ రాష్ట్ర అమ్మకం చేసినప్పుడు, ఛార్జ్ చేయబడిన సిఎస్టి అతనికి ఖర్చు అవుతుంది. ఇది ఎందుకంటే – అతను తన వంతుగా స్థానిక విక్రయం చేసినప్పుడు, అతను చెల్లించిన సిఎస్టి కోసం అతను పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేయలేడు కాబట్టి.. పర్యవసానంగా, అతను చెల్లించిన సిఎస్టి విలువను తన తుది వినియోగదారులపైకి పాస్ చేస్తాడు- వీరికి వస్తువుల ధర పెరుగుతుంది. ఆ విధంగా, స్థానికంగా కొనుగోలుచేసే, అందువలన, తక్కువ ధర వద్ద వస్తువులను అందించగల డీలర్లతో పోల్చితే మీరు మరియు మీ కస్టమర్ ఇద్దరూ కూడా పోటీతత్వంగా నష్టపోతూ ఉంటారు, మీ బి2బి కస్టమర్ ఇంటర్ స్టేట్ అమ్మకాలపై ఛార్జ్ చేయబడిన ఐజిఎస్టి యొక్క క్రెడిట్ క్లెయిమ్ చేయగలుగుతారు మరియు చట్టం సూచించిన క్రమంలో రాష్ట్రం పట్ల తన జిఎస్టి బాధ్యతకు వ్యతిరేకంగా అదే దానిని సెట్-ఆఫ్ చేయగలుగుతారు. ఆ విధంగా, అతనికి ఏ అదనపు వ్యయం కలగదు, మరియు దీనితో చివరకు అతని తుది వినియోగదారులకు ఖర్చు తగ్గించబడుతుంది. అందువల్ల, స్థానిక డీలర్లతో పోల్చితే మీకు ఏ అప్రయోజనము కలగదు, మరియు వారితో సులభంగా పోటీ పడగలుగుతారు.
వారి పోటీ ధరలను మెయిన్టెయిన్ చేయడానికి, వారి కొనుగోలుదారులు సిఎస్టి భారం భరించవలసిన అవసరం ఉండకుండా ఉండేందుకు చాలావరకు అంతర్ రాష్ట్ర అమ్మకందారులు సాధారణంగా వారు పనిచేసే రాష్ట్రాలలో శాఖలు / గిడ్డంగులను ఏర్పాటు చేస్తారు. అయితే విక్రేత కోసం, ఇది అదనపు మౌలిక సదుపాయాల వ్యయంఅవుతుంది, పైగా ఈ వ్యయం ఆపరేటింగ్ సామర్ధ్యం కంటే కూడా ఎక్కువగా కట్టుబడి ఉండే ఉద్దేశ్యం కోసం ఖర్చుపెట్టబడుతుంది. ఎల్లలు లేని ఇన్పుట్ క్రెడిట్ లభ్యత కారణంగా మరొక రాష్ట్రం నుండి విక్రయించడం మరియు రాష్ట్రంలోపల విక్రయించడం, రెండూ కూడా కొనుగోలుదారునికి సమాన అనుకూలంగా ఉంటాయి. అందువల్ల అమ్మకందారుడు కేవలం కట్టుబడి ఉండటం కోసం అదనపు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టవలసిన పని ఉండదు, అందుకు బదులుగా, అతను ఇప్పుడు కార్యాచరణ సామర్థ్యపు ఏకైక లక్ష్యం కోసం శాఖలు / గిడ్డంగులు ఏర్పాటు చేయవచ్చు.
దృష్టాంతం

రామ్ ఎంటర్ప్రైజెస్ కర్ణాటకలో డీలర్ కు విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని బూట్ల డీలర్
జిఎస్టి కి ముందు
రామ్ ఎంటర్ప్రైజెస్ తన ఇన్వాయిస్ సిధ్ధం చేసినప్పుడు:
• ఉత్పాదన ధర = ఐఎన్ఆర్ 5000
• సిఎస్టి @ 2% = ఐఎన్ఆర్ 100
• తుది ధర = ఐఎన్ఆర్ 5000 + 100 = ఐఎన్ఆర్ 5100

అదనంగా, కర్ణాటకలోని డీలర్ ఎంట్రీ టాక్స్ @ 2% (కర్ణాటకలో పాదరక్షల కోసం సగటు రేట్లు) = ఐఎన్ఆర్ 102 ను భరించాలి

కర్నాటకలో డీలర్ కు మొత్తం ఖర్చు = ఐఎన్ఆర్ 5100 + ఐఎన్ఆర్ 102 = ఐఎన్ఆర్ 5202

కర్నాటకలో డీలర్ స్థానికంగా తుది కస్టమర్ కు విక్రయించినప్పుడు, అతడు పాదరక్షలని ఐఎన్ఆర్ 5202 + లాభాలు + వర్తించే పన్నుల వద్ద విక్రయిస్తాడు (సిఎస్టి మరియు ఎంట్రీ పన్ను యొక్క క్రెడిట్ అనుమతించబడదు మరియు అది తుది అంతిమ కస్టమర్ కు పాస్ చేయబడుతుంది కాబట్టి).
జిఎస్టి కింద
రామ్ ఎంటర్ప్రైజెస్ తన ఇన్వాయిస్ సిధ్ధం చేసినప్పుడు:
• ఉత్పాదన ధర = ఐఎన్ఆర్ 5000
• ఐజిఎస్టి @ 18% = ఐఎన్ఆర్ 900
తుది ధర = ఐఎన్ఆర్ 5000 + ఐఎన్ఆర్ 900 = ఐఎన్ఆర్ 5900
కర్నాటకలో డీలర్ స్థానికంగా తుది వినియోగదారునికి విక్రయించినప్పుడు, అతడు పాదరక్షలని ఐఎన్ఆర్ 5000 + లాభాలు + వర్తించే పన్నుల వద్ద విక్రయిస్తాడు (ఐజిఎస్టి యొక్క క్రెడిట్ అనుమతించబడుతుంది, మరియు తుది కస్టమర్ కు పాస్ చేయబడదు కాబట్టి).

ఆ విధంగా, రాష్ట్రాంతర (ఇంటర్ స్టేట్) వస్తు విక్రయాల కోసం కట్టుబడి ఉండే ప్రక్రియలని ఖచ్ఛితంగా సులభతరం చేస్తుంది మరియు ఒక దోహదకారిగా నిరూపించబడుతుంది. అన్నింటి కంటే ముందు, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అనేది రాష్ట్రాంతర (ఇంటర్ స్టేట్) లావాదేవీల పై నిరంతరాయంగా ఉంటుంది, ఇది ఒకదాని కారణంగా మరొకటి ప్రభావితమవడాన్ని (క్యాస్కేడింగ్) నిరోధించడానికి దారితీస్తుంది – అందుకే, విక్రేత మరియు కొనుగోలుదారు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.. అయితే, ఈ మొత్తం చక్రం సజావుగా తిరుగుతుందని నిర్ధారించడానికి, పన్ను పరిధిలోకి వచ్చే రాష్ట్రాంతర (ఇంటర్ స్టేట్) సరఫరాలను చేసే డీలర్లందరికీ వారి గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా జిఎస్టి చట్టం ఒక తప్పనిసరి జిఎస్టి రిజిస్ట్రేషన్ ను నిర్దేశిస్తుంది. ఇతర మాటలలో చెప్పాలంటే, కాంపొజిషన్ పథకం అనేది రాష్ట్రాంతర అమ్మకందారులకు ఒక ఎంపిక కాదు.

ఇతర రాష్ట్రాలలో వినియోగదారులకు సేవలను అందించడం

ప్రస్తుత వ్యవస్థలో, సేవల యొక్క రాష్ట్రాంతర సరఫరాలపై సర్వీస్ టాక్స్ విధించబడుతుంది. సర్వీస్ టాక్స్ కేంద్రం ద్వారా విధించబడుతుంది మరియు వసూలు చేయబడుతుంది, అందువల్ల అదేపనికోసం రిజిస్ట్రేషన్ కూడా ఏకీకృతం మరియు కేంద్రీకృతమై ఉంటుంది.

జిఎస్టి వ్యవస్థలో, వస్తువులు మరియు సేవలుఒకే రీతిగా వ్యవహరించబడటంతో, సేవల యొక్క ఒక రాష్ట్రాంతర సరఫరా ఉన్నప్పుడు ఐజిఎస్టి వర్తిస్తుంది. అయితే, దాని సంక్లిష్టత మరెక్కడో ఉంటుంది – – జిఎస్టి వ్యవస్థలో, పన్నుల విధింపు అనేది సేవల సరఫరా స్థానం పై ఆధారపడి ఉంటుంది.. ఆ విధంగా, మీరు గనక ఒక సేవా ప్రదాత అయితే, మీ రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రంలోని క్లయింట్ కు సేవలను అందిస్తూ ఉన్నట్లయితే – ఐజిఎస్టి వర్తిస్తుంది. అయితే, సేవా రకానికి గనక క్లయింట్ యొక్క స్థానంలోనే, అంటే క్లయింట్ యొక్క రాష్ట్రంలోనే, మీ ఉనికి అవసరమైతే, , అది రాష్ట్రంలోపలి సరఫరాగా పరిగణించబడుతుంది; ఇతర మాటలలో చెప్పాలంటే, ఎస్జిఎస్టి / యుటిజిఎస్టి మరియు సిజిఎస్టి వర్తించబడతాయి కాని ఐజిఎస్టి కాదు. మరియు అది జరగడానికి, మీరు క్లయింట్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ తీసుకోవలసి ఉంటుంది.

దృష్టాంతం

సిఎ. శ్రీ. ప్రసాద్ ని పరిగణించండి, న్యూఢిల్లీలో రిజిస్టర్ అయి, కానీ గురుగ్రామ్ (హర్యానా) మరియు నోయిడా (ఉత్తరప్రదేశ్) వద్ద కూడా క్లయింట్లను కలిగి ఉన్నారు – ఎందుకంటే 3 నగరాలు అన్నీ కూడా జాతీయ రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్నాయి మరియు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి.
హర్యానాలో గురుగ్రామ్ కు బయట ఉన్న తన క్లయింట్ 1 కు, అతను సుదూర కన్సల్టెన్సీ సేవలను అందిస్తారు.

ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు బయట ఉన్న తన క్లయింట్ 2 కు, అతను అంతర్గత ఆడిట్ సేవలను అందిస్తారు, దాని కోసం అతను క్లయింట్ ను సందర్శిస్తారు మరియు క్లయింట్ యొక్క స్థానానికి ప్రయాణించడం ద్వారా సేవలను అందిస్తారు.

జిఎస్టి కి ముందు
Selling goods to customers across states before GST

ఈ సందర్భంలో, అతను 2 లేదా 3 రాష్ట్రాల్లో సేవలను అందిస్తున్నారనే వాస్తవంతో సంబంధం లేకుండా, సర్వీస్ టాక్స్ కోసం ఒకేఒక్క ఏకీకృత, కేంద్ర రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. అలాగే, ప్రస్తుత వ్యవస్థలో శ్రీ ప్రసాద్ సర్వీస్ టాక్స్ క్రింద సంవత్సరానికి 2 సార్లు మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరం ఉంటుంది.
జిఎస్టి కింద
Selling Goods to Customers in Other States_2

జిఎస్టి కింద, శ్రీ. ప్రసాద్ తన స్వంత రాష్ట్రంలో తన రిజిస్టర్డ్ ప్రదేశం, అంటే ఢిల్లీకి ఏడాదికి 13 సార్లు (వార్షిక రిటర్న్లతో సహా) రిటర్న్స్ ఫైల్ చేయవలసి ఉంటుంది. అయితే, ఇప్పుడు అతను గురుగ్రాం, నోయిడాలలో క్లయింట్లకు, స్వయంగా హాజరవడం ద్వారా సేవలను అందించాలని అనుకుంటే, – హర్యానా, యుపిలో రిజిస్ట్రేషన్ తీసుకోవలసి ఉండటం మాత్రమే కాకుండా, సంవత్సరంలో 39 రిటర్న్స్ ఫైల్ చేయవలసి ఉంటుంది! అందువల్ల, జిఎస్టి రావడంతో, సర్వీసు ప్రొవైడర్లు అందరూ ఒక వర్తకం-ఆఫ్ ఎదుర్కోవలసి ఉంటుంది- బహుళ రాష్ట్రాల వ్యాప్తంగా క్లయింట్ల నుండి ప్రవహించే వచ్చే రాబడి, అందుకు వ్యతిరేకంగా, బహుళ రిజిస్ట్రేషన్లు మరియు బహుళ ఫైలింగ్స్ పరంగా సంబంధిత కట్టుబడి ఉండవలసిన భారం.

తుది వాక్యం

అంతిమంగా, ఇతర రాష్ట్రాల్లో వినియోగదారులకు వస్తువులను అమ్మడం లేదా సేవలను సరఫరా చేయడం – ఒక మిశ్రమ బ్యాగ్ లాగా కనిపిస్తుంది.. రాష్ట్ర అడ్డంకులు సంభావ్యంగా కరిగిపోవడం మరియు వ్యాపారాల కోసం స్వేచ్ఛా-రుణ క్రెడిట్ ప్రవాహంతో – రాష్ట్రాంతర వస్తువుల అమ్మకాలకు ఖచ్చితంగా పరిస్థితులు ఉత్తమంగా ఉండగా – అదే సేవల సరఫరా విషయంలో పరిస్థితి సరిగ్గా వ్యతిరేకంగా ఉంది. జిఎస్టి కింద, సర్వీసు ప్రొవైడర్లు అందరూ, వారికి క్లయింట్లు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ భౌతిక ఉనికి ద్వారా సేవలను అందించడం కొనసాగించాలనుకుంటే, ఒక కేంద్రీకృత రిజిస్ట్రేషన్ నుండి రాష్ట్రం-వారీగా రిజిస్ట్రేషన్ కు మరలవలసి ఉంటుంది. ఒక రాష్ట్రంలో కూడబెట్టబడిన సిజిఎస్టి + ఎస్జిఎస్టి / యుటిజిఎస్టి క్రెడిట్ ని మరొక రాష్ట్రం యొక్క సిజిఎస్టి + ఎస్జిఎస్టి / యుటిజిఎస్టి బాధ్యతకు వ్యతిరేకంగా వినియోగించుకోలేని అసమర్ధత – ఇది నగదు బయటికి ప్రవాహంపై తప్పక ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి, జిఎస్టి తప్పనిసరిగా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉద్దేశంతో ఉండగా, ఇది సంచీ నిండిగా సవాళ్లని తీసుకుని వస్తోంది, విరాట్ స్థాయిలో మేలు కోసం వీటిని తట్టుకోవలసిన మరియు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

88,124 total views, 38 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.