కొన్ని వ్యాపారాలు వాటికి వారు స్థిర వ్యాపార స్థానం ఉండని భూభాగాలలో అప్పుడప్పుడు లావాదేవీలు నిర్వహించే విధంగా పనిచేస్తూ ఉంటాయి. జిఎస్టి , కింద, ఒక రాష్ట్రంలో స్థిరమైన వ్యాపార ప్రదేశాన్ని కలిగి ఉండి, పన్ను పరిధిలోకి వచ్చే బయటి లావాదేవీలను చేపట్టే వ్యక్తి, అతని టర్నోవర్ గనక సూచించిన ప్రవేశ పరిమితిని దాటితే, రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. అతనికి/ఆమెకి స్థిరమైన వ్యాపార ప్రదేశం లేని చోట ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే లావాదేవీలను చేపడితే ఏమి జరుగుతుంది?
ఇది రెండు సందర్భాలలో జరగవచ్చు:

  1. ఆ వ్యక్తికి ఒక రాష్ట్రంలో స్థిరమైన వ్యాపార ప్రదేశం ఉండి తనకు స్థిరమైన వ్యాపార ప్రదేశంలేని మరొక రాష్ట్రంలో పన్ను పరిధిలోకి వచ్చే లావాదేవీలను అప్పుడప్పుడూ చేపడుతూ ఉండటం.
  2. ఆ వ్యక్తి భారతదేశం వెలుపల నివసిస్తూ, తనకు స్థిరమైన వ్యాపార ప్రదేశం లేదా నివాసంలేని భారతదేశంలో అప్పుడప్పుడు పన్ను విధించదగిన లావాదేవీలను చేపడుతూ ఉండటం.

మొదటి సందర్భంలో ప్రస్తావించబడిన వ్యక్తులను ‘‘సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు’, అని పిలుస్తారు, అనగా, ఒక స్థిరమైన వ్యాపార ప్రదేశంలేని రాష్ట్రంలో అప్పుడప్పుడూ పన్ను పరిధిలోకి వచ్చే లావాదేవీలను నిర్వహిస్తున్న వ్యక్తులు అని. సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తుల ఉదాహరణలు వాణిజ్య ప్రదర్శనలలో, ట్రేడ్ ఫెయిర్ (వర్తక సమ్మేళనం), సర్కస్ వ్యాపారం మొదలైనవి.

రెండవ కేసులో ప్రస్తావించబడిన వ్యక్తులు ‘ ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు’’, అని పిలుస్తారు, అనగా భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు మరియు అప్పుడప్పుడు వారికి స్థిరమైన వ్యాపార లేదా నివాస స్థానం లేని భారతదేశంలో పన్ను పరిధిలోకి వచ్చే లావాదేవీలు చేపడతారు.
ప్రస్తుత వ్యవస్థలో మరియు జిఎస్టి క్రింద సాధారణ మరియు ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు సంబంధించిన నిబంధనలను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.

మునుపటి వ్యవస్థ

ఈ ‘సాధారణం డీలర్లు’ మరియు ‘ప్రవాస డీలర్లు’ అనే భావనలు ప్రస్తుత వ్యవస్థలో, వాట్(VAT) కింద ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నియమాలు, పన్ను చెల్లింపు మరియు రిటర్న్ ఫైల్ చేయడం రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, కేరళలో, వారి టర్నోవర్ తో సంబంధం లేకుండా సాధారణ మరియు ప్రవాస డీలర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 3 రోజులు ముందు సమర్పించవలసి ఉంటుంది. జారీ చేయబడిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీచేయబడిన తేదీ నుండి గరిష్టంగా 3 నెలల వరకు చెల్లుతుంది. అటువంటి డీలర్లు నెలవారీ రిటర్న్ (ఫారం 10ఇ) ని నెలయొక్క 10వ తేదీనాటికి లేదా ఆఖరి వ్యాపార లావాదేవీ ముగిసిన 24 గంటలలోపు, ఏది ముందువస్తే అప్పటికల్లా, సమర్పించబడాలి. నెలవారీ రిటర్న్ సమర్పణతో పాటు పన్ను చెల్లింపు చేయబడాలి. ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ వ్యవధి కోసం పన్ను బాధ్యత అంచనా వేయబడాలి మరియు ముందుగా చెల్లించబడాలి.

జిఎస్టి వ్యవస్థ

రిజిస్ట్రేషన్

తప్పనిసరి రిజిస్ట్రేషన్ – సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులుగా లేదా ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులుగా లావాదేవీలు చేపట్టబోయే వ్యక్తులు అందరూ, తమ టర్నోవర్ తో సంబంధం లేకుండా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ పత్రాలు

రిజిస్ట్రేషన్ రకం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు
సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి జిఎస్టి రిజ్-01
ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి జిఎస్టి రిజ్-09

రిజిస్ట్రేషన్ ప్రక్రియ

  1. వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 5 రోజులు ముందు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు సమర్పించబడాలి. దరఖాస్తు సమర్పించే సమయంలో, వ్యక్తి ఆ వ్యవధి కోసం తన పన్ను బాధ్యతను అంచనా వేయాలి మరియు ముందస్తు పన్నుగా అందుకు సమానమైన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.

ఉదాహరణ: శ్రీ ప్రకాష్ చేతితో తయారు చేసిన ఆభరణాల కోసం ఒక రిటైల్ దుకాణం నడుపుతారు మరియు మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడ్డారు. గుజరాత్ లో 1 ఆగస్ట్, 2017 నుంచి 15 ఆగస్ట్, 2017 వరకు జరిగే ఒక ప్రదర్శనలో ప్రకాష్ ఆభరణాలను విక్రయిద్దామని ప్రణాళిక వేస్తున్నారు.

ఇక్కడ ప్రకాష్, 2017 ఆగస్టు 1 న ప్రదర్శన ప్రారంభమైన 5 రోజుల వ్యవధిలోపల సాధారణ పన్నుపరిధిలోకి వచ్చే వ్యక్తిగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రకాష్ 2017 ఆగస్టు 1 వ తేదీ నుంచి ఆగస్టు 15 వ తేదీ వరకు అంచనా వేసిన పన్ను బాధ్యతను ముందస్తు డిపాజిట్ చేయవలసి ఉంటుంది.

గమనిక: ఒక వ్యక్తి ప్రవాస పన్నుపరిధిలోకి వచ్చే వ్యక్తిగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే, ఒక చెల్లుబాటు అయ్యే పాన్(PAN)తో భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి అయిన ఒక అధికార సంతకంచేసే వ్యక్తి ద్వారా ఈ దరఖాస్తును సంతకం చేయబడి ఉండాలి.

  1. ఒకసారి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆ వ్యక్తికి జారీ చేయబడిన తర్వాత, రిజిస్ట్రేషన్ తేదీ నుండి అది గరిష్టంగా 90 రోజులపాటు చెల్లుతుంది. అభ్యర్ధనపై, ఫారం జిఎస్టి రిజ్-1 లో దరఖాస్తు సమర్పించడం ద్వారా రిజిస్ట్రేషన్ మరొక 90 రోజులపాటు పొడిగించబడవచ్చు . రిజిస్ట్రేషన్ పొడిగింపు కొరకు దరఖాస్తు గడువు ముగియడానికి ముందు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ కాలం పొడిగించబడితే, రిజిస్ట్రేషన్ కోరిన వ్యవధికి అంచనా వేసిన పన్ను బాధ్యతకి సమానమైన అదనపు పన్ను మొత్తాన్నిఆ వ్యక్తి డిపాజిట్ చేయాలి.
    .
  1. ముందస్తుగా డిపాజిట్ చేసిన పన్ను గనక అసలు పన్ను బాధ్యత కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే, అతను / ఆమె ఆ వ్యవధి కోసం రిటర్నులు ఫైల్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఆ మొత్తం తిరిగి చెల్లింపు (రిఫండ్) చేయబడుతుంది.
రిటర్నులు

ఒక సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి రిజిస్ట్రేషన్ వ్యవధి కోసం ఒక సాధారణ డీలర్ కు వర్తించే నెలవారీ రిటర్నులు సమకూర్చవలసి ఉంటుంది. ఇవి క్రింద ఇవ్వబడ్డాయి:

సాధారణ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తుల ద్వారా సమకూర్చబడవలసిన రిటర్న్
F ఫారం తరచుదనం గడువు తేది వివరాలు
జిఎస్టిఆర్-1 నెలవారీ తర్వాత వచ్చే నెల యొక్క 10వ తేది బయటికి వస్తువుల మరియు/లేదా సేవల సరఫరాల వివరాలు సమకూర్చడం
జిఎస్టిఆర్ -2ఎ నెలవారీ తర్వాత వచ్చే నెల యొక్క 11వ తేదిసరఫరాదారుల ద్వారా సమకూర్చబడిన ఫారం జిఎస్టిఆర్-1 ఆధారంగా సరఫరా గ్రహీతలకు అందుబాటులో ఉంచబడిన లోపలికి సరఫరాల యొక్క వాటంతట అవే నింపబడే (ఆటో పాపులేటెడ్) వివరాలు.
జిఎస్టిఆర్ -2 నెలవారీ తర్వాత వచ్చే నెల యొక్క 15వ తేది ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసేందుకు లోపలికి సరఫరాల వివరాలు సమకూర్చడం.. ఫారం జిఎస్టిఆర్-2ఎలో ఏవైనా చేర్పులు లేదా సవరణలు సమర్పించబడాలి.
జిఎస్టిఆర్ -1ఎ నెలవారీ తర్వాత వచ్చే నెల యొక్క 17వ తేది ఫారం జిఎస్టిఆర్-2 లో గ్రహీతల ద్వారా చేర్చబడిన, దిద్దబడిన లేదా తొలగించబడిన బయటికి సరఫరాల వివరాలు సరఫరాదారుకి అందుబాటులో ఉంచబడతాయి. గ్రహీతల ద్వారా చేయబడిన సవరణలను సరఫరాదారు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
జిఎస్టిఆర్ -3 నెలవారీ తర్వాత వచ్చే నెల యొక్క 20వ తేది పన్ను చెల్లింపుతో, బయటికి సరఫరాలు మరియు లోపలికి సరఫరాల తుది వివరాలు కలిగి ఉండే నెలసరి రిటర్న్ ఫైల్ చేయబడవలసి ఉంటుంది.

 

ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తుల ద్వారా సమకూర్చబడవలసిన రిటర్న్
ఫారం తరచుదనం గడువు తేది వివరాలు
జిఎస్టిఆర్-5 నెలవారీ తర్వాత వచ్చే నెల యొక్క 20వ తేది లేదా రిజిస్ట్రేషన్ గడువుతీరిపోయిన 7 రోజులలోపు, ఏది ముందువస్తే అప్పటికల్లా దిగుమతులు, బయటికి సరఫరాలు, వినియోగించుకున్న ఐటిసి, చెల్లించిన పన్ను మరియు క్లోజింగ్ స్టాక్ వివరాలు సమకూర్చడం.
ముగింపు

ప్రస్తుత వ్యవస్థలో లాగా ఈ నియమాలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉండకుండా రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు మరియు రిటర్న్ ఫైల్ చేయడానికి సంబంధించిన నిబంధనలు భారతదేశవ్యాప్తంగా ఒకే రీతిగా ఉండటంతో సాధారణ మరియు ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తుల కోసం, కట్టుబడి ఉండటంలో జిఎస్టి సౌలభ్యాన్ని తీసుకువస్తుంది. జిఎస్టి కింద సాధారణ మరియు ప్రవాస పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన నియమాలు, అంచనా వేసిన పన్ను బాధ్యత ఆధారంగా ముందస్తు పన్ను చెల్లింపుతో, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 5 రోజులు ముందే దాఖలు చేయాలి, రిజిస్ట్రేషన్ కోసం సర్టిఫికేట్ గరిష్టంగా 90 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది, ఇది గరిష్టంగా మరో 90 రోజులు పొడిగించబడవచ్చు, మరియు రిజిస్ట్రేషన్ వ్యవధి కోసం నెలవారీ రిటర్నులు దాఖలు చేయాలి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

138,200 total views, 7 views today