ఏ సంస్థ యొక్క ఆర్థిక నివేదికల కోసమైనా ఖాతాలు మరియు రికార్డులు అనేవి డేటా యొక్క ప్రధాన మూలంగా ఉంటాయి. మన దేశంలోని ప్రత్యక్ష మరియు పరోక్ష పన్ను యొక్క ప్రతి చట్టం కూడా సమాచారాన్ని నిర్ణీత పద్ధతిలో కూడబెట్టడం మరియు ఒక నిర్దిష్ట వ్యవధిపాటు నిల్వచేయడం తప్పనిసరి అని పేర్కొంటాయి. ప్రతి చట్టం కింద పన్ను చెల్లింపుదారుల దాఖలు చేసే రిటర్నులకి ఈ ఖాతాలు మరియు రికార్డులు ఆధారమవుతాయి.

ప్రస్తుత వ్యవస్థ

ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థలో, ప్రతి పన్ను చట్టం కూడా సాధారణ ఖాతా పుస్తకాలకు అదనంగా, ఒక నిర్దిష్ట వ్యవధిపాటు కొన్ని ప్రత్యేక ఖాతాలు మరియు లావాదేవీల రికార్డులు నిర్వహించడం తప్పనిసరి అని పేర్కొంటాయి.

ఎక్సైజ్ కింద, నిర్వహించవలసిన సాధారణ రికార్డులు ఏమిటంటే ఆర్జి-1 రిజిస్టర్ (ఎక్సైజ్ కిందికి వచ్చే వస్తువుల రోజువారీ స్టాక్ ఖాతా), ఫారం IV రిజిస్టర్ (ముడి పదార్థం యొక్క రసీదు లేదా జారీచేయడం రిజిస్టర్), ఇన్వాయిస్ పుస్తకం మరియు ఉద్యోగం పని రిజిస్టర్.

సర్వీస్ టాక్స్ కింద సూచించబడిన రికార్డుల్లో బిల్లు రిజిస్టర్, రసీదుల రిజిస్టర్, డెబిట్ / క్రెడిట్ నోట్స్ రిజిస్టర్, సెన్వాట్ (CENVAT) క్రెడిట్ రిజిస్టర్ మొదలైనవి ఉంటాయి.

వేట్ (VAT) కింద, నిర్వహించవలసిన రికార్డుల్లో కొనుగోలు రికార్డులు, అమ్మకాల రికార్డులు, స్టాక్ రికార్డులు, ఇన్పుట్ మరియు అవుట్పుట్ పన్ను వివరాలు కలిగిన వేట్ ఖాతా, పనుల కాంట్రాక్ట్ ఖాతా మొదలైనవి ఉంటాయి.

ఈ రికార్డులని అవి అమలు చేయబడిన ఆర్థిక సంవత్సరం చివరి నుండి కనీసం 5 సంవత్సరాలపాటు ఉంచడం అవసరం.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి కింద తయారీ, పన్ను విధించదగిన సేవ మరియు వస్తువుల విక్రయ సదుపాయం కార్యకలాపాలకు ఒక ఉమ్మడి చట్టం ఉంటుంది మరియు అందుకే, ఇదివరకు విడివిడిగా నిర్వహింపబడే దానిని ఇప్పుడు వ్యాపారాలు ఏకీకృత సమాచారంగా నిర్వహించవచ్చు.

జిఎస్టి కింద, ప్రతిఒక్క నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో పేర్కొన్న ప్రధాన వ్యాపార ప్రాంతం వద్ద కింది వివరాల యొక్క సరైన ఖాతాలు నిర్వహించవలసిన అవసరం ఉంటుంది: –

  1. వస్తువుల తయారీ
  2. వస్తువులు మరియు / లేదా సేవల యొక్క లోపలికి మరియు బయటికి సరఫరా
  3. వస్తువుల స్టాక్
  4. వినియోగించుకున్న ఇన్పుట్ పన్ను క్రెడిట్
  5. చెల్లించవలసిన మరియు చెల్లించిన అవుట్పుట్ పన్ను

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో ఒకటి కంటే ఎక్కువ స్థలం పేర్కొనబడితే, ప్రతి వ్యాపార స్థానానికి సంబంధించిన ఖాతాలను ఆయా ప్రదేశాల్లో తప్పక ఉంచాలి.

ఎలక్ట్రానిక్ రూపంలో పుస్తకాలను, రికార్డులను నిర్వహించడం అనేది జిఎస్టి క్రింద ఖచ్చితమైన మరియు సకాలంలో అనువర్తనం కోసం ఆదర్శప్రాయంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆర్ధిక సంవత్సరంలో వారి టర్నోవర్ రూ. 1 కోటి మించే వ్యక్తులు

పైన పేర్కొన్న ఖాతాలను నిర్వహించడంతో పాటు, ఆర్థిక సంవత్సరంలో తమ టర్నోవర్ రూ.1 కోటి మించే ఒక నమోదిత వ్యక్తి ఇవి చేయడం అవసరం,

  • ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ద్వారా ఖాతాలను ఆడిట్ చేయించుకోవడం మరియు
  • ఫారం GSTR-9 లో వార్షిక రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఫారం GSTR- 9 బి లో ఆడిట్ చెయ్యబడిన వార్షిక ఖాతాల యొక్క ఒక కాపీని మరియు ఒక సమన్వయ (రికన్సిలియేషన్) ప్రకటనని సమర్పించడం.

సమన్వయ ప్రకటనలో, వార్షిక రిటర్న్ లో వెల్లడించబడిన సరఫరాల విలువ ఆడిట్ చేయబడిన వార్షిక ఆర్థిక ప్రకటనతో సమన్వయం కుదురుతుంది అని చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ప్రమాణీకరించడం అవసరం.

ఒక గిడ్డంగి లేదా గోడౌన్ నడుపుతున్న వ్యక్తులు

ఒక గిడ్డంగి లేదా గోడౌన్ లేదా సరుకులను నిల్వ చేయడానికి ఉపయోగించే ఏదైనా ఇతర స్థల యజమాని లేదా నడిపే వ్యక్తి, వారు నమోదు చేయబడ్డారా లేదా అనే దానితో ప్రమేయం లేకుండా, సరుకు రవాణాదారు, సరుకు రవాణా చేయబడినవారు మరియు చట్టంలో ఇంకా సూచించబడవలసి ఉన్న ఇతర వివరాల రికార్డులను నిర్వహించవలసిన అవసరం ఉంటుంది .

ఖాతాలు మరియు రికార్డులను ఎంతకాలం నిర్వహించాలి?

ప్రతి నమోదుచేయబడిన వ్యక్తి ఖాతాలు మరియు రికార్డులు సంబంధించే సంవత్సరం కోసం వార్షిక ఆదాయం రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి 5 సంవత్సరాలపాటు ఖాతాలు మరియు రికార్డులను నిర్వహించుకోవలసిన అవసరం ఉంటుంది.

ఉదాహరణకు:ఆర్ధిక సంవత్సరం ’17 -18 కు సంబంధించిన ఖాతాలు మరియు రికార్డుల కోసం, 31 డిసెంబర్ ’18 నాటికి వార్షిక రిటర్న్ తప్పక దాఖలు చేయాలి. ఈ ఖాతాలు మరియు రికార్డులు 31 డిసెంబర్, 23 వరకు తప్పక అట్టిపెట్టాలి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

144,746 total views, 148 views today