జిఎస్టి ని గనక చూచినట్లయితే, వినియోగదారులకు – తక్కువ ధరల వాగ్దానంతో; వ్యాపారాలకు – సరళీకృత పరోక్ష పన్ను వ్యవస్థ వాగ్దానంతో; మరియు భారత ప్రభుత్వానికి – అధిక పన్ను ఆదాయం వాగ్దానంతో, అది ఒక వరంలాగా కనిపిస్తుంది. అయితేమరి, వ్యాపార పర్యావరణ వ్యవస్థలో జిఎస్టి ప్రవేశపెట్టబడటంతో మరియు క్రమక్రమంగా వ్యాపింపజేయబడటంతో విపరీతంగా ప్రయోజనం పొందే మరొక వాటాదారు ఉన్నారు, అది ఎవరంటే – చార్టర్డ్ అకౌంటెంట్.

ఇక్కడ, నేను జిఎస్టి ద్వారా తీసుకురాబడిన కీలక ప్రయోజనాలను జాబితాగా చేయబోతున్నాను – ఇది రాబోయే కొన్ని నెలల్లో అలాగే భవిష్యత్తులో కూడా సిఎ యొక్క జీవనాన్ని తప్పకుండా చాలా సులభం మరియు సరళం చేస్తుంది.

క్లయింట్ల సంఖ్య పెరుగుదల

మనకి ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నులతో పోలిస్తే జిఎస్టి అనేది పూర్తిగా కొత్త పన్ను విధానం. అది ప్రకటించబడిన దగ్గర నుండి, వ్యాపారాలు భయపడిపోతున్నాయి మరియు – వారి వ్యాపారాల పై జిఎస్టి యొక్క అన్వయం గురించి మరియు – ప్రస్తుతం పరోక్ష పన్నులు చెల్లిస్తున్న కొంతమంది మదింపుచేయబడేవారి కోసం కొద్దినెలల క్రితం ప్రారంభించబడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి అడుగుతూ సహాయం కోసం సిఎ వర్గాన్ని చేరుకున్నాయి.
అటువంటి దృష్టాంతంలో, ఒక సిఎకు కేవలం క్లయింట్లకు సలహా ఇవ్వడం మాత్రమే కాకుండా, జిఎస్టి చట్టం గురించి వారికి బోధించవలసిన ఒక విస్తృత పాత్ర ఉంటుంది. జిఎస్టి కి కట్టబడి ఉండటం అనేదానికి జిఎస్టి చట్టం యొక్క ప్రాథమిక అవగాహన మరియు వ్యాపారాలపై దాని ప్రభావం గురించి తెలుసుకోవడం అవసరం కాబట్టి ఇది ఎంతో కీలకమైనది- మరియు ఆ ఖాళీనే ఒక సిఎ పూరించగలరు. సరళంగా చెప్పాలంటే, జిఎస్టి సంప్రదింపులు మరియు జిఎస్టి కింద రిజిస్ట్రేషన్, రిటర్న్ ఫైలింగ్ మరియు అకౌంటింగ్ వంటి జిఎస్టి సంప్రదింపులు మరియు ఇతర సేవల కోసం సిఎ వర్గం దగ్గరికి మరింత ఎక్కువగా వ్యాపారాలు చేరుతూ ఉంటాయి. ఇదంతా కూడా, సిఎల కోసం క్లయింట్ల సంఖ్య అనివార్యంగా పెరగడానికి దారి తీస్తుంది, ఇది క్రమంగా వారి మొత్తం వ్యాపారం పెరగడానికి దోహదపడుతుంది.

కొత్త చార్టర్డ్ అకౌంటెంట్స్ కోసం వరం

జిఎస్టి అనేది క్రొత్త మరియు అభిలషించే చార్టెర్డ్ అకౌంటెంట్స్ కోసం ఒక జీవ-రక్షణ గుళిక. దీనికి గల మామూలు కారణం ఏమిటంటే, జిఎస్టి అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేయబడుతోంది కాబట్టి. ఇంకొక విధంగా చెప్పాలంటే, అది ఏదో కొత్తది – అనుభవజ్ఞులైన లేదా అనుభవహీనులైన సిఎలకి ఇద్దరికి కూడా, అందుకనే ఇద్దరూ అదే పడవలో ఉంటారు. తాజాగా అర్హతపొందిన చార్టర్డ్ అకౌంటెంట్లు ఈ అవకాశం నుంచి లాభం పొందగలరు మరియు జిఎస్టి కెరటాలపై స్వారీ చేస్తూ వారు సులభంగా వారి వృత్తిని పెంచుకోవచ్చు.

GST is a life-saving pill for new as well as aspiring chartered accountants Click To Tweetజిఎస్టి వచ్చినప్పుడు, పని యొక్క విస్తృతి అపారంగా ఉంటుంది – సలహాపరంగా మరియు కట్టుబడి ఉండే పరంగా రెండింటికి సంబంధించినది. ముఖ్యంగా, పాత పన్ను వ్యవస్థ నుండి సరికొత్తదానికి క్లయింట్లను సాఫీగా పరివర్తన చెందించడం అవసరం. ఒక మృదువైన పరివర్తనం అనేది క్లయింట్లకు వేగవంతమైన మార్గంలో మరింత వ్యాపారానికి దారి తీస్తుంది, ఎందుకంటే జిఎస్టి వస్తువుల ధరలను తగ్గించి, మార్జిన్లను పెంచుతుందని భావిస్తున్నారు కాబట్టి. అందువల్ల గొప్పగా చేయాలనుకునే యువ సిఎలకు మంచి క్లయిట్లను ఏర్పరుచుకోవటానికి, వారిని జిఎస్టి యుగంలోకి మార్గనిర్దేశం చేయడానికి వారి ముందు ఒక అద్భుతమైన అవకాశాన్ని కలిగి ఉంటారు. జిఎస్టి లో మద్దతు అవసరం ఉండే క్లయింట్ల భారీ డిమాండ్ కారణంగా – ఇప్పటికే సిఎలుగా ఉన్నవారు ఉన్నంత డిమాండ్ లో వారు కూడా ఉంటారు. కొత్త తరం సిఎలు ఆన్లైన్ ఫోరంలను కూడా ఆశ్రయించవచ్చు మరియు కొత్త క్లయింట్లను పొందేందుకు ఇంటర్నెట్ వ్యాప్తి యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.
సంక్షిప్తంగా చెప్పాలంటే, జిఎస్టిపై సరైన పరిజ్ఞానంతో, పర్యావరణ వ్యవస్థలో కొత్త చార్టర్డ్ అకౌంటెంట్ల జీవితం తప్పనిసరిగా అద్భుతమైనదే.

కట్టుబడి ఉండటం కారణంగా ఆదాయం పెరుగుదల

ముందు చర్చించినట్లుగా, జిఎస్టి అనేది సిఎలకు క్లయింట్లను పెంచడం మాత్రమే కాక, వారి ఆదాయాల అభివృద్ధికి కూడా దారితీస్తుంది. వాస్తవానికి, జిఎస్టి కారణంగా సిఎలు వినియోగించుకోగల భారీ ఆర్థిక ప్రయోజనం ఉంది.

ఒక సరళ మార్గంలో నేను వివరిస్తాను – ఒక క్లయింట్ గనక జిఎస్టి సంప్రదింపుల కోసం వచ్చినట్లయితే అతనికి ఇతర వృత్తిపరమైన అవసరాలు కూడా ఉండగల అవకాశాలు ఉంటాయి. జిఎస్టితో పాటు జతచేసి సేవలను, ఉదా. అకౌంటింగ్ సేవలు, జిఎస్టి రిజిస్ట్రేషన్, సకాలంలో రిటర్న్ ఫైలింగ్, టాక్స్ చెల్లింపులు మొదలైనవి అందించడానికి సిఎలు ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు. రాబడి మాటకి వస్తే, ఈ వ్యూహం తప్పనిసరిగా పని చేస్తుంది, ఎందుకంటే ఒక కొత్త క్లయింట్ ని పొందడంతో పోలిస్తే వేర్వేరు సేవలను ఉపయోగిస్తున్న ఇప్పటికే ఉన్న క్లయింట్ నుండి పునరావృత ఆదాయాన్ని ఉత్పత్తి చేయడం సులభం కాబట్టి. ముఖ్యంగా, ఒకసారి ఒక క్లయింట్ కి విజయవంతంగా శిక్షణ అందజేసి జిఎస్టి లోకి పరివర్తనం చేయబడిన తరువాత, కట్టుబడి ఉండే భాగం ఆరంభమవుతుంది. జిఎస్టి కింద, కట్టుబడి ఉండటం అనేది పునరావృతమయ్యే చర్య మరియు ఇది సిఎ వర్గానికి ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను కలిగి ఉంటుంది. ఆదాయంలో ఈ ఉప్పెన అనేది కొత్తగా అలాగే అనుభవజ్ఞులైన చార్టెర్డ్ అకౌంటెంట్ల జీవితంలో ఎంతో గొప్ప మార్పును తెచ్చి పెడుతుంది.

పని చేయడం సులభం

ప్రస్తుత పన్ను వ్యవస్థలో అనేక ఇతర పన్నులు మరియు నియమాలతో పాటు మనకి ఎక్సైజ్ టాక్స్, సర్వీస్ టాక్స్, వాట్(VAT), సిఎస్టి(CST) వంటి అనేక పరోక్ష పన్నులు ఎన్నో ఉన్నాయి. ఇవి చాలనట్లుగా, ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం వేర్వేరు వాట్(VAT) చట్టాలు మరియు విభిన్న పన్నులు మరియు ఇ-కామర్స్ లావాదేవీలకు నియమాలు ఉన్నాయి. ఈ సంక్లిష్టత అనేది తరచూ చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు, కట్టుబడి ఉండటంలో లోపాలను చేయడానికి అవకాశం కలిగి ఉన్న వారి క్లయింట్లకు సమస్యను కలగజేసింది. సంక్షిప్తంగా చెప్పాలంటే, వారు ఒక చట్టాన్ని, దాని గురించి తెలియకుండానే, ఉల్లంఘించే అంచున కూడా ఉండి ఉండవచ్చు.
జిఎస్టి కారణంగా ఈ సంక్లిష్టత మరియు గందరగోళం పూర్తిగా తొలగించబడుతుంది, ఎందుకంటే, కేంద్రం మరియు రాష్ట్రం రెండూ కూడా ఒకే చట్టాన్ని అనుసరించాలి కాబట్టి, దీని వలన తక్కువ గందరగోళం మరియు మెరుగైన పన్ను పరిపాలన వ్యవస్థ ఏర్పడుతుంది. అందువలన, జిఎస్టి రోల్-అవుట్ అనంతరం, సిఎ వర్గంవారి పనిభారం బాగా తగ్గిపోతుంది మరియు కన్సల్టింగ్ అలాగే కట్టుబడి ఉండే పని చాలా సులభం అవుతుంది.

ముగింపు

నేడు మొత్తం దేశం చేతులుజాచుకుని జిఎస్టికి స్వాగతం పలకడానికి సిధ్ధంగా ఉంది. అదైతే నాకు సంతోషం కలిగిస్తుంది; 1 జూలై తర్వాత ఒకసారి భారతదేశం అంతటా జిఎస్టి పూర్తిగా వర్తింపజేయబడినప్పుడు నేను మరింత సంతోషంగా ఉంటాను. దానితో పాటు తీసుకురావడానికి జిఎస్టి వాగ్దానం చేస్తున్న అనేక ప్రయోజనాలు అనేవి తప్పనిసరిగా భారతదేశం యొక్క పురోగతి మరియు అభివృద్ధిగా పరిణమించనున్నాయి – జిఎస్టిని ఒక వాస్తవంగా రూపకల్పన చేయడంలో సిఎలు ప్రధాన పాత్ర పోషించనున్నారు.
దాదాపు ప్రతిదీ ఆన్లైన్ మార్గాన వెళుతున్న ఒక ప్రపంచంలో, చార్టర్డ్ అకౌంటెంట్లు ఏ వ్యాపారానికైనా వెన్నెముకగా నిలవడం కొనసాగిస్తారు – వారి నైపుణ్యంతో కూడిన మార్గదర్శకత్వం కారణంగా మాత్రమేకాక మొదటి సారిగా, ఏ వ్యాపారం కోసమైన కట్టుబడి ఉండటమనేది కీలకమై ఉంటుంది కాబట్టి. ముగింపుగా, జిఎస్టి అనేది చార్టర్డ్ అకౌంటెంట్ల జీవితాన్ని గతంలో కంటే ఎంతో అద్భుతమైనదిగా చేస్తుంది అనండంలో సందేహమేమీ ఉండదు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

48,986 total views, 29 views today