జిఎస్టి చట్టం ప్రవేశపెట్టబడటంతో, మీ వ్యాపారానికి గనక హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి కోడ్లు మరియు పన్ను రేట్లు అవసరమైతే, మీరు మా జిఎస్టి-సంసిధ్ధతగల సాఫ్ట్వేర్, టాలీ.ఇఆర్పి9 రిలీజ్ 6 ను ఉపయోగించి సులభంగా ఈ వివరాలను సెట్ చేసుకోవచ్చు.

దీనితో మీ వ్యాపార మరియు రిపోర్టింగ్ అవసరాల ఆధారంగా ఏ స్థాయిలోనైనా జిఎస్టి రేట్లను మరియు హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి కోడ్లను కన్ఫిగర్ చేయడానికి మీకు సౌలభ్యం ఉంటుంది.
జిఎస్టి చట్టం ప్రకారం, మీ వార్షిక టర్నోవర్ మరియు వ్యాపార రకాన్ని బట్టి, మీరు క్రింది పట్టిక ప్రకారం ఇన్వాయిస్లు మరియు రిపోర్టింగ్ పై హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి కోడ్ ను ప్రింట్ చేయవలసి ఉంటుంది:

వ్యాపారం రకం హెచ్ఎస్ఎన్ కోడ్ల యొక్క అంకెల సంఖ్య
1.5 కోట్లు (వార్షికంగా) కంటే తక్కువ అవసరం లేదు
1.5 కోట్లు నుంచి 5 కోట్లు (వార్షికంగా) మధ్య మొదటి 2 అంకెలు
5 కోట్లు (వార్షికంగా) కు పైన మొదటి 4 అంకెలు
దిగుమతి- ఎగుమతి కోసం 8 అంకెలు
సేవల కోసం 5 అంకెలు

వాటిని మీరు టాలీ.ఇఆర్పి9 రిలీజ్ 6లో ఎలా కన్ఫిగర్ చేయవచ్చో మనం అర్ధంచేసుకుందాం.

  1. మీకు హెచ్ఎస్ఎన్ లేదా ఎస్ఎసి మరియు అన్ని వస్తువులు మరియు సేవలకు అదే పన్ను రేటు ఉంటే, అప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఈ విలువలను కేవలం ఒకసారి కంపెనీ స్థాయి వద్ద సెట్ చేయడం, అంతే అది ఇక జరిగిపోతుంది.
  2. ఒక వస్తువుల నిర్దిష్ట సమూహం కంపెనీ స్థాయిలో పేర్కొన్న దానికంటే వేరే రేటుని ఆకర్షించినట్లయితే, అప్పుడు మీరు స్టాక్ గ్రూప్ స్థాయిలో హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి ను కూడా కన్ఫిగర్ చేయవచ్చు. సమూహం స్థాయిలో పేర్కొన్న రేటు ఆ సమూహంలోని అన్ని అంశాలకు వర్తిస్తుంది.
  3. స్టాక్ సమూహంలోని కొన్ని వస్తువులు మాత్రమే వేరొక రేటును ఆకర్షిస్తే అప్పుడు ఆ స్టాక్ అంశాల కోసం స్టాక్ ఐటమ్ స్థాయిలో రేట్లు మరియు హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి ను ఏర్పాటు చేయండి. ఇది స్టాక్ గ్రూప్ స్థాయిలో పేర్కొన్న రేట్లను అధిగమిస్తుంది.
  4. మీరు విభిన్న రకాల లావాదేవీల కోసం అదే హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి మరియు పన్ను రేటును వర్తింప చేయాలనుకుంటే, మీరు హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి ను మరియు అమ్మకాలు, కొనుగోలు, వ్యయం మరియు ఆదాయం సమూహాల కోసం లెడ్జర్ గ్రూప్ స్థాయిలో రేటును పేర్కొనవచ్చు.
    .
  5. రాష్ట్రంలోని శాఖలకు మినహాయింపు వస్తువుల బదిలీ వంటి నిర్దిష్ట దృష్టాంతాల కోసం, మీరు ఒక లావాదేవీలో పన్ను వర్తింపును మినహాయింపు రకానికి మార్చాలనుకోవచ్చు. అప్పుడు మీరు ఈ వివరాలను లెడ్జర్ స్థాయిలో లేదా మీరు లావాదేవీల రకాలను విక్రయాలు లేదా వస్తువుల లేదా సేవల కొనుగోలులోకి విభజించాలని అనుకుంటున్నప్పుడు కన్ఫిగర్ చేయవచ్చు. అదే అంశాల మరియు లెడ్జర్ల సెట్ ను ఉపయోగించి, మీరు లావాదేవీ స్థాయిలో లావాదేవీ యొక్క స్వభావాన్ని మార్చవచ్చు.

హెచ్ఎస్ఎన్/ఎస్ఎసి మరియు పన్ను రేటు వివరాలను రెండింటినీ ఒకే స్థాయిలో పేర్కొనవలసిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.

కొన్నిసార్లు, మీరు మాస్టర్స్ లో పేర్కొన్న సెట్టింగులను అధిగమించాలని అనుకోవచ్చు. టాలీ.ఇఆర్పి9 రిలీజ్ 6.0.2 జిఎస్టి సాఫ్ట్వేర్ తో, మీరు దీన్ని సౌకర్యవంతంగా చేయవచ్చు.

ఈ శక్తివంతమైన వశ్యత (ఫ్లెగ్జిబిలిటీ)ను అర్థం చేసుకోవడానికి క్రింది వీడియోను చూడండి లేదా ఈ సహాయ శీర్షికను సందర్శించండి మరియు మీ ప్రత్యేక వ్యాపార అవసరాల కోసం దీనిని ఉపయోగించుకోండి


మీ అభిప్రాయం ఎల్లప్పుడూ స్వాగతం, దయచేసి మీ ఆలోచనలను పంచుకోండి.

టాలీ జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి లేదా అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఇక్కడ సందర్శించండి..

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

258,444 total views, 182 views today

Avatar

Author: Shailesh Bhatt