అక్టోబర్ 14, 2016 న, కాన్స్టెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి), దేశవ్యాప్తంగా సుమారుగా 6 లక్షల తమ సభ్య వ్యాపారాలని జిఎస్టి విషయం పై శిక్షణ అందించేందుకు టాలీ సొల్యూషన్స్ తో ఒక ఎంఒయు సంతకం చేసింది. డిజిటల్ టెక్నాలజీల యొక్క ప్రాముఖ్యతను వర్తక సముదాయం అభినందించేందుకు మరియు ఆమోదించేందుకు వీలుకల్పించడం పై ముఖ్యంగా దృష్టిని కేంద్రీకరించి, మనము 1 జూలై నుండి జిఎస్టి ని స్వీకరించాము కాబట్టి ఈ అసోసియేషన్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు మార్గదర్శక వెలుగుగా ఉపకరిస్తుంది.

దేశంలోని అతిపెద్ద వ్యాపార సంఘాలలో ఒకటే తమను తాము 8 నెలలు ముందుగానే విద్యావంతులను చేసుకునేందుకు ఎన్నుకోవడం అనేది, దేశంలో లక్షలాది మంది వ్యాపారులపై జిఎస్టి కలిగి ఉండబోయే ప్రభావాన్ని చూపనున్నది. ఇక్కడ ఇంక కొంచెం ఎక్కువ వివరంగా అర్ధం చేసుకోవడం, జిఎస్టి అనంతరం ఒక వర్తకునికి జీవితం ఎలాగ మారుతుంది.

సంతోషించదగిన పాయింట్లు

రిజిస్ట్రేషన్ కోసం పెరిగిన ప్రవేశ పరిమితి

ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థలో, చాలా రాష్ట్రాల్లో వేట్ రిజిస్ట్రేషన్ కోసం 5 – 20 లక్షల విలువ అనేది ప్రవేశ పరిమితిగా ఉంది. వస్తువులు మరియు సేవల పన్నులో, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు (ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు 7 ఈశాన్య రాష్ట్రాలు) ఐఎన్ఆర్ 10 లక్షల ఏకీకృత (యూనిఫైడ్) ప్రవేశ పరిమితి మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఐఎన్ఆర్ 20 లక్షలు అవుతుంది – దీని అర్ధం మరింతమంది వర్తకులకు పన్ను ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇది ముఖ్యంగా స్టార్ట్ అప్ లు మరియు కొత్త వ్యాపారాల విషయంలో సహాయపడుతుంది, వారు పెంచబడిన పరిమితిపై పరపతితో, ప్రారంభ సమయాలలో అనువర్తనాన్ని గురించిన ఒత్తిడి తీసుకోకుండా వ్యాపారాన్ని చక్కగా స్థాపించడానికి మరింతగా దృష్టి పెట్టగలుగుతారు

పెంచబడిన కాంపొజిషన్ విధింపు

ప్రస్తుత పరోక్ష పన్నుల వ్యవస్థలో, చాలావరకు రాష్ట్రాల్లో కాంపొజిషన్ పథకం లెవీ ఐఎన్ఆర్ 50 లక్షలు ఉంది. ఇటీవలే జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశాల్లో, ప్రతిపాదిత కాంపొజిషన్ పరిమితి ఐఎన్ఆర్ 50 లక్షల నుండి ఐఎన్ఆర్ 75 లక్షలక పెంచబడింది, అయితే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల కోసం ఐఎన్ఆర్ 50 లక్షల దగ్గర ఉంచబడింది. ఏ వర్తకునికైనా, అతను చెల్లించవలసిందల్లా తన టర్నోవర్ పై లెక్కకట్టబడిన 1% జిఎస్టి లేదా అతను ఒక చిన్న రెస్టారెంట్ ని గనక నడుపుతున్నట్లయితే 5% జిఎస్టి ఫ్లోర్ రేటు మాత్రమే కాబట్టి ఈ ఐఎన్ఆర్ 25 లక్షల అదనపు మార్జిన్ తప్పనిసరిగా ఒక భారీ సానుకూల సంకేతమై ఉంటుంది.
అలాగే, జిఎస్టి కౌన్సిల్ సిఫారసు ప్రకారం ప్రభుత్వం 75 లక్షల ప్రవేశ పరిమితిని గరిష్టంగా 1 కోటికి పెంచవచ్చు, భారతీయ వ్యాపారి కోసం మరింత మంచి శుభవార్త ఎదురుచూస్తూ ఉండవచ్చు..

ఎక్సైజ్ కోసం ఐటిసి అందుబాటులో ఉండటం

ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది వర్తకులకు కేవలం వేట్ రిజిస్ట్రేషన్ ఉందికాని ఎక్సైజ్ కింద నమోదు చేయబడి లేరు. ఫలితంగా, ఒక వర్తకుడు ఎక్సైజ్ కోసం ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) తీసుకోవడానికి అర్హుడు కాదు, దానితో అది చివరికి అతని కొనుగోలుదారుకి వ్యయంగా పాస్ ఆన్ చేయబడుతుంది, అది పెరిగిన ఖర్చులకు దారితీస్తుంది. జిఎస్టి అనంతరం, ఎక్సైజ్ కు సమానమైనదిగా సిజిఎస్టి విధించబడుతుంది కాబట్టి- పన్నులు అలాగ దొంతరపడిపోయే ప్రభావం తొలగించబడుతుంది. ఇన్పుట్ సిజిఎస్టి యొక్క పూర్తి క్రెడిట్ అందుబాటులో ఉండటం వలన, గొలుసు వెంట అంతా ఐటిసి యొక్క ఒక అనియంత్రిత ప్రవాహం ఉంటుంది. తన పన్ను బాధ్యతను ఆఫ్-సెట్ చేసుకోవడానికి దీనినే ఒక ఎస్ఎంఇ ఉపయోగించుకోవచ్చు–ఇదంతా కూడా ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ తో.

ఇన్పుట్ సేవలు/వ్యాపార వ్యయాలకు ఐటిసి అందుబాటులో ఉండటం

ప్రస్తుతం, వ్యాపారులకు వ్యాపార క్రమంలో ఉపయోగించిన ఇన్పుట్ సేవలకు చెల్లించిన పన్నుపై ఐటీసీ అనుమతించబడదు. అయితే, జిఎస్టిలో “వ్యాపారాన్ని మెరుగుపరచడం” అనే భావన ప్రవేశపెట్టబడింది, అయితే వర్తకుడు వాణిజ్య ప్రకటనల సేవలు, ప్రమోషన్లు వంటి వ్యాపారాభివృధ్ధి కోసం ఉపయోగించిన సేవలపై ఐటీసీని పొందవచ్చు. ఇది అతని లాభదాయకతను పెంచుతుంది మరియు అలాగే అతని కార్యాచరణ మూలధనం (వర్కింగ్ క్యాపిటల్) పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

క్యాపిటల్ వస్తువులు కొనుగోలు చేయడం పై పూర్తి మరియు వెంటనే ఐటిసి

ప్రస్తుతం, క్యాపిటల్ వస్తువుల కొనుగోలుకి వ్యతిరేకంగా ఐటిసి వర్తకునికి వెంటనే అందుబాటులో లేదు, ఇంకా అది కూడా, కొన్ని నిర్దిష్ట క్యాపిటల్ వస్తువుల పై మాత్రమే అందుబాటులో ఉంది. అనేక రాష్ట్రాల్లో, అనేక నెలల వ్యాప్తంగా విస్తరించిన వాయిదాల రూపంలో ఐటిసి లభ్యమవుతుంది; మిగతా చోట్లల్లో, క్యాపిటల్ వస్తువులను వ్యాపార ఉపయోగంలోకి తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఐటిసి లభిస్తుంది. అయితే, ఒకసారి జిఎస్టి వస్తే, క్యాపిటల్ వస్తువులు మరియు వాణిజ్యం కోసం వస్తువులను ఒకే విధంగా వ్యవహరించడం జరుగుతుంది మరియు క్యాపిటల్ వస్తువుల కొనుగోలుపైనే పూర్తి ఐటీసీ అందుబాటులో ఉంటుంది – పెట్టుబడిదారుల లాభదాయకతపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉండే మరో విషయం ఇది. ఇందుకు మోటారు వాహనాలు ఒక చెప్పుకోదగిన మినహాయింపు, ప్రయాణికులను లేదా వస్తువులను రవాణా చేయటం లేదా మోటారు వాహనాలపై శిక్షణ ఇవ్వడం వంటి పన్ను విధించదగిన సేవలకు ఉపయోగిస్తే తప్ప, వీటిపై ఐటిసి వినియోగించుకోవడం వీలుకాదు

భారతదేశ వ్యాప్తంగా మార్కెట్లు తెరుచుకోవడం

ప్రస్తుత దృష్టాంతంలో, ఇతర రాష్ట్రాల వ్యాప్తంగా వినియోగదారుల తో మరియు సరఫరాదారులతో లావాదేవీలతో పోలిస్తే రాష్ట్రంలోపల వస్తువులను విక్రయించడం మరియు కొనుగోలు చేయడం వంటివి ప్రాధాన్యం ఇవ్వబడ్డాయి – అంతిమ వినియోగదారుకి పెరిగిన ధరకి దారితీస్తూ, చెల్లించిన సిఎస్టి పై ఐటిసి క్లెయిమ్ చేయడానికి కొనుగోలుదారుకి ఉండే అసమర్థత ఇందుకు ప్రధాన కారణం. అయితే జిఎస్టి వ్యవస్థలో, సిఎస్టిని ఐజిఎస్టి భర్తీ చేస్తుంది, దీని క్రెడిట్ ఎల్లలులేకుండా అందుబాటులో ఉంటుంది, దీనితో రాష్ట్రాల-మధ్య మరియు స్థానిక వ్యాపారులను ఇద్దరినీ సమతల క్రీడాస్థలం పైకి తెచ్చి నిలుపుతుంది. ఇంకొక అదనపు ప్రయోజనం ఏమిటంటే వస్తువులు సరిహద్దులను దాటినప్పుడు ఎంట్రీ పన్నుల తొలగింపు. ఇది ఏమి చేస్తుందంటే, దేశంలో ఒక భాగంలో తయారయ్యే మంచి నాణ్యతగల ఉత్పత్తులకు దేశం యొక్క సుదూర భాగాల్లో మార్కెట్ లభించేలాగా నిర్ధారిస్తుంది. వ్యాపారస్తులు అందరికీ భారతదేశాన్ని ఒక సాధారణ మార్కెట్ గా తెరవడం.

హెచ్చరిక పాయింట్లు

సరఫరాదారు కట్టుబడి ఉండని కారణంగా ఐటిసి అవరోధింపబడటం

జిఎస్టి వ్యవస్థలో, కట్టుబడి ఉండటమనేది సాధారణంగా మరియు ఐటిసి అనేది ప్రత్యేకంగా ఇన్వాయిస్ స్థాయి సమాచారంపై ఆధారపడి ఉంటుంది – ఎందుకంటే సరైన ఐటిసి పొందేందుకు ఇన్వాయిస్ మ్యాచింగ్ ఇన్వాయిస్ అనేది కీలకమై ఉంటుంది కాబట్టి. జిఎస్టి కింద వ్యాపారిని నొక్కిన వాస్తవమైన ఆందోళనల్లో ఒకటి, తన సరఫరాదారు ద్వారా పన్ను చెల్లించని పరిస్థితికి సంబంధించినది. జిఎస్టి కింద వ్యాపారులను దెబ్బతీస్తున్న న్యాయసమ్మతమైన ఆందోళనల్లో ఒకటి ఏమిటంటే వారి సరఫరాదారు ద్వారా పన్ను చెల్లించబడకపోవడం.. జిఎస్టి చట్టం ప్రకారం, గ్రహీత ద్వారా సరిపోల్చబడి అంగీకరించబడిన సరైన అమ్మకాల ఇన్వాయిస్లను అన్నింటినీ అతని సరఫరాదారు అప్లోడ్ చేసినట్లయితే మాత్రమే, ఒక గ్రహీతకు అతనికి రావలసిన ఐటిసి వస్తుంది; మరియు, గ్రహీత ద్వారా అప్లోడ్ చేయబడిన ఏవైనా తప్పిపోయిన కొనుగోలు ఇన్వాయిస్లు కూడా అదే విధంగా సరఫరాదారు ద్వారా సరిపోల్చబడి అంగీకరించబడతాయి.. సంక్షిప్తంగా, సరఫరాదారు గనక ఎగవెయ్య తలచుకుంటే, ఇది వర్తకునికి ఐటిసి నష్టానికి దారితీస్తుంది. ఆదర్శవంతంగా, ఇది ‘కట్టుబడి ఉండే ‘ వ్యాపారులు ‘’కట్టుబడి ఉండని’ వారితో వ్యవహరించకుండా ఉండేందుకు దారి తీస్తుంది – కానీ పన్ను క్రెడిట్ ఒక సారి నష్టపోవడమనే మూల్యం చెల్లించిన తర్వాత. అయితే, వర్తకులు ముందస్తుగానే సమర్థవంతమైన విక్రేత నిర్వహణ – కట్టుబడి ఉండే విక్రేతలను గుర్తించడం మరియు ఏదైనా సంస్థతో వ్యాపారాన్ని చేయటానికి ముందు క్రెడిట్ రేటింగ్ కోసం పరిశీలించడం ద్వారా వర్తకులు సంభావ్యంగా అటువంటి దృష్టాంతాలను నివారించుకోవచ్చు.

స్టాక్ బదిలీ అనేది ఒక పన్ను విధించదగిన సంఘటనగా మారడం

ప్రస్తుత వ్యవస్థలో, స్టాక్ బదిలీలు పన్ను విధించబడదగినవి కావు – అయితే ఫారం ఎఫ్ సమకూర్చబడి ఉండాలి, వాట్ (VAT) ఛార్జి చేయబడదు. అయితే, ఇన్పుట్ వాట్ క్రెడిట్ కొంత శాతం వద్ద (చాలా రాష్ట్రాలలో 4%) రివర్సల్ (తిరగ తిప్ప) చేయబడుతుంది, మిగిలినది వర్తకులకు క్రెడిట్గా లభిస్తుంది. జిఎస్టి వ్యవస్థలో, స్టాక్ బదిలీ ఒక పన్ను విధించదగిన సంఘటన అవుతుంది . చెల్లించిన పన్ను పూర్తిగా క్రెడిట్ గా అందుబాటులో ఉంటుంది, మరియు ఏ క్రెడిట్ రివర్సల్ అవసరం ఉండదు కూడా – దీని ప్రభావం వర్కింగ్ క్యాపిటల్ మీద ఉంటుంది.. ఇది ఎందుకంటే, స్టాక్ బదిలీ తేదీన చెల్లించిన పన్ను కోసం ఐటిసి అనేది, స్వీకరించే శాఖ ద్వారా స్టాక్ లిక్విడేట్ చేయబడినప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి. అందువల్ల, బ్రాంచీలలో స్థాయికి మించిన నిల్వలకు దారి తీస్తూ, లాజిస్టిక్స్ ప్రణాళిక గనక పేలవంగా ఉంటే, వర్కింగ్ క్యాపిటల్ చాలా కాలం పాటు బ్లాక్ చేయబడుతుంది – ఇది చాలా తక్కువ వర్కింగ్ క్యాపిటల్ తో పనిచేసే ఎస్ఎంఇలకు ఒక ప్రత్యక్ష సవాలు. రాష్ట్రాల మధ్య కొనుగోలు పై ఎల్లలు లేకుండా అందుబాటులో ఉండే క్రెడిట్ మరియు ముందుకు సాగుతూ రాష్ట్ర వ్యాపార సరిహద్దులను సమర్థవంతంగా తొలగించడం ద్వారా, శాఖల / గిడ్డంగుల సంఖ్యలో సంభావ్య తగ్గింపు ఉండవచ్చు – ఎందుకంటే కట్టుబడి ఉండే కారణాల కంటే అవి కార్యాచరణ కోసం మాత్రమే ఉంటాయి కాబట్టి. ఇది స్టాక్ బదిలీలలో తగ్గింపుకు దారి తీస్తుంది, ఇది ఒక వ్యాపారి యొక్క వర్కింగ్ క్యాపిటల్ పై తప్పక స్టాక్ బదిలీ ప్రభావాన్ని రద్దు చేస్తుంది మరి.

కట్టుబడి ఉండే కార్యకలాపం మరియు ఖర్చులు

చూడటానికైతే, ఒక వ్యాపారికి కట్టుబడి ఉండే కార్యకలాపం జిఎస్టి కింద పెరిగినట్లుగా కనిపిస్తుంది, కంప్యుషన్ కార్యకలాపం సంవత్సరానికి (నెలవారీ) సంవత్సరానికి (కొన్ని నెలలలో) కొన్ని రాష్ట్రాలలో ప్రతి సంవత్సరానికి – 4 (త్రైమాసికం) ఉండే వాట్ రిటర్నులు ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరానికి 12 (నెలవారీ) ఉండే వాట్ రిటర్నులు జిఎస్టీ వ్యవధిలో 37 రిటర్నుల (3 నెలవారీ మరియు 1 వార్షిక) తో సమర్థవంతంగా భర్తీ చేయబడుతుంది. అయితే, మనము ప్రస్తుత కట్టుబడి ఉండే కార్యకలాపాలను విశ్లేషించి ఉంటే – ఇది సాధారణంగా నెలవారీ రిటర్నులను ఫారంల రూపంలో సమర్పించడం, ఆ తరువాత సరైన ఐటిసి లెక్కించేందుకు అమ్మకాలు / కొనుగోలు లావాదేవీల వివరాలతో అనుబంధాలను సమర్పించడం అయి ఉంటుంది. అందువల్ల, జిఎస్టి వచ్చినప్పుడు కూడా, కార్యకలాపం దానికై అదిగా ఒకే విధంగానే ఉంటుంది.. అయితే, సరైన కట్టుబడి ఉండటం జరిగేందుకు, సరైన ఐటిసి వినియోగించుకోబడేందుకు, లావాదేవీలు అన్నింటినీ సరిపోల్చడం మరియు ఖచ్ఛితంగా ఫైల్ చేయబడవలసి ఉంటుంది కాబట్టి, జిఎస్టి కింద కార్యకలాపాలు జరిగే లోతు ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాల వ్యాప్తంగా గనక ఎవరికైనా కార్యకలాపాలు ఉంటే, సంక్లిష్టత మరింత పెరుగుతుంది, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ అవసరమవుతుంది కాబట్టి. సేవలు అందించేవారు ఈ మార్పుతో గట్టి దెబ్బ తింటారు, ఎందుకంటే, వారు ఒక కేంద్రీకృత సేవా పన్ను వ్యవస్థ నుండి జిఎస్టి కింద వికేంద్రీకృత సేవల సరఫరాకు మారతారు కాబట్టి. అందువల్ల పని ఖచ్ఛితంగా, కాని సకాలంలో చేయబడుతుందని నిర్ధారించుకునేందుకు, వర్తకులు, సరైన జిఎస్టి సాఫ్ట్ వేర్ మరియు సాంకేతికతలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది– అయితే దీని అదనపు ఖర్చులు అవుతాయి మరి.

వివాదాస్పద విషయాలు

ఇ-కామర్స్ (వాణిజ్యం)

ఇ-కామర్స్ వేదికలపై వ్యాపారుల కోసం, జిఎస్టి ఖచ్చితంగా ఇన్పుట్ క్రెడిట్ లభ్యత రూపంలో వ్యయం తగ్గింపులను మరియు దేశవ్యాప్తంగా సరఫరాలపై ఒకే పన్ను విధింపుని తీసుకువస్తుంది. ఇ-కామర్స్ లావాదేవీల వ్యవహారంపై సుస్పష్టత ఉండటం మరియు విధించబడే పన్నుల ఏకరూపత కారణంగా జిఎస్టి వ్యవస్థలో వ్యాపారాన్ని సులభంగా చేయవచ్చని భావిస్తున్నారు. అయితే మరి, వర్తకులు తమ నగదు ప్రవాహాలపై ఉండే ప్రభావం కోసం కూడా తప్పక సిధ్ధంగా ఉండాలి – ఇ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా మూలం (టిసిఎస్) వద్ద పన్ను సేకరణ, వారి విక్రేతల ద్వారా కట్టుబడి ఉండకపోవడం మరియు నెలవారీగా పన్నులు చెల్లించడం కారణంగా. చాలా ముఖ్యమైనదేమిటంటే, తప్పనిసరి రిజిస్ట్రేషన్ కారణంగా జిఎస్టి వ్యవస్థలో ఇ-కామర్స్ వ్యాపారులకు కూడా కట్టుబడి ఉండే కార్యకలాపాలు పెరుగుతాయి; సంక్షిప్తంగా, వారి మొత్తం టర్నోవర్ ఐఎన్ఆర్ 75 లక్షల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ వారు కాంపొజిషన్ విధింపుని ఎంపిక చేసుకోలేరు. జిఎస్టి కింద కట్టుబడి ఉండవలసిన అవసరాల గురించి అవగాహన, ఈ అవసరాలు నిర్వహించడానికి వనరులకు సరైన శిక్షణ మరియు దీన్నంతటినీ సులభం చేయడానికి సాంకేతికని ఉపయోగించడం అనేది భారతదేశంలో ఇ-కామర్స్ నూతన యుగం నుండి ఇ-కామర్స్ వ్యాపారులు లాభపడగలిగేలాగా నిర్ధారించగలవు.

రివర్స్ ఛార్జి

వాట్ (VAT) క్రింద, నమోదుకాని డీలర్ల నుండి చేసిన కొనుగోళ్ల పై, వస్తువుల గ్రహీత (రిజిస్టర్డ్ డీలర్) కొనుగోలు పన్ను అనబడే ఒక పన్ను చెల్లించవలసి ఉంటుంది. జిఎస్టి క్రింద, రివర్స్ ఛార్జ్ పేరుతో ప్రభుత్వంచే అదే భావన నిలిపి ఉంచబడింది – ప్రాథమికంగా వివిధ అసంఘటిత రంగాల నుండి వస్తువుల అమ్మకం లేదా సేవల సరఫరాపై పన్ను వసూలు చేయబడేలాగా నిర్ధారించేందుకు. దీని క్రింద, పన్ను చెల్లించవలసిన బాధ్యత గ్రహీత కలిగి ఉంటారు. ఇది, ప్రభుత్వం ద్వారా పేర్కొనబడిన నిర్దిష్ట వస్తువులు మరియు సేవల సరఫరాపై వర్తిస్తుంది. అయితే, రివర్స్ చార్జ్ మెకానిజం క్రింద పన్నులను చెల్లించవలసిన బాధ్యతగల వ్యక్తికి తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది.

ఇ-వే బిల్లు

జిఎస్టి వ్యవస్థలో – సంబంధిత పన్నులు జిఎస్టి కింద కలుపబడి ఉండటంతో వాణిజ్య అడ్డంకులను కనిష్టీకరించడం జరగగా, అదే దానిని అమలు చేయటం కంటే చెప్పడం సులభంగా ఉంటుంది. జిఎస్టి కింద ఐఎన్ఆర్ 50,000 కన్నా ఎక్కువ విలువైన వస్తువుల తరలింపు ప్రారంభించాలని భావిస్తున్న ఒక నమోదిత వ్యక్తి ఒక ఇ-వే బిల్లుని సృష్టించాలి. భారతీయ మార్కెట్ ను ఒకటిగా చేయడం మరియు వస్తువుల మృదువైన తరలింపుకి సహాయం చేయడం అనేది ఉద్దేశ్యమై ఉండగా, మొత్తం ప్రక్రియ గజిబిజిగా ఉంటుంది. ఇందుకు సరఫరాదారు, రవాణాదారు మరియు గ్రహీత పాల్గొనడం కూడా ఇందుకు అవసరం – ఇ-వే బిల్లు పరిధిలో ఉన్న సరుకుకు తన అంగీకారం లేదా తిరస్కారాన్ని ఒక స్వల్ప వ్యవధిలో అతను తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల, తగ్గిన జాబితా ఖర్చుల ద్వారా ఉత్పన్నం చేయబడిన ఏవైనా పొదుపులు అనేవి కట్టుబడి ఉండటం మరియు అనుబంధ సాంకేతిక అమలు ఖర్చులను పూర్తిచేసుకోవడంలో హరించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మొదట్లో ఏర్పడే అడ్డంకులను ఒకసారి దాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అవలింబించడంతో, ప్రస్తుత లాజిస్టికల్ సమస్యలు కొంతకాలం గడిచేటప్పటికి తగ్గుతాయని భావిస్తున్నారు. ఇప్పటికైతే, ఇటీవలి ప్రకటనల ప్రకారం వ్యవస్థలు సిద్ధమయ్యేటంవరకు ఇ-వే బిల్లు అమలు చేయడాన్ని నిలిపి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముగింపు

మొత్తం మీద, జిఎస్టి అనేది వర్తక సంఘానికి శుభవార్త. ఒక వ్యాపారి తన వ్యాపార పర్యావరణ వ్యవస్థను చక్కగా నిర్వహించుకున్నంత వరకు, తన సరఫరా గొలుసును సమర్థవంతంగా నిర్వహించుకుని మరియు జిఎస్టికి కట్టుబడి ఉన్నంతవరకు – అతను జిఎస్టి కింద ప్రయోజనాలను పొందటం కొనసాగిస్తారు. అయితే, ఈ విషయంలో సాంకేతికత అనేది తప్పనిసరిగా ఆటని మార్చగలిగినది అయి ఉంటుంది, ఎందుకంటే భారతీయ వ్యాపారవేత్తకు మరిన్ని వ్యాపార ప్రయోజనాలుగా మారేందుకు జిఎస్టి యొక్క కట్టుబడి ఉండవలసిన భారం సమర్థవంతంగా శోషించబడేందుకు ఇది ఏకైక మార్గమై ఉంటుంది కాబట్టి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

239,710 total views, 25 views today