ప్రస్తుత పన్ను విధానంలో, ఒక పన్ను పరిధిలోకి వచ్చే సేవ నియమం అనేది సర్వీస్(సేవా) పన్నుకు లోబడి ఉంటుంది. సర్వీస్(సేవా) పన్ను కేంద్ర ప్రభుత్వం ద్వారా విధించబడుతుంది మరియు సర్వీస్ నియమం అంతర్రాష్ట్రమైనదా లేదా రాష్ట్రంలోపలిదా అనే దానితో నిమిత్తం లేకుండా వర్తిస్తుంది.

అయితే, జిఎస్టి కింద, సర్వీస్ యొక్క సరఫరా స్థానం అనేది సర్వీస్ పై వర్తించే పన్ను రకం నిర్ణయిస్తుంది. జిఎస్టి అనేది సరఫరా వినియోగించబడే రాష్ట్రానికి పన్ను వచ్చి చేరే ‘ఒక గమ్యం ఆధారిత వినియోగ పన్ను’, అనే భావనపై ఇది ఆధారితమై ఉంది. అందుకే, సేవల సరఫరా స్థానం నిర్ధారించడం ముఖ్యం.

సేవల సరఫరా స్థానం నిర్ధారించడానికి ఉండే నియమాలు వస్తువుల సరఫరా స్థానం నిర్ధారించడానికి ఉండే నియమాలకి భిన్నంగా ఉంటాయి. వస్తువుల విషయంలో వస్తువులు ఒక చోటు నుంచి మరొకచోటికి తరలింపు అనేది ఎక్కువగా సరఫరా స్థానాన్ని నిర్ణయిస్తుంది. సేవలు, కనిపించనివై ఉండటంతో, వాటికి స్థిరమైన డెలివరీ పద్ధతి ఉండదు. అలాగే, సేవ యొక్క సరఫరా యొక్క కొన్ని సందర్భాలలో, సరఫరాదారు మరియు/లేదా గ్రహీత స్థానం స్థిరంగా ఉండకపోవచ్చు లేదా నిర్ధారించదగినదిగా ఉండకపోవచ్చు.

ఈ బ్లాగ్ లో, సేవల సరఫరా స్థానాన్ని ఎలాగ నిర్ధారించాలి అనే విషయాన్ని మేము చర్చిస్తాము.

GST is a ‘destination based consumption tax’, where tax will accrue to the State where the supply is consumed.Click To Tweet

ఒక నమోదిత వ్యక్తికి ఒక సేవ సరఫరా చేయబడినప్పుడు

ప్రస్తుత వ్యవస్థలో, ఒక నమోదిత వ్యక్తికి ఒక పన్ను పరిధిలోకి వచ్చే సేవని అదే రాష్ట్రంలోపల లేదా రాష్ట్రం వెలుపల అందజేసినప్పుడు, సర్వీస్ టాక్స్ వర్తిస్తుంది.

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార స్థానం భువనేశ్వర్ ఒడిషా అయిన మనీష్ డిజైనర్స్, హైదరాబాద్ తెలంగాణ వారి నమోదిత వ్యాపార స్థానం అయిన రాజేష్ అప్పారెల్స్ కు, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తుంది. ఒక పన్ను పరిధిలోకి వచ్చే సేవ అయి ఉన్నందున, ఈ లావాదేవీ పై సర్వీస్ పన్ను (స్వఛ్ఛభారత్ పన్ను మరియు కృషి కళ్యాణ్ పన్నుతో సహా) @ 15% వసూలు చేయబడుతుంది.

జిఎస్టి వ్యవస్థలో, వసూలు చేయబడవలసిన జీఎస్టీ రకం గుర్తించడానికి సరఫరా స్థానం తప్పక నిర్ధారించబడి ఉండాలి. ఒక పన్ను పరిధిలోకి వచ్చే సేవని ఒక నమోదిత వ్యక్తి (సాధారణ/కాంపొజిషన్ డీలర్)కి సరఫరా చేసినప్పుడు, గ్రహీత యొక్క నమోదిత వ్యాపార స్థానమే సరఫరా స్థానం అవుతుంది.

When a taxable service is supplied to a registered person, the registered place of business of the recipient will be the place of supply.Click To Tweet
అదే రాష్ట్రంలో ఒక నమోదిత వ్యక్తికి సరఫరా

ఒక సేవని అదే రాష్ట్రంలో నమోదిత వ్యక్తికి సరఫరా చేసినప్పుడు, వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార స్థానం భువనేశ్వర్ ఒడిషా అయిన మనీష్ డిజైనర్స్, కటక్ ఒడిషాలో నమోదిత వస్త్రాల తయారీదారు అయిన మురళి ఫ్యాషన్స్ కు, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తుంది.

సరఫరాదారు స్థానం: భువనేశ్వర్, ఒడిషా

సరఫరా ప్రదేశం: కటక్ ఒడిషా

ఇది ఒక రాష్ట్రంలోపలి సరఫరా మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

Intraste supply of services under GST

వేరే రాష్ట్రంలో ఒక నమోదిత వ్యక్తికి సరఫరా

ఒక వేరే రాష్ట్రంలోని ఒక నమోదిత వ్యక్తికి ఒక సేవని సరఫరా చేసినప్పుడు, వర్తించే పన్ను ఐజిఎస్టి అయి ఉంటుంది.

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార స్థానం భువనేశ్వర్ ఒడిషా అయిన మనీష్ డిజైనర్స్, హైదరాబాద్ తెలంగాణ వారి నమోదిత వ్యాపార స్థానం అయిన రాజేష్ అప్పారెల్స్ కు, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తుంది.

సరఫరాదారు స్థానం: భువనేశ్వర్ ఒడిషా.

సరఫరా ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ.

ఈ ఒక అంతర్రాష్ట్ర సరఫరా, మరియు వర్తించే పన్ను ఐజిఎస్టి.

Services place of supply gst

ఒక సేవని ఒక నమోదుకాని వ్యక్తికి సరఫరా చేసినప్పుడు

ప్రస్తుత పన్ను వ్యవస్థలో, ఒక నమోదుకాని వ్యక్తికి ఒక సేవ అందించబడితే సర్వీస్ టాక్స్ వర్తిస్తుంది. గ్రహీత నమోదితమైనా కాకపోయినాగాని పన్ను వసూలులో ఏ వ్యత్యాసం ఉండదు.

జిఎస్టి వ్యవస్థలో, ఒక నమోదుకాని వ్యక్తికి ఒక సేవ సరఫరా చేయబడినప్పుడు, 2 దృష్టాంతాలు ఉండవచ్చు:

దృష్టాంతం 1: గ్రహీత యొక్క చిరునామా సరఫరాదారు రికార్డుల్లో ఉంటుంది

దృష్టాంతం 2: గ్రహీత యొక్క చిరునామా సరఫరాదారు రికార్డుల్లో ఉనికిలో ఉండదు

దృష్టాంతం 1: సరఫరాదారు రికార్డుల్లో చిరునామా ఉన్న ఒక నమోదుకాని వ్యక్తికి ఒక సేవని సరఫరా చేసినప్పుడు, , సరఫరా స్థానం అనేది సరఫరాదారు యొక్క రికార్డుల్లో ఉన్న గ్రహీత స్థానం అయి ఉంటుంది.

When a service is supplied to an unregistered person whose address exists in the supplier’s records, the place of supply will be the location of the recipient in the supplier’s recordsClick To Tweet
అదే రాష్ట్రంలో సరఫరా

సరఫరాదారు యొక్క రికార్డులలో అదే రాష్ట్రంలో చిరునామా కలిగి ఉన్న ఒక నమోదుకాని వ్యక్తికి ఒక సేవని సరఫరా చేసినప్పుడు, వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార స్థానం భువనేశ్వర్ ఒడిషా అయిన మనీష్ డిజైనర్స్, ఒక నమోదుకాని డీలర్ అయిన రమేష్ క్లోదింగ్ కు, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తుంది. మనీషా డిజైనర్స్ యొక్క రికార్డుల్లో రమేష్ క్లోదింగ్ వారి చిరునామా పూరీ ఒరిస్సాగా వ్రాయబడి ఉంది.

సరఫరాదారు స్థానం: భువనేశ్వర్ ఒడిషా

సరఫరా ప్రదేశం: పూరీ, ఒడిషా

ఇది ఒక రాష్ట్రంలోపలి సరఫరా, మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

GST on services to unregistered person

వేరే రాష్ట్రానికి సరఫరా

సరఫరాదారు యొక్క రికార్డులలో వేరే రాష్ట్రంలో చిరునామా కలిగి ఉన్న ఒక నమోదుకాని వ్యక్తికి ఒక సేవని సరఫరా చేసినప్పుడు, వర్తించే పన్ను ఐజిఎస్టి అయి ఉంటుంది.

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార స్థానం భువనేశ్వర్ ఒడిషా అయిన మనీష్ డిజైనర్స్, ఒక నమోదుకాని డీలర్ అయిన లక్ష్మీ అప్పారెల్ కు, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తుంది. మనీష్ డిజైనర్ల రికార్డుల్లో లక్ష్మీ అప్పారెల్స్ యొక్క చిరునామా కోలకతా, పశ్చిమ బెంగాల్ గా వ్రాయబడి ఉంది.

సరఫరాదారు స్థానం: భువనేశ్వర్ ఒడిషా

సరఫరా ప్రదేశం: కోలకతా, పశ్చిమ బెంగాల్

ఇది ఒక అంతర్రాష్ట్ర సరఫరా మరియు వర్తించే పన్ను ఐజిఎస్టి అయి ఉంటుంది.

Example of GST Interstate Supply of Services

దృష్టాంతం 2: సరఫరాదారు యొక్క రికార్డులలో వారి చిరునామా ఉనికిలో లేని ఒక నమోదుకాని వ్యక్తికి ఒక సేవని సరఫరా చేసినప్పుడు, సరఫరా స్థానం అనేది సరఫరాదారు ప్రదేశం అయి ఉంటుంది

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార స్థానం భువనేశ్వర్ ఒడిషా అయిన మనీష్ డిజైనర్స్, వారి రికార్డుల్లో చిరునామా అందుబాటులో లేని ఒక కస్టమర్ కు, ఫ్యాషన్ డిజైనింగ్ సేవలను అందిస్తుంది.

సరఫరాదారు స్థానం: భువనేశ్వర్ ఒడిషా

సరఫరా ప్రదేశం: భువనేశ్వర్ ఒడిషా

ఇది ఒక రాష్ట్రంలోపలి సరఫరా, మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

Supply of services in GST

గమనిక: జిఎస్టిలో, సేవలు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తికి ఒక కాంపొజిషన్ డీలర్ గా నమోదు చేసుకునేందుకు అర్హత ఉండదు. అయితే, జిఎస్టి కౌన్సిల్ 4 మార్చి ’17 న జరిగిన తమ 11 వ సమావేశంలో 50 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ గల చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ధాబాలు కాంపొజిషన్ డీలర్లుగా నమోదు చేసుకోవచ్చు అని నిర్ణయించారు. ఇది ఇంకా జిఎస్టి చట్టంలో చేర్చబడవలసి ఉంది.

సేవలకు సరఫరా స్థానం నిర్ధారించడానికి ఇవి సాధారణ నియమాలు. అయితే, కొన్ని సేవల సరఫరా స్థానం నిర్ధారించడానికి నిర్దిష్ట నియమాలు పొందుపరచబడ్డాయి. మేము రాబోయే బ్లాగుల్లో వీటిని కవర్ చేస్తాము.

క్రమంలో-తదుపరి రానున్నవి

ఒక అచల ఆస్తికి సంబంధించి సేవల సరఫరా ప్రదేశం

మాకు మీ సహాయం కావాలి
కింది వ్యాఖ్యలని ఉపయోగించి ఈ బ్లాగ్ పోస్ట్ లో మీ అభిప్రాయాన్ని దయచేసి పంచుకోండి.

అలాగే ఏ జిఎస్టి సంబంధిత విషయాలని గురించి మీరు మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారో మాకు తెలియజేయండి, మేము మా కంటెంట్ ప్రణాళికలో వాటిని సంతోషంగా చేర్చుతాము.

ఇది సహాయకారిగా అనిపించిందా? క్రింద సోషల్ షేర్ బటన్ను ఉపయోగించి దీన్ని ఇతరులతో పంచుకోండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

123,688 total views, 46 views today