మేక్ ఇన్ ఇండియా ” ప్రచారం అనేది ప్రపంచ పటంపై ఒక ఉత్పాదక కేంద్రంగా భారతదేశం యొక్క స్థానానికి భారీ విజయాన్ని అందించింది. డెలాయిట్ ప్రకారం, 2020 చివరినాటికి ప్రపంచంలోకెల్లా 5 వ అతిపెద్ద ఉత్పాదక దేశంగా భారతదేశం అవుతుందని అంచనా.

అయితే, మనకి చాలా ముఖ్యమైనది ఐబిఇఎఫ్. ప్రకారం, ఇది -గత 2 దశాబ్దాలలో నిలచిపోయిన దశని చూసి ప్రస్తుతం మన జిడిపిలో లో 16% వాటాకు దోహదపడే- ఉత్పాదక రంగానికి అద్భుతాలు చేస్తామని వాగ్దానం చేస్తుంది. అది మరి నిజంగా మన తయారీదారులకు శుభవార్తే కదా.
కానీ కేవలం ఒక ప్రచారం రాత్రికి రాత్రే విషయాలు తిరగతిప్పబోతోందా? బహుశా కాకపోవచ్చు. “మేక్ ఇన్ ఇండియా”ని ఎలాగ సంభవం చేయాలనే దానిపై ప్రభుత్వానికి ఆలోచనలు, ఆవిష్కరణలు, మరియు వ్యూహాల పూర్తి మందుగుండు సామాను సిధ్ధంగా ఉండగా తమ మొదటి ఆయుధం – జిఎస్టిని .

కాబట్టి, మీరు గనక తయారీదారు అయితే, మీ కోసం జిఎస్టి మంచిగా ఉండబోతోందా లేక చెడుగానా? 1 జూలై నుండి మీరు జిఎస్టిని అవలంబించడానికి సిద్ధపడటంతో మీరు మళ్లీ ఆలోచించవలసిన విషయాలేమైన ఉన్నాయా? అన్వేషించండి.

సకారాత్మక ప్రభావం

తగ్గిన ఉత్పత్తి ఖర్చు

ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థలో, ఒక తయారీదారు రాష్ట్రాంతర (ఇంటర్-స్టేట్) సేకరణలలో చెల్లించిన కేంద్ర అమ్మకపు పన్నుపై పన్ను క్రెడిట్ ను పొందలేడు. అదేవిధంగా, ఆక్ట్రోయి, స్థానిక సంఘం పన్నులు, ప్రవేశపన్ను వంటి ఇతర క్రెడిట్ చేయబడదగని పన్నులు ఉన్నాయి. ఇవన్నీ ఉత్పత్తి వ్యయానికి వచ్చి చేరతాయి.
ఈ సమస్య తయారీఅనంతర దశలో కొనసాగుతుంది, ఎందుకంటే పన్నులు ఒకదానిపై మరొక్కటిగా దొంతరపడి ఉంటాయి కాబట్టి. తయారీదారుల లాగా – పంపిణీదారులు, డీలర్లు మరియు చిల్లరవ్యాపారులు కూడా వారి ఇన్పుట్ పై పన్ను క్రెడిట్ ను పొందలేకపోతున్నారు – చిట్టచివరికి కొస వినియోగదారులకు వస్తువుల ధర పెరుగుతూ పోతుంది. ఇది భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు ప్రతిగా పోటీతత్వం పై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంటుంది మరియు పరోక్షంగా భారత తయారీదారుని దెబ్బతీస్తుంది.
మొత్తంమీద దేశానికి జిఎస్టి ఇచ్చే గొప్ప వరాల్లో ఒకటి ఏమిటంటే – పన్నులు దొంతరపడిపోయే ప్రభావాలను తగ్గించడం. ఉత్పాదక దశలో వస్తువులు మరియు సేవలు రెండింటికీ పన్నుఎత్తివేయడాలు అనుమతించబడతాయి – ప్రభావవంతమైన పరోక్ష పన్నును తగ్గించి తయారీదారునికి స్థిరమైన క్రెడిట్ ప్రవాహాన్ని నిర్వహించి ఉండటం. అంతే కాక – ఒక తయారీదారుగా, ఎక్కడ నుండి సేకరించాలనే నిర్ణయాల టెన్షన్ తీసుకోవలసిన అవసరం ఉండకపోవచ్చు – జిఎస్టి చిత్రంలోకి రావడంతో, ఒక తయారీదారు స్థానిక, రాష్ట్రాంతర (ఇంటర్-స్టేట్) లేదా దిగుమతి (ఒక్క బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయించి, ఇది దిగుమతులపై విధించబడటం కొనసాగుతుంది) ఎక్కడి నుంచి సేకరిస్తారనే దానితో నిమిత్తం లేకుండా ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేయవచ్చు.

బహుళ మూల్యాంకన పధ్ధతులకు స్వస్తి

ప్రస్తుతం, ఉత్పాదన చేయబడిన వస్తువులు ఎక్సైజ్ సుంకానికి లోబడి ఉంటాయి – ఇది ప్రస్తుతం వివిధ పద్ధతుల ద్వారా లెక్కించబడుతుంది. కొన్ని సందర్భాల్లో – ఎడ్ వాలోరెమ్ (లావాదేవీ విలువపై) అవలంబించబడుతుంది; కొన్ని సందర్భాల్లో ఎడ్ క్వాంటం (పరిమాణంలో) అవలంబించబడుతుంది; కొన్ని సందర్భాలలో రెండింటి కలయిక అవలంబించబడుతుంది. ఉత్పాదనచేయబడిన వస్తువుల్లో చాలావరకు ఎంఆర్పి మూల్యాంకనను అనుసరిస్తాయి, ఇందులో గరిష్ట రిటైల్ ధర యొక్క ఒక నిర్దిష్ట శాతంలో డ్యూటీ లెక్కించబడుతుంది. సమస్యకు జోడించబడేది ఏమిటంటే, ఎంఆర్పి మూల్యాంకన నియమాలు వాటికి అవిగానే చాలా గందరగోళంగా ఉన్నాయి. వ్యక్తులకు అమ్మబడిన ప్యాకేజీ వస్తువులు, వర్సెస్ సంస్థలకు అమ్మబడిన ప్యాకేజీ వస్తువులు వర్సెస్ కాంబో ప్యాకులుగానూ, ప్రమోషనల్ ప్యాకులుగానూ అమ్మబడిన ప్యాకేజీ వస్తువులకు వేర్వేరు నియమాలు వర్తిస్తాయి.
అయితే జిఎస్టి వ్యవస్థ కింద, తయారీదారు చెల్లించవలసిన జిఎస్టి లావాదేవీ విలువ ఆధారంగా లెక్కించబడుతుంది. ఇది అనేక మదింపు పద్ధతుల సంక్లిష్టతను లోపలికి గ్రహించుకుని, తయారీదారుడికి జీవితాన్ని సులభం చేస్తుంది. వీటికి ఉండగల సంభావ్య మినహాయింపులు 2 ఉత్పత్తులు మాత్రమే అయి ఉంటాయి, అవి ఏమిటంటే బొగ్గు, దీనికి గరిష్ట సుంకం పరిమితి ఐఎన్ఆర్ 400 /టన్నుకి; మరియు పొగాకు, దీనికి గరిష్ట సుంకం పరిమితి ఐఎన్ఆర్ 4170 / వెయ్యి కాడలకు ఉంటుంది.

రాష్టం వారీ రిజిస్ట్రేషన్ వర్సెస్ ఫ్యాక్టరీ వారీ రిజిస్ట్రేషన్

ఇంతకుముందు, ఒక తయారీదారు బహుళ ఫ్యాక్టరీల కోసం బహుళ పన్ను రిజిస్ట్రేషన్లను తీసుకోవలసి వచ్చేది, అవి అదే ప్రాంతంలో లేదా రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా. ఉదా. కర్ణాటకలోనే 10 ఫ్యాక్టరీలు గల తయారీదారుడు 10 వేర్వేరు రిజిస్ట్రేషన్లను తీసుకోవాలి. సంక్షిప్తంగా, ఏదైనా భారీఎత్తున చేద్దామని ఊహించే ఏ తయారీదారులకైనా ఇది కట్టుబడి ఉండాలంటే ఒక పీడకలగా ఉండేది. కానీ జిఎస్టి వ్యవస్థలో, పన్ను పరిధిలోకి వచ్చే కార్యక్రమం కోసం పరిగణించబడేది సరఫరా కావడంతో, అదే తయారీదారు ఒకే రాష్ట్రంలో ఉన్న అన్ని 10 యూనిట్లకి ఒకే రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అందువల్ల ఒక రాష్ట్రంలో అదే పన్ను పరిధిలోకి వచ్చే తయారీదారు కోసం ప్రత్యేక నమోదు అవసరం ఉండదు.

ఆర్ధిక కారకాలపై ఆధారపడి సరఫరా గొలుసు పునర్నిర్మాణం.

ప్రస్తుత వ్యవస్థలో, వ్యాపారాలు మరియు సరఫరా గొలుసులు సాధారణంగా పన్ను చెల్లించే సౌలభ్యం ఆధారంగా నిర్మితమై ఉంటాయి.
జిఎస్టి రావడంతో, తయారీదారు చివరకు ముఖ్యమైనది ఏదో దానిమీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు – వ్యాపార సామర్థ్యం – మరియు ఖర్చులు, స్థానం ప్రయోజనాలు, కీలక వినియోగదారులకు దగ్గరగా ఉండటం వంటి కార్యాచరణ మరియు ఆర్థిక కారణాలపై గిడ్డంగుల నిర్ణయాలు తీసుకోబడవచ్చు. నిజానికి, తయారీదారులు ఇప్పుడు వస్తువుల మరియు సేవ యొక్క రాష్ట్రఅంతర (ఇంటర్-స్టేట్) సరఫరాపై ఇన్పుట్ పన్ను క్రెడిట్ ను పొందగలరు, అలాగే సరఫరా గొలుసు నుండి మొత్తం గిడ్డంగులు తుడిచిపెట్టబడిపోవడం కూడా మనం చూడవచ్చు – ఇది మరింతగా ఖరీదు లాభాలకు దారితీస్తుంది.

వర్గీకరణ వివాదాల తగ్గుదల

ప్రస్తుతం వివిధ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం మరియు వేట్ (VAT) యొక్క భిన్నమైన రేట్లు అలాగే ఎక్సైజ్ మరియు వేట్ చట్టాల క్రింద ఇచ్చిన అనేక మినహాయింపులు కారణంగా, సెంట్రల్ ఎక్సైజ్ మరియు వేట్ రెండింటి కింద వర్గీకరణ వివాదాలు అనేవి, ప్రత్యేకంగా ఉత్పాదక రంగానికి సంబంధించినవి, చట్టపరమైన వివాదాలకు మామూలు కారణం అవుతూ ఉంటాయి. సరళీకృత రేటు నిర్మాణంపై నడిచే మరియు మినహాయింపులను తగ్గించబడడంతో – జిఎస్టి ఆరంభంతో – ఉత్పత్తుల వర్గీకరణకు సంబంధించిన వివాదాల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుంది.

ద్వంద్వ నియంత్రణ ఏదీ లేదు

ప్రస్తుత వ్యవస్థలో, తయారీదారు ద్వంద్వ నియంత్రణకు లోబడి ఉంటాడు – ఎందుకంటే అతను సాధారణంగా కేంద్రం ద్వారా ఎక్సైజ్ కోసం మరియు రాష్ట్రం ద్వారా వేట్ కోసం అంచనా వేయబడతాడు కాబట్టి. జిఎస్టి శకంలో కూడా, ఒక తయారీదారుకి సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి రెండింటిని చెల్లించవలసిన బాధ్యత ఉండటంతో – ఒక తయారీదారు రెండు విధాలుగా అంచనా వేయడం కొనసాగుతుందని ఒక నిజమైన ఆందోళన రేకెత్తింది. ద్వంద్వ నియంత్రణ యొక్క ఈ అంశం రాష్ట్రాలు మరియు కేంద్రం రెండింటి ద్వారా తీవ్రంగా చర్చించబడింది మరియు అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ద్వంద్వ నియంత్రణను నివారించేందుకు ప్రభుత్వం 2017 జనవరిలో ఏకాభిప్రాయాన్ని సాధించింది. ప్రతిపాదిత జిఎస్టి వ్యవస్థలో ఐఎన్ఆర్ 1.5 కోట్లు లేదా తక్కువ టర్నోవర్ కలిగిన ఎస్సెసీలు అందరిలో 90% మంది రాష్ట్ర అధికారుల ద్వారా పరిశీలన మరియు ఆడిట్ కోసం అంచనా వేయబడతారు, మిగిలిన 10% మంది కేంద్రం ద్వారా అంచనా వేయబడతారు. ఆ పరిమితికి మించి, కేంద్రం మరియు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో అంచనా వేస్తాయి. ఈ చర్య తప్పనిసరిగా చిన్న వ్యాపారుల యొక్క ఆసక్తిని కాపాడటానికి, మరియు జిఎస్టి పరివర్తనం అనేది సాఫీగా మరియు సమర్థవంతంగా జరిగేలాగా చేయడంలో ఎంతగానో సహకరిస్తుంది.
మొత్తంమీద, జిఎస్టి ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో ఒక తయారీదారునికి మేలు చేస్తుంది – అన్నింటిలోకి చాలా ముఖ్యమైనవి ఏమిటంటే, వ్యాపారంలో చేయడంలో పెరిగిన సౌలభ్యం మరియు అనేక రంగాల్లో తగ్గించబడిన ఖర్చులు అనేవి. కానీ, ఇంకా మనం చూసుకోవలసిన అంశాలను ఉండవచ్చా? ఈ అంశంపై మా తదుపరి బ్లాగ్ లో మరింత చదవండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

119,231 total views, 81 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.