(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

మన ఆర్థిక మంత్రి, శ్రీ అరుణ్ జైట్లీ, తన బడ్జెట్ ప్రసంగంలో, జీఎస్టీ రోడ్ మ్యాప్ ని విస్తారంగా చర్చించలేదు. అయితే, జిఎస్టి కోసం రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించబడటం మరియు దాని అమలు యొక్క పురోగమనం అనేవి ఒక “టెక్టానిక్ పాలసీ ఇనిషియేటివ్” (నిర్మాణ సంబందిత విధాన కార్యక్రమం) అని వారు సూచించారు.

జీఎస్టీ ప్రయోజనాలని గురించి సభకు సంక్షిప్తంగా తెలియపరుస్తూ, వారు, “అభివృధ్ధిని పరుగుతీయించేందుకు, పోటీతత్వం, పరోక్ష పన్ను సూక్ష్మీకరణ మరియు మరింత పారదర్శకత పరంగా మన ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ యొక్క ప్రయోజనాలు ఇప్పటికే విస్తృతంగా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించాము. ఏకగ్రీవంగా రాజ్యాంగ సవరణను ఆమోదించినందుకు ఉభయ సభల సభ్యులందరికీ ధన్యవాదాలు,” తెలిపారు. జిఎస్టి కౌన్సిల్ లోని అన్ని సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో వారు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. జిఎస్టి ప్రవేశపెట్టడానికి అన్ని ముఖ్య అవరోధాలు జిఎస్టి కౌన్సిల్ నుండి తొలగించబడినట్లుగా ఇది ఆర్ధిక మంత్రి నుండి ఒక స్పష్టమైన సూచన.

జిఎస్టి రేటు నిర్మాణం యొక్క స్థూల హద్దులు, ప్రవేశ మినహాయింపు మరియు కూర్పు పథకం కోసం పారామితులు, జిఎస్టి అమలు కారణంగా రాష్ట్రాలకు పరిహారం కోసం వివరాలు, డ్రాఫ్ట్ మోడల్ జిఎస్టి చట్టం, డ్రాఫ్ట్ ఐజిఎస్టి చట్టం మరియు జిఎస్టి కోసం పరిహారం చట్టం మరియు జిఎస్టి కోసం పరిపాలనా యంత్రాంగంతో సహా జిఎస్టికి సంబంధించిన వివిధ సమస్యలని చర్చించేందుకు జిఎస్టి కౌన్సిల్ 9 సమావేశాలను నిర్వహించిందని ఆర్ధిక మంత్రి తెలుపారు. వారు ఇంకా ఏకాభిప్రాయం ఆధారంగా దాదాపుగా అన్ని సమస్యలపై జిఎస్టి కౌన్సిల్ వారి సిఫార్సులను ఖరారు చేసినట్లుగా కూడా వారు తెలిపారు.

కొత్త చట్టం యొక్క సన్నధ్ధతకు సంబంధించి, రాష్ట్రాల మరియు కేంద్ర ఎక్సైజ్ మరియు కస్టమ్స్ బోర్డు రెండింటి నుంచి పలు అధికారుల బృందాలు మోడల్ జిఎస్టి చట్టం మరియు నియమాలు మరియు ఇతర వివరాలకు తుదిమెరుగులు ఇవ్వడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు అని మన ఆర్ధిక మంత్రి చెప్పారు. నూతన పన్ను వ్యవస్థని గురించి వారికి తెలియపరిచేందుకు జిఎస్టి కోసం వర్తకం మరియు పరిశ్రమ కోసం విస్తృతంగా చాచిఅందుకునే ప్రయత్నాలు 1 ఏప్రిల్, 2017 నుంచి ప్రారంభమౌతాయని వారు సూచించారు. జిఎస్టి కోసం జిఎస్టిఎన్ యొక్క (జీఎస్టీ యొక్క ఐటి విభాగం) ఐటి వ్యవస్థల తయారీ కూడా షెడ్యూల్ ప్రకారంగా నడుస్తోందని వారు ధ్రువీకరించారు.

అమలు తేదీ గురించి, కేంద్ర ఎక్సైజ్ మరియు కస్టమ్స్ బోర్డు ద్వారా, షెడ్యూల్ ప్రకారం జీఎస్టీ అమలు లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం ప్రయత్నించడం కొనసాగిస్తుందని మంత్రి చెప్పారు. గౌరవ మంత్రివర్యులు అమలు తేదీ బయటకి చెప్పకపోయినప్పటికీ, జూలై 1 న జిఎస్టి అమలు చేయబడుతుందని భారత ప్రభుత్వపు ఆర్ధిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ కార్యదర్శి, శ్రీ హస్ముఖ్ అధియా ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ కు ధృవీకరించారు. ఆర్థిక సంవత్సరం 2017-18 కోసం ఆదాయం లెక్కించే సమయంలో ప్రభుత్వం 8.8% పరోక్ష పన్ను పెరుగుదలకు నిలిపిందని కూడా వారు తెలియచేసారు.

ఆర్థిక మంత్రి ప్రసంగం యొక్క ముఖ్యాంశం ఏమిటంటే వారు 2017-18 ద్రవ్య లోటుని జిడిపిలో 3.2% వద్ద నిలిపి ఉంచారు మరియు తదుపరి సంవత్సరంలో 3% సాధించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ క్రమవారీ విధానంతో, ఆర్థిక స్థిరీకరణ రోడ్ మ్యాప్ లో ఎఫ్ఆర్బిఎం నివేదిక సిఫారసు ప్రకారంగా ద్రవ్య పటిష్టతకు కట్టుబడి ఉండటాన్ని వారు ధృవీకరించారు. ఈ రోడ్ మ్యాప్ సాధించాలి అంటే, అప్పుడు లక్ష్యంగా ఉన్న రాబడిని సాధించడం అనేది తప్పనిసరి, మరియు ఆర్థిక లక్ష్యం రాబడిని సాధించడం (జిఎస్టి ఆధారంగా లక్ష్యంగా ఉన్న పరోక్ష పన్ను రాబడిని సాధించడానికి) అనేది సాధ్యమైనంత త్వరలో జిఎస్టి అమలు ద్వారా మాత్రమే సాధ్యం కావచ్చు. ఆర్ధిక క్రమశిక్షణ నెలకొల్పేందుకు మరియు సకాలంలో జిఎస్టి అమలు చేయడం గురించి ప్రభుత్వం ఉత్సాహపూరితంగా ఉన్నదని మేము భావిస్తున్నాము.

మరొకవైపు, అమలు చేసిన మొదటి సంవత్సరంలో 8.8% పరోక్ష పన్ను ఆదాయ వృద్ధిని, అది కూడా 9 నెలల్లో సాధించడం అనేది ప్రభుత్వానికి ఏమీ అంత సులభమైన విషయం కాదని కూడా మనం అంచనా వేయవచ్చు. ప్రభుత్వం జిఎస్టిని సకాలంలో మత్రమే కాక, మంచి ఉత్సాహం మరియు వ్యాపారాల నుండి అధిక నిబద్ధతతో అమలు చేస్తుందని మేము ఇక్కడ భావిస్తున్నాము.

దీనంతటితో, 1 జూలై 2017 నాటి నుండి జిఎస్టి అమలు చేయడం పై ప్రభుత్వం పట్టుదలతో ఉన్నదని వారి నుండి తగినంత మరియు అంతకు మించిన సూచనలు ఉన్నాయి. బడ్జెట్ ప్రసంగంలో తాను ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ యొక్క ప్రస్తుత విధానంలో గొప్పగా మార్పులు చేయడానికి ఇష్టపడటం లేదని ఎందుకంటే అవి త్వరలోనే జిఎస్టి ద్వారా భర్తీ చేయబడవలసి ఉన్నాయనే శ్రీ జైట్లీగారి వ్యాఖ్య కేక్ మీద ఐసింగ్ లాగా ఉంది.

అందుకే, జిఎస్టి పరివర్తన ఒక్క రాత్రిలో జరిగే వ్యవహారం కాదు కాబట్టి, జిఎస్టి సంసిద్ధత కోసం వ్యాపారాలు సంసిధ్ధమయ్యేందుకు ఇది సమయం.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

74,312 total views, 177 views today