జిఎస్టి వచ్చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి అతిపెద్దదైన ఆర్ధిక మరియు పన్ను సంస్కరణలను స్వాగతించటానికి మొత్తం దేశం సన్నద్ధమవుతూ ఉండగా, ఇక్కడ మీ కోసం ఒక చెక్ లిస్ట్ ఇదిగో- దీనితో మీరు జిఎస్టి లోకి సులభంగా పరివర్తన చెందగలరు.

ఇక్కడ మీరు జిఎస్టి కి ఒక అతుకుల్లేని మరియు ప్రభావవంతమైన పరివర్తనం చెందటం కోసం తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలను చూద్దాం

1. రిజిస్ట్రేషన్ పరివర్తనం

ప్రస్తుత వ్యవస్థలో రాష్ట్ర వాట్ (VAT), సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ మొదలైన వాటి కింద రిజిస్టర్ చేసుకున్న, మరియు ఒక చెల్లుబాటు అయ్యే పాన్ కలిగి ఉన్న ఏ డీలర్ కి అయినా – ఫారం జిఎస్టి రెజ్-25 లో జిఎస్టిలో ఒక తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయబడిన తర్వాత, తాత్కాలిక రిజిస్ట్రేషన్ ను తుది రిజిస్ట్రేషన్ గా మార్పు చేసుకునేందుకు, సూచించబడిన పత్రాలను ఫారం జిఎస్టి రెజ్-24 లో సమర్పించేందుకు డీలర్ కు 90 రోజుల సమయం ఉంటుంది. అందించబడిన సమాచారం సంపూర్ణంగా మరియు సంతృప్తికరంగా ఉంటే, ఫారం జిఎస్టి రెజ్-06 లో తుది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. పరివర్తన సమయంలో, ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తికి జిఎస్టి కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, కాని, గతంలో నమోదు చేసుకోబడి ఉంటే (కేంద్ర మరియు రాష్ట్ర చట్టం), జిఎస్టి అమలు నుంచి 30 రోజుల్లోపు, అంటే 31 జూలై, 2017 నాటికి, ఫారం జిఎస్టి రెజ్-28 ను సమర్పించడం ద్వారా జారీ చేయబడిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: జిఎస్టి మార్పు: రిజిస్టర్ చేసుకోబడిన వ్యాపారాలకు

2. ప్రస్తుత వ్యవస్థలో ఫైల్ చేయబడిన గత రిటర్నుల ఐటిసి

ఒక రిజిస్టర్ చేసుకోబడిన పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి, తన ద్వారా గత చట్టం క్రింద జూన్ 30, 2017 నాటికి ముగిసే నెల/ త్రైమాసికానికి సమకూర్చబడిన, ఒక రిటర్న్ లో ముందుకు చేరవేయబడిన సెన్వాట్, వాట్ మరియు ఎంట్రీ పన్ను మొత్తం యొక్క క్రెడిట్, తన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే, జిఎస్టి అమలు తేదీ అనగా జూలై 1, 2017కి 6 నెలల ముందు కాలానికి ప్రస్తుత చట్టం క్రింద అవసరమైన అన్ని రిటర్నులని సమకూర్చినట్లయితే మాత్రమే, డీలర్ ద్వారా ఐటీసీ క్లెయిమ్ చేయబడవచ్చు.

ఇది కూడా చదవండి: జిఎస్టి మార్పు: నేను క్లోజింగ్ స్టాక్ పైన ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకోగలనా?

3. క్యాపిటల్ గూడ్స్ పై చెల్లించిన వాట్/ఎక్సైజ్ పై ఐటిసి

ప్రస్తుతం, క్యాపిటల్ గూడ్స్ కొనుగోలుకి వ్యతిరేకంగా ఐటిసి వెంటనే అందుబాటులో లేదు, ఇంకా అది కూడా, అది కొన్ని పేర్కొన్న క్యాపిటల్ వస్తువులపై మాత్రమే అందుబాటులో ఉంది. 2004 నాటి సెన్వాట్ క్రెడిట్ నియమాల ప్రకారం, మొదటి సంవత్సరంలో 50% క్రెడిట్ మాత్రమే వినియోగించుకోవచ్చు మరియు మిగిలిన50% క్రెడిట్ ని తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో వేటిలోనైనా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా, అనేక రాష్ట్రాల్లో, అనేక నెలల్లో విస్తరించిన వాయిదాల రూపంలో క్యాపిటల్ వస్తువుల కోసం ఐటీసీ అందుబాటులో ఉంది; మిగతా వాటిల్లో, క్యాపిటల్ వస్తువులను వ్యాపార ఉపయోగంలోకి తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే ఐటీసీ లభిస్తుంది. జిఎస్టి వ్యవస్థలో తీసుకురాబడిన ముఖ్యమైన మార్పులలో ఒకటి ఏమిటంటే, క్యాపిటల్ వస్తువుల పై వాట్/ ఎక్సైజ్ క్రెడిట్ యొక్క పూర్తి బ్యాలెన్స్ ను ఐటిసిగా క్లెయిమ్ చేసేందుకు డీలర్ కు ఉండే సామర్ధ్యం.

4. స్టాక్లో ఉన్న వస్తువులపై చెల్లించిన ఎక్సైజ్ క్రెడిట్

బహుశా పరివర్తన నియమాలు అన్నింటిలోకి యొక్క అత్యంత లోతుగా ప్రభావాన్ని చూపే ఆందోళన ఏదంటే, స్టాకులో పడిఉన్న వస్తువులపై చెల్లించిన ఎక్సైజు సుంకం ఏమవుతుంది అని. ఇక్కడ ప్రధానంగా 3 కేసులు ఉంటాయి:

  • కేస్ 1: అందుబాటులో ఎక్సైజ్ ఇన్వాయిస్ – తయారీదారులు, 1 వ దశ మరియు 2 వ దశ డీలర్ల నుండి కొనుగోలు చేసిన డీలర్లు ఎక్సైజ్ సుంకం పేర్కొనబడిన ఇన్వాయిస్ కలిగి ఉంటారు మరియు చెల్లించిన ఎక్సైజ్ యొక్క 100% క్రెడిట్ ను పొందగలుగుతారు.
  • కేస్ 2: అందుబాటులో క్రెడిట్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ – చిల్లరదుకాణదారులైన మరియు పైన పేర్కొన్న వారి నుండి కాక వేరే పార్టీల నుండి కొనుగోలు చేసిన డీలర్లు చెల్లించిన ఎక్సైజ్ మొత్తాన్ని పేర్కుంటూ ఇన్వాయిస్ కలిగి ఉండరు ఎందుకంటే అతని ద్వారా వ్యయంగా అదే భరించబడి ఉండవచ్చు కాబట్టి. అయితే, తయారీదారుచేత గనక అతనికి ఒక క్రెడిట్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ జారీ చేయబడి ఉన్నట్లయితే, ఇది ఎక్సైజు సుంకం చెల్లింపుకి రుజువుగా ఉపయోగపడుతుంది. తనిఖీచేయబడతగిన ఇన్వెంటరీ (సరుకుల జాబితా) మరియు సరఫరా గొలుసు రికార్డులు నిర్వహించబడి, తయారీదారు యొక్క బ్రాండ్ పేరును కలిగి ఉన్న, ఐఎన్ఆర్ 25,000 కంటే ఎక్కువ విలువ కలిగిన వస్తువుల కోసం అటువంటి పత్రం ఒక తయారీదారు ద్వారా జారీ చేయబడవచ్చు.
  • కేస్ 3: అందుబాటులో లేని ఎక్సైజ్ ఇన్వాయిస్ లేదా సిటిడి – అటువంటి దృష్టాంతంలో, ఇంతకుముందు బేషరతుగా మినహాయింపు ఇవ్వబడని స్టాకులపై ఆరు నెలల కాలం పాటు డీలర్ సిజిఎస్టి రేటు 9% లేదా అంతకంటే ఎక్కువ ఉన్న (అంటే జిఎస్టి రేటు 18% లేదా అంతకంటే ఎక్కువ) చోట జిఎస్టి కింద బయటికి సరఫరాల పై చెల్లించిన సిజిఎస్టి యొక్క 60% మరియు ఇతర సందర్భాల్లో జిఎస్టి కింద బయటికి సరఫరాల పై చెల్లించిన సిజిఎస్టి యొక్క 40% ను డీలర్ ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా పొందవచ్చు. రాష్ట్రాల మధ్య సరఫరాల విషయంలో, చెల్లించిన ఐజిఎస్టి పై అనుమతించబడే క్రెడిట్ వరుసగా 30% మరియు 20% ఉంటుంది.

ఈ దృష్టాంతాలతో నిమిత్తం లేకుండా, ఎక్సైజ్ సుంకం యొక్క క్రెడిట్ తీసుకోవటానికి అర్హత కలిగిన రిజిస్టర్ చేసుకోబడిన వ్యక్తులు అందరూ, తొంభై రోజుల వ్యవధిలోపల, డిక్లరేషన్ ను సాధారణ పోర్టల్లో తగువిధంగా సంతకం చేసిన ఫారం జిఎస్టి ట్రాన్ 1 లో ఎలక్ట్రానిక్ గా సమర్పించాలి.

5. రవాణాలో ఉన్న వస్తువుల పై క్రెడిట్

ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి జిఎస్టి తర్వాత అందుకోబడిన సరుకు/సేవలపై చెల్లించిన కేంద్ర/ రాష్ట్ర పన్నులు (ప్రస్తుత వ్యవస్థలో వర్తించే)రెండింటి యొక్క ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందవచ్చు. ఇక్కడ షరతు ఏమిటంటే, జిఎస్టి అమలు తేదీ నుండి 30 రోజుల లోపల ఖాతాల పుస్తకాలలో ఇన్వాయిస్ నమోదు చేయబడి ఉండాలి. అయితే, 30 రోజుల అసలు కాలము, తగినంత కారణాల ఆధారంగా, మరొక 30 రోజులకు పొడిగించబడవచ్చు. రిజిస్టర్ చేసుకున్న పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి తీసుకున్న క్రెడిట్ కు సంబంధించి ఒక ప్రకటనను లేదా సంబంధిత డాక్యుమెంట్లను సమకూర్చుతారు.
మనం జిఎస్టి శకాన్ని ఉత్సాహంతో స్వాగతించేందుకు చూస్తూండగా -మరిన్ని పాయింటర్ల కోసం ఈ స్థలాన్ని గమనిస్తూ ఉండండి!

టాలీ సొల్యూషన్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజస్ గోయెంకా వ్రాసిన ఈ వ్యాసం మొదట ది ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించబడింది

కంట్రిబ్యూటర్స్: పుగల్ టి మరియు ప్రమిత్ ప్రతీమ్ ఘోష్

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

52,239 total views, 1 views today