గడుస్తున్న ప్రతి రోజుతోను, జిఎస్టి వాస్తవికతగా మారేందుకు దగ్గర అవుతోంది. చట్టం తయారుచేసేవారు, జిఎస్టి చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రక్రియలో భాగంగా, ప్రజాభిప్రాయము కొరకు ముసాయిదా చట్టం యొక్క నకలును ప్రభుత్వం బహిరంగ డొమైన్ లో అందుబాటులో ఉంచటం జరిగింది. టాలీ వద్ద మేము చట్టాన్ని, నియమాలని మరియు విధానాలని వివరంగా పరిశీలించాము. మేము చదివి అర్ధము చేసుకున్నదాని ప్రకారం, చట్టంలోని అనేక అంశాలని పునః సందర్శించి మరియు మార్పుచేయవలసి ఉన్నది అని తోస్తుంది ఎందుకంటే వాటి ప్రస్తుత రూపంలో అవి సంభావ్యంగా దేశంలోని చిన్న మరియు మధ్యమ వ్యాపారస్తులకు తద్వారా ఆర్ధిక వ్యవస్తకు బలమైన హాని కలిగించేవిగా ఉన్నట్లున్నాయి కాబట్టి.

మా ప్రయాణములో మేము గత 3దశాబ్దాలలోని విలువైన భాగాన్ని ఈ వ్యాపార సమూహానికి సాఫ్టవేర్ అందించటం మాత్రమేకాక వారి నాడి మరియు వారి జీవన విధానము అర్ధం చేసుకొనుటలో కూడా గడిపాము. ఇది వారి ఆశలు మరియు ఆశయాల మేరకు జిఎస్టి చట్టాన్ని సమీక్షించేందుకు మాకు మార్గదర్శకం అయింది. మేము ఇంకా ముందుకు సాగి చట్టం పై మా అభిప్రాయాలను ప్రభుత్వానికి, పన్ను మరియు రెవెన్యూ అధికారులకు మరియు పారిశ్రామిక సంస్థలకు పంపించాము.

మన దేశం మరియు ఆర్ధికవ్యవస్థకు జిఎస్టి ఒక గొప్ప విషయం అని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. అయితే, మనకు అందరికీ ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా అది ఉండటం కోసం మేము గుర్తించిన సమస్యలు పరిష్కరించబడటం అవసరం. సంబంధిత అధికారులతో మరియు నిర్ణాయక నిర్ణేతలతో ఈ సమస్యలను చేపట్టడానికి మేము బధ్ధులమై ఉన్నాము, తద్వారా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడం వీలవుతుంది.

మేము పంపిన విమర్శలు మరియు రిప్రజెంటేషన్లు కింది ఇవ్వబడ్డాయి.

1. ‘ఇన్ పుట్ క్రెడిట్’ కు చెల్లింపును సంధానపరచుట (లింక్ చేయుట).

చట్టము: సెక్షన్ 16 (1) సెక్షన్ 49 లో సూచించబడి ఉండగల షరతులు మరియు నిబంధనలకు లోబడి మరియు పేర్కొన్న విధంగా, ప్రతి రిజిస్టర్డ్ వ్యక్తి కూడా, తన వ్యాపారం యొక్క కోర్సులో లేదా అభివృధ్ధి కోసం ఉపయోగించడానికి లేదా ఉపయోగించడం కోసం ఉద్దేశించబడి తనకు చేయబడిన ఏదైనా వస్తువుల లేదా సేవల లేదా రెండింటి సరఫరా పై ఛార్జి చేయబడిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి అర్హతకలిగి ఉంటారు, మరియు ఆ సదరు మొత్తం అటువంటి వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కు చెల్లించబడుతుంది..
(2) ఈ విభాగంలో ఉన్న అంశమేమైనప్పటికీ, ఏ రిజిస్టర్ చేయబడిన వ్యక్తికి కూడా ఏవైనా వస్తువుల లేదా సేవలు లేదా రెండింటి సరఫరాకి సంబంధించి ఏవైనా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ కి అర్హత కలిగి ఉండరు, ఇలా అయితే తప్ప,
(c) సెక్షన్ 41 లోని నిబంధనలకు లోబడి, అట్టి సరఫరాలపై వసూలు చేయబడిన పన్ను డబ్బు రూపంలో కానీ అట్టి సరఫరాలకు సంబంధించి అనుమతింపబడిన ‘ఇన్ పుట్ పన్ను’ వినియోగించుకోవడం ద్వారాగానీ వాస్తవంగా ప్రభుత్వానికి జమచేయ బడి ఉండటం, మరియు-

వ్యాఖ్యలు

సరఫరాదారు గనక తన పన్ను బాధ్యత చెల్లించి ఉండకపోతే పన్ను చెల్లింపుదారునికి ఇన్పుట్ క్రెడిట్ ను జఎస్టి బిల్లు తిరస్కరిస్తుంది. ముఖ్యంగా సన్నని మార్జిన్లల్లో పనిచేసే చిన్న వ్యాపారాల కోసం ఇది కార్యనిర్వహణ మూలధనాన్ని పెంచడం ద్వారా వాణిజ్యంలో చాలా ఘర్షణను సృష్టిస్తుంది. ఇది మొత్తంమీద ఆర్ధికవ్యవస్థ పై ఎన్నో ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు విజయవంతంగా జిఎస్టి అమలును అడ్డగించవచ్చు. ఒకసారి వర్తించే పన్ను దానిపై ప్రతిబింబిస్తూ సరఫరాదారు ద్వారా ఇన్వాయిస్ జారీచేయబడి మరియు రిటర్న్ ఫైల్ చేయబడి మరియు ఇన్వాయిస్ మ్యాచింగ్ కూడా చేయబడిన తర్వాత వాస్తవంగా ఆ పన్ను ప్రభుత్వం క్రెడిట్ చేయబడిందా అనేది తెలుసుకోవలసిన బాధ్యత భారం గ్రహీత పై మోపడం వీలు కాదు.. ఇక్కడ సరఫరాదారు ద్వారా పన్ను జమాచేయబడిందని రుజువు చేయవలసిన భారం గ్రహీతపై మోపడం జరుగుతోంది.

‘ఇన్ పుట్ క్రెడిట్’ కు చెల్లింపుని అనుసంధాన పరచటం వలన కలిగే అనుబంధ సమస్యలు

ఎవరైనా క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడం అసాధ్యంగా మారుస్తూ ఎస్ఎంఇ లు కొత్త కొనుగోలుదారులను కనుగొనలేరు లేదా ఐటిసి సరిపోని నివేదిక తర్వాత చెల్లించగల కొనుగోలుదారులను మాత్రమే కనుగొనగలవు
రేటింగులు బహిరంగంగా వెల్లడై ఉన్నప్పుడు వారు డిఫాల్టర్లగా కనిపించకుండా ఉండేలాగా నిర్ధారించుకోవడానికి ఎస్ఎంఇలు భయాందోళన (పానిక్) రుణాలు తీసుకుంటాయి. అప్పుడప్పుడు మరియు ఆగిఆగి వచ్చే నగదు ప్రవాహ సమస్యలు రేటింగుని తగ్గించే కేసులు ఉంటాయి, ఇది కస్టమర్లు తరిగిపోవటం కలిగించడం ప్రారంభిస్తుంది మరియు ఎస్ఎంఇలు భయాందోళన (పానిక్) రుణాలు తీసుకునేందుకు బలవంతపెడుతూ సమస్యలు పెరుగుతూ పోవడానికి దారితీస్తుంది.

పైన హైలైట్ చేయబడిన విధంగా ఒక అనువర్తన రేటింగుని నిర్వచిస్తూ సిజిఎస్టి చట్టం యొక్క సెక్షను
149 (1) ఈ చట్టం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉన్న అతని రికార్డు ఆధారంగా ప్రభుత్వంచే ప్రతి రిజిస్టరు చేయబడిన వ్యక్తికి ఒక వస్తువు మరియు సేవల పన్ను అనువర్తన రేటింగ్ స్కోరును కేటాయించవచ్చు. (2) వస్తువులు మరియు సేవలు పన్ను అనువర్తన రేటింగ్ స్కోర్ సూచించబడగల పారామితులు ఆధారంగా నిర్ణయించబడవచ్చు. (3) వస్తువులు మరియు సేవల పన్ను అనువర్తన రేటింగ్ స్కోరు క్రమబధ్ధమైన విరామాలవద్ద నవీకరించబడవచ్చు మరియు నమోదిత వ్యక్తికి తెలియజేయవచ్చు మరియు సూచించిన విధంగా పబ్లిక్ డొమైన్లో ఉంచబడవచ్చు.

2. అడ్వాన్సులు (ఋణములు) : సరఫరా మరియు వ్యవహరించే సమయ నిర్ధారణ

చట్టము
12.(1) ఈ సెక్షనులోని నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించబడిన విధంగా, వస్తువుల పై పన్ను చెల్లించవలసిన బాధ్యత సరుకు సరఫరా సమయంలో ఏర్పడుతుంది.
(2) సరుకు సరఫరా సమయం క్రింద పెర్కొన బడిన తేదీలలో ముందుగా వచ్చేది అయి ఉంటుంది, అనగా:

(a) సరఫరాదారు ద్వారా ఇన్వాయిస్ జారీ చేయబడిన తేదీ లేదా సరఫరా విషయంలో సెక్షన్ 31 లోని ఉప విభాగం (1) కింద అతను ఇన్వాయిస్ జారీచేయవలసిన ఆఖరి తేదీ; లేదా
సరఫరాదారు సరఫరాకు సంబంధించి చెల్లింపును అందుకునే తేదీ: పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సరఫరాదారు పన్ను ఇన్వాయిస్ లో సూచించబడిన మొత్తానికి మించి ఒక వెయ్యి రూపాయల మొత్తం వరకు అధికంగా అందుకున్న చోట తప్ప, అటువంటి అదనపు మొత్తానికి సంబంధించినంతవరకు సరఫరా సమయం, సదరు సరఫరాదారు యొక్క ఎంపికలో, అటువంటి అదనపు మొత్తానికి సంబంధించి ఇన్వాయిస్ జారీ చేసిన తేదీ అయి ఉంటుంది.
వివరణ 1 – క్లాజులు (a) మరియు (b), యొక్క ప్రయోజనాల కోసం, ఇన్వాయిస్, లేదా సందర్భాన్ని బట్టి, చెల్లింపు ద్వారా అది కవర్ చేయబడిన మేరకు “సరఫరా” చేయబడనదిగా భావించబడుతుంది.
వివరణ 2 – క్లాజు (b), యొక్క ప్రయోజనం కోసం, “సరఫరాదారు చెల్లింపును అందుకునే తేదీ” అతని ఖాతా పుస్తకంలో చెల్లింపు నమోదుచేయబడిన తేదీ లేదా అతని బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేది, ఏది ముందైతే అది అయిఉంటుంది
(3) రివర్స్ చార్జ్ ప్రాతిపదికన పన్ను చెల్లించబడిన లేదా చెల్లించబడవలసిన బాధ్యత ఉన్న సరఫరాల విషయంలో, సరఫరా సమయం క్రింది తేదీలలో అన్నింటికంటే ముందు వచ్చేది అయి ఉంటుంది, అంటే:
(a) వస్తువుల అందుకున్న తేదీ; లేదా
(b) గ్రహీత యొక్క ఖాతా పుస్తకంలో నమోదు చేయబడిన విధంగా చెల్లింపు తేదీ లేదా చెల్లింపు అతని బ్యాంకు ఖాతాలోకి డెబిట్ చేయబడిన తేదీ, ఏది ముందైతే అది; లేదా
(c) ఇన్వాయిస్ లేదా, ఏ పేరుతో పిలవబడేది అయినా, సరఫరాదారు ద్వారా అందు నిమిత్తమై ఏదైనా ఇతర పత్రం, జారీ చేసిన తేదీ నుండి వెంటనే ముప్పై రోజులు:
క్లాజ్ (a) లేదా క్లాజ్ (b) లేదా క్లాజ్ (c), కింద సరఫరా సమయాన్ని నిర్ణయించడం సాధ్యంకానిచోట మినహా, సరఫరా సమయం అనేది సరఫరా గ్రహీత యొక్క ఖాతా పుస్తకాలలో ఎంట్రీ తేదీ అయి ఉండాలి.
(4) ఒక సరఫరాదారు ద్వారా వోచర్ల సరఫరా విషయంలో, సరఫరా సమయం ఇది అయి ఉండాలి- (a) ఆ సమయంలో సరఫరా గుర్తించదగినది అయితే, వోచర్ జారీచేయబడిన తేదీ; లేదా (b) అన్ని ఇతర కేసులలో, వోచర్ విమోచనం (రిడెప్షన్) తేదీ.
(5) సబ్ సెక్షన్ (2) లేదా సబ్ సెక్షన్ (3) లేదా సబ్ సెక్షన్ (4) నిబంధనల ప్రకారం సరఫరా సమయం నిర్ణయించలేనప్పుడు, సరఫరా సమయం ఇది అయి ఉంటుంది –
(a) ఒక నియమిత కాలంలో (పీరియాడిక్) రిటర్న్ ఫైల్ చేయవలసిన ఒక సందర్భంలో, అటువంటి రిటర్న్ ఫైల్ చేయవలసిన తేదీ అయి ఉండాలి; లేదా
(b) ఏదైనా ఇతర సందర్భంలో, పన్ను చెల్లించిన తేదీ అయి ఉండాలి.
(6) వడ్డీ, ఆలస్యం రుసుము లేదా ఏదైనా పరిగణన యొక్క ఆలస్యం చెల్లింపు కోసం జరిమానా పరంగా సరఫరా విలువలో ఒక అదనపు జోడింపుకు సంబంధించినంతవరకూ సరఫరా సమయం అనేది విలువలో అటువంటి అదనపు జోడింపుని సరఫరాదారు అందుకున్న తేదీ అయి ఉంటుంది.
అదేవిధంగా, సెక్షన్ 13 క్రింద సేవ కోసం సరఫరా చేసిన సమయం నిబంధన కోసం
వ్యాఖ్యలు
వాటికి వ్యతిరేకంగా ఒక అడ్వాన్స్ చెల్లించబడే హెచ్ఎస్ఎన్ కోడ్ లను గుర్తించవలసిన అవసరంతో సహా, ముందస్తు చెల్లింపులపై పన్ను అనేది ఒక నాన్-స్టార్టర్ అవుతుంది. సాధారణంగా, ఒక పెద్ద ఆర్డర్ బహుళ హెచ్ఎస్ఎన్ కోడ్ లను కలిగి ఉండవచ్చు, అయితే అడ్వాన్సు ఆర్డర్ విలువలో ఒక భాగం కోసం మాత్రమే అయి ఉంటుంది. ప్రస్తుతం నిర్దేశించబడిన నిబంధనలకు వేరుచేసుకుని మరియు అనుగుణంగా ఉండేందుకు ప్రజలకి ఎటువంటి ఆచరణాత్మక మార్గం ఉండదు. అడ్వాన్సులకు అస్సలు పన్ను విధించబడకూడదు; అడ్వాన్స్ ల వ్యవధి (ఏదో ఒక) 6 నెలలు మించిపోతే తప్ప, ఈ సందర్భంలో , ప్రమేయం గల హెచ్ఎస్ఎన్ ప్రాతిపదిక పొందేందుకు ప్రయత్నించేందుకు బదులుగా, అది ‘కొనుగోలు’ గా పరిగణించబడుతుంది మరియు మొత్తం అడ్వాన్స్ మొత్తానికి ప్రామాణిక రేటు వద్ద పన్ను వర్తింపజేయబడుతుంది.
3. ఇ-వే బిల్లు ను వ్యవహరించడం.
చట్టము: నియమం 1 (1) యాభై వేల రూపాయలకు మించిన విలువగల సరుకు కన్సైన్మెంట్ తరలింపుని కలగజేసే ప్రతి రిజిస్టర్డ్ వ్యక్తి,
(i) సరఫరాకు సంబంధించి; లేదా
(ii) సరఫరా కాకుండా ఇతర కారణాల కోసం; లేదా
(iii) ఒక రిజిస్టర్ చేసుకోబడని వ్యక్తి నుంచి లోపలివైపుకి సరఫరా కారణంగా,
తరలింపు ప్రారంభించటానికి ముందు, సదరు వస్తువులకి సంబంధించిన సమాచారాన్ని ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-01 యొక్క భాగం-ఎ లో, ఎలక్ట్రానిక్ గా, సాధారణ పోర్టల్ లో సమకూర్చుతారు మరియు
(a) రిజిస్టర్ చేయబడిన వ్యక్తి ద్వారా ఒక సరుకు రవాణాదారు (కన్సైనర్)గా లేదా సరఫరాను అందుకునే గ్రహీత (కన్సైనీ)గా తన స్వంత రవాణా లేదా ఒక అద్దెకు తీసుకున్న రవాణాలోగాని వస్తువులు తరలించబడే సందర్భంలో, అట్టి వ్యక్తి లేదా అందుకునే వ్యక్తి ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-01 యొక్క భాగం బి లో సమాచారాన్ని సమకూర్చిన తర్వాత ఇ-వే బిల్లును, ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-1 లో సాధారణ పోర్టల్ లో ఎలక్ట్రానిక్గా ఉత్పత్తి చేయవచ్చు, లేదా
(b) నిబంధన (a) కింద ఇ-వే బిల్లు సృష్టించబడని మరియు సరుకులు ఒక రవాణాదారునికి అప్పగించటం జరిగినచోట, సాధారణ పోర్టల్లో ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-01 యొక్క భాగం బి లో రవాణాదారుకి సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్డ్ వ్యక్తి సమకూర్చాలి మరియు ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-01 యొక్క భాగం ఎ లో రిజిస్టర్డ్ వ్యక్తి ద్వారా అందజేయబడిన సమాచారం ఆధారంగా ఇ-వే బిల్లు సదరు పోర్టల్ పై రవాణాదారు ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది:
రిజిస్టర్డ్ వ్యక్తి లేదా, సందర్భానుసారంగా, రవాణాదారు గాని, తన ఇచ్ఛానుసారంగా, రవాణా సరుకు విలువ యేభై వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడా, ఇ-వే బిల్లును ఉత్పత్తి చేసి వెంట తీసుకువెళ్ళే సందర్భం అయితే తప్ప.
ఇంకా రిజిస్టర్ చేయబడని వ్యక్తి ద్వారా తన సొంత వాహనము లేక అద్దెదానిలో లేదా ఒక రవాణాదారు ద్వారాగాని సరుకు రవాణా చేయబడేటప్పుడు, అతను లేదా రవాణాదారు గాని, తమ ఇచ్ఛానుసారము, ఈ నియమంలో సూచించబడిన ప్రకారము సాధారణ పోర్టల్లో ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-01 లో ఇ-వే బిల్లు ఉత్పత్తి చేసే సందర్భం అయితే తప్ప.
వివరణ – ఈ ఉప-నియమం నిమిత్తము, ఒక రిజిస్టర్ చేయబడని సరఫరాదారు ద్వారా ఒక రిజిస్టర్ చేయబడిన గ్రహీతకు వస్తువులు సరఫరా చేయబడే సందర్భంలో, వస్తువుల రవాణా ప్రారంభమైన సమయంలో గనక గ్రహీత తెలిసి ఉంటే, అటువంటి గ్రహీత ద్వారా రవాణా చేయబడినట్లుగా భావించ బడుతుంది.
వ్యాఖ్యలు
1. ఇ-వే బిల్లులని ఉత్పత్తి చేయడం కోసం కనిష్ఠ పరిమితిని రూ. 50,000/- కు మించిన పరిమితికి పెంచవలసిన అవసరం లేదు
2. బి నుండి సి కి జరిగే కొనుగోళ్ళను ఇ-వే బిల్లులు ఉత్పత్తి చేయవలసిన అవసరము నుండి మినహాయించుట, ప్రత్యామ్నాయముగ అధిక కనిష్ఠ పరిమితిని నిర్ధారించుట (ఐఫోను ఈరోజున రూ.80,000 కు అమ్మబడుతోంది)
చట్టం నియమం 1(3) తరలింపు చేసే సమయంలో ఒక వాహనం నుండి మరొకదానిలోకి వస్తువులను బదిలీ చేసే ఎవరైనా రవాణాదారు, అటువంటి బదిలీకి మరియు వస్తువులను మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి ముందు, రవాణా సాధనాన్ని అక్కడ పేర్కొంటూ ఫారం జిఎస్టి ఐఎన్ఎస్-01 లో సాధారణ పోర్టల్ మీద కొత్త ఇ-వే బిల్లును ఉత్పత్తి చేయాలి.
వ్యాఖ్యలు: ఈ నిబంధనలోని ఆచరణాత్మక ఇబ్బంది
డిటిడిసి లేదా ఫర్స్ట్ ఫ్లైట్ లాంటి కొరియర్ ద్వారా ఒక కొరియర్ బుక్ చేయబడినప్పుడు
వారి శాఖ లేదా బుకింగ్ కౌంటర్ సదరు కొరియర్ కోసం అతను బుక్ చేసిన షిప్మెంట్ కోసం ఇ వే బిల్లుని ఉత్పత్తి చేస్తారు, తరువాత అతను దానిని సమీప శాఖకి తరలిస్తారు, మళ్లీ ఆ శాఖ (వారి లోడ్ ని అనేక బుకింగ్ కౌంటర్లు ఏకీకృతం చేసే చోట) దానిని హబ్ (HUB)కి బదిలీ చేసేందుకు మళ్లీ ఇ-వే బిల్లును ఉత్పత్తి చేస్తారు.
మళ్ళీ కొరియర్ హబ్ వీటికి కనెక్షన్ కోసం ఒక ఇ-వే బిల్లును ఉత్పత్తి చేస్తారు
1) విమానాలు
2) రైలు
3) రహదారి
అప్పుడు మళ్ళీ విమానము లేదా రైలు లేదా రహదారికి సహ-లోడర్ కొరకు మరొక ఇ-వేబిల్లు. ఇదే ప్రక్రియ తుది గ్రహీత వరకు కొనసాగుతుంది. ఇది ఆచరణాత్మకంగా అసంభవమైన విషయం.
3.చట్టం నియమం 1(8) ఉప-నియమం (1) కింద రూపొందించబడిన ఇ-వే బిల్లు వివరాలు, గ్రహీత గనక రిజిస్టర్ చేయబడి ఉంటే, సాధారణ పోర్టల్ పై అందుబాటులో ఉంచబడతాయి, అతను అట్టి ఇ-వే బిల్లు కవర్ చేయబడిన సరుకుకి తన ఆమోదము లేదా తిరస్కారము తెలియజేస్తారు.
వ్యాఖ్యలు : ఒక వేళ గ్రహీతగనక ఇ-వే బిల్లును తిరస్కరించినట్లయితే అట్టి రవాణా పరిస్థితి ఏమవుతుంది అనేదాని గురించిన స్పష్ఠత అవసరం. సరఫరా మరియు తదనుసారముగ ఇన్వాయిస్ జారీచేయడం ఆపివేయబడుతుందా?
చట్టం నియమం 3 ( 1) కమీషనరు లేదా ఈ విషయంలో తన తరఫున అతని ద్వారా అధికారమివ్వబడిన ఒక అధికారిగాని అన్ని రాష్ట్రఅంతర (ఇంటర్ స్టేట్) మరియు అంతర్ రాష్ట్ర (ఇంట్రా స్టేట్) సరుకు తరలింపుల కోసం ఏదైనా రవాణా సాధనాన్ని ఆపేందుకు మరియు ఇ-వేబిల్లు లేదా ఇ-వే బిల్లు నెంబరును ప్రత్యక్ష రూపంలో తనిఖీ చేసేందుకు తగిన అధికారికి అధీకృతం ఇవ్వవచ్చు.
వ్యాఖ్యలు – ఇ-వే బిల్లును ధృవీకరించడానికి లేదా తనిఖీ చేయడానికి ఏదైనా వాహనాన్ని ఆపేందుకు అధీకృతమివ్వబడిన అధికారి హక్కు, రవాణా జాప్యాలకు దారి తీస్తుంది ఇంకా ‘చెక్ పోస్ట రాజ్యం’ తిరిగి తీసుకువస్తుంది.
ఖాతాల మరియు రికార్డుల ముసాయిదా నియమాలలో సమస్యలు
అధ్యాయం – అకౌంట్లు మరియు రికార్డులు
1. రిజిస్టర్ చేసుకోబడిన వ్యక్తుల ద్వారా ఖాతాల నిర్వహణ
నియమం – (2) ఉప-నియమం (1) లో పేర్కొన్న ఖాతా లేదా రికార్డులు తయారీ, ట్రేడింగ్ మరియు సేవల నిబంధనలు మొదలైనవాటితో సహా ప్రతి కార్యకలాపానికి ప్రత్యేకంగా నిర్వహించబడతాయి.
వ్యాఖ్యలు
ఒక అకౌంటింగ్ వాతావరణంలో జరిగే అన్ని లావాదేవీలను మనం తీసుకున్నప్పుడు, అది అన్ని బ్యాంకుల మధ్య బదిలీలు, నగదు డిపాజిట్లు మరియు ఉపసంహరణలు, చెల్లింపులు, రసీదులు, రుణాలు, తిరిగి చెల్లింపులు మరియు అటువంటి పన్ను-కాని లావాదేవీలు కలిగి ఉంటుంది. ఇవి సాధారణంగా ఒక ‘కార్యకలాపం’ కోసం ప్రత్యేకంగా గుర్తించబడి చేయబడవు – కానీ స్వభావరీత్యా సంస్థాగతమైనవిగా ఉంటాయి. ఖాతాలు / రికార్డులను ‘విడివిడిగా’ నిర్వహింగలిగేందుకు వీలుగా, ప్రతి ఒక్క లావాదేవీ వేరు చేయబడటమనేది, నెరవేర్చడానికి ఏదైనా సంస్థకు దాదాపుగా అసాధ్యం అవుతుంది.
ప్రతిపాదితం: తయారీ, వర్తకం మరియు సేవల నిబంధనలు, మొదలైనవాటితో సహా ప్రతి ప్రత్యేక కార్యకలాపానికి సంబంధించిన అన్ని రాబడి వివరాలను పొందడం సాధ్యం అయ్యేవిధంగా ఉప-నియమం(1) లో పేర్కొన్న ఖాతా లేదా రికార్డులు నిర్వహించబడతాయి.
నియమం – (3) (3) సెక్షన్ 10 క్రింద పన్ను చెల్లించే వ్యక్తి కాకుండా ఇతర ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి, తన ద్వారా అందుకోబడే మరియు సరఫరా చేయబడే ప్రతి సరకుకు సంబంధించి స్టాక్ ఖాతాలను నిర్వహించాలి మరియు అటువంటి ఖాతా ప్రారంభ బ్యాలెన్స్, రసీదు, సరఫరా, పోయిన వస్తువులు, దొంగిలించబడినవి, నాశనం చేయబడినవి, కొట్టిపారేసినవి లేదా కానుకలు లేదా ఉచిత నమూనాల రూపంలో విసర్జించబడినవి మరియు ముడి పదార్థాలు, పూర్తయిన వస్తువులు, స్క్రాప్ మరియు అక్కడి వ్యర్థంతో సహా సరుకు యొక్క బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
వ్యాఖ్యలు
అనేక రకాలైన వ్యాపారాలు లెక్కించటం/తిరిగి లెక్కించడం కష్టంగా ఉండే అనేక ఎస్కెయులు లేదా ఉత్పత్తులతో వ్యవహరిస్తూ ఉండే వారి వ్యాపార స్వభావరీత్యా, ‘భర్తీ చేయటానికి’ కేవలం ‘స్టాక్ జాడ గుర్తించడం (ట్రాకింగ్)’ కాకుండా ‘స్టాక్ పరిసమాప్తమవడం’ పై ఆధారపడతాయి. మనస్సులో మెదిలే ఉదాహరణలు, ఏవో కొన్ని చెప్పాలంటే ఔషధాల దుకాణాలు, కిరాణా / ఎఫ్ఎంసిజి దుకాణాలు, ఆహార/మిఠాయి దుకాణాలు, బాల్ బేరింగ్లు మరియు హార్డ్వేర్ స్టోర్లు, వస్త్రాల దుకాణాలు. బాగా వ్యవస్థ సజావుగా ఉన్న సంస్థలు లేదా అధిక విలువ ఎస్కెయులతో వ్యవహరించేవారికి మినహాయించి, ఇటువంటి అనేక వ్యాపారాల నుంచి ఇది ఆశించడం దుస్సాధ్యం.
నియమం – (4) ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి అందుకున్న, చెల్లించిన మరియు అందులో చేసిన సర్దుబాట్లకు సంబంధించిన ప్రత్యేక ఖాతాలను ఉంచుకోవాలి మరియు నిర్వహించాలి.
వ్యాఖ్యలు ఇది పూర్తి లావాదేవీల జాడ తెలిసి ఉండటం కోసం మంచిది, కానీ ఒక పొడిగించబడిన వ్యవధి గడువు (6 నెలలు అలాగ) ముగిసిపోతే తప్ప దీనిని పన్ను జాలంలోకి తీసుకుని రాకూడదు. ఈనాటి నిబంధనలేమిటంటే అదే రిటర్న్ వ్యవధి (ఇది ఒక నెల) లో అది చెల్లించబడకుండా మిగిలి ఉన్నట్లయితే, దానిని పన్ను జాలంలోకి తీసుకురావడం. అందువల్ల, ముఖ్యంగా ఒక నెల 28 వ తేదీన (అనుకుందాం) ఒక అడ్వాన్స్ అందుకోబడి, మరియు వచ్చే నెలలో 3 వ తేదీన ఇన్వాయిస్ సిధ్ధం చేయబడినట్లయితే, పన్ను చెల్లించే వ్యక్తి గత నెల కోసం ‘అడ్వాన్స్ పై పన్ను’ ని మరియు తర్వాతి నెలలో ఇన్వాయిస్ కోసం బ్యాలెన్స్ ను విడివిడిగా చెల్లించాలి – ఇది కట్టుబడి ఉండటాన్ని కష్టతరం చేస్తుంది.
నియమం – (6); ప్రతి రిజిస్టర్ చేయబడినన వ్యక్తి వీటి యొక్క వివరాలను ఉంచాలి – (a) తాను వస్తువులను లేదా సేవలను అందుకున్న సరఫరాదారుల యొక్క పేర్లు మరియు పూర్తి చిరునామాలు; (b) తాను వస్తువులను లేదా సేవలను సరఫరా చేసిన వ్యక్తుల యొక్క పేర్లు మరియు పూర్తి చిరునామాలు;(c) అక్కడ నిల్వ చేసిన వస్తువుల వివరాలతో పాటు తరలింపు చేసే సమయంలో నిల్వ చేసిన వస్తువులతో సహా తాను వస్తువులని నిల్వచేసిన ప్రాంగణాల సంపూర్ణ చిరునామాలు.
వ్యాఖ్యలు ఏ రిటైల్ సరఫరాదారుకైనా దీనిని – అంటే పేర్లు మరియు తాను వస్తువులను లేదా సేవలను అందించిన వ్యక్తుల పేర్లు మరియు పూర్తి చిరునామాలను అనువర్తించడం అనేది అసాధ్యమనిపిస్తుంది. అదేవిధంగా, కూరగాయలు మరియు పండ్ల మార్కెట్ (మండీలు) కోసం, ఇది అసాధ్యం. వస్తువులు నిల్వ చేయబడిన ప్రదేశం యొక్క చిరునామాలు ఖచ్చితంగా సాధ్యం కాగలవు, అయితే వస్తువుల రవాణాలో వస్తువులు నిల్వ చేయబడిన ప్రాంతాల అన్నింటి చిరునామాలను రిజిస్టర్డ్ వ్యక్తి కలిగి ఉంటారని చెప్పడం కూడా అసాధ్యం అనిపిస్తుంది – ఎందుకంటే ఇది సాధారణంగా వారి నియంత్రణ ప్రదేశానికి బయట, మరియు వస్తువులు బట్వాడా చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తులు నియంత్రణలో ఉంటుంది కాబట్టి.
ప్రతిపాదితం: ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి వీటి యొక్క వివరాలను ఉంచాలి- (a) తాను వస్తువులను లేదా సేవలను అందుకున్న సరఫరాదారుల యొక్క పేర్లు మరియు పూర్తి చిరునామాలు; (b) తాను వస్తువులను లేదా సేవలను సరఫరా చేసిన రిజిస్టర్ చేయబడిన వ్యక్తుల యొక్క పేర్లు మరియు పూర్తి చిరునామాలు; (c) తాను వస్తువులని నిల్వచేసిన ప్రాంగణాల సంపూర్ణ చిరునామాలు.
నియమం – (7) ఉప-నియమం (6) క్రింద ప్రకటించబడినవి కాకుండా ఏవైనా ఇతర ప్రదేశం(లు) వద్ద ఏదైనా పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు, ఏ చెల్లుబాటయ్యే పత్రాల ఆఛ్ఛాదన లేకుండా నిల్వచేయబడినట్లుగా కనుగొనబడితే, అప్పుడు వస్తువులు రిజిస్టర్డ్ చేయబడిన వ్యక్తిచే సరఫరా చేయబడినట్లుగా సరైన అధికారి అటువంటి వస్తువులపై చెల్లించవలసిన పన్ను మొత్తం నిర్ణయిస్తారు.
వ్యాఖ్యలు రవాణా సరుకులు రావడం మరియు తాత్కాలిక నిల్వలో వస్తువులను ఉంచవలసిన అవసరం ఉండటం, ప్రాకృతిక సమస్యలు (వర్షం / వరదలు) ఉన్నప్పుడు వస్తువులను స్థానం మార్చవలసిన అవసరం ఏర్పడటం, వారి సొంత ప్రాంగణంలో పునర్నిర్మాణము / నిర్మాణం కార్యకలాపాలు ఉన్నప్పుడు పదార్ధాలను చోటుమార్చవలసి రావడం, పొగపెట్టడం/ తెగులు నియంత్రణ కార్యకలాపాల వల్ల పదార్థం చోటుమార్చవలసి అవసరం మరియు మొదలైనవాటి కారణంగా చోటు చాలకపోవడం వంటి అత్యవసర పరిస్థితులని ఇది పరిగణనలోకి తీసుకోదు. దీనిని ఒక విస్తృత-ఆధారిత ప్రకటనగా తయారు చేయడం అనేది ఊరికే యాదృఛ్ఛిక వివరణ కోసం విషయాన్ని తెరుస్తుంది.
ప్రతిపాదితం: (7) ఉప-నియమం (6) క్రింద ప్రకటించబడినవి కాకుండా ఏవైనా ఇతర ప్రదేశం(లు) వద్ద ఏదైనా పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు, ఏ చెల్లుబాటయ్యే పత్రాల ఆఛ్ఛాదన లేదా చెల్లుబాటయ్యే వివరణ లేకుండా నిల్వచేయబడినట్లుగా కనుగొనబడితే, అప్పుడు వస్తువులు రిజిస్టర్డ్ చేయబడిన వ్యక్తిచే సరఫరా చేయబడినట్లుగా సరైన అధికారి అటువంటి వస్తువులపై చెల్లించవలసిన పన్ను మొత్తం నిర్ణయిస్తారు.
నియమం – (8) ప్రతీ రిజిస్టర్ చేయబడిన వ్యక్తి తన వ్యాపార ప్రధాన స్థలంలో మరియు తన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో పేర్కొన్న వ్యాపారం యొక్క ప్రతి సంబంధిత ప్రదేశంలోనూ ఖాతా పుస్తకాలు నిర్వహిస్తారు మరియు అలాంటి ఖాతా పుస్తకాలలో ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంలో నిల్వ చేయబడిన ఏదైనా డేటా యొక్క ఎలక్ట్రానిక్ రూపాన్ని కలిగి ఉండాలి.
వ్యాఖ్యలు నేటి ప్రపంచంలో, డేటా ‘నిల్వ’ కాకుండా డేటాకు ‘ప్రాప్యత’ ముఖ్యమైనదిగా ఉన్నచోట, ఇది ఒక తిరోగమన నియమంగా ఉంటుంది.
ప్రతిపాదితం: ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి ఖాతా పుస్తకాలను అది వ్యాపార ప్రధాన స్థలంలో మరియు తన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో పేర్కొన్న వ్యాపారం యొక్క ప్రతి సంబంధిత ప్రదేశంలోనూ అందుబాటులో ఉండే విధంగా ఉంచాలి మరియు అలాంటి ఖాతా పుస్తకాలలో ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంలో నిల్వ చేయబడిన ఏదైనా డేటా యొక్క ఎలక్ట్రానిక్ రూపాన్ని కలిగి ఉండాలి.. నిల్వ చేయబడిన డేటా యొక్క ఎలక్ట్రానిక్ రూపం అంతా కూడా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సరిహద్దులలో నిల్వ చేయబడాలి.
నియమం – (9) రిజిస్టర్లు, ఖాతాలు మరియు పత్రాల్లో ఏవైనా ఎంట్రీలు తొలగించబడవు, చెరిపివేయబడవు లేదా భర్తీ చేయబడవు మరియు అన్ని తప్పు ఎంట్రీలు ధృవీకరణ కింద స్కోర్ చేయబడతాయి మరియు ఆ తరువాత సరైన ఎంట్రీ నమోదు చేయబడుతుంది మరియు రిజిస్టర్లు మరియు ఇతర పత్రాలు ఎలక్ట్రానిక్గా నిర్వహించబడేచోట, ప్రతి సవరించబడిన లేదా తొలగించబడిన ఎంట్రీ యొక్క లాగ్ నిర్వహించబడాలి.
వ్యాఖ్యలు ఇది దేశంలోని ప్రతి పెద్దదైన మరియు చిన్నదైన వ్యాపారాన్ని, వెంటనే కట్టుబడి ఉండకుండా ఉండేలాగా చేస్తుంది. మానవ దోషాలు ఊహించబడతాయి (మరియు మినహాయింపు ఏమీ కాదు) కాబట్టి పెద్ద వ్యాపారాలకి మేకర్, వెరిఫైర్, అప్రెసేర్ వంటి ప్రక్రియలు ఉంటాయి. ఒక ఎలక్ట్రానిక్ వాతావరణంలో మానవ దోషాలు – కీ పంచ్ లోపాల కారణంగా – మానవ ఇంటర్ఫేస్ స్వభావం కారణంగా మరింత తరచుగా ఉంటాయి. దోషాలు అనేవి తారుమారు చేయడం లేదా దురుద్దేశాన్ని సూచించవు. కౌంటర్-పార్టీ లావాదేవీ, మరియు / లేదా బ్యాంక్ రికార్డలు మరియు / లేదా ఇతర మాన్యువల్ సపోర్టింగ్ ద్వారా ఒక ఎంట్రీకి మద్దతు ఇవ్వడంలో అసమర్థత, అనేది ‘లోపం దిద్దుబాటు యొక్క ట్రయిల్’గా కాకుండా దృష్టి పెట్టవలసిన విషయం అయి ఉండాలి. ప్రతి దోషం ‘కనిపించే’ లాగా ఉండిపావలసిన అవసరం ఉండటం, ప్రతి రికార్డుల వ్యవస్థను అసహ్యమైనదిగా చేసి, ‘దోషం లేకుండా దానిని పంచ్ చేయగలరని ఖచ్ఛితంగా తెలిసేంత’ వరకు, వాటిని రికార్డుల వ్యవస్థ వెలుపల ఉంచడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది’ – ఇది మంచి కంటే మరింత చెడు చేస్తుంది. ఈ నిబంధన అనేది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని వర్డ్ లేదా ఎక్సెల్ నుంచి ‘డిలిట్’ ( ‘తొలగించు’) మరియు ‘బ్యాక్పేస్’ (వెనక్కి) కీ లేకుండా చేయాలని అడగడంతో సమానంగా ఉంటుంది, మరియు ప్రజలు ‘వారి దోషాన్ని స్కోర్ చేయగలరు’ అంతేగాని వాటిని ‘తొలగించ’లేరు!….
ఒక ఆదాయం దృష్టి కోణం నుండి ఈ నిబంధన యొక్క లాభం మరియు ప్రయోజనం కూడా చర్చనీయంగా ఉంటుంది – ఇది రాబడి గరిష్టీకరణ లేదా పాలసీ జోక్యం కోసం ఏమైనా విలువైన ఇన్పుట్లను లేదా అంతర్దృష్టులను ఇస్తుందా అని. వాస్తవానికి, ప్రజలు ఎలక్ట్రానిక్ పద్ధతులను ఉపయోగించడం మానుకుంటారు లేదా క్రమబద్ధీకరణతో సంఘటనల రికార్డింగ్ మానుకుంటారు కాబట్టి దీనికి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే సామర్ధ్యం ఉంది – దీని ఫలితంగా మరింత అపారదర్శక రికార్డులను లేదా తక్కువ సమర్థవంతమైన వ్యాపారాలు (తక్కువ ఆదాయ సేకరణకు దారితీస్తుంది) ఏర్పడతాయి.
ప్రతిపాదితం: రిజిస్టర్లు, ఖాతాలు మరియు పత్రాల్లో ఏదైనా ఎంట్రీ స్కాన్ చేయబడిన లేదా మాన్యువల్ పత్రాల ద్వారా పూర్తిగా మద్దతు ఇవ్వబడి ఉంటుంది లేదా కౌంటర్ పార్టీ (బ్యాంకుల వంటివి) రికార్డులకి ఆచూకీ చూపగలిగే విధంగా ఉంటుంది మరియు అటువంటి సమర్పించిన రికార్డులకు చేసిన మార్పులు, ఏమైనా ఉంటే, వాటితో సహా రిటర్నులో సమర్పించబడిన అన్ని రికార్డులతో రాజీపడి ఉండాలి.
నియమం – (10) రిజిస్టర్ చేయబడిన వ్యక్తిచే నిర్వహించబడే ఖాతా పుస్తకంలోని ప్రతి వాల్యూమ్ క్రమవరుసలో నంబర్లు వేయబడి ఉండాలి.
ప్రతిపాదితం: రిజిస్టర్ చేయబడిన వ్యక్తిచే నిర్వహించబడే మాన్యువల్ ఖాతా పుస్తకాలలోని ప్రతి వాల్యూమ్ క్రమవరుసలో నంబర్లు వేయబడి ఉండాలి.
నియమం – (13) వస్తువులను తయారుచేసే ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి ఉపయోగించిన ముడి పదార్ధాలు లేదా సేవల యొక్క పరిమాణాత్మక వివరాలను మరియు వ్యర్ధ పదార్ధాలు మరియు బై ప్రాడక్టులతో సహా ఆ విధంగా తయారు చేయబడిన వస్తువుల పరిమాణాత్మక వివరాలను చూపే నెలవారీ ఉత్పాదన ఖాతాలను నిర్వహించాలి
వ్యాఖ్యలు ఎంతోమంది ఎస్ఎంఇ తయారీదారులకు ఇది ఒక అసాధ్యమైన పని. ఉదాహరణల్లో లాథె / మిల్లింగ్ దుకాణాలు, వడ్రంగి, కుమ్మరి వస్తువులు, బొమ్మలు / కళాఖండాలు మొదలైనవి ఉన్నాయి. వారి ముడి పదార్థాల, మరియు వారి తయారైన ఉత్పత్తుల యొక్క నిర్మాణాత్మకంకాని స్వభావం, ఊహించిన విధంగా వివరాలను సంగ్రహించే సామర్థ్యాన్ని ప్రతిఘటిస్తాయి.
నియమం – (14). సేవలను అందించే ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి ప్రతి సేవా అందించడం కోసం ఉపయోగించబడిన వస్తువుల పరిమాణాత్మక వివరాలు, వినియోగించుకున్న ఇన్పుట్ సేవల వివరాలు మరియు సరఫరా చేయబడిన సేవల వివరాలు చూపే ఖాతాలను నిర్వహించాలి.
వ్యాఖ్యలు ఇంతకు పాయింటు కు ఎస్ఎంఇలకు సంబంధించి చేసిన పరిశీలనలాంటిదే. బ్యూటీ పార్లర్స్, రెస్టారెంట్లు, అటువంటివి. సాధారణంగా, నిబంధనలో ప్రతిపాదించబడిన విధంగా సమాచారాన్ని పరస్పరం పొంతన ఏర్పర్చగల సామర్ధ్యం ఆచరణయోగ్యంకానిది (అనేకమందికి) మరియు అసాధ్యం (కొంతమందికి).
నియమం – (15) ప్రతి పనుల కాంట్రాక్టు అమలుచేసే ప్రతి రిజిస్టర్ చేయబడిన వ్యక్తి ప్రతి పనులకి సంబంధించి వీటిని చూపుతూ వేర్వేరు ఖాతాలని నిర్వహించాలి – – (a) పనుల పనుల ఒప్పందం ఎవరిపేరిట అమలు చేయబడిందో ఆ వ్యక్తుల పేర్లు మరియు చిరునామాలు; (b) పనుల కాంట్రాక్ట్ అమలు కోసం అందుకున్న వస్తువుల లేదా సేవల, విలువ మరియు పరిమాణం (వర్తించే చోట) యొక్క వివరణ; (c) ప్రతి పనుల కాంట్రాక్ట్ అమలులో వినియోగించుకోబడిన వస్తువుల లేదా సేవల, విలువ మరియు పరిమాణం (వర్తించే ప్రతిచోట) యొక్క వివరణ; (d) ప్రతి పనుల కాంట్రాక్టుకు సంబంధించి అందుకున్న చెల్లింపు వివరాలు; మరియు (e) తాను వస్తువులను లేదా సేవలను అందుకున్న సరఫరాదారుల పేర్లు మరియు చిరునామాలు.
వ్యాఖ్యలు ఇది మళ్ళీ ఏ ఎస్ఎంఇ కాంట్రాక్టర్ కైనా చేయడం అసాధ్యం. వాస్తవానికి, ఏ కాంట్రాక్టర్ కి అయినా చేయడం బహుశా అసంభవం (అనగా, ప్రతి కాంట్రాక్టుకు ప్రత్యేక ఖాతాలను నిర్వహించడం). చాలా సందర్భాల్లో, ప్రస్తుతం అమలులో ఉన్న కోకొల్లలుగా ఉన్న (హోస్ట్) ఒప్పందాల వ్యాప్తంగా ప్రజలు బహుళ భాగస్వామ్య సేవలను ఉపయోగిస్తూ ఉంటారు మరియు అత్యంత వ్యవస్థీకృత సంస్థల(ఇంకా కొంత ‘కేటాయింపు’ రకాన్ని ఉపయోగించగల )కి కూడా ‘ప్రతి పని ఒప్పందానికి’ ఏ సేవలను వినియోగించుకున్నారు అనేదానిని వేరుచేసి నిర్వహించడం అసాధ్యం, కానీ ఏ ఎస్ఎంఇలు కూడా దీనిని సరైన పరిజ్ఞానంతో చేయలేరు. ఒక ఆదాయం దృష్టి కోణం నుండి ఈ నిబంధన యొక్క లాభం మరియు ప్రయోజనం కూడా చర్చనీయంగా ఉంటుంది – ఇది రాబడి గరిష్టీకరణ లేదా పాలసీ జోక్యం కోసం ఏమైనా విలువైన ఇన్పుట్లను లేదా అంతర్దృష్టులను ఇస్తుందా అని.
నియమం – (16). ఈ నియమాల క్రింద రికార్డులు ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించబడవచ్చు మరియు ఆ విధంగా నిర్వహించబడిన రికార్డు ఒక డిజిటల్ సంతకం ద్వారా ప్రామాణీకరించబడాలి.
వ్యాఖ్యలు అకౌంటింగ్ రికార్డులు డేటాబేస్లలో నిల్వ చేయబడి ఉండే అవకాశాలుంటాయి, మరియు ‘డిజిటల్ సంతకం’ అనే భావన ఒక ‘పత్రం’ సంతకం చేయడం కోసం రూపొందించబడింది కాని ఒక ‘డేటాబేస్’ లో సంతకం చేయటానికి కాదు. ఇందుకోసమని ఇది, ఒక అమలు చేయబడలేని నిబంధన.
నియమం – (17) చట్టం యొక్క సెక్షన్ 36 లో పేర్కొన్న విధంగా అన్ని ఇన్వాయిస్లు, సరఫరా బిల్లులు, క్రెడిట్ మరియు డెబిట్ నోట్లు మరియు స్టాకులు, డెలివరీలు, లోపలికి సరఫరా మరియు బయటికి సరఫరాకి సంబంధించిన డెలివరీ ఛలాన్లతో పాటు ఒక రిజిస్టర్ చేయబడిన వ్యక్తిచే నిర్వహించబడే ఖాతాలు చట్టం యొక్క సెక్షన్36 లో తెలియజేసిన విధంగా ఆ వ్యవధి కోసం భద్రపరచబడతాయి మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ప్రస్తావించబడిన ప్రతి సంబంధిత వ్యాపార ప్రదేశంలో ఉంచబడతాయి.
వ్యాఖ్యలు ప్రతి సంబంధిత వ్యాపార ప్రదేశంలో అన్ని రికార్డులను నిర్వహించవలసిన అవసరం ఉండటం ఆచరించడానికి అసంభవమైన విషయం – మరి ముఖ్యంగా కాగితపు (మాన్యువల్ లేదా ఎలెక్ట్రానిక్ రికార్డులకు మద్దతు ఇచ్చేవి అయిన) రికార్డుల ప్రమేయం కూడా ఉన్నప్పుడు ఒక రిజిస్టర్ చేసుకోబడిన వ్యక్తికి పేర్కొన్న నగరంలో లేదా రాష్ట్రంలో (వ్యాపార సంబంధమైన ప్రదేశాలు) బహుళ అవుట్లెట్లను కలిగి ఉన్నప్పుడు, అన్ని రికార్డులను ప్రతులు తయారుచేసి ప్రతిస్థానంలో ఉంచబడవలసిందిగా ఆశించడం అనేది ఆచరణలో అసంభవమైనది. అలాగే, ఎలక్ట్రానిక్ రికార్డుల కోసం, ప్రతీ స్థానంలో రికార్డుల భౌతిక లభ్యత కంటే ‘యాక్సెస్’ (ప్రాప్యత) అవసరమవుతుంది మరియు ఎన్నో (అన్నీ కాకపోయినా) వ్యాపారాలు వారి లావాదేవీలను నిర్వహించడానికి కేంద్రీకృత వ్యవస్థలను ఉపయోగిస్తాయి.
2. ఎలక్ట్రానిక్ రికార్డుల ఉత్పత్తి మరియు నిర్వహణ
నియమం – (1) రికార్డుల యొక్క సరైన ఎలక్ట్రానిక్ బ్యాక్ అప్ నిర్వహించబడాలి మరియు ప్రమాదాలు లేదా ప్రకృతి కారణాల వలన ఇటువంటి రికార్డులు గనక ధ్వంసం చేయబడితే, సమాచారం హేతుబధ్ధ సమయ పరిధిలో పునరుద్ధరించబడేవిధంగా భద్రపరచబడాలి.
వ్యాఖ్యలు ఇది ఒక ‘నియమం’ అవదు కాని ఒక ‘సలహా’ కాగలదు – ఎందుకంటే ఈ నియమాన్ని పాటించే సామర్థ్యం అనేది ప్రతి ఎస్ఎంఇ కు గల సాధానాలను మించి ఉంటుంది ఇంకా ఎన్నో పెద్ద సంస్థల సాధనాలకి కూడా ఇది మించిన పని కాబట్టి. విపత్తు రికవరీ అనే భావాలు ఇంకా లేతదశలో ఉండి, వ్యయాలు అందుబాటుకి మించినవి అయి ఉండటంతో పైన చెప్పిన పదాల ఎంపిక కంటే నష్టపోయిన సందర్భంలో ప్రజలు వారి పుస్తకాల రికార్డులను పునర్నిర్మించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అనడం సబబుగా ఉంటుంది. సాధారణంగా, ఇది గతంలో ప్రభుత్వానికి, జిఎస్టిఎన్, బ్యాంకులు, కౌంటర్ పార్టీలకు సమర్పించిన రికార్డుల నుండి డేటా, మరియు ఇంకా నిలచి ఉండగల ఏవైనా మానవీయ లేదా ఎలక్ట్రానిక్స్ రికార్డుల నుండి డేటాను ఉపయోగించడం ద్వారా పునర్నిర్మించడాన్ని కలిగి ఉంటుంది.
నియమం – (2) ఎలక్ట్రానిక్ రికార్డులను నిర్వహించే రిజిస్టర్ చేయబడిన వ్యక్తి డిమాండ్ చేయబడిన మీదట, అతని ద్వారా తగువిధంగా అధికారికంగా ప్రమాణీకరించబడిన సంబంధిత రికార్డులు లేదా పత్రాలను, హార్డ్ కాపీ లో లేదా ఎలక్ట్రానిక్ గా చదవదగిన ఫార్మాట్ లో సమర్పించాలి.
వ్యాఖ్యలు ‘తగువిధంగా అధికారికంగా ప్రమాణీకరించబడిన’ అనే భావన అనేది సరఫరా చేయబడిన రికార్డుల ఒక ప్రత్యేక సెట్ అనేవి వాస్తవంగా వారి వ్యవహారాలకి ప్రాతినిధ్యం వహించేవిగా పేర్కొంటూ ఉన్న ఒక మాన్యువల్ సర్టిఫికేట్ అనేది స్పష్టంగా తెలిసి ఉండాలి- మళ్ళీ ఎందుకంటే డేటాబేసులకి ఏ ఇతర ఎలెక్ట్రానిక్ ధృవీకరణ ప్రక్రియ ఉండదు అనే వాస్తవం కారణంగా. సమర్పించబడిన ఎలక్ట్రానిక్ డేటా యొక్క మొత్తాన్ని ధృవీకరించడం (చెక్సమ్) కోరడం, తనిఖీ చేయబడిన రికార్డులు సమర్పించబడిన రికార్డులు ఒకటేనని రుజువు చేయడం పూర్తిగా సాధ్యమవుతుంది – తద్వారా తాము సమర్పించిన రికార్డులు ఇవి కాదని తర్వాత పన్ను చెల్లింపుదారు క్లెయిమ్ చేసేందుకు వీలు లేకుండా.
నియమం – (3) రిజిస్టర్ చేయబడిన వ్యక్తి, డిమాండ్ చేయబడిన మీదట, కాగితపు లేదా ఎలక్ట్రానిక్ అయినాగాని మూల పత్రంతో సహా ఆడిట్ ట్రయిల్ మరియు అంతర్-బంధాల ఖాతా, ఆర్థిక ఖాతాలు, రికార్డు లేఅవుట్, డేటా నిఘంటువు మరియు ఉపయోగించిన కోడ్ లకు వివరణ డాక్యుమెంట్ల నమూనా కాపీలతో పాటు ప్రతి క్షేత్రంలోనూ రికార్డుల మొత్తం సంఖ్య కూడా సమర్పించాలి.
వ్యాఖ్యలు దీనిని సాఫ్ట్ వేర్ అప్లికేషన్ యొక్క డెవలపర్ నుండి కోరడానికి సంభావ్యంగా అవకాశం ఉండవచ్చు, అయితే, ఒక రిజిస్టర్ చేయబడిన వ్యక్తి అడగబడే సాంకేతిక వివరాలను అందిస్తారని అనుకోవడానికి అవకాశం లేదు. ఇది కారు కొనుగోలు చేసే వ్యక్తిని బ్రేకింగ్ వ్యవస్థ వెనుక గల హైడ్రాలిక్స్ మరియు సంబంధిత లెక్కింపులని వివరించేందుకు బాధ్యులుగా చేయడంతో సమానమైనది. అదనంగా, అనేక పదుల (లేదా వందల) వేలకొద్దీ ఎస్ఎంఇలు భారతదేశంలో వ్రాయబడని / సృష్టించబడని సాఫ్ట్ వేర్ ఉపయోగించుకోవచ్చు, మరియు ఈ నిబంధనకు అనుగుణంగా ఉండగలిగేందుకు వారి సామర్ధ్యం ప్రశ్నార్థకమే. మనం మళ్ళీ ఒకసారి ఈ నిబంధన యొక్క ఉద్దేశ్యం మరియు ప్రయోజనాన్ని, మరియు పరిష్కరించడానికి ప్రయత్నించడంలో సమస్య ఏమిటి అనేదానిని పరిశీలించాలి.
3. గోదాము లేదా గిడ్డంగి యొక్క యజమాని లేదా నిర్వాహకుడు మరియు రవాణాదారులు నిర్వహించవలసిన రికార్డులు
నియమం – (5) నియమం 1 యొక్క నిబంధనలకు లోబడి,. అటువంటి వస్తువులు పంపిణీ, తరలింపు, అందుకోవడం మరియు పారవేయడానికి సంబంధించిన వివరాలతో సహా నిర్దిష్ట వస్తువులు గిడ్డంగిలో ఉంచబడిన వ్యవధికి సంబంధించి గిడ్డంగి లేదా గోదాము యొక్క ప్రతి యజమాని లేదా ఆపరేటర్ ఖాతాల పుస్తకాలను నిర్వహించాలి
వ్యాఖ్యలు ట్రాన్స్-షిప్మెంట్ డిపోలు పనిచేసే వాస్తవికత సందర్భంలో మరియు వాటి వ్యాపార సందర్భాన్ని మరియు ఇటువంటి సందర్భాన్ని నిర్వహించే ప్రజల యొక్క నైపుణ్యం స్థాయిలని పరిగణనలోకి తీసుకుని తీవ్ర రికార్డుల నిర్వహించే ఆచరణాత్మకత పునఃపరిశీలించబడాలి
నియమం – (6) గోదాము యొక్క యజమాని లేదా ఆపరేటర్ ఐటెమ్ వారీగా మరియు యజమాని వారీగా అవి గుర్తించబడగలిగే విధంగా వస్తువులను నిల్వచేసుకోవాలి, తగుఅధికారి ద్వారా డిమాండు చేయబడిన మీదట ఏదైనా భౌతిక ధృవీకరణ లేదా తనిఖీని సులభతరం చేయాలి.
వ్యాఖ్యలు ఇది సామాన్యంగా, ఒక రవాణా దృష్టికోణం నుండి, తక్కువ పరిమాణంలో వస్తువుల తరలింపు – సాధారణంగా ఒక ఎస్ఎంఇ షిప్ చేసేవి ఇవే – ఏకీకృతమయ్యే చోట అసాధ్యమవుతుంది. అటువంటి షిప్మెంట్లు/ కంటైనర్ల జాడ తెలుసుకోగలిగి ఉండటం అనేది అంతిమంగా మూలకారకాలు మరియు యజమానులను వెల్లడించగా, ఈ నిబంధన అనేది అంశం-వారీగా / యజమాని-వారీగా గుర్తించగల ప్రతి మధ్యంతర బిందువు యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది, మరియు అందుబాటులో ఉండే అవకాశం లేదు.. వారు ‘షిప్మెంట్ యొక్క మూలం’ మరియు ‘షిప్మెంట్ యొక్క సంబంధిత పత్రాన్ని’ గుర్తించగలిగి ఉండాలి అనడం సరిపోతుంది – మరియు రివర్స్ ట్రెయిల్ (దానినుంచి వెనక్కు ప్రయాణించడం) చివరికి కోరబడిన వివరాలను ఎలాగూ అందిస్తుంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

114,939 total views, 2 views today