ఇన్వాయిస్ మ్యాచింగ్ (సరిపోల్చడం) అనేది జిఎస్టి వ్యవస్థ యొక్క ప్రత్యేకమైన మరియు అతి కీలకమైన ఆవశ్యకత. అందువల్ల జిఎస్టి వ్యవస్థ కింద జిఎస్టి బిల్ నంబరింగ్ ని ఎలా నిర్వహించాలా అని వ్యాపారాలు ఆందోళన చెందడాన్ని మనం అర్ధంచేసుకోవచ్చు.

బిల్లు నంబరింగ్ గురించి చట్టం ఏమి చెబుతుంది?

ఒక జిఎస్టి సాఫ్ట్వేర్లో కొన్ని దృష్టాంతాలని ఎలా నిర్వహించాలనే దాని గురించిన వివరాల్లోకి మనం వెళ్ళే ముందు, వ్యాపారాల నుండి చట్టం ఏమి కోరుతుందో మనం క్లుప్తంగా చర్చిద్దాం.

మీ పత్రాల కోసం వరుస క్రమవారీగా నంబరింగ్ చేయడం మరియు ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన సంఖ్యలనే మళ్ళీ మళ్ళీ ఉపయోగించకుండా ఉండటం చట్టానికి అవసరం. ఈ నియమాలు అమ్మకాల ఇన్వాయిస్, క్రెడిట్ నోట్స్ మరియు డెబిట్ నోట్స్ వంటి అన్ని పత్రాలకు వర్తిస్తాయి.

అయితే, వేర్వేరు స్వభావం గల బిల్లుకు వేర్వేరు పుస్తక వరుసక్రమ నెంబర్ కలిగి ఉండటానికి లేదా రాష్ట్రంలోని వివిధ శాఖల బిల్లు ఒకే జిఎస్టిఐఎన్ నంబర్లను కలిగి ఉండటానికి చట్టం మిమ్మల్ని అనుమతిస్తోంది.
ఉదాహరణకు, బి2బి ఇన్వాయిస్లు, బి2సి ఇన్వాయిస్లు, రివర్స్ ఛార్జ్ కోసం ఇన్వాయిస్లు మొదలైనవాటి కోసం మీరు వేర్వేరు పుస్తక వరుస క్రమసంఖ్యను కలిగి ఉండవచ్చు.

మరోవైపు, అదే జిఎస్టిఐఎన్ కలిగి ఉన్న ముంబైలోని ఒక ప్రధాన కార్యాలయం మరియు పూణెలోని ఒక శాఖ వారి డేటాను కేంద్రీకృతంగా వ్యవహరించుకోవడానికి లేదా దానిని వికేంద్రీకృతం చేసేందుకు ఎంచుకోవచ్చు. అటువంటి దృష్టాంతంలో, వారు బిల్లులని సులభంగా గుర్తించగలిగే విధంగా వారి బిల్లు కోసం వివిధ వరుస క్రమసంఖ్యలను వారు నిర్వహించాలి. ఉదా. ముంబైలో బిల్లులు ముం/ 001 / 17-18 వరుసక్రమాన్ని మరియు పుణెలో వరుస క్రమసంఖ్య పూణ్/ 001 / 17-18 అయి ఉండవచ్చు

పై పరిస్థితులను నిర్వహించడానికి, టాలీ. ఇఆర్పి 9 వినియోగదారులకు భిన్న స్వభావపు బిల్లులు మరియు బ్రాంచి బిల్లింగ్ కోసం భిన్న వౌచర్ రకాలను సృష్టించడానికి ఒక వికల్పం ఉంటుంది. అలాగే, మీరు బిల్లులను సులభంగా గుర్తించడానికి ప్రిఫిక్స్ (ముందు జోడించే పదం) మరియు సఫిక్స్ (వెనక జోడించే పదం) వివరాలను నమోదు చేయడాన్ని ఎంచుకోవచ్చు.
గురించి మరింత తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. కొత్త వౌచర్ రకాన్ని సృష్టించడం .

గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
GST బిల్ నంబరింగ్ ఏర్పాటు
.

జులై 1 తర్వాత మీ జిఎస్టి ఇన్వాయిసుల కోసం మీరు తాజా నంబరింగ్ మొదలుపెట్టవలసి ఉంటుందా?

చట్టానికి ఇది తప్పనిసరి కాదు. అందువలన, మీరు నంబరింగ్ వరుసక్రమంలో ఉండి మరియు అదే ఆర్ధిక సంవత్సరంలో మళ్ళీ మళ్ళీ వచ్చేది కాకుండా ఉన్నంతవరకు ఏ నంబర్ నుండి అయినా నంబరింగ్ ప్రారంభించే స్వేఛ్ఛ మీకు ఉంటుంది.

టాలీ యొక్క జిఎస్టి-రెడీ సాఫ్ట్వేర్ అనువైనది మరియు మీరు ఇప్పటికే ఉన్న నంబరింగ్ తో కొనసాగించాలా లేక జూలై 1 నుండి తాజా నంబరింగ్ ప్రారంభించాలా అనేది ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
అయితే, గమనించదగ్గ ముఖ్య విషయం ఏమిటంటే ఈ సంఖ్య క్రమవరుసలో ఉండాలి. అందువలన, మీరు తొలగింపు మరియు చొప్పించడం మానుకోవాలి.
బిల్లులను తొలగించే బదులు, మీరు బిల్లును రద్దు చేసి, అదే లేదా సవరించిన బిల్లు సంఖ్యతో కొత్త బిల్లును జారీ చేయడాన్ని ఎంచుకోవచ్చు. జిఎస్టి రిటర్నులను ఫైల్ చేస్తున్నప్పుడు రద్దు చేసిన బిల్లులను నివేదించడం అవసరం.

బిల్లులు తొలగించబడినా లేదా జొప్పించబడినా ఏమవుతుంది?

బిల్లులను తొలగించినప్పుడు మీరు ఎదుర్కొనే సవాళ్లను మరియు మీరు సమర్పించిన రిటర్నులతో మీ పుస్తకాలు సరిపోలతాయని నిర్ధారించడానికి మీరు చేయవలసిన విషయాలు మనం అర్థం చేసుకుందాం:

  1. 1. మీరు ఇన్వాయిస్ సంఖ్య 234ను సృష్టించారని మరియు జిఎస్టిఎన్ కు అప్లోడ్ చేసారని భావించుకుందాం. సంతకం చేయడం మరియు ఫైల్ చేయడం ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఇప్పుడు మీరు దానిని మీ పుస్తకాల నుండి తొలగించాలని నిర్ణయించుకుంటే, అప్పుడు మీరు జిఎస్టిఎన్ పోర్టల్ నుండి కూడా అదేదాని తొలగింపును నిర్ధారించుకోవాలి. అదే సమయంలో, మీరు మిగిలిన బిల్లుల కోసం వౌచర్ నంబరింగ్ మారదని నిర్ధారించుకోవలసి ఉంటుంది..
  2. 2.మీరు ఒక ఇన్వాయిస్ తయారుచేసారు, జిఎస్టిఎన్ కు అప్లోడ్ చేసి రిటర్న్ ను సంతకం చేసారు. అయితే, కొనుగోలుదారు ఇన్వాయిస్ ను అంగీకరించలేదు. తరువాత, మీరు ఈ ఇన్వాయిస్ ని పుస్తకాలలో తొలగించారు. అటువంటి సందర్భంలో, మునుపటి నెలలో అప్లోడ్ చేయబడిన ఇన్వాయిస్ విలువ యొక్క సవరణను చూపించే సున్నా విలువ ఇన్వాయిస్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  3. 3.మీరు ఒక ఇన్వాయిస్ తయారుచేసారు, జిఎస్టిఎన్ కు అప్లోడ్ చేసి రిటర్న్ ను సంతకం చేసారు. మీ కొనుగోలుదారు ఇన్వాయిస్ ను అంగీకరించారు. ఇటువంటి బిల్లులను పుస్తకాలలో తొలగించవద్దు. మీరు ప్రభావాన్ని రద్దు చేయడానికి పూర్తి విలువ కోసం క్రెడిట్ నోట్ జారీ చేయవలసి ఉంటుంది.
  4. 4.మీరు వరుసక్రమంలో లేదా వరుస సంఖ్యలను నిర్వహించాల్సిన అవసరం ఉన్నందున, మేము బిల్లులను చొప్పించడాన్ని సిఫార్సు చేయము. మీరు ఒక వరుసక్రమం మధ్య బిల్లును చొప్పించినట్లయితే, మీరు విభాగానికి నివేదించిన దానితో అది సరిపోలదు. ఉదాహరణకు, మీరు ఇన్వాయిస్ నెం.3 మరియు ఇన్వాయిస్ నంబర్ 4 మధ్య ఇన్వాయిస్ నం. 3ఎ ను చేర్చినట్లయితే, సమర్పించిన బిల్లుల సంఖ్యను ఇది పెంచుతుంది.
   .

గమనికలు:

కౌంటర్ పార్టీ జిఎస్టిఐఎన్, ఇన్వాయిస్ నంబర్ మరియు ఇన్వాయిస్ తేదీ ఆధారంగా ఇన్వాయిస్లు సరిపోల్చబడతాయి.
పన్ను ఇన్వాయిస్లు, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ మొదలైనవి సెంట్రల్ జిఎస్టి యాక్ట్ యొక్క విభాగం 31లో నిర్వచించబడ్డాయి మరియు ఇన్వాయిస్లను పాలించే నియమాలు సిబిఇసి వెబ్సైట్

టాలీ యొక్క జిఎస్టి సాఫ్ట్వేర్, టాలీ. ఇఆర్పి 9 రిలీజ్ 6 ఈ సామర్థ్యాలను అన్నింటినీ నిర్వహించడానికి రూపొందించబడింది. మా జిఎస్టి-సంసిధ్ధతగల సాఫ్ట్వేర్ అనుభవం పొందటానికి www.tallysolutions.com/downloads సందర్శించండి. మీ అభిప్రాయం మాకు ముఖ్యం. ఈ బ్లాగ్ పై మీ వ్యాఖ్యలను పోస్ట్ చేయండి.

టాలీ యొక్క జిఎస్టి-సంసిధ్ధతగల సాఫ్ట్వేర్ కొనుగోలు లేదా అప్గ్రేడ్ కోసం, ఇక్కడ .

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

211,298 total views, 190 views today

Avatar

Author: Shailesh Bhatt