ఈ అంశంపై మా గత బ్లాగులో, మేము, మన దేశవ్యాప్తంగా తయారీదారుపై జిఎస్టి యొక్క సకారాత్మక ప్రభావాలను కొన్నింటిని చర్చించాము. వ్యాపార సౌలభ్యం, మరియు పలు రంగాల్లో ఖర్చులు తగ్గింపు పరంగా ముఖ్య ప్రయోజనాలు ఉండటంతో, తయారీ రంగానికి బహుశా అనుకూలంగా ఉండని కొన్ని అంశాలు వస్తువులు మరియు సేవా పన్ను లో ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

నకారాత్మక ప్రభావం

తగ్గించబడిన కార్యాచరణ మూలధనం

ప్రస్తుత పన్ను విధింపు వ్యవస్థ క్రింద, స్టాక్ బదిలీలకు పన్ను విధించబడదు, అయితే ఫారం ఎఫ్ సమర్పించబడి ఉండాలి. ఇన్పుట్ వేట్ క్రెడిట్ అనేది కొనుగోలులో చెల్లించిన పన్ను యొక్క 4% కంటే ఎక్కువగా లభిస్తుంది, మరియు ఆ విధంగా వెనక్కు వచ్చిన 4%, ఉత్పత్తి వ్యయంలోకి వెళ్తుంది. అయితే, జిఎస్టి వ్యవస్థలో, స్టాక్ బదిలీలు ‘సరఫరా’గా భావించబడతాయి మరియు జిఎస్టికి లోబడి ఉంటాయి. ఈ దశలో చెల్లించిన జిఎస్టి పూర్తిగా క్రెడిట్ గా అందుబాటులో ఉంటుంది అని వాదించినప్పటికీ, అంతిమ సరఫరా పూర్తయినప్పుడు మాత్రమే ఆ పని పూర్తవడం జరుగుతుంది. ఉదాహరణకు, చెన్నైలో సరఫరా చేయవలసిన బెంగళూరులోని ఒక తయారీదారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది, దీని క్రెడిట్ అతనికి సరఫరా పూర్తయినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఇది చేసేదేమిటంటే నగదు ప్రవాహాన్ని నిరోధించడం మరియు ఆ విధంగా తయారీదారుల కార్యాచరణ మూలధనాన్ని ప్రభావితం చేయడం..

Under the GST regime, stock transfers are deemed to be ‘supply’ and are subject to GSTClick To Tweet
జిఎస్టి నుంచి పెట్రోలియం మినహాయింపు

5 పెట్రోలియం ఉత్పత్తులు – ముడి పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్, మోటారు స్పిరిట్, నేచురల్ గ్యాస్ మరియు విమానయాన ఇంధనం – జిఎస్టి యొక్క పరిధికి వెలుపల ఉంటాయి. దీని అర్థం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం విధించడం కొనసాగుతుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం వేట్ విధించడం కొనసాగుతుంది అని – వేరే మాటల్లో చెప్పాలంటే, పన్ను విధింపు దొంతరపడడం కొనసాగుతుంది. అయితే, అసలు సమస్య ఇందుకు భిన్నమైనది – ప్రస్తుతం, ఈ ఉత్పత్తులకు చెల్లించిన ఎక్సైజ్ సుంకం క్రెడిట్ అందుబాటులో ఉంది; కానీ ఒకసారి జిఎస్టి వస్తే, క్రెడిట్ అందుబాటులో ఉండదు. వివిధ తయారీ ప్రక్రియల్లో, అలాగే వివిధ దశల్లో ఉత్పత్తుల రవాణాకు పెట్రోలియం ఉత్పత్తులు సాధారణంగా ఉపయోగించబడతాయని తెలిసి – ఇది ఖచ్చితంగా ఉత్పాదక ఖర్చులను పెంచుతుంది. ఇది పెట్రోలియం భారీ పాత్ర పోషించే టెలికాం, ఎరువులు, పవర్ మరియు లాజిస్టిక్స్ వంటి పరిశ్రమలను ప్రత్యేకంగా దెబ్బ తీస్తుంది. కౌన్సిల్ యొక్క సిఫార్సుల ఆధారంగా ఈ పెట్రోలియం ఉత్పత్తులపై జిఎస్టి ప్రభుత్వం ద్వారా తరువాత రోజుల్లో నిర్థారించబడవచ్చు.

మినహాయింపులకు తగ్గించబడిన ప్రవేశ పరిమితి

ప్రస్తుత పన్ను నిర్మాణంలో, అనేక రాష్ట్రాల్లో వేట్ నుంచి మినహాయింపు కోసం ప్రవేశపరిమితి ఐఎన్ఆర్ 5-10 లక్షలు; ఐఎన్ఆర్ 1.5 కోట్ల టర్నోవర్ గల తయారీ యూనిట్లు ఎక్సైజ్ సుంకాన్ని ఆకర్షిస్తాయి, ఐఎన్ఆర్ 10 లక్షల మరియు అంతకంటే ఎక్కువ ఆదాయంగల యూనిట్లు పన్ను పరిధిలోకి వచ్చే సేవను అందించిన మీదట సేవా పన్ను చెల్లించవలసి ఉంటుంది. కానీ జిఎస్టి వ్యవస్థలో ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల కోసం ఐఎన్ఆర్ 10 లక్షల ఏకీకృత ప్రవేశపరిమితి మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఐఎన్ఆర్ 20 లక్షలు అమలవుతాయి –ఇంతకు ముందు మినహాయింపులను అనుభవిస్తున్న తయారీదారులను ఇది భారీ సంఖ్యలో పన్నుచెల్లించదగిన బ్రాకెట్లోకి తీసుకువస్తుంది. అయితే, ఇంతకుముందు ఒక రిజిస్టర్డ్ డీలర్ కాని, కాని ఇప్పుడు జిఎస్టి కింద రిజిస్టర్ చేసుకోవలసిన బాధ్యత గల ఒక తయారీదారు, ఒకరితో ఒకరు వ్యాపారం చేయాలనుకునే రిజిస్టర్డ్ ఎంటిటీల నెట్వర్క్ లో అతను ఇప్పుడు ఒక భాగం అవుతాడు కాబట్టి అతను తన వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో భారీగా లాభం పొందుతాడు అని కూడా వాదించవచ్చు.

GST will bring a huge number of manufacturers who were enjoying exemptions earlier into the taxable bracket.Click To Tweet

చెయ్యాలా వద్దా?

జిఎస్టి యొక్క చాలా అంశాలు ఉత్పత్తిదారుడికి నేరుగా సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండగా, ఏ స్పష్టమైన సమాధానంలేని, ఊహాగానాలు చేసుకోవడానికి విడిచిపెట్టబడిన అంశాలు కొన్ని ఉన్నాయి. జిఎస్టి ప్రవేశపెట్టడంతో తాను లాభం పొందుతానా లేదా నష్టపోతానా అని తయారీదారు అంచనా వేసుకోవాలి మరియు తదనుగుణంగా అతని వైఖరిని మార్చుకోవాలి.

రాష్ట్ర ప్రోత్సాహకాలు

ప్రస్తుత వ్యవస్థలో, తమ పెట్టుబడుల ప్రోత్సాహక విధానాల క్రింద రాష్ట్రాల ద్వారా వారికి అందించి ఉండి ఉండగల ప్రోత్సాహకాల ఆధారంగా కంపెనీల ద్వారా ఏర్పాటు చేయబడిన యూనిట్లు అనేకం కనిపిస్తాయి. ఈ ప్రోత్సాహకాలు ప్రధానంగా రెండు రకాలు – సుంకాల ప్రోత్సాహకాలు (తక్కువ పన్ను రేట్లు, పన్నులను తిరిగి చెల్లించడం / వాయిదా వేయడం మొదలైనవి) మరియు సుంకం-కాని ప్రోత్సాహకాలు (తక్కువ ధరలో స్థలం లీజు నిబంధనలు, తక్కువ విద్యుత్ డ్యూటీ మొదలైనవి). ప్రస్తుతం, అటువంటి ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుంది, కానీ జిఎస్టి కింద, అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్దేశించబడిన ఏకరూపతను సాధించడానికి ఇటువంటి ప్రోత్సాహకాలను అన్నింటినీ తగ్గించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఉత్సాహకర ప్రోత్సాహకాలు అన్నింటికీ ఏమవుతుంది అనేది జిఎస్టి చట్టం తెలియజేయదు, అందుచేత తయారీదారులు వారి ఆర్థిక అంచనాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది – ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రమైనా మరొక రాష్ట్రం అంతగా చక్కటి ఉత్పాదక గమ్యంగా మారవచ్చు కాబట్టి.
జిఎస్టి అనేది ఒక గమ్యస్థాన ఆధారిత వినియోగ పన్ను, అందువలన వినియోగం భారీగా ఉన్న రాష్ట్రాలు లాభం పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాస్తవం మరొక ముఖ్యమైన మార్పుని తీసుకు వస్తుంది.అందువల్ల వినియోగదారు రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పాదన చేసే రాష్ట్రాలకు అందించేందుకు తక్కువ ఆర్థిక ప్రోత్సాహకాలు ఉంటాయి, ఎందుకంటే సరఫరా వినియోగించుకోబడుతున్న రాష్ట్రాలకు జిఎస్టి క్రెడిట్ చేయబడుతుంది కాబట్టి. అందువల్ల, ముందుకు వెళ్తున్న అన్ని ప్రోత్సాహకాలు సంభావ్యంగా సుంకం-రహితంగా ఆధారితమైనవి అయి ఉంటాయని సురక్షితంగా భావించవచ్చు.

ప్రాంతం ఆధారిత మినహాయింపులు

కొన్ని తయారీ విభాగాలు కొన్ని ప్రాంతాల్లో- ఉదాహరణకు, నిర్దిష్ట వెనుకబడిన ప్రాంతాల్లో, ఈశాన్యం మరియు కొండ రాష్ట్రాలలో పన్నుల మినహాయింపు పొందుతున్నాయి. అటువంటి ప్రాంతం-ఆధారిత మినహాయింపులతో ఎలాగ వ్యవహరించాలి అనేదాని గురించి జిఎస్టి చట్టం ఎటువంటి స్పష్టతను అందించదు – కానీ భారతదేశాన్ని ఒక ఏకీకృత మార్కెట్ గా చేయాలనే జిఎస్టి యొక్క ఉద్దేశ్యం చూస్తే, చాలా మినహాయింపులు తీసివేయబడవచ్చు మరియు మిగిలిన కొద్దిపాటివి రిఫండ్ రూపంలో అందుబాటులో ఉండవచ్చు. సరైన వినియోగం కోసం కంపెనీలు ఎల్లప్పుడూ తమ కేసులను ప్రభుత్వం ముందు వాదించుకోగలిగినప్పటికీ, జిఎస్టి జూలైలో అమలవడంతో తక్షణ నష్టం వాటిల్లవచ్చు.

ఇ-వే బిల్లు

భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సమర్పించిన రెవెన్యూ న్యూట్రల్ రేట్ రిపోర్టుని బట్టి చూస్తే – రోజుకు 800 కిలోమీటర్ల ప్రయాణించే అమెరికాలో ట్రక్కులతో పోలిస్తే భారతదేశంలో ట్రక్కులు సగటున రోజుకు 280 కి.మీ. ప్రయాణిస్తాయి. అందుకు కారణం? – మన రాష్ట్ర సరిహద్దులు అన్నింటి వెంటా ఉండే చెక్ పాయింట్లు, ఇన్-ట్రాన్సిట్ (రవాణాలో ఉన్న) సరుకుని తనిఖీ చేయడం, అలాగే వే బిల్లులు, ఎంట్రీ పర్మిట్స్ వంటి అనువర్తనానికి సంబంధించిన పత్రాలను జారీ చేయడంలో గణనీయమైన సమయం వృథా చేస్తాయి- అందువలన భారతీయ తయారీదారుల సామర్థ్యం గణనీయంగా తగ్గించబడిపోతుంది.

జిఎస్టి వ్యవస్థలో – సంబంధిత పన్నులు జిఎస్టి కింద కలుపబడి ఉండటం వలన వాణిజ్య అడ్డంకులు కనీసం చేయబడగా, అదే దానిని అమలు చెయ్యడం కంటే చెప్పడం సులభంగా ఉంటుంది. జిఎస్టి కింద ఐఎన్ఆర్ 50,000 రూపాయల కన్నా ఎక్కువ విలువైన వస్తువుల తరలింపు ప్రారంభించాలని భావిస్తున్న ఒక రిజిస్టర్డ్ వ్యక్తి ఇ-వే బిల్లు. ని రూపొందించుకోవలసి ఉంటుంది. భారత మార్కెట్ ను ఐక్యపరచడం మరియు వస్తువుల ప్రవాహం సాఫీగా సాగడానికి సహాయం చేయడం అనేది ఉద్దేశ్యం కాగా, మొత్తం ప్రక్రియ గజిబిజిగా ఉంటుంది. దీనికి సరఫరాదారు, రవాణాదారు మరియు – ఇ-వే బిల్లు పరిధిలో ఉన్న సరుకుకు చాలా స్వల్ప వ్యవధిలో తన అంగీకారం లేదా తిరస్కారాన్ని తెలియచేయాల్సిన గ్రహీత కూడా పాల్గొనవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల, తగ్గిన జాబితా ఖర్చుల ద్వారా ఉత్పత్తి చేయబడే ఏ పొదుపులైనా కట్టుబడి ఉండటం మరియు అనుబంధ సాంకేతికత అమలు ఖర్చులను పూర్తిచేసుకోవడంలో ఆవిరైపోయేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, మొదట్లో వచ్చే అడ్డంకుల్ని ఒకసారి అధిగమించి మరియు మరింత సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడంతో, ప్రస్తుత లాజిస్టికల్ సమస్యలు కొంత కాల వ్యవధిలో తగ్గుతాయని భావిస్తున్నారు.

ముగింపుగా, ప్రతికూలమైనవాటికి విరుధ్ధంగా అనుకూలమైనవాటిని తూస్తే, జిఎస్టి తప్పనిసరిగా ఉత్పాదక విభాగానికి ఉపయోగకరంగా ఉంటుంది – చాలావరకు ప్రయోజనాలు తక్షణమైనవై మరియు కొన్ని ప్రయోజనాలు దీర్ఘకాలికమైనవై ఉంటాయి. కొద్ది సమయం కోసం చూస్తే సవాలుభరితంగా ఉండగల కొన్ని అంశాలు ఉన్నప్పటికీ, మంచి రోజులని తీసుకుని రాగల ముందు ముందు రానున్న పెద్ద మార్పులో ఇది చాలా సహజమైనది, మరియు “మేక్ ఇన్ ఇండియా!” వెనుకగల ప్రయత్నాలు మరియు ఆలోచనలకు నిజంగా ఊపిరి పోస్తుంది,

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

94,473 total views, 1 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.