పన్ను అంచనా అంటే ఒక వ్యక్తి యొక్క పన్ను బాధ్యత నిర్ణయించడం. ఒక వ్యక్తి యొక్క పన్ను బాధ్యత అనేది, ఒక పన్ను వ్యవధిలో ఒక వ్యక్తి ద్వారా చెల్లించబడవలసిన పన్ను మొత్తం. జిఎస్టి కింద పన్నుల అంచనా యొక్క రకాలు ప్రస్తుత వ్యవస్థలో ఉన్నవాటిని పోలి ఉంటాయి. విస్తృతంగా, 2 రకాల లెక్కింపులు ఉంటాయి – పన్ను చెల్లించదగిన వ్యక్తి ద్వారా తనకై తానుగా వేసుకోబడే అంచనా, అంటే స్వీయ-అంచనా, మరియు పన్ను అధికారుల ద్వారా వేయబడే అంచనా.

పన్ను అధికారుల ద్వారా అంచనా అనేది 4 రకాలు:

  1. తాత్కాలిక అంచనా
  2. పరిశీలన అంచనా
  3. ఉత్తమ తీర్పు అంచనా
  4. సారాంశం అంచనా

మనం వీటిని వివరంగా అర్థం చేసుకుందాం.

స్వీయ-అంచనా

ప్రతి నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ఆమె/అతని ద్వారా చెల్లించబడవలసిన పన్నును తమకుతాముగా అంచనా వేసుకోవాలి మరియు ప్రతి పన్ను వ్యవధికి సంబంధిత రిటర్న్ అందించాలి. పన్ను విధింపదగిన వ్యక్తి యొక్క రకాన్ని బట్టి, అందించబడవలసిన రిటర్నులు పేర్కొనబడ్డాయి. జిఎస్టి కింద రిటర్నుల రకాలుఅనే మా బ్లాగ్ లో ఇది సవివరంగా వివరించబడింది.

ఉదాహరణకు: ఒక నమోదిత క్రమబధ్ధమైన డీలర్ ఒక నెలవారీ ప్రాతిపదికన ఫారం జిఎస్టిఆర్-3 ను మరియు ప్రతి సంవత్సరం ఫారం జిఎస్టిఆర్-9 ను తప్పక అందజేయాలి. పన్ను చెల్లింపుదారు స్వీయ-అంచనాను నిర్వహిస్తున్న సంఘటన ఇది.

పన్ను అధికారుల ద్వారా అంచనా

1. తాత్కాలిక అంచనా

ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి గనక వస్తువుల మరియు / లేదా సేవల విలువను నిర్ధారించలేకపోతే లేదా వర్తించే పన్ను రేటును నిర్ధారించలేకపోతే, తాత్కాలిక ప్రాతిపదికన పన్ను చెల్లింపును అనుమతించవలసిందిగా ఆ వ్యక్తి ఒక అధికారిని అభ్యర్థించవచ్చు. ఒక తాత్కాలిక ప్రాతిపదికన పన్ను చెల్లించడానికి ఆ వ్యక్తిని అనుమతించే ఒక ఉత్తర్వును అధికారి జారీ చేస్తారు. పన్ను రేటు మరియు పన్ను విధించదగిన విలువ అధికారి చేత నిర్దేశించబడుతుంది. అధికారికి సబబుగా తోచినట్లుగా ఆ వ్యక్తి ఒక బాండ్ మరియు హామీ లేదా భద్రత ఒప్పందం సంతకం చేయవలసి ఉంటుంది. తాత్కాలికంగా అంచనా వేయబడిన మరియు చివరికి అంచనా వేయబడిన పన్ను మొత్తం మధ్య తేడా చెల్లింపు కోసం ఆ బాండ్ కు ఆ వ్యక్తి కట్టుబడి ఉండవలసి ఉంటుంది.

తాత్కాలిక అంచనా తేదీ నుండి 6 నెలల లోపల, అధికారి తుది అంచనా ఉత్తర్వును జారీ చేయాలి.

తాత్కాలిక అంచనా ప్రకారం చెల్లించవలసిన ఉన్న కాని గడువు తేదీన అంటే, ఆ నెల యొక్క 20 వ తేదీన చెల్లించబడనిది అయిన ఏదైనా అదనపు పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తుది అంచనా ఉత్తర్వుకు ముందు లేదా తర్వాత ఆ మొత్తం చెల్లించబడినదా అనేదానితో ప్రమేయం లేకుండా, నెల యొక్క 21 వ తేదీ నుండి అసలు చెల్లింపు తేదీ వరకు వడ్డీ బాధ్యత ఉంటుంది. తుది అంచనా ఉత్తర్వు ప్రకారంగా ఆ వ్యక్తికి తిరిగి చెల్లింపు కోసం అర్హత ఉన్నట్లయితే, వాపసు మొత్తంపై వడ్డీ చెల్లించబడుతుంది.

ఉదాహరణకు: ఒక నమోదిత వ్యక్తి హెచ్ఎస్ఎన్ కోడ్ మరియు పన్ను రేటు అందుబాటులో లేని ఒక కొత్త ఉత్పత్తిని తయారు చేస్తుంది. ఈ సందర్భంలో, ఒక వ్యక్తి తనద్వారా చెల్లించబడవలసిన పన్ను యొక్క తాత్కాలిక అంచనాను కోరుతాడు.

2.పరిశీలన అంచనా

పరిశీలనా అంచనా ప్రకారం, రిటర్న్ యొక్క ఖచ్ఛితత్వాన్ని సరిచూచేందుకు ఒక వ్యక్తి అందించిన రిటర్న్ మరియు ఇతర సమాచారాన్ని ఒక అధికారి పరిశీలించవచ్చు.

ఏదైనా వ్యత్యాసం గనక గమనించబడినట్లయితే, ఆ అధికారి ఆ వ్యక్తికి తెలియజేస్తాడు మరియు అతని వివరణను కోరతాడు. వివరణ గనక సంతృప్తికరంగా ఉంటే, తదుపరి చర్య ఏదీ తీసుకోబడదు. తెలియబరచబడిన 30 రోజుల్లోపు సంతృప్తికర వివరణ ఏదీ ఇవ్వబడకపోతే లేదా వ్యత్యాసాలను అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి దిద్దుబాట్లు చేయకపోతే, ఆ అధికారి తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు.

ఉదాహరణకు: రెగ్యులర్ పరిశీలనా అంచనలో భాగంగా, ఒక నమోదిత వ్యక్తి ద్వారా దాఖలు చేయబడిన ఫారం జిఎస్టిఆర్-3ని ఒక అధికారి పరిశీలిస్తారు మరియు కొన్ని లావాదేవీల విలువ మరియు కొన్ని నిర్దిష్ట లావాదేవీల్లో విధించబడిన పన్నుకు సంబంధించి సందేహాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో, ఆ అధికారి డీలర్ నుండి వివరణను కోరతారు.

3. ఉత్తమ తీర్పు అంచనా

ఉత్తమ తీర్పు అంచనా ప్రకారం, ఒక అధికారి అతని/ఆమె తీర్పు ప్రకారంగా ఉత్తమంగా ఒక వ్యక్తి యొక్క పన్ను బాధ్యతను అంచనా వేస్తారు. దీని కోసం పరిస్థితులు ఇవి:

a.రిటర్నులు ఫైల్-చేయని వారి అంచనా– వ్యక్తికి నోటీసు ఇవ్వబడిన తర్వాత కూడా రిటర్న్ అందజేయకపోతే, ఒక అధికారి తన తీర్పు ప్రకారంగా ఉత్తమంగా ఒక వ్యక్తి యొక్క పన్ను బాధ్యతను అంచనా వేస్తారు. అందుబాటులో ఉన్న లేదా అధికారి సేకరించిన అన్ని సంబంధిత విషయాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. పన్ను రిటర్న్ దాఖలు చేయబడని సంవత్సరానికి వార్షిక రిటర్న్ దాఖలు చేసే గడువు తేదీ నుండి 5 సంవత్సరాల్లోపు ఒక అంచనా ఉత్తర్వు జారీ చేయడం జరుగుతుంది.

అంచనా ఆర్డర్ నుండి 30 రోజుల లోపల గనక ఆ వ్యక్తి రిటర్న్ అందజేస్తే, అంచనా ఉత్తర్వు ఉపసంహరించబడుతుంది.

ఉదాహరణకు: పన్ను శాఖ నుండి నోటీసు పొందిన తరువాత కూడా, ఒక సాధారణ డీలర్ ఒక ఆర్ధిక సంవత్సరం కొరకు జిఎస్టిఆర్-9 ను అందజేయరు. అటువంటి సందర్భంలో, ఒక వ్యక్తి ద్వారా చెల్లించబడవలసిన పన్నును అంచనా వేయడానికి ఒక అధికారి ఉత్తమ తీర్పు అంచనాను ప్రారంభిస్తారు.

b. నమోదుకాని వ్యక్తుల అంచనా – ఒకవేళ అతనికి/ఆమెకి అది చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఒక పన్ను విధించదగిన వ్యక్తి రిజిస్ట్రేషన్ పొందడంలో విఫలమైతే, సంబంధిత పన్ను వ్యవధుల కోసం ఒక అధికారి తన తీర్పు ప్రకారంగా ఉత్తమంగా ఒక వ్యక్తి యొక్క పన్ను బాధ్యతను అంచనా వేస్తారు మరియు పన్ను రిటర్న్ దాఖలు చేయబడని సంవత్సరానికి వార్షిక రిటర్న్ దాఖలు చేసే గడువు తేదీ నుండి 5 సంవత్సరాల్లోపు ఒక అంచనా ఉత్తర్వు జారీ చేయడం జరుగుతుంది.

ఉదాహరణకు: ఒక తనిఖీ సమయంలో, తన టర్నోవర్ నిర్ణీత పరిమితిని మించినప్పటికీ కూడా ఒక వ్యక్తి జిఎస్టి కింద నమోదు చేసుకోలేదని ఒక అధికారి తెలుసుకుంటారు. అధికారి ఒక ఉత్తమ తీర్పు అంచనాను ప్రారంభించి ఆ వ్యక్తి యొక్క పన్ను బాధ్యతను అంచనా వేస్తారు.

4.సారాంశం అంచనా

కొన్ని ప్రత్యేక కేసులలో, ఒక అధికారి, తన దృష్టికి వచ్చిన ఒక వ్యక్తి యొక్క పన్ను బాధ్యతలను చూపించే ఏదైనా ఆధారం కనుగొన్న మీదట, అదనపు/ జాయింట్ కమీషనర్ యొక్క అనుమతితో, ఆదాయం యొక్క ప్రయోజనాన్ని కాపాడటానికి ఆ వ్యక్తి యొక్క పన్ను బాధ్యతను అంచనా వేయవచ్చు మరియు ఒకవేళ అలాంటి ఆలస్యం వలన ఆదాయం ఉద్దేశ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుందని విశ్వసించటానికి తగినంతగా ఆధారాలు ఉన్నట్లయితే అతను ఒక అంచనా ఉత్తర్వును జారీ చేస్తారు.

ఉదాహరణకు: ఒక రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ ద్వారా దాఖలు చేయబడిన ఫారం జిఎస్టిఆర్-3 ఆధారంగా, ఆ వ్యక్తి నుండి గణనీయమైన ఆదాయం నష్టాన్ని తిరిగిపొందవచ్చని విశ్వసించడానికి తగినంత సాక్ష్యాలను అతను కనుగొంటాడు కాబట్టి ఒక అధికారి సారాంశం అంచనాను ప్రారంభిస్తారు.

జిఎస్టి కింద వివిధ రకాల అంచనాని గురించి ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి తెలుసుకుని ఉండటం మరియు సమ్మతి అవసరాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమైనది. ప్రతి నమోదిత వ్యక్తికి స్వీయ-అంచనా అనేది చాలా ముఖ్యమైనది. నిర్ధారించబడిన గడువు తేదీల ప్రకారంగా ఖచ్చితమైన సమాచారాన్ని సమకూర్చడం మరియు సమయానుసారంగా బాకీ పన్నుని చెల్లించటం ముఖ్యమైనది. తగు విధంగా చేయబడిన స్వీయ-అంచనా అనేది పన్ను అధికారుల ద్వారా అంచనా ప్రారంభించబడకుండా ఉండటాన్ని నిర్ధారిస్తుంది. పన్ను అధికారులచే అంచనా ప్రారంభించబడిన సందర్భంలో, ఇచ్చిన సమయానికల్లా అడిగిన సమాచారాన్ని అందించటానికి ఒక డీలర్ నిర్థారించుకోవాలి.జిఎస్టికింద అనుగుణంగా ఉండటానికి వ్యాపారాలు సమ్మతి మరియు సాంకేతిక సౌకర్యాలను వినియోగించుకోవాలి.

మాకు మీ సహాయం కావాలి
దయచేసి క్రింద ఉన్న వ్యాఖ్యలను ఉపయోగించి ఈ బ్లాగ్ పోస్ట్పై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇంకా మీరు ఏ జిఎస్టి సంబంధిత విషయాలని గురించి మరింతగా తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నారో మాకు తెలియజేయండి, మా విషయ ప్రణాళికలో మేము వాటిని చేర్చడానికి సంతోషిస్తాము.

ఇది ఉపయోగకరంగా ఉందా? క్రింది సోషల్ షేర్ బటన్లను ఉపయోగించి ఇతరులతో పంచుకోండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

120,891 total views, 322 views today