మన దేశం ఒకే ఏకీకృత పరోక్ష పన్ను వ్యవస్థ అయిన జిఎస్టి దాపుల్లోకి వచ్చింది. పరోక్ష పన్నుల వ్యవస్థలో ఇది అతిపెద్ద పన్నుల సంస్కరణ మరియు అది అనేక పరోక్ష పన్నులను లోపలికి శోషించుకుంటుంది. హోస్ట్ పరిగణలోకి తీసుకుంటోంది. సరఫరా గొలుసు అంతటా (అది తయారీ నుంచి వినియోగదారుడిని చేరు వరకు) మరియు రాష్ట్ర సరిహద్దుల వ్యాప్తంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ యొక్క అతుకులు లేని ప్రవాహ భావనను జిఎస్టి ప్రవేశ పెడుతుంది. రెండవది, సరఫరా అనేది జిఎస్టి కింద పన్ను పరిధిలోకి వచ్చే సంఘటన కావడంతో, తయారీ, వాణిజ్యం మరియు సేవల సదుపాయమనే భావన అసంబద్ధమైనవిగా అయిపోతాయి.
సరఫరా అనే పదంలో బదిలీలు ఇమిడి ఉంటాయి. పరిగణ లేకుండా కొన్ని నిర్దిష్ట సరఫరాల యొక్క పన్ను పరిధిలోకి రాగల అర్హత అనేది జిఎస్టి కింద స్టాక్ బదిలీ పన్ను పరిధిలోకి వచ్చేది అని సూచిస్తుంది. ఈ అంతర్భావాన్ని అర్ధం చేసుకోవడం వ్యాపారాలకు తప్పనిసరి. వ్యాపారాల కోసం స్టాక్ బదిలీలపై జీఎస్టీ ప్రభావాన్ని ఇక్కడ మేము మీ కోసం తీసుకు వస్తున్నాం.

స్టాక్ బదిలీల యొక్క పన్ను పరిధిలోకి రాగల అర్హత

సెంట్రల్ ఎక్సైజ్ కింద, భంగి వస్తువుల ఒక స్టాక్ బదిలీ చేస్తున్న ఒక నమోదిత తయారీదారు 100% + ఉత్పాదన ఖర్చు యొక్క 10 % ఎక్సైజ్ డ్యూటీగా చెల్లించాలి మరియు వాట్ క్రింద, ఫారం ఎఫ్ సమర్పించిన మీదట, స్టాక్ బదిలీలు పన్ను పరిధిలోకి రాజాలవు. అయితే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉండే కొంత శాతం వద్ద, వస్తువుల కొనుగోలుపై ఇన్పుట్ వేట్ వెనక్కు మళ్ళించవలసి ఉంటుంది.

Branch Stock Transfer under VAT and Excise
జిఎస్టి కింద పన్ను విధింపు అనబడేది సరఫరా పై ఉంటుంది, ఇందులో బదిలీలు ఇమిడి ఉంటాయి, మరియు విశిష్ట వ్యక్తి నిర్వచనంతో, శాఖలని వేరే పరిధిగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. దీని ప్రకారంగా, క్రింది రెండు సందర్భాలలో ఏ స్టాక్ బదిలీలైనా పన్ను పరిధిలోకి వస్తాయి:

• రాష్ట్రం లోపల సరుకు బదిలీ: ఒక రాష్ట్రంలోఒక పరిధికి ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పుడు మాత్రమే.
• రాష్ట్రం నుంచి రాష్ట్రానికి సరుకు బదిలీ: వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెండు పరిధుల మధ్య బదిలీ పన్ను పరిధిలోకి వస్తుంది.

Branch stock transfers under GST
జిఎస్టి కింద స్టాక్ బదిలీల పన్ను పరిధిలొకి రాగల అర్హత అనేది నగదు ప్రవాహం పై ప్రభావం కలిగి ఉంటుంది. ఇది ఎందుకంటే, పన్ను స్టాక్ బదిలీ తేదీన చెల్లించబడుతుంది, మరియు స్వీకరించే శాఖ ద్వారా స్టాక్ అమ్మివేయబడినప్పుడు ఐటిసి బాగా సమర్ధవంతంగా ఉపయోగించబడుతుంది కాబట్టి. అందుకే, జిఎస్టి కింద, ముఖ్యంగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ వస్తువుల విషయంలో, స్టాక్ బదిలీలలో నిమగ్నమై ఉన్న వ్యాపారాలకు పన్ను సందర్భాల కారణంగా అదనపు కార్యాచరణ మూలధనం (వర్కింగ్ క్యాపిటల్) అవసరం అవుతుంది. అల్పమైన కార్యాచరణ మూలధనంతో పని నడిపే ఎస్ఎంఇలకు ఇది ఒక సవాలుగా ఉంటుంది.

ఏడాది పొడవునా ఉత్పత్తి జరిగే కానీ ఒక నిర్దిష్ట సీజన్లో మాత్రమే అమ్మకం జరిగే ఒక సీజనల్ వ్యాపారం పరిగణించండి. అటువంటి సందర్భాల్లో, సుదీర్ఘ కాలం పాటు నిధులు అవరోధించబడి ఉండవచ్చు. ఇది ఎందుకంటే, శాఖ బదిలీలు జరిగిన నెలలో జిఎస్టి చెల్లించవలసి ఉంటుంది, కానీ, అమ్మకం జరిగిన నెలలో క్రెడిట్ సమర్థవంతంగా వినియోగించుకోబడుతుంది కాబట్టి.

GST needs to be paid in the month in which branch transfers are doneClick To Tweet

ఇన్పుట్ క్రెడిట్ పై ప్రభావం

బదిలీ చేయబడే తయారైన వస్తువుల తయారీలో ఉపయోగించబడే వస్తువులు లేదా పదార్థాలపై ఇన్పుట్ వేట్, తగ్గించబడిన ధరకు అందుబాటులో ఉంటుంది. వెనక్కు మళ్ళింపు (రివర్సల్) రేటు రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటూ ఉంటుంది. సాధారణంగా, ఇన్పుట్ వాట్ క్రెడిట్ కొనుగోలు పై చెల్లించబడిన 4% పన్నుకు అధికంగా అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు, కొనుగోలు పై చెల్లించబడిన వేట్ గనక 12.5% ఉంటే, అప్పుడు 4% యొక్క అధికం అనగా 8.5% ఇన్పుట్ వేట్ క్రెడిట్ గా అనుమతించబడుతుంది మరియు 4% వెనక్కు మళ్ళించబడుతుంది. వెనక్కు మళ్ళించబడిన ఐటిసి ఉత్పత్తి ధరగా జోడించబడి దొంతరపడుతూ పోయే ప్రభావంగా ఫలిస్తుంది.

వాట్
కొనుగోలు ధర (10 పరిమాణం @రూ.10,000/సంఖ్యలు)1,00,000
వేట్@ 14.5%14,500
మొత్తం 1,14,500
స్టాక్ బదిలీ (10 సంఖ్య)
వాట్ (మినహాయించబడిన)
ఐటిసి అర్హత
వాట్ చెల్లింపు @14.5%14,500
4% కు అధికం పై అర్హతగల ఐటిసి అనగా. 10.5% (14.5% మైనస్ 4%)10,500
వెనక్కు మళ్ళించబడిన ఐటిసి @ 4%4,000
రూ 4,000 ఉత్పత్తి ధరగా జోడించబడుతుంది

అయితే, జిఎస్టి కింద, స్టాక్ బదిలీపై చెల్లించిన పన్ను మాత్రం పూర్తిగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అందుబాటులో ఉంటుంది. అందువలన, ఇది దొంతరపడుతూ పోయే ప్రభావం తొలగిస్తుంది మరియు దాని ఫలితంగా, ఉత్పత్తి తక్కువ ధర కలిగినది అవుతుంది.

జిఎస్టి
కొనుగోలు ధర (10 పరిమాణం@10,000/సంఖ్యలు)1,00,000
సిజిఎస్టి@ 9%9,000
ఎస్జిఎస్టి@ 9%9,000
మొత్తం 1,18,000
స్టాక్ బదిలీ (10 పరిమాణం)
సిజిఎస్టి@ 9% *9,000
సిజిఎస్టి@ 9% *9,000
ఐటిసి అర్హత
సిజిఎస్టి@ 9%9,000
ఎస్జిఎస్టి@ 9%9,000
ఐటిసి గా పూర్తిగా 18,000 అందుబాటులో ఉంటుంది

*జీఎస్టీ రేటు 18% వద్ద పరిగణించబడుతుంది. ఇలస్ట్రేషన్ ప్రయోజనం కోసం, కొనుగోలు ధర రూ 1 00.000 ని స్టాక్ బదిలీ విలువగా పరిగణించి తదనుగుణంగా జిఎస్టి లెక్కించబడుతుంది.

Under GST, tax paid on stock transfer will be fully available as input tax creditClick To Tweet

No declaration forms = faster processing of stock transfers

Under VAT, in order to get tax exemption on stock transfers, the receiving branch has to issue Form F to the source branch which sends the goods. This has to be produced to the assessing authority to prove that the goods are sent to another branch and not for sale.

With GST, all the declaration forms will be abolished. As a result, there will be no need to furnish any forms for stock transfers. This will ease the process of stock transfers by eliminating the time and effort involved in such activities.

With GST, all the declaration forms will be abolished. As a result, there will be no need to furnish any forms for stock transfers.Click To Tweet

డిక్లరేషర్ ఫారంలు ఏమీ లేవు =స్టాక్ బదిలీలు మరింత వేగంగా ప్రాసెసింగ్

వ్యాట్ కింద, స్టాక్ బదిలీలపై పన్ను మినహాయింపు పొందడానికి, స్వీకరించే శాఖ వస్తువులను పంపే మూల శాఖకు ఫారం ఎఫ్ జారీ చేయాలి. వస్తువులు మరొక శాఖకు పంపబడ్డాయని మరియు అమ్మకం కోసం కాదు అని నిరూపించడానికి అంచనా వేసే అధికారులకు దీనిని సమర్పించవలసి ఉంటుంది.

జిఎస్టి తో, అన్ని డిక్లరేషన్ ఫారంలు రద్దు చేయబడతాయి. దీని ఫలితంగా, స్టాక్ బదిలీల కోసం ఏ ఫారంలను సమర్పించవలసిన అవసరం ఉండదు. అలాంటి కార్యకలాపాలకి పట్టే సమయం మరియు కృషి తొలగించడం ద్వారా ఇది స్టాక్ బదిలీల ప్రక్రియని సులభతరం చేస్తుంది.

స్టాక్ బదిలీలపై పన్ను నిర్ధారణ

సాధారణంగా, స్టాక్ బదిలీలు అనేవి మరో యూనిట్ లేదా శాఖకు వస్తువుల తరలింపు. ఏ పరిగణ లేకుండా ఇవి నిర్వహించబడతాయి. కానీ పన్ను డిశ్చార్జి చేయవలసిన దాని విలువను నిర్ణయించటంలో సంక్లిష్టత తలెత్తుతుంది. సెంట్రల్ ఎక్సైజ్ కింద, 100% + 10 వస్తువుల తయారీ ఖర్చు పై ఎక్సైజ్ సుంకం చెల్లించవలసి ఉంటుంది మరియు వ్యాట్ కింద స్టాక్ బదిలీలు విధింపు నుండి మినహాయించబడి ఉంటాయి.
జిఎస్టిలో, లావాదేవీ విలువ అనేది విస్తారంగా జిఎస్టి విధించబడే విలువగా పరిగణిస్తారు. స్టాక్ బదిలీల విషయంలో, పరిగణ ఏదీ లేకుండా బదిలీలు చేయబడతాయి కాబట్టి లావాదేవీ విలువ వర్తింపజేయడం సాధ్యం కాదు. సంక్లిష్టత అనేది ఇప్పటికీ జిఎస్టి వ్యవస్థలో మిగిలే ఉంటుంది. పన్ను అనేది సంభావ్యంగా ఒకే రకం మరియు నాణ్యత కలిగిఉన్న వస్తువులకు సమానంగా, లేదా ఉత్పత్తి ఖర్చు ప్లస్ లాభం పరిగణించే అటువంటి పద్దతితో విలువ కట్టబడుతుంది.
జిఎస్టి చట్టాలు మరియు నియమాలు ఖరారు చేయబడినప్పుడు దీనిపై స్పష్టత విశిదమవుతుంది.

శాఖల ఆవశ్యకత పరిశీలన

నేడు, పన్ను ప్రయోజనాలను అత్యంత ఎక్కువ వినియోగించుకునే క్రమంలో, పూర్తిగా చట్టబద్ధమైన అవసరాల నిమిత్తం అనేక వ్యాపారాలు శాఖలను ఏర్పాటు చేసాయి. కొనుగోలుదారుడు క్రెడిట్ పొందేందుకు వీలు కల్పించే స్థానిక వ్యాట్ తో బిల్లింగ్ చేయడానికి వ్యాపారానికి వీలు కల్పించేందుకోసమే ఇది. అలాగే, స్టాక్ బదిలీలు పన్ను పరిధిలోకి రావు కాబట్టి, శాఖలకు బదిలీల పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
జిఎస్టిలో రాష్ట్ర సరిహద్దుల వ్యాప్తంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ యొక్క అతుకుల రహిత ప్రవాహంతో, రాష్ట్రాల వ్యాప్తంగా బహుళ శాఖలు తెరవవలసిన అవసరం ఇక వ్యాపారాలకు ఎంతమాత్రమూ ఉండదు. కేవలం వ్యాపార కార్యకలాపాల దృష్టికోణం నుంచి మాత్రమే వారు శాఖలను పునఃవీక్షించుకోవలసి ఉండవచ్చు. శాఖలను సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోవడం అనేది శాఖల సంఖ్యను క్రిందికి తీసుకురావచ్చు, మరియు తదనంతరం శాఖల బదిలీ పరిమాణాన్ని కూడా తగ్గించవచ్చు.
శాఖాంతర బదిలీ యొక్క ప్రభావాన్ని అర్ధం చేసుకోవడం
డిమాండ్ మరియు సమృద్ధిగా జాబితా లభ్యత కారణంగా, ఒక శాఖ శాఖాంతర బదిలీలను చేపట్టవచ్చు, అంటే, వివిధ శాఖలు నుండి వస్తువులు అనేకసార్లు బదిలీ చేయబడవచ్చు. ఉదాహరణకు, చెన్నైలోని వారి శాఖ కార్యాలయానికి ప్రధాన కార్యాలయం బదిలీ చేస్తుంది. ఈ వస్తువులు మళ్ళీ చెన్నై నుండి బెంగుళూర్ కు బదిలీ చేయబడతాయి. నేడు, ఈ బదిలీలు పన్ను రహితమైనవి. జిఎస్టి కింద, ఇది ఒక ఖరీదైన వ్యవహారంగా నిరూపితమవుతుంది. ఇది ఎందుకంటే ప్రతి బదిలీ పై, జిఎస్టి చెల్లించవలసి ఉంటుంది మరియు ప్రతి శాఖ వద్ద నగదు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. దీనిని నివారించాలి మరియు ప్రాథమిక గిడ్డంగి లేదా శాఖ నుండి నేరుగా వస్తువులను బదిలీ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
అయితే, అత్యధిక డిమాండ్ ఉన్న శాఖకి సరుకుని బదిలీ చేయడం ద్వారా వ్యాపారాలు దీని అత్యంత ప్రయోజనం పొందవచ్చు. ఈ విధంగా సరుకు త్వరగా అమ్మకమై పోతుంది మరియు వ్యాపారం యొక్క కార్యాచరణ మూలధనం పై తక్కువ ప్రభావం ఉంటుంది.

Under GST, it is better to avoid cross branch transfers as tax needs to paid on each transferClick To Tweet

ముగింపు
జిఎస్టి కింద స్టాక్ బదిలీలు పన్ను పరిధిలోకి వచ్చినప్పటికీ, పన్ను పూర్తిగా క్రెడిట్ గా అనుమతించబడుతుంది. ప్రస్తుత వ్యవస్థ కింద ఉనికిలో ఉన్న దొంతరపడుతూపోయే ప్రభావాన్ని ఇది నిర్మూలిస్తుంది, మరి దీని ఫలితంగా ఉత్పత్తులు మరింత చవకగా ఉంటాయి. ఇది కార్యాచరణ మూలధనంలో ఒక కొరతని తప్పక సృష్టించనున్నప్పటికీ, శాఖలను సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోవడం మరియు శాఖాంతర బదిలీల ప్రయోజనాలను సాధ్యమైనంతగా వినియోగించుకోవడం అనేవి కార్యాచరణ మూలధనంపై ప్రభావాన్ని తగ్గించవచ్చు.
టాలీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన తేజస్ గోయింకా ద్వారా రచింపబడిన ఈ వ్యాసం అసలు ‘ద ఇకొనమిక్ టైమ్స్’ లో ప్రచురించబడినది.
సమర్పణ: పూగల్ టి మరియు యారబ్ ఎ

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

95,229 total views, 5 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.