ఇన్వాయిస్ అనేది ప్రతి వ్యాపారానికి పన్ను అనువర్తనానికి ఒక కీలకమైన అంశం. జిఎస్టి క్రింద ఇన్వాయిస్ నియమాలు తెలుసుకుని ఉండటం అవసరం. వీటిని మనం వివరంగా అర్ధం చేసుకుందాం.

ప్రస్తుత పన్ను వ్యవస్థల్లో ఇన్వాయిస్

ప్రస్తుత పన్ను వ్యవస్థల్లో, రెండు రకాల ఇన్వాయిస్లు జారీ చేయబడతాయి:

    1. పన్ను ఇన్వాయిస్ – ఇది నమోదు చేసుకోబడిన డీలర్లకు జారీ చేయబడుతుంది, మరియు పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన రకాల పన్ను ఇన్వాయిస్ నమూనా ఫార్మాట్లు, నియమం 11 ఎక్సైజ్ ఇన్వాయిస్ మరియు పన్ను ఇన్వాయిస్ క్రింద చూపించబడ్డాయి.

Tax-invoice-in-the-current-tax-regime

  1. రిటెయిల్ లేదా కమర్షియల్ ఇన్వాయిస్ – ఇది నమోదుచేసుకోబడని లేదా రీటెయిల్ కస్టమర్ కు జారీ చేయబడుతుంది, ఇంకా ఈ ఇన్వాయిస్ పై ఏ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేయడం వీలుకాదు. ప్రస్తుత పన్ను వ్యవస్థలో రిటెయిల్ ఇన్వాయిస్ యొక్క నమూనా ఫార్మాట్ కింద చూపబడింది.

Retail-Invoice

జిఎస్టి వ్యవస్థలో ఇన్వాయిసింగ్

జిఎస్టి వ్యవస్థలో, రెండు రకాల ఇన్వాయిస్లు జారీ చేయబడతాయి:

  1. పన్ను ఇన్వాయిస్
  2. సరఫరా బిల్లు

పన్ను ఇన్వాయిస్

ఒక నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే సరుకు లేదా సేవలను సరఫరా చేసినప్పుడు, ఒక పన్ను ఇన్వాయిస్ జారీ చేయబడుతుంది. ఒక పన్ను ఇన్వాయిస్ లో కావలసిన వివరాలకు సంబంధించి నియమాల ఆధారంగా, ఒక నమూనా పన్ను వాయిస్ క్రింద చూపించబడింది.

Sample-of-a-tax-invoice-under-GST_Telugu

పన్ను ఇన్వాయిస్ జారీ చేయడం కోసం సమయ పరిమితి ఏమిటి?

సరుకు సరఫరా పన్ను ఇన్వాయిస్ అనేది ఈ సమయానికి ముందు లేదా ఈ సమయంలో జారీ చేయబడాలి

సరుకు తోలగింపు, సరుకు సరఫరాలో కదలిక ఇమిడి ఉన్నచోట.

ఉదా – ఒక కారు తయారీదారు, సూపర్ కార్స్ లిమిటెడ్, , తమ డీలర్ రవీంద్ర ఆటోమొబైల్స్ కు కార్లు సరఫరా చేసినప్పుడు, సూపర్ కార్స్ లిమిటెడ్ ప్రాంగణంలో నుండి కార్లు తొలగింపు సమయంలో ఇన్వాయిస్ జారీ చేయబడాలి. ఇది ఎందుకంటే సరఫరాలో రవీంద్ర ఆటోమొబైల్స్ ‘ప్రాంగణంలోకి కార్ల కదలిక ఉంటుంది కాబట్టి.

లేదా

సరుకు సరఫరాలో కదలిక అవసరం లేనిచోట గ్రహీతకు సరుకు అందజేయడం,

ఉదా – సూపర్ కార్స్ లిమిటెడ్ సరఫరాదారు ద్వారా ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసెంబల్ చేయబడి మరియు ఇన్స్టాల్ చేయబడే ఒక జెనరేటర్ సెట్ కొన్నారు. ఇక్కడ, సరఫరాకు జెనరేటర్ సెట్ కదలిక అవసరం లేదు కాబట్టి, సూపర్ కార్స్ లిమిటెడ్ కు జెనరేటర్ సెట్ అందుబాటులో ఉంచబడిన సమయంలో, ఇన్వాయిస్ జారీ చేయబడాలి

సేవల సరఫరా సేవని సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజుల లోపల పన్ను ఇన్వాయిస్ జారీ చేయాలి.
పంపిణీదారు ఒక బ్యాంకు లేదా ఏ ఆర్థిక సంస్థ అయిన, సేవని సరఫరా చేసిన తేదీ నుండి 45 రోజుల లోపల ఇన్వాయిస్ జారీ చేయాలి.

గమనిక: ఒకవేళ రివర్స్ ఛార్జ్ పై పన్ను చెల్లించే ఒక వ్యక్తి ఒక నమోదుకాని సరఫరాదారు నుంచి సరుకు లేదా సేవలు అందుకుంటే, సరుకు లేదా సేవలు అందిన తేదీనాడు గ్రహీత ఒక ఇన్వాయిస్ జారీ చేయాలి.

పన్ను ఇన్వాయిస్ ఎన్ని కాపీలు అవసరం?

సరుకు సరఫరా కోసం,ఇన్వాయిస్ మూడు కాపీలు అవసరం – ఒరిజినల్, డూప్లికేట్ మరియు ట్రిప్లికేట్.

అసలు ఇన్వాయిస్: అసలు (ఒరిజినల్ )ఇన్వాయిస్ గ్రహీతకు జారీచేయబడుతుంది, మరియు ‘గ్రహీత కోసం ఒరిజినల్’ గా గుర్తించబడి ఉంటుంది.

డూప్లికేట్ కాపీ: డూప్లికేట్ కాపీ రవాణాదారుకి జారీ చేయబడుతుంది, మరియు ‘రవాణా కోసం డూప్లికేట్’ గుర్తించబడి ఉంటుంది. సరఫరాదారు గనక ఒక ఇన్వాయిస్ రిఫరెన్స్ సంఖ్య పొంది ఉంటే ఇది అవసరం ఉండదు.. అతని ద్వారా జారీచేయబడిన ఒక పన్ను ఇన్వాయిస్ ని ఒక సరఫరాదారు జిఎస్టి పోర్టల్ లో అప్లోడ్ చేస్తే అతనికి ఇన్వాయిస్ రిఫరెన్స్ సంఖ్య ఇవ్వబడుతుంది. ఇది ఇన్వాయిస్ అప్లోడ్ తేదీ నుండి 30 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది.

ట్రిప్లికేట్ కాపీ: ఈ కాపీ సరఫరాదారు ఆధీనంలోనే ఉంటుంది, మరియు ‘సరఫరాదారు కోసం ట్రిప్లికేట్” అని గుర్తించబడి ఉంటుంది.

Copies-of-tax-invoice-for-supply-of-goods

సేవల సరఫరా కోసం, ఇన్వాయిస్ యొక్క రెండు కాపీలు అవసరం:

  • అసలు ఇన్వాయిస్: అసలు ఇన్వాయిస్ గ్రహీతకు ఇవ్వబడాలి, మరియు ‘గ్రహీత కోసం ఒరిజినల్’ గా గుర్తించబడి ఉంటుంది.
  • డూప్లికేట్ కాపీ: డూప్లికేట్ కాపీ సరఫరాదారు కోసం, మరియు ‘సరఫరాదారు కోసం డూప్లికేట్’ అని గుర్తించబడి ఉంటుంది.

Copies-of-tax-invoice-for-supply-of-services

ఎగుమతి కోసం పన్ను ఇన్వాయిస్ లో ఏ వివరాలు ఉండాలి?

ఒక ఎగుమతి ఇన్వాయిస్ ఒక పన్ను ఇన్వాయిస్ లో కావలసిన సమాచారంతో పాటు, కింది వివరాలను తప్పక కలిగి ఉండాలి:

ఎగుమతి ఇన్వాయిస్
” IGST చెల్లించిన మీదట ఎగుమతి కోసం సరఫరా” లేదా ” IGST చెల్లింపు లేకుండా బాండ్ కింద ఎగుమతి కోసం సరఫరా ” పదాలు కలిగి ఉండాలి
గ్రహీత పేరు మరియు చిరునామా
డెలివరీ చిరునామా
ARE-1 (ఎగుమతి కోసం సరుకు తొలగింపు కోసం దరఖాస్తు) యొక్క నెంబర్ మరియు తేది

సప్లై బిల్

కింది కేసుల్లో సప్లై బిల్లు ఒక నమోదు చేయబడిన సరఫరాదారు ద్వారా జారీ చేయబడాలి:

  • మినహాయింపు సరుకు లేదా సేవల సరఫరా
  • సరఫరాదారు కాంపొజిషన్ పథకం కింద పన్ను చెల్లించుతూ ఉంటే

సప్లై బిల్లులో అవసరమైన వివరాలు గురించి నియమాల ఆధారంగా, సప్లై బిల్లు నమూనా క్రింద చూపించబడింది.

Sample-of-Bill-of-Supply

గ్రహీత బిల్లు కోసం పట్టుబడితే తప్ప సరఫరా చేయబడిన సరుకు లేదా సేవల విలువ రూ .100 కంటే తక్కువ ఉన్నప్పుడు సప్లై బిల్లు జారీచేయవలసిన అవసరం లేదు. అయితే, అటువంటి సప్లై బిల్లు జారీ చేయబడని అన్ని సరఫరాలకు వ్యాపార దినం ముగింపు వద్ద ఒక కన్సాలిడేటెడ్ సప్లై బిల్లును సిద్ధం చేయాలి.

ఇప్పటికే జారీ చేయబడిన ఒక ఇన్వాయిస్ విలువలు సరిచేయడం ఎలా?

ఒక ఇన్వాయిస్ లో పన్ను పరిధిలోకి వచ్చే విలువ లేదా ఛార్జ్ చేయబడే జిఎస్టి సవరించడానికి, ఒక డెబిట్ నోట్ లేదా అనుబంధ ఇన్వాయిస్ లేదా క్రెడిట్ నోట్ సరఫరాదారు ద్వారా జారీ చేయబడాలి.

డెబిట్ నోట్ లేదా అనుబంధ ఇన్వాయిస్- పన్నుపరిధిలోకి వచ్చే విలువ & / లేదా అసలు ఇన్వాయిస్ లో ఛార్జ్ చేయబడిన జిఎస్టిలో పెరుగుదల నమోదు చేసేందుకు ఇవి ఒక సరఫరాదారు ద్వారా జారీ చేయవలసి ఉంటాయి.

క్రెడిట్ నోట్ – పన్నుపరిధిలోకి వచ్చే విలువ & / లేదా అసలు ఇన్వాయిస్ లో ఛార్జ్ చేయబడిన జిఎస్టిలో తగ్గుదల నమోదు చేసేందుకు ఇవి ఒక సరఫరాదారు ద్వారా జారీ చేయవలసి ఉంటాయి.
మనం ఒక ఉదాహరణతో క్రెడిట్ నోట్ జారీచేసేందుకు కాలపరిమితిని అర్ధం చేసుకుందాం.

ఉదాహరణ
సూపర్ కార్స్ లిమిటెడ్ తమ డీలర్ రవీంద్ర ఆటోమొబైల్స్ కు రూ6,00,000. విలువ గల స్పేర్ పార్ట్స్ ని 1 వ నవంబర్ ’17 నాడు విక్రయిస్తుంది. 2 నవంబర్’17 నాడు రవీంద్ర ఆటోమొబైల్స్ , దెబ్బతిన్న సరుకుగా రూ .1,00,000, విలువగల స్పేర్ పార్ట్స్ తిరిగిఇస్తుంది. తిరిగి ఇవ్వబడిన సరుకు కోసం సూపర్ కార్స్ లిమిటెడ్ ఒక క్రెడిట్ నోట్ లేవనెత్తాలనుకుంటుంది
మనం 2 సినేరియోలని ఉపయోగిస్తూ సూపర్ కార్స్ లిమిటెడ్ వారు ఏ తేదీనాటికి తప్పక క్రెడిట్ నోట్ జారీ చేయాలి అనేది నిర్ధారించుదాము

సినేరియో 1- వారు 17-18 ఆర్థిక సంవత్సరం కోసం 1 డిసెంబర్ ’18 నాడు వార్షిక రిటర్న్ ఫైల్ చేస్తారు.

సినేరియో 2- వారు 17-18 ఆర్థిక సంవత్సరం కోసం 31మే’18 నాడు వార్షిక రిటర్న్ ఫైల్

సినేరియో అసలు సరఫరా తేది వార్షిక రిటర్న్ ఫైల్ తేది క్రెడిట్ నోట్ జారీచేసేందుకు ఆఖరి తేది నిర్ధారించేందుకు షరతు క్రెడిట్ నోట్ జారీచేసేందుకు ఆఖరి తేది
సినేరియో 11 నవంబర్ 201711 డిసెంబర్ ‘18సరఫరా చేయబడిన ఆర్థిక సంవత్సరం ముగింపు లేదా సంబంధిత వార్షిక రాబడి ఫైల్ చేసిన తేదీ తర్వాతి సెప్టెంబర్ 30 వ తేదీనాడు లేదా అంతకు లోపల, ఏది ముందైతే అప్పుడు30 సెప్టెంబర్ ‘18
సినేరియో 231 మే ‘1831 మే ‘18

 

డెబిట్ నోట్లు, అనుబంధ ఇన్వాయిస్లు మరియు క్రెడిట్ నోట్లలో ఏ వివరాలు ఉండాలి?

డెబిట్ నోట్లు, అనుబంధ ఇన్వాయిస్లు మరియు క్రెడిట్ నోట్లలో కింది వివరాలు ఉండాలి:

డెబిట్ నోట్, అనుబంధ ఇన్వాయిస్ మరియు క్రెడిట్ నోట్
పత్రం యొక్క స్వభావం స్పష్టంగా ‘సవరించిన ఇన్వాయిస్’ లేదా ‘సప్లిమెంటరీ ఇన్వాయిస్’, అని తప్పనిసరిగా తెలియచేయాలి
సరఫరాదారు యొక్క పేరు, చిరునామా, మరియు GSTIN
కేవలం అక్షరాలు మరియు/లేదా అంకెలు మాత్రమే కలిగి ఉన్న, మరియు ఒక ఆర్ధిక సంవత్సరం కోసం ప్రత్యేకమైనదైన ఒక వరుస క్రమ సంఖ్య
పత్రం జారీచేయబడిన తేదీ
గ్రహీత నమోదు చేయబడి ఉంటే- పేరు, చిరునామా మరియు గ్రహీత యొక్క GSTIN / ప్రత్యేక ID నంబర్
గ్రహీత నమోదు చేయబడి లేకపోతే- గ్రహీత పేరు, చిరునామా మరియు డెలివరీ చిరునామా రాష్ట్ర పేరు మరియు కోడ్ తో
అసలు పన్ను ఇన్వాయిస్ యొక్క క్రమ సంఖ్య మరియు తేదీ లేదా సప్లై బిల్లు
సరుకు లేదా సేవల యొక్క పన్ను వేయదగిన విలువ, పన్ను రేటు మరియు గ్రహీతకు క్రెడిట్ చేయబడిన లేదా డెబిట్ చేయబడిన పన్ను మొత్తం
సరఫరాదారు లేదా అతని అధీకృత ప్రతినిధి సంతకం లేదా డిజిటల్ సంతకం

 

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

371,208 total views, 547 views today