రోజువారీ కార్యకలాపాలను చేపట్టడానికి వర్కింగ్ కాపిటల్ అనేది ఒక వ్యాపారం యొక్క జీవనరేఖ. వర్కింగ్ కాపిటల్ ని సమర్ధవంతంగా నిర్వహించడం అనేది చిన్న మరియు పెద్ద వ్యాపారాలు రెండింటినీ కలచివేసే ఒక సమస్య. వర్కింగ్ కాపిటల్ ని నిర్వహించడంలో అసమర్ధత అనేది వ్యాపారాలు అకాలంలోనే మూసివేయడంతో సహా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు.

ఒక సమగ్ర పరోక్ష పన్ను విధానమైన జిఎస్టి, అమలులోకి రావడానికి కొన్ని నెలల దూరంలో ఉంది. వివిధ రోజువారీ కార్యకలాపాల పై జిఎస్టి యొక్క పర్యవసానాలను వ్యాపారాలు అర్థం చేసుకోవాలి.

అందువల్ల, ఎస్ఎంఇ ల కోసం జిఎస్టి వర్కింగ్ కాపిటల్ ని ప్రభావితం చేసే మార్గాలను మనం పరిశీలించి, మీ ప్రయోజనానికి జిఎస్టి ని ఎలా ఉపయోగించుకోవచ్చో అర్థం చేసుకుందాం.

ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ యొక్క ఒక భావనగా “వ్యాపారం వ్యాప్తి” ప్రవేశపెట్టడం

ప్రస్తుత వ్యవస్థలో ఉపయోగించుకోబడిన లేదా మీ పన్ను విధించదగిన అవుట్పుట్ కు అనుసంధానింపబడిన ఇన్పుట్ల పై మాత్రమే ఇన్పుట్ పన్ను క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు, ఒక వర్తకుడుగా, వస్తువుల కొనుగోలుపై చెల్లించిన ఇన్పుట్ వాట్అనేది పన్ను విధించదగిన విక్రయాలపై మాత్రమే క్రెడిట్ గా అందుబాటులో ఉంటుంది. అయితే, వ్యాపార ఓవర్ హెడ్స్ పై చెల్లించిన ఏ పన్ను అయినా క్రెడిట్ గా అనుమతించబడదు. ఉదాహరణకు, ఒక వ్యాపారస్తుని ద్వారా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రకటనల సేవల పై చెల్లించబడిన సర్వీస్ టాక్స్ ను క్రెడిట్ గా అనుమతించడం జరగదు మరియు వ్యాపార ఖర్చులుగా పరిగణించబడాలి.

జిఎస్టి లో, ఇన్పుట్ పన్ను క్రెడిట్ భావన అనేది వ్యాపర విస్తరణ క్రమంలో లేదా కోసం “ఉపయోగించబడిన లేదా ఉపయోగించడం కోసం ఉద్దేశించబడిన” ఏదైనా ఇన్పుట్ లేదా సేవలను చేర్చడానికి విస్తరింపజేయబడింది. అందువల్ల, అటువంటి అన్ని ఇన్పుట్లు మరియు ఇన్పుట్ సేవలపై వ్యాపారాలు ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చెయ్యడానికి అనుమతించబడతాయి. పైన ఉపయోగించిన ఉదాహరణలో, ప్రకటనల సేవలపై చెల్లించిన పన్ను కోసం ఒక వర్తకుడు క్రెడిట్ పొందవచ్చు.

ఒక పనిచేసే లెక్కింపుతో మనం దీనిని మరింతగా అర్ధం చేసుకుందాం

వివరాలుప్రస్తుత వ్యవస్థజిఎస్టి
స్థూల లాభం10,00,00010,00,000
పరోక్ష ఖర్చులు 
మరమ్మతు మరియు నిర్వహణ *#1,15,0001,00,000
ప్రకటన ఖర్చులు *#1,15,0001,00,000
ప్రింటింగ్ మరియు స్టేషనరీ**1,15,000 3,45,0001,00,000 3,00,000
నికర లాభం6,55,0007,00,000
మెరుగైన లాభదాయకత %  7%

(*ప్రస్తుత వ్యవస్థ కింద పన్ను రేటు @ 15% గా పరిగణించబడుతుంది. # జిఎస్టి క్రింద పన్ను రేటు @ 18% గా పరిగణించబడుతుంది ** జిఎస్టి రేటు @ 12%)

మీరు గమనిస్తే, ప్రస్తుత వ్యవస్థలో, పన్నులతో సహా వ్యాపార ఖర్చులు లాభం & నష్టం ఖాతాకు డెబిట్ చేయబడతాయి. ఇది ఎందుకంటే, వ్యాపారం ఓవర్ హెడ్స్ పై ఇన్పుట్ పన్ను క్రెడిట్ అనుమతించబడదు కాబట్టి. విస్తృతంగా, పన్ను చెల్లించదగిన ఇన్పుట్ కి నేరుగా అనుసంధానించబడిన ఆ ఇన్పుట్ సేవలు లేదా వస్తువుల పై మాత్రమే ఇన్పుట్ పన్ను క్రెడిట్ అనుమతించబడుతుంది.

జిఎస్టి కింద, ‘వ్యాపర విస్తరణ క్రమంలో లేదా కోసం ఉపయోగించబడిన లేదా ఉపయోగించడం కోసం ఉద్దేశించబడిన’ వ్యాపార ఖర్చుల పై ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసేందుకు వ్యాపారాలు అనుమతించబడతాయి. దాని ఫలితంగా, పై పట్టికలో, పన్నులను మినహాయించి వాస్తవ ఖర్చులు మాత్రమే లాభం & నష్టం ఖాతాకు డెబిట్ చేయబడ్డాయి.

“వ్యాపార విస్తరణ” అనే ఈ భావన మీ పనిచేసే ఖర్చు తగ్గిస్తుంది మరియు నేరుగా మీ వ్యాపార నికర మార్జిన్లని పెంచుతుంది, తద్వారా మీ వర్కింగ్ కాపిటల్ ని బలపరుస్తుంది.

దీని పరపతి వినియోగించుకోవడానికి, వ్యాపారాలు నమోదు చేయబడిన వ్యాపారాల నుండి వస్తువులని లేదా సేవలను తీసుకోవలసి ఉంటుంది, మరియు వ్యాపారం ఓవర్హెడ్స్ పై చెల్లించిన పన్నుకు లెక్క చెప్పవలసి ఉంటుంది.

ఇన్పుట్ పన్ను క్రెడిట్ పై ప్రభావం

ప్రస్తుత వ్యవస్థలో, మీ ద్వారా వినియోగించుకోబడిన ఇన్పుట్ క్రెడిట్ విలువ సరఫరాదారు ద్వారా పన్ను బాధ్యత యొక్క ‘నిజ సమయం’ ఆమోదంపై ఆధారపడి ఉండదు.

అయితే, జిఎస్టి కింద, మీ సరఫరాదారు యొక్క కట్టుబడి ఉండటంపై ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఆధారపడి ఉంటుంది, అంటే పన్ను చెల్లింపుతో పాటుగా మీ సరఫరాదారు బాహ్య సరఫరాలను వెల్లడిస్తూ రిటర్న్ దాఖలు చేయాలి.

మీ సరఫరాదారు గనక కట్టుబడి ఉండకపోతే, అది మీ నగదు ప్రవాహానికి పెద్ద లొట్ట పెడుతుంది. ఏదో కారణం వలన, మీ సరఫరాదారు గనక చెల్లుబాటు అయ్యే రిటర్న్ అందించలేక పోయినట్లయితే, మీ ద్వారా క్లెయిమ్ చేయబడిన ఇన్పుట్ పన్ను క్రెడిట్ తిరగతిప్పబడుతుంది మరియు దానిని మీరు వడ్డీతో సహా డిచ్ఛార్జ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మీ నగదు ప్రవాహానికి ఒక జంట దెబ్బ తగులుతుంది:

  • మీరు ఇప్పటికే మీ సరఫరాదారునికి చెల్లించారు.
  • ఐటీసీ దావా తిరగతిప్పబడినందున, మీరు వడ్డీతో పాటు పన్ను చెల్లించాలి.

అయితే, ఐటిసి క్లెయిమ్ ను తిరగతిప్పే ముందు వ్యత్యాసాలను ఆమోదించడానికి డ్రాఫ్ట్ చట్టం ఒక 2 నెలల విండోను అందించడంతో కొంత ఊపిరాడేందుకు స్థలం దొరుకుతుంది.

అందువలన, జిఎస్టి కింద విక్రేత నిర్వహణ చాలా కీలకమైనది. సరఫరాదారుకి సమయానుకూలమైన కట్టుబడి ఉండే విశ్వసనీయత ఉన్న చోట, మీ లోపలివైపుకి సరఫరాపై ఇన్పుట్ పన్ను క్రెడిట్ యొక్క సకాలంలో క్లెయిమ్ కోసం వీలుకల్పించే కారకాలలో ఇది ఒకటి. మీరు మీ ప్రస్తుత అమ్మకందారులకేసి తిరిగి చూసుకుని, సమీక్షించి మరియు అనువర్తనం కలిగి ఉన్న విక్రేతలను గుర్తించాలి. జిఎస్టి అనువర్తనం రేటింగ్ మీకు మంచిగా కట్టుబడి ఉండే సరఫరాదారులని ఎన్నుకోవటానికి సహాయపడుతుంది.

దీని అంతటికీ అర్ధం ఏమిటి?

మీకు కట్టుబడి ఉండటం పట్లు క్రమశిక్షణ లేకుంటే, మీరు మీ వినియోగదారులను కోల్పోవచ్చు. అదేవిధంగా, మీ సరఫరాదారు కట్టుబడకుండా ఉంటే, అతను మిమ్మల్ని కోల్పోవచ్చు.

జిఎస్టి కింద, వ్యాపారాలు తమ రేటింగ్ కోల్పోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఎగవేతలు లేకుండా ఉండేలాగా నిర్ధారించుకోవాలి మరియు ఇది చివరకు వ్యాపారాన్ని చంపివేయగలదు.

Under GST, businesses must ensure that they do not default because they might lose their rating, and this might eventually kill the business.Click To Tweet

ముందస్తు చెల్లింపులు (అడ్వాన్సులు) పన్ను పరిధిలోకి రావడం

జిఎస్టి కింద, తరువాత తేదీలో వస్తువుల లేదా సేవల సరఫరా చేయడానికి ముందుగానే చెల్లింపు అందుకున్న మీదట, ముందస్తు చెల్లింపు అందుకున్న తేదీనాడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం, ముందస్తు చెల్లింపులను అందుకోవడంపై పన్ను చెల్లింపు అనే భావన కేవలం సర్వీస్ టాక్స్ లో మాత్రమే ఉంది. జిఎస్టిలో వస్తువుల పైకి ఈ విస్తరించబడిన అంశం, వస్తువుల సరఫరాలో నిమగ్నమైన వ్యాపారాల నగదు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికి కారణం ఏమిటంటే, ఇన్నాళ్ళూ కూడా, ఒక తయారీదారు లేదా వస్తువుల వ్యాపారిగా, ముందుగానే చేసిన చెల్లింపులో ఒక భాగం పన్నుగా చెల్లించవలసిన బాధ్యత లేదు, కానీ జిఎస్టి లో మీరు చెల్లించాల్సి ఉంటుంది.

రెండవది, ముందస్తు చెల్లింపు అందుకున్న మీదట సరఫరాదారు ద్వారా పన్ను చెల్లించబడినప్పటికీ, గ్రహీత దానిని వెంటనే ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా క్లెయిమ్ చేయలేరు. ఇది ఎందుకంటే పన్ను ఇన్వాయిస్ మరియు ఒకసారి చెప్పబడిన వస్తువులని లేదా సేవలని తాను అందుకున్న మీదట మాత్రమే ఐటిసి అందుబాటులో ఉంటుంది కాబట్టి.

ఫలితంగా, ఒప్పందాలలో ‘అడ్వాన్స్ క్లాజ్’కు సంబంధించి తగు జాగ్రత్త తీసుకోవాలి. దయచేసి ఒప్పందాలను రూపకల్పనచేసేటప్పుడు సహాయం పొందండి. శాతం పూర్తి పద్దతుల ఆధారంగా ఇన్వాయిస్లు లేవనెత్తబడగలిగితే, వాటిని మూల్యాంకన చేయాలి.

శాఖలకు వస్తువుల బదిలీ చేయడం యొక్క ప్రభావం

సెంట్రల్ ఎక్సైజ్ కింద, ఎక్సైజ్ పరిధిలోకి వచ్చే సరుకు బదిలీ చేస్తున్న ఒక నమోదిత తయారీదారు 100%+10% ఉత్పత్తి ఖర్చు పై ఎక్సైజ్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది, మరియు వేట్ క్రింద, ఫారం ఎఫ్ సమర్పించిన మీదట, సరుకుల బదిలీలు పన్ను విధించబడదగినవి అవవు.

జిఎస్టి కింద, ‘సరఫరా’లో బదిలీలు ఉంటాయి. పరిగణన లేకుండా కొన్ని నిర్దిష్ట సరఫరాల యొక్క పన్ను పరిధిలోకి రావడం, మరియు నిర్ధిష్ట వ్యక్తులు అనే భావనకి జిఎస్టి కింద సరుకు బదిలీ పన్ను విధించబడుతుంది అని అర్ధం. జిఎస్టి కింద సరుకు బదిలీల యొక్క పన్ను పరిధిలోకి రావడం అనేది, నగదు ప్రవాహంపై ప్రభావాన్ని చూపుతుంది. దీనికి కారణం ఏమిటంటే, సరుకు బదిలీ తేదీన పన్ను చెల్లించబడుతుంది, మరియు స్వీకరించే శాఖ ద్వారా సరుకు అందుకోబడటం జరిగినప్పుడు ఐటిసీ సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది కాబట్టి.

పన్ను సందర్భాల కారణంగా, అదనపు వర్కింగ్ కాపిటల్ కోసం అవసరం ఏర్పడుతుంది మరియు ఇది స్వల్ప వర్కింగ్ కాపిటల్ కలిగి ఉండి పనిచేసే ఎస్ఎంఇలకు ఒక సవాలుగా ఉంటుంది. శాఖల అవసరాన్ని పరిశీలించడం, శాఖల సమర్థవంతమైన ప్రణాళిక, మరియు బ్రాంచ్ నుంచి బ్రాంచిల మధ్య బదిలీల పరపతి వినియోగించుకోవడం అనేది వర్కింగ్ కాపిటల్ పై ప్రభావం తగ్గించగలదు.

అందువల్ల, మీ వ్యాపార కార్యకలాపాలు ఎక్కడి నుంచి నడపబడతాయో ఆ అన్ని వివిధ ప్రాంతాల్లోనూ ప్రభావం విశ్లేషణ నిర్వహించబడేలాగా నిర్ధారించుకోండి.

అంతేకాక, ఒక సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి లకు వ్యతిరేకంగా ఒక ఐజిఎస్టి (ఇంటర్ ఆపరేటివ్) అయినా, మీరు చెల్లించవలసిన పన్నుల యొక్క స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం మీకు సహాయకరంగా ఉంటుంది.

సేవా రంగంలో ఎస్ఎంఇలు

ప్రస్తుతం సేవా పన్ను క్రింద, రిజిస్ట్రేషన్ కేంద్రీకృతమై ఉంటుంది, మరియు ఇది భారతదేశవ్యాప్తమైనది. దీని ఫలితంగా, దేశవ్యాప్తంగా సేకరించబడిన ఇన్పుట్ సేవలపై వినియోగించుకున్న ఇన్పుట్ సేవా పన్ను ఏ విధమైన పరిమితి లేకుండా సర్వీస్ టాక్స్ బాధ్యతలను తీసివేయడానికి ఉపయోగించుకోవచ్చు. జిఎస్టి కింద, రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వారీగా ఉంటాయి. ఒక సేవల సరఫరాదారు, అతను బాహ్య సేవలను అందించే రాష్ట్రంలో నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క సిజిఎస్టి + ఎస్జిఎస్టి ను మరొక రాష్ట్రంతో తీసివేయడానికి ఒక పరిమితి ఉంది. దీని కారణంగా ఒక శాఖ వద్ద ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందబడి మరియు వేరొక శాఖ యొక్క పన్ను బాధ్యతలను తొలగించుకోవడం కోసం వినియోగించుకోలేని పరిస్థితి సృష్టించబడవచ్చు. ఇది వ్యాపార నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతుంది.

ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ఐఎస్డి) భావన జిఎస్టి కింద అందుబాటులో ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఇది ఉపయోగపడదు.

రెండవది, 5%, 12%, 18% మరియు 28% యొక్క పన్ను రేటు నిర్మాణపు తుది నిర్ణయంతో మరియు 18% పన్ను పరిధిలో సేవలను చేర్చినట్లయితే, ప్రస్తుత వ్యవస్థ యొక్క 15% సేవా పన్నుతో పోలిస్తే సేవ 3% ఎక్కువ ధర కలిగి ఉంటుంది. ప్రవాహంలో ఈ అదనపు పెరుగుదల కారణంగా, వర్కింగ్ కాపిటల్ పెంచుకోవలసిన అవసరం తలెత్తుతుంది.

ఈ విషయంలో మీ చార్టర్డ్ అకౌంటెంట్స్ మరియు టాక్స్ కన్సల్టెంట్ల నుండి మార్గదర్శకత్వం మీరు మెరుగ్గా సిద్ధపడేందుకు సహాయం చేస్తుంది.

విలోమ సుంకం నిర్మాణం

విలోమ సుంకం నిర్మాణం అనేది అవుట్పుట్లపై పన్ను కంటే ఇన్పుట్లపై పన్ను ఎక్కువగా ఉండే పరిస్థితి. ఉదాహరణకు, ముడి పదార్థాలపై ఎక్సైజ్ సుంకం రేటు 12.5% మరియు పూర్తయిన సరుకుల పై ఎక్సైజు సుంకం 6%. సాధారణంగా, ఇది ఔషధ పరిశ్రమలో మరియు ముడి పదార్థాల దిగుమతి విషయంలో ఉంటుంది. ఈ పరిస్థితి వినియోగించుకోబడని క్రెడిట్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఉదాహరణ ప్రకారం, 12.5% లో 6% కంటే ఎక్కువైనది, అనగా 6.5 ఎప్పుడూ ఉపయోగించబడదు మరియు పేరుకుపోతుంది.

సెంట్రల్ ఎక్సైజ్ కింద, ఎగుమతుల విషయంలో మాత్రమే రిఫండ్ అనుమతించబడుతుంది, మరియు విలోమ సుంకం నిర్మాణం కారణంగా పేరుకుపోయిన క్రెడిట్ కు, రిఫండ్ అనుమతించదగినది కాదు. ఇది నిధుల అవరోధానికి దారితీసింది.

జిఎస్టి కింద, విలోమ సుంకం నిర్మాణం యొక్క ప్రయోజనం మెరుగైన నగదు ప్రవాహాన్ని అనుమతిస్తుంది. జిఎస్టి లో, విలోమం సుంకం నిర్మాణం కారణంగా పేరుకుపోయిన వినియోగించుకోబడని ఇన్పుట్ పన్ను క్రెడిట్ ను క్లెయిమ్ చేయడానికి వ్యాపారాలు అనుమతించబడతాయి. రిఫండ్ క్లెయిమ్ యొక్క సరళీకృత ప్రక్రియ, మరియు రిఫండ్ యొక్క వేగవంతమైన ప్రక్రియతో జోడించబడిన ఇది వ్యాపారాలకు ప్రధాన ఉపశమనం – రిఫండ్ క్లెయిమ్ యొక్క 90% తాత్కాలిక ప్రాతిపదికన మరియు ధృవీకరణ తర్వాత 10% పంపిణీ చేయబడుతుంది.

జిఎస్టికు మార్పు చెందిన మీదట ఇన్పుట్ పన్ను క్రెడిట్

జిఎస్టి కు మార్పు చెందిన తేదీన, చివరి రిటర్న్ (జిఎస్టి కి ముందు) లో ప్రతిబింబించబడిన సెన్వాట్ (CENVAT) మరియు ఇన్పుట్ వాట్ (VAT) యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ని సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందువల్ల, అర్హతగల ఇన్పుట్ పన్ను క్రెడిట్ రిటర్న్ లలో పూర్తిగా చూపబడేటట్లుగా మరియు జిఎస్టి కు మార్పు అనేది ఏ ఇన్పుట్ పన్ను క్రెడిట్ నష్టం లేకుండా జరిగేవిధంగా అన్ని కొనుగోళ్లకు వ్యాపారాలు లెక్కచెప్పడం చాలా ముఖ్యం.

ప్రస్తుత వ్యవస్థలో, చెల్లించబడిన ఎక్సైజ్ సుంకం మరియు ప్రవేశ పన్ను వంటి కొన్ని సుంకాల పై మరియు పన్నులపై వ్యాపారాలు క్రెడిట్ తీసుకోవడానికి అనుమతించబడవు. ఇది వివిధ కారణాల వలన కావచ్చు:

  • మీరు ప్రస్తుతం మినహాయించబడిన వస్తువుల తయారీలో లేదా మినహాయించబడిన సేవను అందించడంలో నిమగ్నమై ఉండి ఉండవచ్చు. జిఎస్టి కు బదిలీ అయినప్పుడు, ఈ వస్తువులు లేదా సేవలకు పన్ను విధించబడవచ్చు.
  • మీ మొత్తం క్లియరెన్స్ విలువ 1.5 కోట్ల కంటే తక్కువగా ఉండటం వలన మీరు ఒక నమోదుకాని తయారీదారు అయి ఉండవచ్చు. జిఎస్టి కింద, ప్రత్యేక శ్రేణి రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ మరియు కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్) కోసం రూ .10 లక్షల మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు రూ. 20 లక్షల గరిష్ట పరిమితి ఆధారంగా మీరు నమోదుచేసుకోవలసిన బాధ్యత కలిగి ఉండవచ్చు.
  • మీరు ఎక్సైజ్ సుంకం చెల్లించే వ్యాపారి అయి ఉండవచ్చు. ఇన్పుట్ క్రెడిట్ కోసం ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు.

శుభవార్త ఏమిటంటే, జిఎస్టి కు బదిలీ చేసే తేదీన క్లోజింగ్ సరుకు పై చెల్లించిన సుంకాలు మరియు పన్నులు చట్టం ద్వారా నిర్దేశించిన నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఉన్న మీదట ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అనుమతించబడతాయి.

ఇది దొంతరపడుతూపోయే ప్రభావం మరియు ద్వంద్వ పన్ను విధింపు విధానాన్ని తొలగిస్తుంది మరియు వ్యాపారం యొక్క అదనపు మూలధన అవసరాలను నింపుకోవడంలో ఎస్ఎంఇలకు సహాయపడుతుంది.

అందువల్ల, జిఎస్టి కింద అర్హత ఉన్న ఇన్పుట్ క్రెడిట్ యొక్క ప్రయోజనాన్ని పొందగలిగే విధంగా వ్యాపారాలు తమను తాము సిద్ధం చేసుకోవడం అనివార్యం అవుతుంది. కొన్ని సూచనల్లో ఇవి ఉన్నాయి:

  • నియమం 11 లేదా పన్ను ఇన్వాయిస్ కు ప్రతిగా చేసిన అన్ని కొనుగోళ్లు మీ పుస్తకాలలో లెక్క చెప్పబడ్డాయని నిర్ధారించుకోండి
  • తప్పిపోయిన ఏవైనా క్రెడిట్ సందర్భాలను గుర్తించడానికి లావాదేవీల యొక్క క్రమానుగత సమీక్షను నిర్వహించండి
  • సరైన ముందుకు తీసుకునిపోబడే బ్యాలెన్స్ నిర్ధారించడానికి డెబిట్ నోట్లు / క్రెడిట్ నోట్లు పరిష్కరించబడి ఉండేలాగా నిర్ధారించుకోండి
ముగింపు

ఏ వ్యాపారానికైనా వర్కింగ్ కాపిటల్ అనేది ఇంధనం, మరియు ఎస్ఎంఇ లకు, కొత్త పరోక్ష పన్ను వ్యవస్థను స్వీకరించేటప్పుడు వర్కింగ్ కాపిటల్ పై జిఎస్టి యొక్క ప్రభావం అనేది ఒక గొప్ప సవాలుగా ఉంటుంది. ఏ ఇన్పుట్ పన్ను క్రెడిట్ నష్ట పోకుండా సాఫీగా పరివర్తన చెందటం కోసం సంసిద్ధత, వ్యాపార ఓవర్ హెడ్లపై ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందటం మరియు సమర్థవంతమైన అమ్మకందారుని నిర్వహణ ఇవన్నీ కూడా వర్కింగ్ కాపిటల్ పై నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సత్య ప్రమోద్, సిఎఫ్ఒ, టాలి సొల్యూషన్స్ ద్వారా రచింపబడిన ఈ వ్యాసం మొదట ది ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించబడింది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

22,235 total views, 6 views today