18 జూన్, 2017, నాడు జరిగిన 17 వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం దేశవ్యాప్తంగా వ్యాపారాలకు ఎంతగానో అవసరమైన ఉపశమనం కలిగించింది. వివిధ వర్తక మరియు పారిశ్రామిక సంస్థల ద్వారా లేవనెత్తబడిన ఆందోళనలను విని మరియు జిఎస్టి సజావుగా అమలవడాన్ని నిర్ధారించేందుకు మొదటి రెండునెలలపాటు ఫారం జిఎస్టిఆర్-1 మరియు ఫారం జిఎస్టిఆర్-2 లో ఇన్వాయిస్-వారీగా రిటర్న్ ఫైలింగ్ కొరకు కాలపరిమితిని విస్తరించాలని నిర్ణయించుకుంది.

మొదటి రెండు నెలలు – జూలై 17 మరియు ఆగష్టు 17, వ్యాపారాలు లోపలి సరఫరా మరియు బయటికి సరఫరా యొక్క సారాంశాన్ని ప్రకటించడం ద్వారా ఫారం జిఎస్టిఆర్-3బిలో సాధారణ రిటర్న్ ఫైల్ చేయవలసి ఉంటుంది. అయితే ఫారం జిఎస్టిఆర్-1 మరియు ఫారం జిఎస్టిఆర్-2 లో జులై మరియు ఆగస్టు కోసం ఇన్వాయిస్-వారీ వివరాలను వరుసగా సెప్టెంబరు 5 మరియు సెప్టెంబర్ 20, 2017 నాటికి ఫైల్ చేయాలి.

సవరణ చేయబడిన రిటర్న్ సమయరేఖలు
నెల జిఎస్టిఆర్-3బి జిఎస్టిఆర్-1 జిఎస్టిఆర్-2 జిఎస్టిఆర్-3
జులై, 201725 ఆగస్టు, 201710 వ అక్టోబర్, 201731 వ అక్టోబర్, 201710 వ నవంబర్, 2017

సవరించిన రిటర్న్ తేదీలు కొత్త పరోక్ష పన్ను వ్యవస్థ యొక్క వివిధ అవసరాల కోసం సంసిధ్ధమవటానికి మరియు స్థిరపడడానికి వ్యాపారాలకు అదనంగా 25 రోజులు అందిస్తాయి. పై వాటికి అదనంగా, మధ్యంతర వ్యవధి కోసం రిటర్న్ ఫైల్ చేయడంలో ఏదైనా పొరబాటుకి ఏ ఆలస్యమైన రుసుము మరియు జరిమానా విధించబడదు.

ఫారం జిఎస్టిఆర్ -3బి అనేది జిఎస్టి క్రింద వ్యాపారాలు ఫైల్ చేసే మొదటి రిటర్న్ అయి ఉంటుంది. ఈ బ్లాగ్లో, ఫారం జిఎస్టిఆర్ -3బి ని ఎలా పూరించాలో మనం అర్థం చేసుకుందాం.

మీరు టాలీ.ఇఆర్పి9 రిలీజ్ 6 ను ఉపయోగిస్తుంటే, మీరు ఈ మిగిలిన బ్లాగ్ పోస్ట్ దాటివెయ్యొచ్చు. ఫారం జిఎస్టిఆర్-3బి కు మద్దతిచ్చే మా కొత్త విడుదల ఇప్పుడు అందుబాటులో ఉంది – డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యామ్నాయంగా, టాలీ.ఇఆర్పి9 యొక్క సమాచారం ప్యానెల్ లో వర్షన్ మరియు అప్డేట్ల విభాగాన్ని క్లిక్ చేయండి.

ఫారం జిఎస్టిఆర్ -3బిలో 6 పట్టికలు ఉంటాయి. బయటికి సరఫరా, లోపలికి సరఫరా, అర్హత గల ఐటీసీ, మరియు పన్ను చెల్లింపు వివరాల యొక్క ఏకీకృత వివరాలను మీరు సంగ్రహించుకోవాలి. దీనిని వివరంగా చర్చిద్దాం:

1. రివర్స్ ఛార్జి విధించబడగల బయటికి సరఫరా మరియు లోపలికి సరఫరా యొక్క వివరాలు

Outward Inward Supplies

పై పట్టిక (3.1)లో, వర్తించట్లుగా మొత్తం పన్ను (ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి / యుటిజిఎస్టి) తో క్రింది స్వభావపు సరఫరాల మొత్తం పన్నుల విలువ (అంతర్-రాష్ట్ర (ఇంటర్ స్టేట్) మరియు రాష్ట్ర-అంతర (ఇంట్రా స్టేట్)) ను మీరు చేర్చాలి:

   1. బయటికి పన్ను విధించబడగల సరఫరాలు ఇతర సున్నా రేటు, శూన్య రేటు మరియు మినహాయించబడినవి

 

   2. బయటికి పన్ను విధించబడగల సరఫరాలు (సున్నా రేటు చేయబడినవి)

 

   3. బయటికి సరఫరాలు శూన్య రేటు, మినహాయించబడినవి గా

 

   4. రివర్స్ ఛార్జి ప్రాతిపదికన చెల్లించబడగల లోపలికి సరఫరా

 

  5. జిఎస్టి కాని బయటికి సరఫరాలు

2. నమోదు చేయబడని వ్యక్తులు, కాంపొజిషన్ డీలర్ మరియు యుఐఎన్ హోల్డర్లకు చేసిన అంతర్-రాష్ట్ర (ఇంటర్ స్టేట్) సరఫరా వివరాలు

Inter state supply

పాయింట్ 1 లో చర్చించిన, పట్టిక 3.1 పేర్కొన్న బయటికి సరఫరా వివరాల నుండి, మీరు నమోదుకాని వ్యక్తులు, కాంపొజిషన్ డీలర్స్ మరియు యుఐఎన్ హోల్డర్లకు చేసిన అంతర్ రాష్ట్ర బయటికి సరఫరాకు ఒక విభజన అందించాలి. ఈ సరఫరాల మొత్తం పన్నులు విధించబడగల విలువ మరియు విధించిన మొత్తం ఐజిఎస్టితో ఈ వివరాలను అంతర్ రాష్ట్ర-వారీ/కేంద్రపాలిత ప్రాంతంవారీ మొత్తంగా సంగ్రహించబడాలి.

3 అర్హతగల ఇన్పుట్ పన్ను క్రెడిట్ వివరాలు

eligible ITC

పై పట్టికలో, ఐటిసి లభ్యత, రివర్స్ చేయవలసిన ఐటిసి వివరాలను సంగ్రహించి, మరియు అందుబాటులో ఉన్న నికర ఐటీసీ చేరుకోవలసి ఉంటుంది. మీరు సంగ్రహించవలసిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 1. అందుబాటులో ఉన్న ఐటిసి (పూర్తి లేదా భాగం): : ఐటిసి వినియోగించుకోబడిన లోపలి సరఫరాల విభజన మీరు అందించవలసి ఉంటుంది. మీరు సంగ్రహించవలసిన వివరాలు ఇవి:
 • వస్తువుల దిగుమతి: వస్తువుల దిగుమతులపై చెల్లించిన ఐజిఎస్టి యొక్క పన్ను క్రెడిట్.
 • సేవ దిగుమతి : సేవ దిగుమతిపై చెల్లించిన ఐజిఎస్టి యొక్క పన్ను క్రెడిట్.
 • రివర్స్ ఛార్జి విధించబడగల లోపలికి సరఫరాలు : వస్తువులు లేదా సేవల దిగుమతి కాకుండా, స్పాన్సర్షిప్ సేవలు, యుఆర్డి నుండి కొనుగోలు, మొదలైనటువంటి రివర్స్ ఛార్జ్ కోసం లోపలికి సరఫరా పై చెల్లించిన జిఎస్టి యొక్క ఐటిసిని మీరు సంగ్రహించవలసి ఉంటుంది. మరింత తెలుసుకోవాలంటే, రివర్స్ ఛార్జి విధించబడగల లోపలికి సరఫరాలు చదవండి.
 • ఐఎస్డి నుండి లోపలికి సరఫరా: ఇన్పుట్ సేవ పంపిణీదారు (ఐఎస్డి) నుండి అందుకున్న ఇన్పుట్ పన్ను క్రెడిట్. మరింత వివరాల కోసం ఐఎస్డి పై మా బ్లాగ్ పోస్ట్ చదవండి.
 • అన్ని ఇతర ఐటిసి: పైవి కాకుండా, ఇతర లోపలి సరఫరాల ఐటిసి ఇక్కడ సంగ్రహించాలి.
 1. రివర్స్ చేయబడవలసిన ఇన్పుట్ పన్ను క్రెడిట్ యొక్క వివరాలు ఈ పట్టిక కింద, మీరు వ్యాపారప్రయోజనం-కాని ఉద్దేశ్యం కోసం, లేదా పాక్షికంగా మినహాయింపు సరఫరా కోసం ఉపయోగించబడిన ఇన్పుట్లు / ఇన్పుట్ సేవలు / క్యాపిటల్ వస్తువులు వినియోగంపై రివర్స్ చేయబడగల ఐటిసిని సంగ్రహించవలసి ఉంటుంది. అంతేకాకుండా, క్యాపిటల్ వస్తువుల యొక్క పన్ను భాగం మరియు ప్లాంట్ & మెషినరీలలో తరుగుదల క్లెయిమ్ చేయబడి ఉంటే, అప్పుడు ఐటిసి అనుమతించబడదు. ఇటువంటి రివర్సల్ ను ఈ పట్టికలో సంగ్రహించాలి. మరింత తెలుసుకునేందుకు, వ్యాపారేతర ప్రయోజనాలు లేదా మినహాయింపు సరఫరాల కోసం వినియోగించుకోబడిన ఇన్పుట్లు/ ఇన్పుట్ సేవల పై ఐటిసి చదవండి .

ITC Reverse

పట్టిక 4 (ఎ) లో నివేదించబడిన విధంగా అందుబాటులో ఉన్న ఐటిసి పైన పట్టికలో నివేదించబడిన విధంగా పరిగణించవలసిన ఐటీసీ మొత్తం ద్వారా తగ్గించబడవలసి ఉంటుంది. ఆ మిగిలిన బ్యాలెన్స్ మీ అర్హత గల ఐటిసి అయి ఉంటుంది.

 1. అర్హత లేని ఐటిసి యొక్క వివరాలు: ఐటిసికి అర్హతలేని సరఫరాల జాబితా చూడండి..

Ineligible ITC

4. మినహాయింపు, శూన్యరేటు మరియు జిఎస్టి-కాని లోపలి సరఫరాల వివరాలు

మీరు కాంపొజిషన్ డీలర్ నుండి చేసిన లోపలికి సరఫరా వివరాలను, శూన్య రేట్ మరియు మినహాయింపులో చేసిన లోపలి సరఫరాల వివరాలను గ్రహించాలి. అలాగే, మీరు ప్రత్యేకంగా జిఎస్టి- కాని లోపలి సరఫరాలను పేర్కొనాలి. పైన చర్చించిన సరఫరాల విలువ అంతరాష్ట్ర మరియు రాష్ట్రాంతర సరఫరా కోసం విడివిడిగా సంగ్రహించబడాలి.

non gst supply

5. పన్ను చెల్లింపు

Tax Payment

పైన పట్టిక (6.1)లో, మీరు స్వయం-ధృవీకరించిన చెల్లించదగిన పన్ను ప్రకటించాలి. పట్టిక సంఖ్య 3.1 లో సంగ్రహించబడిన రివర్స్ ఛార్జిపై చెల్లించాల్సిన బాధ్యతగల బయటికి సరఫరా మరియు లోపలికి సరఫరాకి సంబంధించిన వివరాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఐటిసి మరియు నగదు డిపాజిట్లను ఉపయోగించడం ద్వారా పన్ను చెల్లింపు యొక్క పన్ను-వారీగా విభజన అందచేయాలి.

6. టిడిఎస్/టిసిఎస్ క్రెడిట్

TDS, TCS Credit

పై పట్టికలో, టిడిఎస్ (ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ఉంచుకోబడిన పన్ను) మరియు టిసిఎస్ (ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా ఉంచుకోబడిన పన్ను) వివరాలను మీరు సంగ్రహించాలి. అయితే, ఈ నిబంధనలను ప్రారంభ జిఎస్టి నుండి వాయిదా వేయడం జరిగింది. దీని ప్రకారం టిడిఎస్ మరియు, టిసిఎస్ ముందుముందు తెలియపరచబడేటంతవరకూ వర్తించవు.

అప్డేట్: ఫారం జిఎస్టిఆర్-3బి కు మద్దతిచ్చే మా కొత్త విడుదల అందుబాటులో ఉంది – ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి మరింత తెలుసుకోవడానికి జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్పి9 రిలీజ్ 6 లో మేనేజింగ్ ఫారం జిఎస్టిఆర్-3బి సందర్శించండి


దయచేసి గమనించండి:

పన్ను విధించదగిన సామాగ్రి యొక్క విలువ నికర పన్ను పరిధిలోకివచ్చే విలువ మరియు లెక్కించేందుకు సూత్రాన్ని సూచిస్తుంది:

పన్ను చెల్లించదగిన విలువ = ఇన్వాయిస్ల విలువ+ డెబిట్ నోట్ల విలువ – క్రెడిట్ నోట్ల విలువ + అదే నెలలో ఇన్వాయిస్లు జారీ చేయబడని అడ్వాన్సుల విలువ – ఇన్వాయిస్లకు వ్యతిరేకంగా సర్దుబాటు చేసిన అడ్వాన్స్ యొక్క విలువ.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

308,195 total views, 10 views today