(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

తాజా మార్పులు పొందుపరచడానికి ఈ పోస్ట్ 21 అక్టోబర్ 2016 నాడు అప్డేట్ చేయబడింది.

జీఎస్టీ యొక్క ప్రాథమిక లక్షణాల్లో ఒకటే, సీమలు లేకుండా ఉండే ఇన్పుట్ క్రెడిట్ అనేది, దాని ఛెయిన్ అంతటా (వస్తువుల తయారీదారు నుంచి అది వినియోగించబడేటంత వరకు) మరియు దేశవ్యాప్తంగా కూడా. ఈ విభాగంలో, సరుకు లేదా సేవలను అందజేయడంపై జిఎస్టి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వినియోగించుకునేందుకు చట్టం ద్వారా విధించబడిన వివిధ పరిస్థితులని గురించి చర్చిద్దాం.

జిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ పొందగోరేవారు విధిగా క్రింది పరిస్థితులు అన్నింటినీ సంతృప్తి పరచాలి:
• డీలర్ దగ్గర పన్ను ఇన్వాయిస్ కానీ / డెబిట్ లేదా క్రెడిట్ నోట్ కానీ / జిఎస్టి చట్టం కింద నమోదు చేయబడిన ఒక సరఫరాదారుచే జారీ చేయబడిన సప్లిమెంటరీ ఇన్వాయిస్ కానీ ఉండాలి.
• సదరు వస్తువులు / సేవలు అందుకోబడి ఉండాలి.
• (జిఎస్టిఆర్-3) రిటర్న్స్ ఫైల్ చేయబడి ఉండాలి.
• వసూలు చేయబడిన పన్ను సరఫరాదారు ద్వారా ప్రభుత్వానికి చెల్లించబడి ఉండాలి.

ఈ పరిస్థితుల అర్ధం ఏమిటి?

ఒకసారి సరఫరాదారు ద్వారా ఫారం జిఎస్టిఆర్-1 (Outward Supply details) (బయటికి సరఫరా వివరాలు) ఫైల్ చేయబడితే, ఆటో పాపులేటెడ్ (దానికై అది నింపబడిపోయే) ఫారం జిఎస్టిఆర్-2ఎ (Inward Supply details) (లోపలికి సరఫరా వివరాలు) ద్వారా గ్రహీతకి కొనుగోలు గురించిన నిదర్శనం ఉంటుంది. అవసరమైన సవరణల, చేర్పులు (ఏవైనా ఉంటే) మరియు ఫారం జిఎస్టిఆర్-2 లో అంగీకారం, తరువాత ఒక తాత్కాలిక ప్రాతిపదికన గ్రహీత యొక్క ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కు ఇన్పుట్ క్రెడిట్ జమ చేయబడుతుంది.

గ్రహీత ద్వారా జిఎస్టిఆర్ -2లో చేయబడిన చేర్పు మరియు మార్పు అతని ఆమోదం కోసం సరఫరాదారుకు ఫారం జిఎస్టిఆర్- 1ఎ లో అందుబాటులో ఉంటుంది.

చెల్లింపు పన్నుతో పాటుగా సరఫరాదారు ద్వారా (Monthly Return) నెలసరి రిటర్న్ (ఫారం జిఎస్టిఆర్ -3) ఫైల్ చేయబడినప్పుడు మాత్రమే ఇన్పుట్ క్రెడిట్ అందుబాటులో ఉంటుంది. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ యొక్క తుది ఆమోదం ఫారం జిఎస్టి ఎంఐఎస్-1 లో తెలియజేయబడుతుంది.

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాం

ఒక కార్లు తయారీదారు సూపర్ కార్స్ లిమిటెడ్, రత్న స్టీల్స్ నుంచి 30 టన్నుల ఉక్కు కొనుగోలు చేసారు. రత్న స్టీల్స్ ఉక్కు సరఫరా చేసి ఏప్రిల్ 5వ తేదీనాడు 2,40,000 జిఎస్టితో పన్ను ఇన్వాయిస్ జారీ చేసింది.

ఈ ఉదాహరణతో మనం ఇన్పుట్ క్రెడిట్ వినియోగించుకునే ప్రవాహాన్ని అర్థంచేసుకునే ప్రక్రియను పరిశీలిద్దాం.

నోట్స్
జిఎస్టిఆర్-1: అన్ని బయటికి సరఫరా ( outward supply) వివరాలను తదుపరి నెల 10న లేదా అంతకు ముందు అందించండి.
జిఎస్టిఆర్-2ఎ: తదుపరి నెల 11 నాడు సిస్టం ద్వారా ఆటో పాప్యులేట్ చేయబడుతుంది (దానంతట అదే నింపబడుతుంది). ఇందులో అన్ని (Inward Supplies) లోపలికి సరఫరా వివరాలు చేర్చబడి ఉంటాయి
జిఎస్టిఆర్-3: నెలసరి రిటర్న్ తదుపరి నెల 20 న సిస్టం ద్వారా ఆటో పాప్యులేట్ చేయబడుతుంది (దానంతట అదే నింపబడుతుంది).

త్వరలోనే వీటి పై మరిన్ని వ్యాసాలు వస్తున్నాయి:
• రిటర్న్స్ అప్లోడ్ చేయడం
• ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రివర్స్ చేయడం మరియు తిరిగి క్లెయిమ్ చేయడం

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

80,102 total views, 2 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.