వ్యాపారాలకి తయారీ యూనిట్లు లేదా సేవలను అందించే యూనిట్లు దేశవ్యాప్తంగా వితరణజేయబడి ఉన్న వ్యవస్థ కలిగి ఉండటం చాలా సాధారణం. మామూలు మాటలలో చెప్పాలంటే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రధాన కార్యాలయాలు (హెచ్ఒ) మరియు శాఖా కార్యాలయాలు (బిఒ) గల వ్యాపారాలు – ఒకే రాష్ట్రంలో లేదా వేరొక రాష్ట్రంలో ఉండవచ్చు. ఈ వ్యవస్థలో, మంచి కార్యాచరణ సామర్థ్యాన్ని మరియు నియంత్రణను కలిగి ఉండటం కోసం, సాధారణంగా వ్యాపారాలు ప్రధాన కార్యాలయం వద్ద సాధారణ సేవలు పొందటం కోసం కేంద్రీకృత బిల్లింగు పద్ధతిని అవలంబిస్తాయి. ఈ పరిస్థితి బ్రాంచ్ యూనిట్లు ఉపయోగించే సాధారణ ఇన్వర్డ్ సరఫరాలపై చెల్లించిన ఇన్పుట్ పన్ను క్రెడిట్ పేరుకుపోవడానికి దారితీస్తుంది.

ముందుచెప్పబడిన పరిస్థితిని నివారించడానికి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ఐఎస్డి) భావనను సెన్వాట్ (CENVAT) క్రెడిట్ నియమాలలో ప్రవేశపెట్టడం జరిగింది, ఇది తయారీలోనూ లేదా పన్ను పరిధిలోకి వచ్చే సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న అర్హతగల విభాగాలకు ఇన్పుట్ పన్ను క్రెడిట్ ను పంపిణీ చేయడానికి హెచ్ఒను అనుమతిస్తుంది. సాధారణ సేవలను పొందటం కోసం కేంద్రీకృత బిల్లింగ్ చేసే హెచ్ఒ ‘ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్’ గా పిలువబడుతుంది.
క్రెడిట్ పంపిణీ చేయడం కోసం, హెచ్ఒ ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ ను ఒక ఐఎస్డి గా పొందవలసి ఉంటుంది మరియు అర్ధవార్షిక రాబడిని ఫైల్ చేయవలసి ఉంటుంది.
ఒక ఐఎస్డి గా, హెచ్ఒ ప్రధానంగా ఈ క్రింది వాటిని నిర్వహిస్తుంది:
• సాధారణ ఇన్పుట్ సేవలను వినియోగించుకోవడం కోసం సేవా పన్ను ఇన్వాయిస్ అందుకుంటుంది
• అవసరమైన విధంగా ఇన్వాయిస్/చలాన్ జారీ చేయడం ద్వారా అర్హతగల యూనిట్లకు ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ చేస్తుంది.

జిఎస్టి కింద ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్

ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ఐఎస్డి) భావన జిఎస్టి లో కూడా అందించబడింది. ఇది “వస్తువులు మరియు/లేదా సేవల పంపిణీదారు కార్యాలయంగా చెప్పబడుతుంది, పన్ను ఇన్వాయిస్ కవర్ కింద ఇన్పుట్ సేవలను అందుకున్న, మరియు ఆ సదరు పన్ను క్రెడిట్ ను అదే పాన్(PAN) కింద నమోదుచేయబడిన వస్తువుల మరియు/లేదా సేవల పంపిణీదారుకు పంపిణీ చేయడానికి అనుమతించబడుతుంది’ గా నిర్వచింపబడుతుంది. ఇది ఐఎస్డి ఒక కార్యాలయం అని సూచిస్తుంది:
• ఇది క్రెడిట్ పంపిణీ చేయాలనుకుంటున్న నమోదుచేసుకోబడిన పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తికి చెందిన ఒక ప్రధాన కార్యాలయం, పరిపాలక కార్యాలయం, కార్పొరేట్ ఆఫీసు, ప్రాంతీయ కార్యాలయం, డిపో మరియు మొదలైనవి అయి ఉండవచ్చు
• ఇన్వర్డ్ సేవల సరఫరా అందుకున్నందుకుగాను పన్ను ఇన్వాయిస్లు అందుకునేది
• సేవలను వినియోగించుకున్న బ్రాంచ్ యూనిట్లకు, సేవల ఇన్వర్డ్ సరఫరా యొక్క చెల్లించబడిన పన్ను క్రెడిట్ పంపిణీ చేసేది మరియు క్రెడిట్ పంపిణీ కోసం ఇన్వాయిస్లు జారీ చేసేది.

జిఎస్టి కింద నమోదుచేసుకోవడం

ఒక ఐఎస్డి ఒక ప్రత్యేకంగా నమోదుచేసుకోవడం అవసరం. నమోదు తప్పనిసరి మరియు ఐఎస్డి కి నమోదు చేసుకోవడం కోసం ఏ ప్రారంభ పరిమితి లేదు. ఇప్పటి వ్యవస్థలో (అంటే సేవా పన్ను క్రింద) ఒక ఐఎస్డి గా నమోదైన వ్యాపారాలు, జిఎస్టి కింద కొత్త ఐఎస్డి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. ఇది ఎందుకంటే, ఇప్పటికే ఉన్న ఐఎస్డి రిజిస్ట్రేషన్ జిఎస్టి వ్యవస్థలోకి మార్చి తీసుకురాబడదు కాబట్టి.

Businesses who are already registered as an Input Service Distributor under the existing regime (i.e. under Service Tax), will be required obtain a new ISD registration under GST.Click To Tweet
పంపిణీ విధానం

జిఎస్టి కింద, ఒక రాష్ట్ర అంతర్గత లావాదేవీలో, సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి వర్తించబడతాయి. కేంద్ర పాలిత ప్రాంతంలోని లావాదేవీ సందర్భంలో, సిజిఎస్టి మరియు యుటిజిఎస్టి వర్తించబడతాయి. రాష్ట్రాల మధ్య లావాదేవీలు మరియు దిగుమతుల విషయంలో ఐజిఎస్టి వర్తించబడుతుంది. ఒక ఐఎస్డి ద్వారా క్రెడిట్ పంపిణీ దృష్టాంతాలు ఇవి:
• ఐఎస్డి మరియు క్రెడిట్ గ్రహీత అదే రాష్ట్రంలో ఉన్నారు
• ఐఎస్డి మరియు క్రెడిట్ గ్రహీత వివిధ రాష్ట్రాలలో ఉన్నారు
ఇన్పుట్ పన్ను క్రెడిట్ పంపిణీ చేయబడిన యూనిట్ ని ‘క్రెడిట్ గ్రహీత’ గా సూచిస్తారు.

ఐఎస్డి మరియు క్రెడిట్ గ్రహీత అదే రాష్ట్రంలో ఉన్నారు
ఐఎస్డి మరియు క్రెడిట్ గ్రహీత అదే రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నపుడు, ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, మరియు యుటిజిఎస్టి యొక్క ఇన్పుట్ పన్ను క్రెడిట్ గ్రహీతకు క్రింది విధంగా పంపిణీ చేయబడాలి:

GST Input Service Distributor same state

*ఒక కేంద్ర పాలిత ప్రాంతం లోపలి లావాదేవీలపై వర్తింపజేయబడుతుంది.

మనం ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
టాప్-ఇన్-టౌన్ హోం అప్లయెన్సెస్ లిమిటెడ్, కర్ణాటకలోని బెంగుళూరులో ఉంది. వాళ్ళకి మైసూర్, చెన్నై, ముంబైలలో కూడా యూనిట్లు ఉన్నాయి. బెంగళూరులోని యూనిట్ ప్రధాన కార్యాలయం మరియు ఐఎస్డి గా నమోదు చేయబడింది. ఇతర యూనిట్ల ద్వారా కూడా ఉపయోగించుకోబడే సామాన్య సేవలను వారు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు.

టాప్-ఇన్-టౌన్ హోం అప్లయెన్సెస్ లిమిటెడ్ (హెచ్ఒ), మైసూర్ యూనిట్కు ప్రత్యేకంగా అందించిన ప్రకటన సేవలకు గాను రూ. 18,000 జిఎస్టి (సిజిఎస్టి రూ.9,000 + ఎస్జిఎస్టి రూ.9,000) తో వారు రూ1,00,000 కి ఒక ఇన్వాయిస్ అందుకున్నారు.
సిజిఎస్టి రూ.9,000 మరియు ఎస్జిఎస్టి రూ .9,000 గా ఈ క్రెడిట్ పంపిణీ చేయబడుతుంది.

క్రెడిట్ గ్రహీత మరియు ఐఎస్డి వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు
క్రెడిట్ గ్రహీత మరియు ఐఎస్డి వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నపుడు, ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, మరియు యుటిజిఎస్టి యొక్క ఇన్పుట్ పన్ను
GST ISD

ఉదాహరణకు, టాప్-ఇన్-టౌన్ హోం అప్లయెన్సెస్ లిమిటెడ్ (హెచ్ఒ) చెన్నై విభాగానికి ప్రత్యేకంగా అందించిన ప్రకటన సేవలకు గాను రూ. 18,000 జిఎస్టి (సిజిఎస్టి రూ.9,000 + ఎస్జిఎస్టి రూ.9,000) తో వారు రూ1,00,000 కి ఒక ఇన్వాయిస్ అందుకున్నారు.
రూ.9,000 సిజిఎస్టి మరియు రూ .9,000 ఎస్జిఎస్టి అయిన ఈ క్రెడిట్ చెన్నై యూనిట్ కి ఐజిఎస్టి రూ. 18,000 గా పంపిణీ చేయబడుతుంది.

జిఎస్టి కింద రిటర్న్ ఫారంలు

రిటర్న్ రకం తరచుదనం
గడువు తేది అందించవలసిన వివరాలు
ఫారం జిఎస్టిఆర్-6ఎ నెలవారీ తదుపరి నెల 11వ తేదీ సరఫరాదారు ద్వారా సమర్పించబడిన ఫారం జిఎస్టిఆర్ -1 ఆధారంగా ఐఎస్డి గ్రహీతకు అందజేయబడిన ఇన్వర్డ్ సరఫరాల వివరాలు
ఫారం జిఎస్టిఆర్ -6 నెలవారీ తదుపరి నెల 13 వ తేదీ పంపిణీ చేయబడిన ఇన్పుట్ క్రెడిట్ వివరాలు సమర్పించాలి

జిఎస్టి లో ఐఎస్డి భావన అనేది సెన్వాట్ (CENVAT) క్రెడిట్ నియమాలు మరియు సేవా పన్ను కింద ఉన్న నిబంధనలను పోలి ఉంటుంది. ఈ బ్లాగ్ లో మేము జిఎస్టి లో ఒక ఐఎస్డి యొక్క ప్రాధమిక వివరాల గురించి చర్చించాము. క్రెడిట్ గ్రహీతకు క్రెడిట్ పంపిణీ చేయడం ఎలాగో తెలుసుకోవడం కోసం మా రానున్న బ్లాగ్ కోసం చూడండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

79,899 total views, 5 views today