భారతదేశం ఒక ఫెడరల్ దేశం అయి ఉండటంతో, ఉత్పాదన మరియు సేవలను అందించడం పై విధులు మరియు పన్నులను విధించేందుకు రాజ్యాంగం ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారం పొంది ఉంది. రాష్ట్ర పరిధులలో వస్తువుల తరలింపు కలిగి ఉండే రాష్ట్ర అంతర్గత విక్రయాలపై పన్ను విధింపుకు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు అధికారం కలిగివున్నాయి. వస్తువుల విక్రయం వేర్వేరు రాష్ట్రాల మధ్య వస్తువులు తరలింపు కలిగి ఉన్నప్పుడు, అలాంటి అమ్మకాలపై పన్ను విధించేందుకు కేంద్రం అధికారం కలిగి ఉంటుంది మరియు ఆ విధంగా సేకరించిన ఆదాయం కేంద్రం మరియు రాష్ట్రం ద్వారా పంచుకోబడుతుంది.
రాజ్యాంగం స్పష్టంగా కేంద్రం వద్దగల మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను నిర్దేశిస్తుండగా, రాష్ట్రాలకు ఉండే అతి పెద్ద సవాలు ఏమిటంటే, రాష్ట్రం లోపల మరియు రాష్ట్రం వెలుపల వస్తువుల తరలింపును పర్యవేక్షించడం.

హద్దుల్లేని పన్నుల ఎగవేత మరియు రాష్ట్రాలకు రాబడిని లీక్ చేయడం జరుగుతూ ఉండేది. అందువలన, పన్ను ఎగవేత మరియు వ్యవస్థ దుర్వినియోగం అధిగమించేందుకు, చాలావరకు రాష్ట్రాలకి వారి జాతీయ రహదారులు మరియు సరిహద్దుల వెంట బహుళ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్-పోస్ట్లు ప్రధానంగా వస్తువుల తరలింపుని పర్యవేక్షిస్తాయి మరియు వస్తువులపై సంబంధిత విధులు/పన్నులు చెల్లించబడ్డాయని నిర్ధారించుకుంటాయి.

వస్తువులను తరలించే వ్యక్తి, చెక్-పోస్ట్ వద్ద తనిఖీ కోసం సమర్పించవలసిన అవసరం ఉన్న ఇన్వాయిస్, ఛలాన్, రోడ్ పర్మిట్లు, వే బిల్లు వంటి వివిధ డాక్యుమెంట్లతో సన్నధ్ధంగా ఉండవలసి ఉంటుంది.

ప్రస్తువ వ్యవస్థ

నేడు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ సరిహద్దుల లోపల మరియు వెలుపల వస్తువుల తరలింపు జాడ తెలుసుకునేందుకు తమ సొంత వ్యవస్థను రూపొందించుకున్నాయి. ఉదాహరణకి, కొన్ని రాష్ట్రాలు నమోదిత డీలర్ ను సరుకుల విలువ ఆధారంగా వస్తువుల వివరాలను లేదా అవి రవాణా చేయబడినప్పుడు నియమించబడిన / నోటిఫైడ్ వస్తువులుగా ప్రకటించవలసిన అవసరం కల్పించాయి. మిగతా వాటితో సహా పర్మిట్ ఫారం, వే బిల్లు లాంటి పత్రాలు పొందవలసి ఉంటుంది. వీటితో పాటు, కొన్ని రాష్ట్రాలు రవాణా పాస్ లేదా డిక్లరేషన్ ఫారం పొందవలసిందిగా వస్తువుల రవాణాదారునికి తప్పనిసరి చేసాయి.

సాంకేతిక పరిణామం చెందడంతో, వస్తువుల తరలింపు ఇమిడి ఉన్న విధానాలను, కర్ణాటక ద్వారా ప్రవేశపెట్టిన ఇ-సుగమ్ లాగా డిజిటలైజ్ చేసేందుకు వివిధ రాష్ట్రాలద్వారా గణనీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇ-సుగమ్ కింద, రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులని రవాణా చేసే ఒక నమోదిత డీలర్ రవాణా సరుకు వివరాలను అప్లోడ్ చేసి, ఒక ఏకైక సూచన సంఖ్య (యునీక్ రిఫరెన్స్ నెంబర్)ను పొందవలసి ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్టర్ తో పంచుకోబడుతుంది మరియు అతను చెక్-పోస్ట్ అధికారికి కేవలం సంఖ్యను చెప్పవచ్చు.

ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇదే విధమైన యంత్రాంగం ప్రవేశపెట్టబడింది, ఇది సరుకు వివరాలను నమోదిత డీలర్ ఎలక్ట్రానిక్ గా ప్రకటించి వస్తువుల తరలింపు కోసం అవసరమైన ఫారంలను పొందటానికి వీలు కల్పిస్తుంది.

జిఎస్టి కింద

జిఎస్టి కింద, వస్తువుల తరలింపు కోసం ప్రక్రియ మరియు విధానపరమైన అంశాలు ఇ-వే బిల్లు నియమాలలో సూచించబడ్డాయి. ఇ- వే బిల్లు అంటే ఎలక్ట్రానిక్ వే బిల్లు అని అర్ధం. సామాన్యంగా ఇది వస్తువుల తరలింపు కలిగి ఉన్న నిర్దిష్ట రవాణాసరుకు కోసం ఉత్పత్తి చేయబడిన ఒక ప్రత్యేకమైన బిల్లు సంఖ్య అయి ఉంటుంది. జిఎస్టి కింద, రూ 50,000 కు మించిన విలువగల వస్తువుల తరలింపు ప్రారంభించాలని భావిస్తున్న ఒక నమోదిత వ్యక్తి ఒక ఇ-వే బిల్లును ఉత్పన్నం చేయాలి.

Under GST, a registered person who intends to initiate a movement of goods of value exceeding Rs 50,000 should generate an e-Way bill. Click To Tweet
వర్తింపు మరియు ఇ-వే బిల్లుని ఉత్పన్నం చేయడం.
ప్రశ్నలు సమాధానాలు
ఇ-వే బిల్లు ఎప్పుడు వర్తిస్తుంది? ఇది రూ .50,000 మించిన ఏ సరుకు విలువకైనా వర్తిస్తుంది. నమోదుకాని వ్యక్తి నుండి వస్తువుల లోపలికి సరఫరా విషయంలో కూడా, ఇ-వే బిల్లు వర్తిస్తుంది.
నేను ఇ-వే బిల్లు ఎప్పుడు ఉత్పన్నం చేయాలి? వస్తువుల తరలింపు ప్రారంభానికి ముందు ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయవలసి ఉంటుంది.
ఇ-వే బిల్లు ఎవరు ఉత్పన్నం చేయాలి?తన సొంత లేదా అద్దెకు తీసుకోబడిన వాహనంలో సరుకు పంపే యాజమానిగా లేదా సరుకు అందుకోవలసిన వ్యక్తిగా వ్యవహరిస్తూ, ఒక నమోదిత వ్యక్తి ద్వారా వస్తువులు రవాణా చేయబడినప్పుడు, గ్రహీత లేదా సరఫరాదారు ఇ-వే బిల్లును ఉత్పన్నం చేయాలి.
వస్తువులని ఒక రవాణాదారుకు అప్పగించినప్పుడు, ఇ-వే బిల్లు రవాణాదారు ద్వారా ఉత్పత్తి చేయబడాలి. ఈ సందర్భంలో, నమోదిత వ్యక్తి ఒక ఉమ్మడి పోర్టల్ లో వస్తువుల వివరాలను ప్రకటించాలి.
ఒక నమోదుకాని వ్యక్తి నుండి లోపలికి వస్తువుల సరఫరా విషయంలో, సరఫరా గ్రహీత లేదా సరఫరాదారు ఇ-వే బిల్లును ఉత్పన్నం చేయాలి..
ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-1 ఫారం ఒక ఇ-వే బిల్లు ఫారం. ఇందులో వస్తువుల వివరాలు అందజేయబడే పార్ట్-ఎ ఉంటుంది, , మరియు పార్ట్- బి రవాణాదారు వివరాలను కలిగి ఉంటుంది.
రూ.50,000 కంటే తక్కువ విలువగల రవాణా సరుకుకి ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయవచ్చా?
అవును, ఒక నమోదిత వ్యక్తి లేదా ఒక రవాణాదారు ఒక ఇ-వే బిల్లును ఉత్పన్నం చేయవచ్చు, అయితే ఇది తప్పనిసరి అయి ఉండకపోవచ్చు. ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయబడిన మీదట, ఏదైనా సూచన నంబర్ ఉత్పన్నం చేయబడుతుందా? ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయబడిన మీదట, ఉమ్మడి పోర్టల్ లో, ‘ఇబిఎన్’ అని పిలువబడే ఒక ఏకైక ఇ-వే బిల్లు నంబర్ సరఫరాదారు, గ్రహీత మరియు రవాణాదారునికి అందుబాటులో ఉంటుంది.
రవాణా చేయబడే సమయంలో వస్తువులు ఒక వాహనం నుంచి మరొక వాహనానికి బదిలీ చేయబడితే ఏమవుతుంది? వస్తువులను మరొక వాహనానికి బదిలీ చేసి అటువంటి వస్తువులను మరింతగా తరలింపు చేసే ముందు, రవాణా విధానం యొక్క వివరాలను పేర్కొనడం ద్వారా ఫారం జిఎస్టి ఐఎన్ఎస్ 01 లో రవాణాదారు ఒక కొత్త ఇ-వే బిల్లును ఉత్పన్నం చేయాలి.
రవాణా సరుకు విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ సరుకు పంపేవ్యక్తి (కన్సైనర్) ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయకపోతే ఏమవుతుంది? ఇన్వాయిస్, సరఫరా బిల్లు లేదా డెలివరీ ఛలాన్ ఆధారంగా ఫారం జిఎస్టి ఐఎన్ఎస్ 01లో రవాణాదారు ఇ-వే బిల్లును ఉత్పన్నం చెయ్యాలి.
ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయబడి కాని సరుకు రవాణా చేయబడకపోతే ఏమవుతుంది? ఒక ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయబడిన 24 గంటల లోపల ఉమ్మడి పోర్టల్లో ఎలక్ట్రానిక్ గా దానిని రద్దు చేయవచ్చు. రవాణా చేయబడే సమయంలో ఒక అధికారి ద్వారా గనక ఇ-వే ధృవీకరించబడితే అది రద్దు చేయబడలేదు.
వస్తువుల గ్రహీతకు అంగీకారం కోసం ఇ-వే బిల్లు అందుబాటులోకి ఉంచబడుతుందా? అవును, అతను నమోదు చేయబడి ఉంటే మాత్రమే ఇ-వే వివరాలు వస్తువుల గ్రహీతకి అందుబాటులో ఉంచబడతాయి. వివరాలు అందుబాటులోకి వచ్చిన 72 గంటలలోపు వస్తువుల గ్రహీత ఇ-వే బిల్లు పరిధిలో ఉన్న రవాణా సరుకులకి అంగీకారం లేదా తిరస్కరణను తెలియజేయాలి.
వస్తువుల గ్రహీత 72 గంటలలో తిరస్కరణ అంగీకారం తెలియజేయకపోతే ఏమి జరుగుతుంది? వస్తువుల గ్రహీత గనక 72 గంటల్లోపు అంగీకారం లేదా తిరస్కరణ తెలియజేయనట్లయితే, అది గ్రహీత ద్వారా ఆమోదించబడినట్లుగా భావించబడుతుంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఇ-వే ని ఉత్పన్నం చేసేందుకు లేదా రద్దు చేసేందుకు ఏదైనా వీలు ఉన్నదా? ఇ-వే బిల్లులని ఉత్పన్నం చేసే మరియు రద్దు చేసే సౌకర్యం ఎస్ఎంఎస్ ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది.

ఇ-వే బిల్లులని ఉత్పన్నం చేయడంలో ఇమిడి ఉండే ప్రక్రియని ఒక ఉదాహరణతో మనం అర్థం చేసుకుందాం.

మహారాష్ట్రలో నమోదైన ఒక డీలర్ అయిన రాణా ట్రేడర్స్, కర్ణాటకలో నమోదైన ఒక డీలర్ అయిన శివా ట్రేడర్స్ కు రూ.75,000 విలువైన వస్తువుల వెలుపలికి సరఫరా చేయడానికి అంగీకరించింది. శివా ట్రేడర్స్ కు వస్తువులను పంపిణీ చేయటానికి, రాణా ట్రేడర్స్ వస్తువులను స్పీడ్ ట్రాన్స్పోర్ట్స్ కు అందచేశారు.

GST e-way bill generarion

జిఎస్టి కింద ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయడం
దూరం చెల్లుబాటు వ్యవధి
100 కిమీ కంటే తక్కువ1 రోజు
100 కిమీ లేదా ఎక్కువ కాని 300 కిమీ కంటే తక్కువ 3 రోజులు
300 కిమీ లేదా ఎక్కువ కాని 500 కిమీ కంటే తక్కువ5 రోజులు
500 కిమీ లేదా ఎక్కువ కాని 1000 కిమీ కంటే తక్కువ 10 రోజులు
1000 కిమీ లేదా ఎక్కువ 15 రోజులు

ఇ-వే బిల్లు ఉత్పన్నం చేయబడిన సమయం నుండి చెల్లుబాటయ్యే వ్యవధి లెక్కించబడుతుంది. ఈ విషయంలో జారీచేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా, నిర్దిష్ట వస్తువుల కోసం కమిషనర్ ద్వారా ఇ-వే బిల్లు యొక్క చెల్లుబాటయ్యే వ్యవధి పొడిగించబడవచ్చు.

పత్రాలు, తనిఖీ మరియు ధృవీకరణ

రవాణాదారు లేదా ఒక రవాణావాహన బాధ్యత వహించే వ్యక్తి క్రింది పత్రాలను కలిగి ఉండాలి:
• ఇన్వాయిస్ లేదా సరఫరా బిల్లు లేదా డెలివరీ ఛలాన్, మరియు
• ఇ-వే బిల్లు లేదా ఇ-వే బిల్లు సంఖ్య యొక్క భౌతిక ప్రతి.

ధృవీకరణ ప్రదేశంలో, అన్ని రాష్ట్రాంతర మరియు రాష్ట్రఅంతర్గత సరుకు రవాణాలకు భౌతిక రూపంగా ఇ-వే బిల్లు లేదా ఇ-వే బిల్లు సంఖ్యను ధృవీకరించడానికి అధికారి ఏదైనా వాహనాన్ని అడ్డగించవచ్చు

ఇ-వే బిల్లు భౌతిక ప్రతి ధృవీకరణను నివారించడానికి, ఒక పరికరమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడి) ని వాహనానికి జోడించవచ్చు మరియు ఇ-వే బిల్లు పరికరానికి మ్యాప్ చేయబడుతుంది. ధృవీకరణ ప్రదేశం వద్ద, ఈ పరికరానికి మ్యాప్ చేయబడిన ఇ-వే బిల్లు ఆర్ఎఫ్ఐడి రీడర్ల ద్వారా ధృవీకరించబడుతుంది.

కొన్ని ప్రత్యేక శ్రేణి రవాణాదారుల కోసం, వాహనానికి ఆర్ఎఫ్ఐడి పరికరాలను జత చేయడం మరియు పరికరానికి ఇ-వే బిల్లును మ్యాపింగ్ చేయడం తప్పనిసరి చేయబడుతుంది. ఇది కమిషనర్ ద్వారా తెలియజేయబడుతుంది.

పన్ను ఎగవేత అనుమానంతో, కమిషనర్ లేదా అతని తరపున అధీకృతమివ్వబడిన అధికారి నుండి అవసరమైన ఆమోదం పొందిన తరువాత, ఒక వాహనం యొక్క భౌతిక ధృవీకరణను ఒక అధికారి చేపట్టవచ్చు. వాహనం యొక్క భౌతిక ధృవీకరణ ఒక ప్రదేశంలో జరిగితే – రాష్ట్రంలోపల లేదా ఏదైనా ఇతర రాష్ట్రంలోనైనా, పన్ను ఎగవేత యొక్క నిర్దిష్ట సమాచారం తరువాత అందుబాటులోకి వస్తే తప్ప, తదుపరి భౌతిక ధృవీకరణ, ఆ సరుకు రవాణా సమయంలో మళ్లీ చేయడం జరగదు.
ప్రతి తనిఖీ తరువాత, వస్తువుల తనిఖీ వివరాలను అధికారి తనిఖీ జరిగిన 24 గంటల లోపల ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-03 యొక్క పార్ట్-ఎ లో రికార్డు చేయాలి మరియు తుది నివేదిక తనిఖీ జరిగిన 3 రోజుల లోపల ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-03 యొక్క పార్ట్ బి లో నమోదు చేయాలి. వాహనం గనక 30 నిముషాల కంటే ఎక్కువ సమయంపాటు నిర్బంధించబడినట్లయితే, ఫారం జిఎస్టి ఐఎన్ఎస్ 04 లో వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయడానికి రవాణాదారుకు ఒక ఎంపిక ఉంటుంది.
జిఎస్టితో, వస్తువుల తరలింపు కోసం అవసరమైన అన్ని రాష్ట్రాల వారీగా డాక్యుమెంటేషన్ తొలగించబడుతుంది మరియు ప్రతిపాదిత ఇ-వే బిల్లు దేశం అంతటా సామాన్యంగా చేయబడుతుంది.
ఇంకా రాష్ట్ర సరిహద్దులు, జాతీయ రహదారులు వెంటగల చెక్ పోస్టుల సంఖ్య తగ్గించబడుతుందని ఆశించబడుతోంది. ఇది వస్తువుల తరలింపు సౌలభ్యతకు దారి తీయవచ్చు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

141,692 total views, 18 views today