ఫార్వార్డ్ ఛార్జ్ వస్తువుల కోసం సరఫరా సమయం ఏమిటి అనే మా ఇంతకు పూర్వపు బ్లాగ్ పోస్ట్ లో మేము ఫార్వర్డ్ ఛార్జ్ పై వస్తువుల సరఫరా సమయం చర్చించాము. ఈ బ్లాగ్లో, మనం రివర్స్ ఛార్జ్ పై ఉన్న వస్తువుల సరఫరా సమయం గురించి చర్చించుకుందాం.
వివిధ అసంఘటిత రంగాల నుండి వస్తువుల లేదా సేవల అమ్మకం పై పన్ను వసూలు చేయబడేలాగా నిర్ధారించుకోవడానికి, ప్రభుత్వం రివర్స్ ఛార్జ్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. దీని క్రింద, సరఫరాదారుకి పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉన్న ఫార్వర్డ్ ఛార్జ్ లో లాగా కాకుండా, వస్తువుల లేదా సేవల గ్రహీత లేదా కొనుగోలుదారు ప్రభుత్వం క్రెడిట్ కు పన్ను చెల్లించాలి. సరఫరాదారు నుండి కొనుగోలుదారునికి తరలించబడిన పన్ను చెల్లింపు బాధ్యతలో మార్పిడి అనేది కీలకమైన మార్పు.

Under ప్రస్తుత వ్యవస్థ క్రింద

వేట్ క్రింద, నమోదుకాని డీలర్స్ నుండి చేసిన కొనుగోళ్ల పై, వస్తువుల గ్రహీత (రిజిస్టర్డ్ డీలర్) కొనుగోలు పన్ను అనబడే ఒక పన్ను చెల్లించవలసి ఉంటుంది.
ఉదాహరణకు, కర్ణాటకలో ఉన్న ఒక నమోదిత డీలర్ అయిన రామ్ ట్రేడర్స్, ఒక నమోదు చేయబడని వర్తకుడైన శ్రీ శివ కుమార్ నుండి వస్తువులు కొనుగోలు చేసారు. ఈ కొనుగోలులో, కొనుగోలు పన్ను చెల్లించవలసిన బాధ్యణి రామ్ ట్రేడర్స్ వహించవలసి ఉంటుంది.

జిఎస్టి కింద

జిఎస్టి కింద, రివర్స్ చార్జ్ మెకానిజం యొక్క అదే భావన అలాగే నిలుపబడింది. ఇది వస్తువుల మరియు సేవల నిర్దిష్ట సరఫరాపై వర్తింపచేయబడుతుంది, ఇది ఇంకా ప్రభుత్వం ద్వారా తెలియజేయబడవలసి ఉన్నది.

రివర్స్ ఛార్జ్ యంత్రాంగం క్రింద మనం వస్తువుల కోసం సరఫరా సమయాన్ని అర్ధం చేసుకుందాం.

జిఎస్టి (వర్తించే విధంగా సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి లేదా ఐజిఎస్టి) యొక్క బాధ్యత క్రింద చూపిన విధంగా ఉత్పన్నమవుతుంది:

క్రింది వాటిల్లో అన్నింటికంటే ముందుగా వచ్చేది
వస్తువులు అందుకున్న తేది గ్రహీత ద్వారా వస్తువులు అందుకోబడిన తేది.
చెల్లింపు తేది చెల్లింపు చేయబడిన తేది. గ్రహీత యొక్క ఖాతాల పుస్తకాలలో చెల్లింపు లెక్కచూపబడిన తేది లేదా అతని బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీలలో ముందుగా వచ్చే తేది అయి ఉంటుంది.
ఇన్వాయిస్ తేదీ నుండి 30 రోజులు సరఫరాదారు ద్వారా ఇన్వాయిస్ జారీచేయబడిన తేది నుండి 30 రోజుల తర్వాత వెంటనే వచ్చేతేది

ఒకవేళ, ఏదైనా కారణం వలన, పై తేదీలు గనక నిర్ధారించబడలేకపోతే, అప్పుడు గ్రహీత యొక్క పుస్తకాల్లో సరఫరా నమోదు చేయబడిన తేదినే సరఫరా సమయం అవుతుంది.

మనం ఉదాహరణలతో అర్ధం చేసుకుందాం రండి.

వస్తువులు అందుకున్న తేది ఇన్వాయిస్ తేది చెల్లింపు తేది వస్తువుల సరఫరా సమయం వివరణ
29 జులై, 20175 ఆగస్ట్, 20175 ఆగస్ట్, 201629 జులై, 2017వస్తువులని అందుకున్న తేదీ, ఈ సందర్భంలో, చెల్లింపు తేదీ కంటే ముందు మరియు ఇన్వాయిస్ తేదీ నుండి 30 రోజులకు ఉంది. అందువల్ల, సరఫరా సమయం 29 జులై, 2017 అయి ఉంటుంది.
15 ఆగస్ట్, 201725 ఆగస్ట్, 201730 జులై, 201730 జులై, 2017చెల్లింపు తేదీ అనేది వస్తువులని అందుకున్న తేదీ కంటే ముందుగా మరియు ఇన్వాయిస్ తేదీ నుండి 30 రోజులకు ఉంది. అందువల్ల, సరఫరా సమయం 30 జులై, 2017 అయి ఉంటుంది.
10th ఆగస్ట్, 20171st జులై, 201715th ఆగస్ట్, 201731st జులై, 2017ఈ సందర్భంలో, ఇన్వాయిస్ తేదీ నుండి 30 రోజుల సమయం అనేది వస్తువులని అందుకున్న తేదీ మరియు చెల్లింపు తేదీ కంటే ముందు ఉన్నది. అందువల్ల, సరఫరా సమయం 31 జులై, 2017 అయి ఉంటుంది..
రాబోతున్నవి

రివర్స్ ఛార్జ్ యంత్రాంగం పై సేవల కోసం సరఫరా సమయం

మాకు మీ సహాయం కావాలి

కింది వ్యాఖ్యలని ఉపయోగించి ఈ బ్లాగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని దయచేసి పంచుకోండి.
అలాగే ఏ జిఎస్టి సంబంధిత విషయాలని గురించి మీరు మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారో మాకు తెలియజేయండి, మేము మా కంటెంట్ ప్రణాళికలో వాటిని సంతోషంగా చేర్చుతాము.
ఇది సహాయకారిగా అనిపించిందా? క్రింద సోషల్ షేర్ బటన్ను ఉపయోగించి దీన్ని ఇతరులతో పంచుకోండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

37,870 total views, 440 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.