ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఇ-కామర్స్ అనేది భారతదేశంలో వ్యాపారం జరిగే మార్గాన్ని మార్చివేసింది. ప్రస్తుతం, భారతదేశంలో ఇ-కామర్స్ పరిశ్రమ బహుళ పన్నుల విధింపుని ఎదుర్కుంటోంది. ఇ-కామర్స్ పరిశ్రమపై ప్రతి రాష్ట్రం తన స్వంత నియమాల మరియు పన్నుల సెట్ విధించింది. వివిధ రకాల ఇ-కామర్స్ లావాదేవీలని పన్నుపరంగా వ్యవహరించడంలో స్పష్టత లేకపోవడం, ఇ-వాలెట్ మరియు క్యాష్ బ్యాక్ వంటి కొత్త అంశాలు, పరిశ్రమకు ఒక అస్తవ్యస్తమైన పన్ను పర్యావరణంగా ప్రతిఫలించాయి.

ఇ-కామర్స్ సంస్థలు ఎక్కువ స్పష్టత ఆశతో మరియు రాష్ట్ర నిర్దిష్ట నియమాలు మరియు పన్నుల విధింపు తొలగింపు కోసమై జీఎస్టీ అమలుకోసం ఎదురుచూస్తున్నాయి. డ్రాఫ్ట్ మోడల్ జిఎస్టి చట్టం, ఇ- కామర్స్ పరిశ్రమకు నిర్దిష్టంగా ఉండే నియమాల అవసరాన్నిగుర్తిస్తుంది. ఈ బ్లాగ్ లో, మేము జిఎస్టిలో ఇ- కామర్స్ కు సంబంధించి నిర్దిష్ట నియమాలను పరిశీలిస్తాము.

 • ఇ-కామర్స్ ఆపరేటర్ మరియు
 • ఇ-కామర్స్ వేదికలపై సప్లయర్స్

జిఎస్టి కింద ఇ-కామర్స్ వేదికలపై ఇ-కామర్స్ ఆపరేటర్లు మరియు సరఫరాదారుల నుండి అవసరాలను మనం వివరంగా పరిశీలిద్దాం.

ఇ-కామర్స్ ఆపరేటర్

ఎలక్ట్రానిక్ కామర్సు కోసం డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ సౌకర్యం లేదా వేదికకి యజమానియై ఉండే, నడిపే లేదా నిర్వహించే ఒక వ్యక్తిని ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ అంటారు. జిఎస్టి కింది ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ నుండి అవసరమైనవి ఇవి-

1. తప్పనిసరి రిజిస్ట్రేషన్
ఇ-కామర్స్ ఆపరేటర్లు అందరూ తప్పనిసరిగా జిఎస్టి కింద నమోదై ఉండవలసి ఉంటుంది. అంటే, వారి టర్నోవర్ తో సంబంధం లేకుండా, వారు జిఎస్టి కింద నమోదుచేసుకోబడి ఉండాలి అని అర్ధం.

2.నోటిఫై చేయబడిన సేవలపై ఇ-కామర్స్ ఆపరేటర్లు చెల్లించవలసిన పన్ను
ఈ క్రింద సందర్భంలో కొన్ని సేవా విభాగాలు నోటిఫై చేయబడి ఉండవచ్చు, వీటి సరఫరాపై, పన్ను సరఫరాదారు ద్వారా కాక, ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా చెల్లించబడుతుంది.,

   • ఒక రాష్ట్రంలో ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ లేనట్లయితే, ఆ రాష్ట్రంలో ఇ-కామర్స్ ఆపరేటర్ కు ఏ ఉద్దేశానికైనా ప్రాతినిధ్యం వహించే ఎవరైనా వ్యక్తి పన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగి ఉంటారు
   • ఒక రాష్ట్రంలో ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ లేకపోయి, ఇంకా పైగా రాష్ట్రంలో ప్రతినిధి కూడా ఎవరూ లేనట్లయితే, పన్ను చెల్లించే ప్రయోజనం కోసం ఇ-కామర్స్ ఆపరేటర్ ఆ రాష్ట్రంలో ఒక వ్యక్తిని నియమించవలసి ఉంటుంది, మరియు ఈ వ్యక్తి పన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగి ఉంటారు

3.ఇ-కామర్స్ ఆపరేటర్లు మూలం వద్ద పన్ను సేకరించవలసి ఉంటుంది
ప్రతి ఇ-కామర్స్ ఆపరేటర్, వారి వేదిక ద్వారా చేయబడిన పన్ను పరిధిలోకి వచ్చే సరఫరా నికర విలువ @ 2% పన్ను సేకరించాలి, ఇక్కడ అటువంటి సరఫరాలకు సంబంధించిన పరిగణన, ఆపరేటర్ ద్వారా సేకరించబడవలసి ఉంటుంది.

పన్ను పరిధిలోకి వచ్చే సరఫరా నికర విలువ = ఆపరేటర్ ద్వారా పన్ను చెల్లించబడిన నోటిఫై చేయబడిన సరఫరా కంటే ఇతరరమైన, ఆపరేటర్ ద్వారా నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులందరి చేత చేయబడిన పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాల విలువ (-) సరఫరాదారులకు తిరిగి ఇవ్వబడిన పన్ను పరిధిలోకి వచ్చే సరఫరా విలువ

ఉదాహరణ: ఫాస్ట్ డీల్స్ ఒక ఇ-కామర్స్ ఆపరేటర్. రాకేష్ ప్రెవేట్ లిమిటెడ్ మరియు రోహన్ ప్రెవేట్ లిమిటెడ్ ఫాస్ట్ డీల్స్ పై సరఫరాదారులు. అక్టోబర్ ’17 లో ఫాస్ట్ డీల్స్ పై క్రింది సరఫరాలు చేయబడ్డాయి.

ఫాస్ట్ డీల్స్ పై బయటికి సరఫరాల రిజిస్టర్
సరఫరాదారు
పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలు (రూ.)తిరిగివ్వబడిన పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలు (రూ.)నికర పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలు ( తిరిగివ్వబడిన పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలు తీసివేయబడిన పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలు (రూ.)వసూలు చేయబడిన టిసిఎస్ @2% (రూ.)
రాకేష్ ప్రై. లి.1,00,00,00010,00,00090,00,0001,80,000
రోహన్ ప్రై. లి.2,00,00,00020,00,0001,80,00,0003,60,000
మొత్తం3,00,00,00030,00,0002,70,00,0005,40,000

ఇక్కడ, ఫాస్ట్ డీల్స్ నికర పన్ను పరిధిలోకి వచ్చే సరఫరా రూ 2,70,00,000 మరియు సేకరించిన జిఎస్టి రూ 5,40,000 ఉంది.

4. రిటర్నులు మరియు పన్ను చెల్లింపు ప్రక్రియ

   • ప్రతి నెల 10 వ తేదీనాడు, ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ తిరిగివ్వబడిన సరఫరాలతో సహా, గత నెలలో ఆ వేదిక ద్వారా చేయబడిన బయటికి సరఫరాల వివరాలున్న ఫారం జిఎస్ టిఆర్-8, సమర్పించవలసి ఉంటుంది. ఫారం జిఎస్ టిఆర్-8 లో, నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు చేసిన సరఫరాలకు ఇన్వాయిస్ వారీగా వివరాలు మరియు నమోదుకాని వ్యక్తులకు చేసిన సరఫరాకు సగటు విలువ అందజేయాలి. సరఫరాదారుల నుండి సేకరించిన పన్ను కూడా ఇ-కామర్స్ ఆపరేటర్లు చెల్లించవలసి ఉంటుంది.
    GST-Ecommerce-Operator
   •  ప్రతి నెల 21 వ తేదీనాడు, వేదికపై ఇ-కామర్స్ ఆపరేటర్ మరియు సరఫరాదారులు నివేదించిన సరఫరా మధ్య ఏదైనా తేడా ఫారం జిఎస్టి ఐటిసి-1 లో అందుబాటులో ఉంచబడుతుంది. అది సమర్పించబడిన నెల లో రిటర్న్ లో ఈ తేడా నివారించబడాలి. పై ఉదాహరణలో, అక్టోబర్ సరఫరాల కోసం ఫాస్ట్ డీల్స్ 10 నవంబర్ ’17నాడు ఫారం జిఎస్టిఆర్-8 అందజేసారు. 21 నవంబర్ ’17 నాడు జిఎస్టి ఐటిసి-1 లో ఏదైనా తేడా నివేదించబడితే, 10 డిసెంబర్ ’17 న ఫైల్ చేయబడవలసిన, నవంబర్ ’17 రిటర్న్ లో అది తప్పక సరిదిద్దబడాలి.

ఇ-కామర్స్ వేదికలపై సఫరాదారులు

ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారలు అంటే ఒక ఇ-కామర్స్ వేదిక పై వస్తువులు లేదా సేవలు సరఫరా చేసే వ్యక్తులు. ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారుల నుండి కావలసినవి ఇవి-

1. తప్పనిసరి రిజిస్ట్రేషన్
ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారులు అందరూ తప్పనిసరిగా జిఎస్టి కింద నమోదై ఉండవలసిన అవసరం ఉంటుంది. అందుకే, వారి సగటు టర్నోవర్ రిజిస్ట్రేషన్ కోసం ఉండవలసిన ప్రారంభ పరిమితిని మించని ఇ-ఇ-కామర్స్ సరఫరాదారులు కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది

2. కాంపోజిషన్ పథకం కోసం అర్హత-లేకపోవడం
ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా వస్తువులు లేదా సేవలను అందించే వ్యక్తికి కాంపొజిషన్ పథకం కింద రిజిస్ట్రేషన్ కోసం అర్హత ఉండదు. అందువల్ల, ఆ వ్యక్తి యొక్క సగటు టర్నోవర్ ఒకవేళ రూ 50 లక్షలు మించకపోయినాగాని, అతనికి/ఆమెకి ఒక కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారు అయ్యేందుకు ఎంపిక అందుబాటులో ఉండదు.

3. రిటర్నుల ప్రక్రియ
ఒక ఇ-కామర్స్ వేదిక మీద సరఫరాదారు ఒక సాధారణ డీలర్ కు వర్తించే జిఎస్టి రిటర్న్ ప్రక్రియ . అనుసరించవలసి ఉంటుంది. ఇందుకు అదనంగా, ఇ-కామర్స్ వేదికల ద్వారా సరఫరాలకు సంబంధించి అందించవలసిన వివరాలు క్రింది విధంగా ఉంటాయి –

   • ప్రతి నెల 10వ తేదీన, ఇ-కామర్స్ వేదికల ద్వారా చేసిన బయటికి సరఫరాల వివరాలు గల ఫారం జిఎస్టిఆర్ -1 ని ఒక సరఫరాదారు అందజేయవలసి ఉంటుంది. ఫారం జిఎస్టిఆర్ -1లో, ఇ-కామర్స్ వేదిక ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే నమోదుచేసుకోబడిన వ్యక్తులకు చేసిన సరఫరాల యొక్క ఇన్వాయిస్ వారీగా వివరాలు మరియు నమోదుకాని వ్యక్తులకు చేసిన సరఫరాల యొక్క సగటు విలువ అందించవలసి ఉంటుంది.
   • ప్రతి నెల 11వ తేదీన, ఫారం జిఎస్టిఆర్-2ఎ సరఫరాదారుకు అందుబాటులో ఉంచబడుతుంది. ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా ఫైల్ చేయబడిన ఫారం జిఎస్టిఆర్-8 ఆధారంగా, గత నెలలో ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా సేకరించబడిన పన్ను యొక్క సరాసరి మొత్తం దానంతట అదే నింపబడుతుంది.
    GST-Ecommerce-Suppliers
   • ప్రతి నెలలో 15 వ తేదీన, ఒక సరఫరాదారు ఫారం జిఎస్టిఆర్ -2 అందజేయాలి, ఇందులో ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా సేకరించబడిన పన్ను వివరాలను అంగీకరించవచ్చు లేదా సవరించవచ్చు. సేకరించబడిన పన్ను,తాత్కాలిక ప్రాతిపదికన సరఫరాదారు యొక్క ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ కు జమ చేయబడుతుంది, దీనిని పన్ను బాధ్యతకు వ్యతిరేకంగా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు.
   • ప్రతి నెలలో 21వ తేదీన, ఫారం జిఎస్టి ఐటిసి-1 సరఫరాకు అందుబాటులో ఉంచబడుతుంది. అందజేయబడిన సరఫరాలతో ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా నివేదించబడిన సరఫరాల మధ్య ఏదైనా తేడా చూపబడుతుంది. తేడా తెలియజేయబడిన నెలకోసం రిటర్న్ లోనే అది తప్పక సరిదిద్దబడాలి. తేడా సరిదిద్దబడకపోతే మరియు ఆపరేటర్ల ద్వారా అందజేయబడిన సరఫరా విలువ సరఫరాదారు ద్వారా అందజేయబడిన విలువ కంటే ఎక్కువగా ఉంటే, వడ్డీతో సహా అవకలన మొత్తం సరఫరాదారు యొక్క తదుపరి నెల పన్ను బాధ్యతకు చేర్చబడుతుంది.

    పై ఉదాహరణలో, 10 నవంబర్ ’17 నాడు, అక్టోబర్ సరఫరాల కోసం రాకేష్ ప్రెవేట్ లిమిటెడ్ ఫారం జిఎస్టిఆర్ -1 అందజేసారు. ఒకవేళ, 21 నవంబర్ ’17 నాడు ఏదైనా తేడా గనక ఫారం జిఎస్టి ఐటిసి-1 లో నివేదించబడితే, 10 డిసెంబర్ ’17 నాడు ఫైల్ చేయబడవలసిన నవంబర్ ’17 కోసం రిటర్న్ లో అది తప్పక సరిదిద్దబడాలి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

100,892 total views, 73 views today