వస్తువులు మరియు సేవల దిగుమతి మరియు ఎగుమతికి వర్తించే పన్నులను పన్నుల చట్టాలు విధించాయి. ప్రస్తుత పన్ను వ్యవస్థలో, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ మరియు వేట్ చట్టాలు దిగుమతుల మరియు ఎగుమతుల యొక్క పన్నుల నిర్వహణని నిర్వచిస్తాయి. జిఎస్టి వ్యవస్థలో ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, మరియు వాట్ జిఎస్టిలోకి గ్రహించుకోబడతాయి మరియు కస్టమ్స్ సుంకం ప్రత్యేకంగా విధించబడటం కొనసాగుతుంది. ప్రస్తుత వ్యవస్థతో పోలిస్తే జిఎస్టి కింద దిగుమతులు మరియు ఎగుమతులపై పన్నుల ప్రభావం గురించి మనం అర్థం చేసుకుందాం.

ప్రస్తుత వ్యవస్థ

వస్తువుల దిగుమతి

ప్రస్తుత వ్యవస్థలో, వస్తువులు దిగుమతి చేసుకునే వ్యక్తి కస్టమ్స్ సుంకం, కౌంటర్వైలింగ్ సుంకం (సివిడి) మరియు ప్రత్యేక అదనపు సుంకం (ఎస్ఏడీ) లను చెల్లించాలి. ఆ వస్తువులు భారతదేశంలో తయారు చేయబడినట్లయితే, అటువంటి వస్తువులపై విధించబడి ఉండే ఎక్సైజ్ రేటుకు సమానమైన రేటు వద్ద సివిడి విధించబడుతుంది. భారతదేశంలో వస్తువులపై వేట్ కు ఎస్ఏడీ సమానంగా ఉంటుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తి యొక్క ధరను భారతదేశంలో నిజమైన మార్కెట్ ధరలకు తీసుకురావడానికి సివిడి మరియు ఎస్ఏడీ లు విధించబడతాయి. దిగుమతిదారు గనక దిగుమతి చేసుకున్న వస్తువులను భారతదేశంలో సుంకం విధించబడదగిన వస్తువులను ఉత్పత్తి చేయటానికి లేదా పన్ను విధించదగిన సేవలను అందించడానికి ఉపయోగించినట్లయితే, ఇన్పుట్లపై చెల్లించిన సివిడి అనేది పన్ను క్రెడిట్ గా అందుబాటులో ఉంటుంది. దిగుమతిదారు గనక కేవలం ఒక వ్యాపారి అయితే, దిగుమతులపై సివిడి అనేది పన్ను క్రెడిట్ గా అందుబాటులో ఉండదు. దిగుమతిపై చెల్లించిన ఎస్ఏడీ, పరిస్థితులకు లోబడి, రీఫండ్ కోసం అర్హత కలిగి ఉంటుంది. ఏదేమైనా, చెల్లించబడిన కస్టమ్స్ సుంకం చెల్లింపుపై ఏ క్రెడిట్ ఇవ్వబడదు మరియు అది దిగుమతిదారు కోసం ఒక ఖరీదు అవుతుంది.

ప్రస్తుత వ్యవస్థలోని వస్తువుల దిగుమతి విషయంలో దిగుమతి సుంకాలు విధింపుని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం.

ఉదాహరణ: కర్ణాటకలోని బెంగుళూరులోని మనోజ్ అప్పారెల్, ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ఒక సరఫరాదారు Oz డిజైన్స్ నుండి వస్త్రాలు కొనుగోలు చేస్తుంది.

పన్ను లెక్కింపు

వివరాలుసంఖ్య.పతి సం. కు ధర (రూ..)మొత్తం (రూ..)
మహిళల టీ-షర్టులు2002,500 (51.68 ఆస్ట్రే డాలర్) *5,00,000
పురుషుల టీ-షర్టులు1005,000 (103.37 ఆస్ట్రే డాలర్) *5,00,000
మొత్తం30010,00,000
కస్టమ్స్ సుంకం @ 10%    1,00,000
విద్యా సెస్ @ కస్టమ్స్ సుంకం పై 3% (1,00,000*3%)           3,000
ఉప మొత్తం  11, 03,000
సివిడి @ 12.5%    1,37,875
ఉప మొత్తం  12,40,875
ఎస్ఎడి @ 4%       49,635
మొత్తం దిగుమతి ఖరీదు  12,90,510

* తీసుకోబడిన మార్పిడి ధర 0.021 ఆస్ట్రేలియా డాలర్ = 1 రూపాయి

సేవల దిగుమతి

సేవలను దిగుమతి చేసుకునే వ్యక్తి భారతదేశంలో వర్తించే సర్వీస్ టాక్స్ రేటు వద్ద దిగుమతి చేసుకున్న సేవపై సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై చెల్లించిన సర్వీస్ టాక్స్ యొక్క పన్ను క్రెడిట్ ను దిగుమతిదారుడు క్లెయిమ్ చేయవచ్చు.

ఉదాహరణకు: తెలంగాణాలోని హైదరాబాద్ లో రాజేష్ అప్పారెల్స్, శ్రీలంకలోని కొలంబియాలోని కౌషి డిజైన్స్ నుండి రూ. 50,00,000 సేవలను వినియోగించుకున్నారు.

పన్ను లెక్కింపు

వివరాలుమొత్తం (రూ.)
ఫ్యాషన్ డిజైనింగ్ సేవలు  50,00,000
సర్వీస్ టాక్స్ @14%    7,00,000
క్రిషి కళ్యాణ్ సెస్ @0.5%       25,000
స్వఛ్ఛ భారత్ సెస్ @0.5%       25,000
దిగుమతి మొత్తం ఖరీదు 57,50,000
ఎగుమతులు

ప్రస్తుత వ్యవస్థలో, వస్తువుల మరియు సేవల ఎగుమతి సున్నా రేట్ చేయబడి ఉన్నది, అంటే, ఎగుమతులపై పన్ను రేటు 0%. ఎగుమతి చేసిన వస్తువుల లేదా సేవల ఉత్పత్తి / కొనుగోలు / అందించడానికి ఉపయోగించిన ఇన్పుట్లపై చెల్లించిన పన్నును కూడా ఒక ఎగుమతిదారుడు రిఫండ్ క్లెయిమ్ చేయవచ్చు.

జిఎస్టి వ్యవస్థ

వస్తువుల దిగుమతి

జిఎస్టి వ్యవస్థలో, సరుకులను దిగుమతి చేసుకునే వ్యక్తి కస్టమ్స్ సుంకం మరియు ఐజిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత వ్యవస్థలో దిగుమతులపై విధించబడే సివిడి మరియు ఎస్ఎడి అనేవి, జిఎస్టి క్రింద ఐజిఎస్టి ద్వారా భర్తీ చేయబడతాయి. భారతదేశంలో దిగుమతి చేసుకున్న వస్తువులకు వర్తించే రేటువద్ద ఐజిఎస్టి విధించబడుతుంది. ఒక దిగుమతిదారు దిగుమతులపై చెల్లించిన ఐజిఎస్టి యొక్క పూర్తి పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేయవచ్చు. అందువల్ల, ప్రస్తుత వ్యవస్థలో సివిడి లేదా ఎస్ఎడి యొక్క క్రెడిట్ క్లెయిమ్ చేయలేకపోయిన దిగుమతిదారులు ఇప్పుడు దిగుమతులపై చెల్లించిన ఐజిఎస్టి యొక్క పూర్తి పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదేమైనా, చెల్లించబడిన కస్టమ్స్ సుంకంపై ఎలాంటి పన్ను క్రెడిట్ ఇవ్వబడదు, మరియు జిఎస్టి కింద కూడా అది దిగుమతిదారుకు ఒక ఖరీదుగానే ఉంటుంది.

జిఎస్టి వ్యవస్థలో వస్తువుల దిగుమతి విషయంలో దిగుమతి సుంకాలను విధింపుని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణను తీసుకుందాం.

ఉదాహరణ: కర్ణాటకలోని బెంగుళూరులోని మనోజ్ అప్పారెల్, ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ఒక సరఫరాదారు Oz డిజైన్స్ నుండి వస్త్రాలు కొనుగోలు చేస్తుంది.

పన్ను లెక్కింపు

వివరాలుసంఖ్య.పతి సం. కు ధర (రూ..)మొత్తం (రూ.)
మహిళల టీ-షర్టులు2002,500    (51.68 AUD) *  5,00,000
పురుషుల టీ-షర్టులు1005,000    (103.37 AUD) *  5,00,000
మొత్తం30010,00,000
కస్టమ్స్ సుంకం @ 10%     1,00,000
విద్యా సెస్ @ కస్టమ్స్ సుంకం పై 3% (10,000*3%)           3,000
ఉప మొత్తం  11,03,000
ఐజిఎస్టి @18% **    1,98,540
మొత్తం దిగుమతి ఖరీదు  13,01,540

* తీసుకోబడిన మార్పిడి ధర 0.021 ఆస్ట్రేలియా డాలర్ = 1 రూపాయి
**వస్త్రాలపై జిఎస్టి రేటు 18% అని భావిస్తూ.

సేవల దిగుమతి

జిఎస్టి పరిధిలో, సరఫరా ఒక సేవ దిగుమతిగా పరిగణించబడుతుంది ఎప్పుడంటే-

  1. సేవ యొక్క సరఫరాదారు భారతదేశం వెలుపల ఉండి
  2. సేవ గ్రహీత భారతదేశంలో ఉండి మరియు
  3. సేవల సరఫరా ప్రదేశం భారతదేశంలో ఉండి ఉన్నప్పుడు

ఉదాహరణకు: తెలంగాణాలోని హైదరాబాద్ లోని రాజేష్ ఎప్పారెల్స్, శ్రీలంకలో కొలంబియాలోని కౌశి డిజైన్స్ నుండి 50,00,000 రూపాయల ఫ్యాషన్ డిజైన్ సేవలు వినియోగించుకున్నారు

సరఫరాదారు యొక్క స్థానం: కొలంబో, శ్రీలంక

గ్రహీత యొక్క స్థానం: హైదరాబాద్, తెలంగాణ

సరఫరా స్థలం: సరఫరా చేయబడే స్థలం అనేది గ్రహీత యొక్క స్థానం, అంటే హైదరాబాద్, తెలంగాణ.

అందువల్ల, ఈ సరఫరా ఒక దిగుమతి.

పన్ను లెక్కింపు

వివరాలుమొత్తం (రూ.)
ఫ్యాషన్ డిజైనింగ్ సేవలు  50,00,000
ఐజిఎస్టి @ 18%*    9,00,000
మొత్తం దిగుమతి ఖరీదు 59,00,000

* ఫ్యాషన్ డిజైనింగ్ సేవలపై జిఎస్టి రేటు 18% అని భావిస్తూ

ఎగుమతులు

జిఎస్టి కింద, ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా ఎగుమతులు సున్నా రేట్ చేయబడతాయి. ఎగుమతి చేసిన వస్తువుల లేదా సేవల ఉత్పత్తి / కొనుగోలు / అందించడానికి ఉపయోగించిన ఇన్పుట్లపై చెల్లించిన పన్నును కూడా ఒక ఎగుమతిదారుడు రిఫండ్ క్లెయిమ్ చేయవచ్చు.

సేవల ఎగుమతి

జిఎస్టి కింద సరఫరాను ఒక సేవా ఎగుమతిగా పరిగణించేందుకు నిర్దిష్ట పరిస్థితులు నిర్దేశించబడ్డాయి. ఇవి:

  1. సేవ యొక్క సరఫరా భారతదేశంలో ఉండి
  2. సేవ గ్రహీత భారతదేశం వెలుపల ఉండి
  3. సేవ యొక్క సరఫరా భారతదేశం వెలుపల ఉండి
  4. సేవ కోసం చెల్లింపు మార్పిడి చేసుకోదగిన విదేశీ మారకంలో సరఫరాదారు అందుకుని ఉండి మరియు
  5. సరఫరాదారు మరియు గ్రహీత ఒకే వ్యక్తి యొక్క స్థాపించబడినవి కాకుండా ఉండి ఉండాలి

ఉదాహరణకు: మహారాష్ట్రలోని ముంబైలోని రోహన్ కన్సల్టెంట్స్ సింగపూర్లోని అబేస్ ఇంజనీరింగ్ కు వ్యాపార సలహాసేవలను అందిస్తుంది. సేవ కోసం చెల్లింపు సింగపూర్ డాలర్లలో పొందడం జరిగింది.

ఇక్కడ,

సరఫరాదారు యొక్క స్థానం: ముంబై, మహారాష్ట్ర

గ్రహీత యొక్క స్థానం: సింగపూర్

సరఫరా స్థలం: సరఫరా స్థలం అనేది గ్రహీత యొక్క స్థానం అయి ఉంటుంది, అనగా సింగపూర్.

సేవ కోసం చెల్లింపు: సేవ కోసం చెల్లింపు మార్పిడిచేసుకోగల విదేశీ మారకంలో, అనగా సింగపూర్ డాలర్లలో అందుకోవడం జరిగింది.

సరఫరాదారు మరియు గ్రహీతకు మధ్య సంబంధం:సరఫరాదారు మరియు గ్రహీత వేర్వేరు వ్యక్తులు.

అందువల్ల ఈ సరఫరా అనేది ఒక సేవ యొక్క ఎగుమతిగా అర్హత పొందింది. సరఫరాపై పన్ను రేటు 0% గా ఉంటుంది.

Export of service under GST

ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలతో పోలిస్తే దిగుమతుల మరియు ఎగుమతుల విషయంలో పన్నుల విధింపు మరియు పన్నుల నిర్వహణ చాలావరకు జిఎస్టి కింద ఉన్నట్టే ఉంటుంది. ఒక దిగుమతిదారు విషయంలో, దిగుమతులపై చెల్లించిన ఐజిఎస్టి పై పూర్తి ఇన్పుట్ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది మరియు వ్యాపారం కోర్సులో లేదా అభివృద్ధి కోసం ఉపయోగించిన లేదా ఉపయోగించేందుకు ఉద్దేశింపబడిన అన్ని రకాల ఇన్పుట్ల పై చెల్లించిన జిఎస్టి పై అదనపు ఇన్పుట్ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది . అదేవిధంగా, ఒక ఎగుమతిదారు విషయంలో, వ్యాపారం సమయంలో ఉపయోగించే అన్ని ఇన్పుట్ల పై చెల్లించే పన్నుపై రిఫండ్ ఇవ్వబడుతుంది. మొత్తంమీద, దిగుమతి మరియు ఎగుమతి ఖర్చులు జిఎస్టి కింద తగ్గుతాయని భావిస్తున్నారు మరియు పలు పన్ను చట్టాలను ఏక చట్టంగా సమాగమం చేయడంతో కట్టుబడి ఉండటం సులభమవుతుందని ఆశించబడుతోంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

152,184 total views, 146 views today