భారతదేశం యొక్క ఇ-కామర్స్ రంగం 2020 నాటికి రూ .12,000 కోట్ల ఆదాయాన్ని దాటగలదని అసోచామ్-ఫారెస్టర్ అధ్యయనం తెలిపింది. ప్రపంచంలోకెల్లా అత్యధికమైన 51% వార్షిక రేటు వద్ద ఈ రంగం పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది. భారత ప్రభుత్వం యొక్క కరెన్సీ డిమానిటైజేషన్ మరియు జీవితంలోని ప్రతి అంశంలో డిజిటైజేషన్ కోసం జోరుగా ఊపునివ్వడం వంటి ఇటీవలి చర్యలు ఇ-కామర్స్ పరిశ్రమ వృద్ధి వేగవంతమవడానికి దోహదపడ్డాయి.

ఇ-కామర్స్ వేదికపై ఒక సరఫరాదారుకి, భౌగోళికంగా సుదూర కస్టమర్లకు ప్రాప్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు మరియు ఇ-కామర్స్ అందించే అనుగుణంగా మార్పుచేసుకోగల వసతితో వ్యాపారం చేయడానికి ఇది ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన సమయం. అదే సమయంలో, ప్రస్తుత వ్యవస్థలో ఇ-కామర్స్ లావాదేవీలపై పన్నులు అస్పష్టంగా ఉండి వివిధ రాష్ట్రాలు వేర్వేరు పన్ను విధించడాలను కలిగి ఉంటుంది.
జిఎస్టి ఆగమనం అనేది ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారుల మనస్సులలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. దేశం అంతటా ఇ-కామర్స్ పై పన్నుల్లో ఏకత్వాన్ని జిఎస్టి తీసుకువస్తుందా? వారి లాభాలపై మరియు నిర్వహణ వ్యయాలపై జిఎస్టి ప్రభావం ఎలా ఉంటుంది?
ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారులపై జిఎస్టి ప్రభావం గురించి మనం అర్థం చేసుకుందాం.

ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారులపై జిఎస్టి ప్రభావం గురించి మనం అర్థం చేసుకుందాం.

ప్రస్తుత వ్యవస్థ

ప్రస్తుత పన్ను వ్యవస్థలో, ఇ-కామర్స్ వేదికలు వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్, మార్కెట్ ప్లేస్ కమీషన్ వంటి వాటి వేదికపై పంపిణీదారులకి అందించే సేవలపై సేవా పన్ను వసూలు చేస్తాయి. ఈ సేవలపై చెల్లించిన సేవా పన్నుపై సరఫరాదారులు ఇన్పుట్ క్రెడిట్ను క్లెయిమ్ చేయలేవు మరియు ఒక ఖర్చు అవుతుంది. అదేవిధంగా, వస్తువులపై చెల్లించిన ఎక్సైజ్ డ్యూటీ కూడా ప్రస్తుత వ్యవస్థలో సరఫరాదారుకు ఒక ఖర్చు అవుతుంది.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి వ్యవస్థలో సరఫరాదారులకు మంచి సానుకూలమైన విషయం ఏమిటంటే ఎల్లలు లేకుండా లభించే ఇన్పుట్ క్రెడిట్. జిఎస్టి పరిధిలో, వ్యాపారంలో లేదా మరింత ప్రయోజనం కోసం ఉపయోగించిన అన్ని ఇన్పుట్లపైనా ఇన్పుట్ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. ఫలితంగా, ఇది ఇప్పుడు సరఫరాదారులకు కార్యకలాపాల కోసం ఖర్చులు తగ్గించటానికి దారి తీస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వారు ఇన్పుట్లపై చెల్లించిన పన్ను యొక్క క్రెడిట్ తీసుకోగలుగుతారు, ఇది ఇప్పటివరకు వారి ఖర్చుకు జోడించబడుతూ వస్తోంది.

A great positive for e-commerce suppliers in the GST regime is the seamless availability of input creditClick To Tweet

రాష్ట్రాల వ్యాప్తంగా ఏకరీతి పన్ను విధింపు

ప్రస్తుత వ్యవస్థ

ప్రస్తుత వ్యవస్థలో, పంపిణీదారులు వారు వ్యవహరించే ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్ర వారీ పన్నుల నిబంధనలను తెలుసుకుని ఉండాలి. అదే ఉత్పత్తి వివిధ రాష్ట్రాలలో వేర్వేరు రేట్ల వద్ద పన్ను విధించబడుతుంది. కొన్ని సందర్భాల్లో, ఇ-కామర్స్ వ్యాపార నమూనాలపై వ్యవహరించే విధానంలో అస్పష్టత కారణంగా, ఒకే ఉత్పత్తిపై బహుళ పన్నులు విధించబడతాయి. అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోకి ఆన్లైన్లో అమ్ముడైన వస్తువుల ప్రవేశానికి ప్రవేశ పన్ను విధిస్తున్నాయి.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి పరిధిలో, అన్ని వస్తువుల మరియు సేవలు, అవి భౌతికంగా దుకాణాల్లో లేదా ఆన్లైన్లో విక్రయించబడ్డాయా అనే దానితో నిమిత్తం లేకుండా, దేశవ్యాప్తంగా ఏకరీతిగా ఉండే నిర్దిష్ట పన్ను రేట్లు కేటాయించబడతాయి. అందువల్ల, ఒక సరఫరాదారుగా, జిఎస్టి దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఎక్కువ ప్రాప్యతను తీసుకువస్తుంది.

For e-commerce suppliers, GST brings greater access to customers across the nationClick To Tweet

తప్పనిసరి రిజిస్ట్రేషన్

ప్రస్తుత వ్యవస్థ

ఇ-కామర్స్ వేదికలపై అనేకమంది సరఫరాదారులు ప్రస్తుత పన్ను వ్యవస్థలో నమోదు చేసుకోబడి లేరు, ఎందుకంటే వారి టర్నోవర్ ప్రవేశ పరిమితిని అధిగమించదు కాబట్టి. ఇది వారు నమోదు చేసుకున్న డీలర్లతో పోల్చితే తక్కువ ధర వద్ద ఉత్పత్తులను అమ్మడానికి వీలుకల్పించింది. వివరణాత్మక ఖాతాల మరియు ఇన్వాయిస్ల నిర్వహణ, మరియు రిటర్నులను ఫైల్ చేయడం వంటి కట్టుబడి ఉండవలసిన పనులు కూడా అవసరం లేదు.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి వ్యవస్థలో, ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారులు అందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అందువల్ల, వారి టర్నోవర్ ఎంత తక్కువగా ఉంది అనేదానితో నిమిత్తం లేకుండా, ఇ-కామర్స్ వేదికలపై వస్తువులను లేదా సేవలను అందించే ఒక వ్యక్తి రిజిస్టర్ చేసుకోబడిన డీలరుగా తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది, దీనిలో వివరణాత్మక ఖాతాలు మరియు రికార్డులను నిర్వహించడం, రిటర్నులను ఫైల్ చేయడం మరియు నెలసరి ప్రాతిపదికన పన్నులు చెల్లించడం ఉంటుంది. ఇ-కామర్స్ పంపిణీదారులకు ఇది అన్యాయంగా అనిపించవచ్చు, ఎందుకంటే భౌతిక దుకాణాల ద్వారా సరఫరా చేసే వ్యక్తులకు, ప్రవేశ పరిమితిని దాటుతున్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది నియమం మరియు వారు వారి టర్నోవర్ రూ.50 లక్షలు మించకపోతే, పన్నును కాంపొజిషన్ ప్రాతిపదికన చెల్లించేందుకు కూడా వారికి వికల్పం ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా, తమ స్వంత పోర్టల్స్ కలిగి ఉన్న సరఫరాదారులు ఇ-కామర్స్ యొక్క పరిధిలోకి రావు అందువలన వారి టర్నోవర్ ప్రవేశ పరిమితిని మించితేనే నమోదు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. ఇ-కామర్స్ సరఫరాదారులు ఇప్పుడు చేయవలసినది ఏమిటంటే, జిఎస్టి తీసుకువచ్చే అదనపు కట్టుబడి ఉండే కార్యకలాపాలకు మరియు వ్యయం కోసం సిద్ధమవాలి కట్టుబడి ఉండే కార్యక్రమాలను సులభతరం చేసేందుకు సాంకేతికత ఖాతాలు మరియు పుస్తకాలను కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారులుగా మారలేరు

ప్రస్తుత వ్యవస్థ

ప్రస్తుత వ్యవస్థలో, వేట్ (VAT) క్రింద, రూ.50 లక్షల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన సరఫరాదారులు కాంపొజిషన్ పథకానికి ఎంపిక చేసుకోవచ్చు, తద్వారా వారు వారి టర్నోవర్ లో కేవలం కొద్ది శాతం వద్ద పన్నులు చెల్లించి వారు పనిచేస్తున్న రాష్ట్రాన్ని బట్టి కేవలం త్రైమాసిక ప్రాతిపదికన వార్షిక రిటర్న్ ఫైల్ చేయవలసి ఉంటుంది.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి కింద, వారి టర్నోవర్ రూ .50 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ అటువంటి సరఫరాదారులు కాంపొజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకోలేరు. వారు సాధారణ డీలర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుని తీరాలి. అలాంటి పంపిణీదారుల కోసం కూడా, నిర్దేశించిన పద్ధతిలో ఖాతాలను మరియు రికార్డులను నిర్వహించడంతో పాటు నెలవారీ ప్రాతిపదికన రిటర్నులను ఫైల్ చేయడం మరియు పన్నులు చెల్లించడం అవసరాలు కారణంగా జిఎస్టి కింద కట్టుబడి ఉండవలసిన కార్యకలాపాలు మరియు ఖర్చు పెరుగుతుంది.

నగదు ప్రవాహం ప్రభావితమవుతుంది

ప్రస్తుత వ్యవస్థ

ఇ- కామర్స్ సరఫరాదారులు సాధారణంగా చిన్న మార్జిన్లలో పనిచేస్తారు. ఇ-కామర్స్ వేదిక ద్వారా ఒక విక్రయం జరిగిన తర్వాత, ఇ-కామర్స్ ఆపరేటర్ వినియోగదారుల నుండి డబ్బును సేకరించి మరియు మార్కెట్ ప్లేస్ కమీషన్ మినహాయించుకున్న తరువాత దానిని పంపిణీదారునికి చెల్లిస్తారు. ప్రస్తుత వ్యవస్థలో సరఫరా యొక్క ఉదాహరణను మనం తీసుకుందాం.
ఉదాహరణ: ఫాస్ట్ డీల్స్ ఒక కామర్స్ ఆపరేటర్ మరియు రాకేష్ ప్రైవేట్ లిమిటెడ్ వేదికపై నమోదైన సరఫరాదారు. రాకేష్ ప్రైవేట్ లిమిటెడ్ 1 మే, ’17 నాడు రూ. 11,200 లకు (వాట్ తో సహా) ఫాస్ట్ డీల్స్ పై ఒక మొబైల్ ఫోన్ సరఫరా చేస్తారు.

వివరాలు రూ.
అమ్మిన మొబైల్ ఫోన్ విలువ 10,000
వేట్ @ 12% 1,200
అమ్ముకపు ధర 11,200
(-) సర్వీస్ పన్నుతో సహా మార్కెట్ ప్లేస్ కమిషన్*(-) 200
ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సరఫరాదారుకు చెల్లించిన మొత్తం 11,000

*ఉదాహరణ ఉద్దేశ్యం కొసం మార్కెట్ ప్లేస్ కమిషన్ రూ. 200 అని భావిద్దాం.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి కింద, ఇ-కామర్స్ సరఫరాదారులు 2 సవాళ్లను ఎదుర్కొంటారు:

    1. 1. ఆపరేటర్ల ద్వారా మూలం వద్ద పన్ను వసూలు (టిసిఎస్) @ 2% ద్వారా వారి నగదు ప్రవాహం ప్రభావితమవుతుంది. జిఎస్టి వ్యవస్థలో, వారి వేదిక ద్వారా చేసిన సరఫరాలపై పన్ను వసూలు చేసేందుకు మరియు మిగిలిన మొత్తాన్ని మాత్రమే సరఫరాదారుకు చెల్లించేందుకు ఆపరేటర్లు బాధ్యులు.

పైన పేర్కొన్న అదే ఉదాహరణనే మనం జిఎస్టి వ్యవస్థలో పరిశీలిద్దాము

వివరాలు రూ.
అమ్మిన మొబైల్ ఫోన్ విలువ 10,000
జిఎస్టి @ 12% 1,200
అమ్ముకపు ధర 11,200
(-) జిఎస్టితో సహా మార్కెట్ ప్లేస్ కమిషన్*

(-) 200
(-) టిసిఎస్@ 2% రూ.10,000 పై(-)200
ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సరఫరాదారుకు చెల్లించిన మొత్తం 10,800

*ఉదాహరణ ఉద్దేశ్యం కొసం మార్కెట్ ప్లేస్ కమిషన్ రూ. 200 అని భావిద్దాం.

ఇక్కడ, టిసిఎస్ మినహాయింపు తరువాత ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా పంపిణీదారునికి చెల్లించిన మొత్తం రూ .10,800. అందువల్ల, ఒక ఇ కామర్స్ సరఫరాదారుపై టిసిఎస్ యొక్క నెలసరి ప్రభావం విశ్లేషించబడినప్పుడు, నగదు బిగుసుకుపోయే పరిమాణం, ముఖ్యంగా చిన్న మార్జిన్లపై పనిచేసే చిన్నతరహా డీలర్లకు, గణనీయంగా అవుతుంది. ఈ చెల్లించబడిన పన్ను వచ్చే నెల 15 వ తేదీన సరఫరాదారుకు ఇన్పుట్ క్రెడిట్ గా చెల్లించబడుతుంది, అంటే 30-45 రోజులు నగదు బిగుసుకుపోవడం అన్నమాట.

    1.
  1. ఇ-కామర్స్ సరఫరాదారులకు అందుబాటులో ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్(ఐటిసి) వారి విక్రేత యొక్క కట్టుబడి ఉండటం పై ఆధారపడి ఉంటుంది. ఇ-కామర్స్ సరఫరాదారు యొక్క విక్రేత నెలవారీ రిటర్న్ ఫైల్ చేసి మరియు బాకీ ఉన్న పన్ను పూర్తిగా చెల్లించి ఉన్నట్లయితే మాత్రమే ఒక ఇ- కామర్స్ సరఫరాదారు ద్వారా అతని / ఆమె విక్రేత నుండి కొనుగోళ్లపై చెల్లించబడే పన్నును ఐటిసిగా పొందవచ్చు.

విక్రేత గనక కట్టుబడి ఉండని సందర్భంలో, ఇ-కామర్స్ సరఫరాదారు అర్హత గల ఐటీసీని కోల్పోతారు. అటువంటి పరిస్థితులలో కూడా, పంపిణీదారుల డబ్బు ప్రవాహాలు గణనీయంగా ప్రభావితం అవుతాయి.
అందువల్ల, ఇ-కామర్స్ పంపిణీదారులు ఎంచుకోవలసిన విక్రేతలను, ఉత్పత్తి ధర మరియు పని మూలధనంపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు, టిసిఎస్ యొక్క ప్రభావం మరియు వారి విక్రేత ద్వారా కట్టుబడి ఉండకపోవడాన్నిపరిగణించాలి.

ముగింపు

ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారుల కోసం, జిఎస్టి ఖచ్చితంగా ఇన్పుట్ క్రెడిట్ లభ్యత మరియు దేశవ్యాప్తంగా సరఫరాపై ఒకే పన్ను విధింపు ద్వారా వ్యయం తగ్గింపులను తెస్తుంది. ఇ-కామర్స్ లావాదేవీలపై మరింత స్పష్టత మరియు ఏకరీతిగా విధించబడే పన్నులతో జిఎస్టి వ్యవస్థలో వ్యాపారాన్ని సులభంగా చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా పన్నుల సేకరణ (టిసిఎస్) వారి విక్రేతలు కట్టుబడి ఉండకపోవడం మరియు నెలసరి ప్రాతిపదికన పన్నులను చెల్లించడం ద్వారా వారి నగదు ప్రవాహాలపై ప్రభావం కోసం సప్లయర్స్ కూడా సిధ్ధపడి ఉండాలి. తప్పనిసరి రిజిస్ట్రేషన్ కారణంగా జిఎస్టి వ్యవస్థలో సరఫరాదారుల కోసం కట్టుబడి ఉండవలసిన కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. వారి మొత్తం టర్నోవర్ రూ .50 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు కాంపొజిషన్ విధింపుని ఎంచుకోలేరు. ఒక సాధారణ డీలర్ కావడంతో నెలవారీ ప్రాతిపదికన రిటర్న్స్ దాఖలు చేయడం మరియు వివరణాత్మక ఖాతాలు మరియు రికార్డుల నిర్వహణ అవసరమవుతుంది. ఒక సరఫరాదారుగా, జిఎస్టి వ్యవస్థ కోసం ప్రణాళిక చేసుకుని సిద్ధం కావడం చాలా ముఖ్యం. జిఎస్టి క్రింద కట్టుబడి ఉండవలసిన అవసరాల గురించి అవగాహన, ఈ అవసరాలను నిర్వహించడానికి వనరుల సరైన శిక్షణ మరియు వీటిని అన్నింటినీ సులభతరం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం అనేది, సరఫరాదారులు భారతదేశంలో ఇ-కామర్స్ యొక్క కొత్త యుగం నుంచి లాభాలు ఆర్జించేలాగా చేయగలవు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

100,464 total views, 20 views today