(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

భారత ప్రధాని నరేంద్ర మోది ఉన్నట్టుండి నవంబరు 8, 2016న ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల రద్దును ప్రకటించడం నిజంగా మనకు ఒక పిడుగు లాంటి వార్త. ఇది ఆకస్మిక నిర్ణయంగా మనకు అనిపిస్తుంది కాని… ప్రభుత్వం ప్రజలను కొత్త బ్యాంకు ఖాతాలను తెరవమని చెప్పడం, వాటిని ఆధార్కి అనుసంధానించమని ప్రొత్సహించడం, నల్లధనాన్ని స్వచ్చందంగా తెలియజేసే పథకాన్ని ప్రవెశపెట్టడం, నల్ల కుబేరులకు వరుసగా హెచ్చరికలను జారిచేయడం లాంటివి గమనిస్తే, ఇది ఒక ఖచ్చితమైన ముందుగానే నిర్ణయించబడిన ప్రణాళికగా మనకు కనిపిస్తుంది.

మరోవైపు, అదాయ పన్ను శాఖ కూడా రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసే వారిని ద్రుష్టిలో పెట్టుకొని ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం, ఎవరైతే రూ.2.5 లక్షల కంటే ఎక్కువ తమ ఖాతాల్లొ జమ చేస్తారో వారు నోటీసులను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ఏది ఏమైన! మరి ఇంతకీ ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చిన్న వ్యాపారం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ మొత్తం వ్యవహారంలో మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే… కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద కఠిన నిర్ణయాన్ని ఎటువంటి సవాళ్ళనైనా స్వీకరిస్తూ అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా, ఆదాయ పన్ను శాఖ కూడా సాంకేతిక సమాచారాన్ని ఉపయోగించుకొని దేశం మొత్తం మీద బ్యాంకుల్లో ఎవరైతే రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసారో వారి యొక్క జాడని పసిగడుతోంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి సమాచార సాంకేతికత ఒక విలువైన ఆయుధంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

నోట్ల రద్దు చిన్న వ్యాపారాన్ని ఎలాంటి ప్రభావాలకు గురి చేసింది?

బెంగళూరులోని మల్లేశ్వరానికి చెందిన భాస్కర్ ఒక కిరణా షాపు నడుపుతుంటాడు. డబ్బే అతని రోజువారి వ్యాపార లావాదేవీలకు మూలం. ఖాతా పుస్తకాలు మొదలైనవి నిర్వహించే అలవాటు అతనికి మొదటినుంచీ లేదు. ఆర్డర్లు మరియు డెలివెరీలు తన మొబైల్ సహాయంతో తీసుకుంటాడు. వాటికి సంబందించిన చెల్లింపులన్నీ డెలివరీలు పూర్తి అయిన తరువాతే జరుగుతుంటాయి. అతని ఖాతాదారులలో కొందరైతే అతనికి నెలకోసారి చెల్లింపు చేస్తారు. అతని అకౌంటంట్లు కూడా సరిగ్గా పన్ను కట్టే ముందు అతని పన్నును లెక్క కడతారు, అది కూడా వార్షిక పద్దతిన.

సరిగ్గా నవంబరు 10న ఎప్పటిలాగే భాస్కర్ తన ఖాతాలో నగదును జమ చేయడానికి బ్యాంకుకి వెళ్ళాడు. అయితే సరిగ్గా అపుడే బ్యాంకు సిబ్బంది ఎపుడూ లేని విధంగా తన నగదు యొక్క వివరలన్నీ అడిగేసరికి కంగు తిన్నాడు. ఈ అకస్మిక సంఘటన అతనికి పీడకలతో సమానం. ఎందుకంటే అతనికి అసలు ఖాతా లెక్కల అనుభవమే లేదు. అంతే కాకుండా ఆ సమయంలో తన దగ్గరున్న నగదు తన స్వంత డబ్బు అనే దాని కంటే కూడా ఎక్కువగా ఉంది.

ఒక సారి మీరు అలోచించండి… భాస్కర్ కనుక తన నగదు వ్యవహారాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసే పద్దతి ఒకటి పాటిస్తే ఎంత బాగుండేది? అకౌంటంటు అతని యొక్క రికార్డులను పరీశీలించి సులభంగా పన్నుని లెక్క కట్టేవాడు. సంబంధిత ఖాతా పుస్తకాలను చూపడం ద్వారా కూడా భాస్కర్ తన యొక్క నగదు స్థితిని బ్యాంకు వారికి వివరించగలిగేవాడు

వసూళ్ళను మరియు చెల్లింపులను రికార్డు చేసే పద్దతి ఏదైతే వుందో అది వ్యాపారాన్ని నిక్కచ్చిగా చేసే ఏకైక పరిపూర్ణ మార్గం. అలాంటి ఒక క్రమశిక్షణను పాఠించడం ద్వారా ఒక వ్యాపారం ఖాతాదారులు, అమ్మకం దారులు, చెల్లింపులు మరియు వసూళ్ళ యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని కలిగియుంటుంది. ఆ వ్యాపారం యొక్క నగదు వివరాలన్నీ బ్యాంకు వారిని ఒప్పించగలుతాయి. ఒక సారి ఆలోచించండి…మీకే గనుక ఎవరికి ఎంత చెల్లించాలి, ఎపుడు చెల్లించాలి, ఇంతకీ బ్యాంకులో ఇంకా ఎంత నగదు అందుబాటులో ఉందో తెలిస్తే ఎంత సులభంగా ఉంటుంది?

ఎపుడైతే మీరు వ్యాపారంలో వచ్చే ఎత్తు పల్లాలను ముందుగానే ఊహించి సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకుంటారో అపుడు మీ వ్యాపారం అతి తక్కువ ఒడిదుడుకులకు గురి అవుతుంది. ఖాతాలను సరిగ్గా నిర్వహించడానికి ఏకైక సులువైన మార్గం ఒక మంచి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ను వాడటాన్ని ప్రారంభించడం. ఒక వేళ మీరు అటువంటి దాన్ని ఇంతవరకు వాడి ఉండకపోతే ఇపుడు వాడటాన్ని ప్రారంభించడం మీరు వేయబోయే ఒక మంచి తొలి అడుగు. జి.ఎస్.టి ఇంకొన్ని నెలల్లో కార్యరూపం దాల్చే ఈ క్రమంలో, నిజంగా ఇది మీ వ్యాపారాన్ని చాలా శక్తివంతంగా మారుస్తుంది.

ఇపుడు ఈ కరెన్సీ సంక్షోభం వల్ల ఎన్నో కంపనీలు చెల్లింపులను డెబిట్ కార్డుల ద్వారా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు మరియు మొబైల్ వాలెట్ల ద్వారా స్వీకరించడం ప్రారంభించాయి. మరి ఇలాంటి ఎలక్ట్రానిక్ చెల్లింపుల వల్ల వ్యాపారంపై ఎలాంటి ప్రాభావం ఉంటుంది? ఈ పద్దతి వ్యాపారాన్ని నిజంగా అంత శక్తివంతంగా మార్చగలుగుందా? అది తెలుసుకోవడానికి వేచి ఉండండి!

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

234,567 total views, 33 views today

Avatar

Author: Santosh AR