జిఎస్టి ని ప్రారంభించటానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో, చాలా వ్యాపారాలకు ఆసక్తిగల కీలకమైన వాటిలో ఒకటేమిటంటే పరివర్తన నియమాలు మరియు నిబంధనలు, ప్రత్యేకించి పరివర్తన తేదీనాడు ఉన్న ముగింపు స్టాక్ కు సంబంధించి. ముగింపు స్టాక్ పై అందుబాటులో ఉన్న ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ని నిబంధనలు నిర్ణయించడం వలన, మరియు దాని ఆధారంగా, వ్యాపారాలు వారి ఇన్వెంటరీని సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రస్తుత పన్ను వ్యవస్థ యొక్క చివరి కొద్ది రోజుల్లో తమను తిరిగి వ్యవస్థీకరించుకోవలసిన అవసరం ఉంటుంది కాబట్టి. వ్యాపారాల కోసం ఇది అతి క్లిష్టమైనది.

ప్రధాన ఆందోళన

ప్రస్తుత చట్టం కింద నమోదు చేసుకోబడని, కాని ఇన్పుట్ పన్ను క్రెడిట్ (ఐటిసి) కు అర్హతకలిగి ఉన్న ఆ డీలర్లకు ముగింపు స్టాక్ పై ఇన్పుట్ పన్ను క్రెడిట్ అనేది ప్రస్తుతం చర్చించవలసిన కీలక విషయం. ట్రాన్సిషన్ నిబంధనల ప్రకారం, ఎక్సైజ్ విధించదగిన వస్తువులను నేరుగా తయారీదారు / 1 వ స్థాయి డీలర్ / 2 వ స్థాయి డీలర్ నుండి కొనుగోలు చేసిన డీలర్లు- మూసివేసే స్టాక్ పై చెల్లించిన ఎక్సైజుకు 100% క్రెడిట్ పొందేందుకు అర్హులు. మరోవైపు, ఎక్సైజ్ విధించదగిన వస్తువుల కొనుగోలు చేసిన, కానీ – ఎక్సైజ్ కారకాన్ని ఖర్చుగా పాస్ ఆన్ చేసే టోకువర్తకుల నుంచి – చేసిన వర్తుకులు, వారు జిఎస్టి అమలు తర్వాత వారి వస్తువులను అమ్మినప్పుడు క్రెడిట్ యొక్క భాగాన్ని మాత్రమే పొందేందుకు అర్హులవుతారు, జిఎస్టి రేటు 18% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నచోట 60%, మరియు జిఎస్టి రేటు 12% లేదా తక్కువగా ఉంటే 40%.

ఇంకా చదవండి: రిజిస్టర్ చేయబడిన వ్యాపారం కోసం జిఎస్టికి మారడం

ఈ రెండు కేసులని మనం మరింత వివరంగా అర్ధం చేసుకుందాం.

కేసు 1

రిజిస్టర్ చేసుకోబడిన డీలర్ నేరుగా తయారీదారు / 1 వ దశ డీలర్ / 2 వ స్థాయి డీలర్ నుండి ఎక్సైజ్ విధించబడగల వస్తువులను కొనుగోలు చేయడం మరియు డ్యూటీ చెల్లింపు ప్రమాణంగా ఇన్వాయిస్ ఉన్నచోట

జూన్ 15, 2017 వ తేదీన తయారీదారు అయిన కుంతల ఇండస్ట్రీస్ల నుండి ఉత్పత్తిని కొనుగోలు చేసే ఒక డీలర్ శివా ఎంటర్ప్రైజెస్ ను పరిశీలిద్దాం. ఇన్వాయిస్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది –

ధర = 1000.00 ఐఎన్ఆర్

ఎక్సైజ్ @12.5% = 125.00 ఐఎన్ఆర్
ఎక్సైజ్ తో ధర = 1125.00 ఐఎన్ఆర్

వాట్(VAT) @ 5% = 56.25 ఐఎన్ఆర్

మొత్తం = 1181.25 ఐఎన్ఆర్

ప్రస్తుతం, జూలై 1, 2017న జిఎస్టి ప్రభావంలోకి వచ్చినప్పుడు ఈ ఉత్పత్తి అతని దగ్గర క్లోజింగ్ స్టాక్ గా పడి ఉంది. ఉత్పత్తి 12% జిఎస్టి రేటులోకి వస్తుందని అనుకోండి. శివ ఎంటర్ప్రైజెస్ దగ్గర ఎక్సైజ్ కోసం ఇన్వాయిస్ ఉన్నందున, అతనికి వాట్ (VAT) భాగం కోసం మాత్రమేకాక, ఎక్సైజ్ అంశానికి కూడా పూర్తి క్రెడిట్ దక్కుతుంది. ఆ విధంగా, జిఎస్టి అనంతరం, అతను అదే ఉత్పత్తిని విక్రయిస్తున్నప్పుడు అతను అదే 1000 ఐఎన్ఆర్ ధరలోనే విక్రయించగలడు.
2017 జులై 15 న శివ ఎంటర్ప్రైజెస్ మహేంద్ర ఏజెన్సీస్ కి ఒక విక్రయం చేసింది. ఇన్వాయిస్ క్రింది విధంగా కనిపిస్తుంది –

అమ్మకం ధర = 1000.00 ఐఎన్ఆర్ (ఏ లాభాలూ లేవని భావిస్తే)

సిజిఎస్టి @ 6% = 60.00 ఐఎన్ఆర్

SGST @ 6% = 60.00 ఐఎన్ఆర్

మొత్తం = 1120.00 ఐఎన్ఆర్
ఇప్పుడు, ప్రస్తుతం ఉన్న పన్ను క్రెడిట్లకు వ్యతిరేకంగా జిఎస్టి ఎలా సెట్ చేయబడిందో చూద్దాం.

సిజిఎస్టి అనేది ఎక్సైజ్ క్రెడిట్ కి వ్యతిరేకంగా సెట్-ఆఫ్ చేయబడుతుంది కనుక,

బ్యాలెన్స్ సిజిఎస్టి క్రెడిట్ = ప్రస్తుత ఎక్సైజ్ క్రెడిట్ – సిజిఎస్టి బాధ్యత = 125 ఐఎన్ఆర్ – 60 ఐఎన్ఆర్ = 65 ఐఎన్ఆర్ (ఎలక్ట్రానిక్ లెడ్జర్లో ఇది వినియోగించుకోవడానికి అందుబాటులో ఉంటుంది)

ఎస్జిఎస్టి అనేది వాట్(VAT) క్రెడిట్ కి వ్యతిరేకంగా సెట్-ఆఫ్ చేయబడుతుంది కనక,

బ్యాలెన్స్ ఎస్జిఎస్టి క్రెడిట్ = ఇప్పటికే ఉన్న వాట్(VAT) క్రెడిట్ – ఎస్జిఎస్టి బాధ్యత = 56.25 – 60 ఐఎన్ఆర్ = 3.75 ఐఎన్ఆర్ (దీనిని శివ ఎంటర్ప్రైజెస్ చెల్లించాల్సి ఉంటుంది)
మొత్తంమీద, శివ ఎంటర్ప్రైజెస్ వైపునుంచి చూస్తే, నికర పన్ను క్రెడిట్ ఇంకా అనుకూలమైనదిగానే ఉంటుంది. సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి క్రెడిట్లు సంబంధిత ఎలక్ట్రానిక్ లెడ్జర్లకు మళ్ళించబడగా, నికర అనుకూల పన్ను క్రెడిట్ అంటే శివ ఎంటర్ప్రైజెస్ యొక్క నగదు ప్రవాహం అనేది ఏ విధంగానైనా ప్రభావితం కాదు అని అర్థం.
ఈ ఉదాహరణ వాట్(VAT) రేటు 5% మరియు జిఎస్టి రేటు 12% గా భావిస్తుంది. వాట్(VAT) మరియు జిఎస్టి యొక్క ఇతర రేట్లు పరిశీలిస్తే, నికర పన్ను క్రెడిట్ విలువలు క్రింది విధంగా ఉన్నాయి –

పన్ను రేట్లు వాట్(VAT) @ 5%
జిఎస్టి @ 12%
వాట్(VAT) @ 5%
జిఎస్టి @ 18%

వాట్(VAT) @ 5%

జిఎస్టి @ 28%
వాట్(VAT) @ 14.5%
జిఎస్టి @ 12%
వాట్(VAT) @ 14.5%
జిఎస్టి @ 18%
వాట్(VAT) @ 14.5%
జిఎస్టి @ 28%
ధర 1000.001000.001000.001000.001000.001000.00
ఎక్సైజ్ @ 12.5 %
125.00125.00125.00125.00125.00125.00
వాట్(VAT)56.2556.2556.25163.13163.13163.13
సిజిఎస్టి 60.0090.00140.0060.0090.00140.00
ఎస్జిఎస్టి 60.0090.00140.0060.0090.00140.00
సిజిఎస్టి బ్యాలె.65.0035.0015.0065.0035.0015.00
ఎస్జిఎస్టి బ్యాలె.3.7533.7583.75103.1373.1323.13
నికర పన్ను క్రెడిట్ 61.251.25168.13108.138.13
కేసు 2

వాట్(VAT) రిజిస్టర్డ్ డీలర్ ఒక టోకు వ్యాపారి నుండి ఎక్సైజ్ విధించబడగల వస్తువుల కొనుగోలు చేయడం, అందుచే ఎక్సైజ్ అనేది ఇన్వాయిస్ లో ఛార్జి చేయబడిన ఎక్సైజ్ గా కాక ధర అని పాస్ ఆన్ చేయబడింది

జూన్ 15, 2017 న కపిల్ హోల్సేలర్ల నుండి ఉత్పత్తిని కొనుగోలు చేసే డీలర్ భల్లా ఎంటర్ప్రైజెస్ ని పరిశీలిద్దాం. ఇన్వాయిస్ ఈ క్రింది విధంగా కనిపిస్తుంది –
ధర = 1125.00 ఐఎన్ఆర్ (ఎందుకంటే ఈ సరుకులో ధరలోకి ఎక్సైజ్ గ్రహించబడింది కాబట్టి)

వాట్(VAT) @ 5% = 56.25 ఐఎన్ఆర్

మొత్తం = 1181.25 ఐఎన్ఆర్

ఇప్పుడు, జూలై 1, 2017 నాడు జిఎస్టి అమలులోకి వచ్చినప్పుడు ఈ ఉత్పత్తి అతని దగ్గర క్లోజింగ్ స్టాక్ గా పడి ఉంది. ఉత్పత్తి 12% జిఎస్టి రేటులోకి వస్తుందని అనుకోండి, భల్లా ఎంటర్ప్రైజెస్ కు ఎక్సైజు కోసం ఇన్వాయిస్ లేదు కాబట్టి, అతనికి 100 క్రెడిట్ లభించదు, కానీ చెల్లించిన సిజిఎస్టి యొక్క 40% క్రెడిట్ గా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, భల్లా ఎంటర్ప్రైజెస్, తనకు ఏ నష్టం కలగకుండానే కొనుగోలుదారునికి సరైన మొత్తంలో లాభం పాస్ ఆన్ చేయగలిగే విధంగా అతను విక్రయించాల్సిన అవసరం ఉన్న ఒక మంచి ధరను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.

జూలై 15, 2017 న, భల్లా ఎంటర్ప్రైజెస్ కు ఐఎన్ఆర్ 1000 అని భావించిన అమ్మకం ధర వద్ద అమర్ ఏజన్సీలకు విక్రయించింది అనుకుందాం. ఈ సరుకు 125 ఐఎన్ఆర్ విలువచేసే ఎక్సైజ్ కు ఇప్పటికే గురిచేయబడిందని మనం మనస్సులో పెట్టుకోవాలి. ఇన్వాయిస్ క్రింది విధంగా కనిపిస్తుంది –

అమ్మకం ధర = 1125.00 ఐఎన్ఆర్ (ఏ లాభాలూ లేవని భావిస్తే)

సిజిఎస్టి @ 6% = 67.50 ఐఎన్ఆర్
ఎస్జిఎస్టి @ 6% = 67.50 ఐఎన్ఆర్

మొత్తం = 1260.00 ఐఎన్ఆర్
ఇప్పుడు, భల్లా ఎంటర్ప్రైజెస్ కి ఎక్సైజ్ విభాగానికి ఇన్వాయిస్ లేదు కాబట్టి, మరియు జిఎస్టి రేటు 12% కాబట్టి, అతను చెల్లించాల్సిన బాధ్యతగల సిజిఎస్టిలో అతను కేవలం 40% మాత్రమే పన్ను క్రెడిట్ గా క్లెయిమ్ చేయగలుగుతారు.

అందువల్ల, అందుబాటులో ఉన్న సిజిఎస్టి క్రెడిట్ = చెల్లించిన సిజిఎస్టి యొక్క40% = 40 * 67.50 / 100 = 27.00 ఐఎన్ఆర్
ఇప్పుడు ప్రభావంగా, భల్లా ఎంటర్ప్రైజెస్ 125 ఐఎన్ఆర్ విలువైన ఎక్సైజ్ ఖర్చును భరించింది. అందువల్ల అందుబాటులో ఉన్న 27 ఐఎన్ఆర్ క్రెడిట్ తో దానిని సమానంగా చేస్తే, వాస్తవానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్రెడిట్ శాతం కేవలం = 27 * 100/125 = 21.6% మాత్రమే అని మనం చూడవచ్చు. ఈ విధంగా, భల్లా ఎంటర్ప్రైజెస్, మరియు ఈ వర్గంలోని డీలర్లు పొందేది 40% క్రెడిట్ కాదు, నిజానికి అంతకంటే చాలా తక్కువ. వారికి 40% క్రెడిట్ లభించిందని భావిస్తే, అయితే వాస్తవ క్రెడిట్ శాతం తక్కువగా/భిన్నంగా ఉన్నప్పుడు వారు కొనుగోలుదారులకు లాభం గనక పాస్ ఆన్ చేస్తే, వాళ్ళు నష్టపోతారనే విషయం వేరే చెప్పక్కర్లేదు.
ఈ ఉదాహరణ వాట్ (VAT) రేటు 5%, మరియు జిఎస్టి రేటు 12% గా భావిస్తుంది, అందుచేత అందుబాటులో ఉన్న ఎక్సైజ్ క్రెడిట్ 40% ఉంటుంది. అదేవిధంగా, డీలర్లు 14.5% వాట్ (VAT) వద్ద రేట్ చేయబడిన ఉత్పత్తుల దృష్టాంతాన్ని మరియు – ఒక 60%ఎక్సైజ్ క్రెడిట్ ని తీసుకురాగల 18% లేదా అంతకు మించి రేట్ చేయబడిన ఉత్పత్తుల దృష్టాంతాన్ని మూల్యాంకన చేసుకోవాలి.
వాట్ (VAT) మరియు జిఎస్టి యొక్క ఇతర రేట్లు పరిశీలిస్తే, ఈ వర్గంలో ఉన్న డీలర్ ఏ విధంగానూ నష్టపోకుండా, వినియోగదారుకి పాస్ ఆన్ చేయగల సంభావ్య ప్రయోజనాల విలువలు క్రింది విధంగా ఉంటాయి.

పన్ను రేట్లు వాట్(VAT) @ 5%
జిఎస్టి @ 12%
ఎక్సైజ్ క్రెడిట్
@ 40%
వాట్(VAT) @ 5%
జిఎస్టి @ 18%
ఎక్సైజ్ క్రెడిట్
@ 60%
వాట్(VAT) @ 5%
జిఎస్టి @ 28%
ఎక్సైజ్ క్రెడిట్
@ 60%
వాట్(VAT) @ 14.5%
జిఎస్టి @ 12%
ఎక్సైజ్ క్రెడిట్
@ 40%
వాట్(VAT) @ 14.5%
జిఎస్టి @ 18%
ఎక్సైజ్ క్రెడిట్
@ 60%
వాట్(VAT) @ 14.5%
జిఎస్టి @ 28%

ఎక్సైజ్ క్రెడిట్

@ 60%
ధర 1000.001000.001000.001000.001000.001000.00
ఎక్సైజ్ @ 12.5 %125.00125.00125.00125.00125.00125.00
వాట్(VAT)56.2556.2556.25163.13163.13163.13
అమ్మకం ధర 1125.00
సిజిఎస్టి 67.50101.25157.5067.50101.25157.50
ఎస్జిఎస్టి 67.50101.25157.5067.50101.25157.50
సిజిఎస్టి క్రెడిట్
అందుబాటులో
ఉన్న/సంభావ్య/ పాస్ చేయబడగల ప్రయోజనం
27.0060.7594.5027.0060.7594.50
అందుబాటులో ఉన్న ప్రభావంలోకి వచ్ఛే % సిజిఎస్టి క్రెడిట్ 21.648.675.621.648.675.6

ఈ విధంగా, పైన చెప్పిన దృష్టాంతంలో ఇది స్పష్టమైనది – 18% జిఎస్టికి క్రింద రేట్ చేయబడిన ఉత్పత్తులకు, ప్రభావంలోకి వచ్ఛే క్రెడిట్ లభ్యత, 40% అని పేర్కొన్న క్రెడిట్ లభ్యతకు విరుద్ధంగా, 30% అయినా దాటదు. జిఎస్టి కింద అత్యధిక స్లాబ్ అయిన 28%వద్ద ఉత్పత్తులు రేట్ చేయబడినప్పుడు, పొందదగిన క్రెడిట్ శాతం వాస్తవంగా 60% దాటిపోతుంది. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ కూడా వ్యాపారం కోసం బయటికి నగదు ప్రవాహానికి దారితీస్తూ నికర పన్ను క్రెడిట్ ప్రతికూలంగా ఉండటంతో, అది నిజంగా సహాయపడదు. మొత్తంమీద, అన్ని సందర్భాలలో, అటువంటి డీలర్లు నష్టపోయే స్థితిలో ఉంటారు.

పరిస్థితులు

చెల్లించిన పన్నుకి క్రెడిట్ పొందేందుకై, క్రింది పరిస్థితులు, మార్పు పురోగతిలో ఉన్నప్పుడు, డీలర్లు గుర్తుంచుకోవలసిన పరిస్థితులు క్రింది విధంగా ఉంటాయి –

 

  • మూసివేసే స్టాక్ పై ఈ ఐటిసి క్రెడిట్ @40% పథకాన్ని వినియోగించుకునే ఒక రిజిస్టర్డ్ డీలర్, , నియమిత తేదీనాడు అతని దగ్గర ఉంచబడిన స్టాక్ వివరాలను, తొంభై రోజులలోపుగా తెలియజేయాలి; ఇంకా, సరిగ్గా సంతకం చేయబడిన ఫారం జిఎస్టి ట్రాన్ 1 ని సాధారణ పోర్టల్ పై, పన్ను లేదా సుంకం యొక్క మొత్తం ప్రత్యేకంగా పేర్కొంటూ ఎలక్ట్రానిక్ గా సమర్పించాలి.

 

 • అదనంగా, నెలవారీ ప్రాతిపదికన, ఆరు పన్ను వ్యవధులపాటు ఈ పథకం అమలులో ఉన్న కాలంలో డీలర్ ఫారం జిఎస్టి ట్రాన్ 2 లో- పన్ను వ్యవధిలో ప్రభావితమైన అటువంటి వస్తువుల సరఫరా వివరాలను సూచిస్తూ స్టేట్మెంట్లు సమర్పించాలి.

 

 

 • అటువంటి వస్తువుల సేకరణ కోసం పత్రం రిజిస్టర్డ్ వ్యక్తి వద్ద అందుబాటులో ఉంటుంది.

 

 

 • క్రెడిట్ వినియోగించుకున్న వస్తువుల స్టాక్, రిజిస్టర్డ్ వ్యక్తి ద్వారా తేలికగా గుర్తించబడగలిగే విధంగా నిల్వ చేయబడవలసి ఉంటుంది.

 

క్రెడిట్ వినియోగించుకున్న వస్తువుల స్టాక్, రిజిస్టర్డ్ వ్యక్తి ద్వారా తేలికగా గుర్తించబడగలిగే విధంగా నిల్వ చేయబడవలసి ఉంటుంది.

ఈ సవాళ్ళను ఎదుర్కొనేందుకు, “క్రెడిట్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్” (సిటిడి) అనే భావనతో జిఎస్టి చట్టం ముందుకు వచ్చింది. దీని ప్రకారం,ఒక ఎక్సైజ్ రిజిస్టర్ చేయబడిన తయారీదారు ఎక్సైజ్ కింద రిజిస్టర్ చేయబడని ఒక రిజిస్టర్ చేయబడిన, కానీ జిఎస్టి వ్యవస్థ కింద సిజిఎస్టి చెల్లించాల్సిన బాధ్యతగల డీలర్ కు ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపు ప్రమాణం చూపుతూ ఒక క్రెడిట్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ జారీ చేయవచ్చు.
పత్రం జారీ చేయబడవచ్చు, అయితే –

 

  • అటువంటి వస్తువులు ఐఎన్ఆర్ 25000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైనవి అయి ఉండి, మరియు అది ప్రత్యేకమైన సంఖ్యగా గుర్తించదగినదైన తయారీదారు లేదా ప్రధాన తయారీదారుని యొక్క బ్రాండ్ పేరు కలిగి ఉంటాయి. ఉదా. – కారు యొక్క చట్రం(ఛాసిస్) / ఇంజిన్ నంబర్.

 

 • అటువంటి వస్తువుల ప్రతి భాగానికి సంబంధించి క్లియరెన్స్ మరియు డ్యూటీ చెల్లింపుల యొక్క ధృవీకరించబడిన రికార్డులు తయారీదారుచే నిర్వహించబడి మరియు ఒక సెంట్రల్ ఎక్సైజ్ అధికారి డిమాండ్ చేసిన మీదట ధృవీకరణ కోసం అందుబాటులో ఉంచబడతాయి.

 

 

 • సిటిడి అనేది క్రమసంఖ్య వేయబడి సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ నంబర్, సంబంధిత సెంట్రల్ ఎక్సైజ్ డివిజన్ యొక్క చిరునామా, అది జారీచేయబడిన వ్యక్తి యొక్క పేరు, చిరునామా మరియు జిఎస్టిఐఎన్, వివరణ, వర్గీకరణ, తొలగింపు తేదీతో ఇన్వాయిస్ సంఖ్య, రవాణా విధానం మరియు వాహన నమోదు సంఖ్య, సుంకం రేటు, పరిమాణం, ఎక్సైజ్ విలువ మరియు సుంకం కలిగి ఉంటుంది .

 

 

 • ఏ డీలర్ కి అయితే సిటిడి జారీచేయబడిందో, అతను, తాను క్లియర్ చేసిన రూపంలో అటువంటి తయారీ వస్తువుల స్వాధీనం కలిగి ఉన్నాడని తయారీదారుడు సంతృప్తి చెందుతాడు.

 

 

 • జిఎస్టి అమల్లోకి వచ్చిన తేదీనుంచి 30 రోజుల్లోపు సిటిడి జారీ చేయబడుతుంది, మరియు సంబంధిత ఇన్వాయిస్ల కాపీ సిటిడితో జతచేయబడుతుంది.

 

 

 • తయారీదారు నుండి డీలర్ కు, మధ్యవర్తిత్వపు డీలర్ల ద్వారా కొనుగోలు మరియు విక్రయించడానికి సంబంధించిన అన్ని ఇన్వాయిస్ల కాపీలు, సిటిడిని ఉపయోగించి క్రెడిట్ వినియోగించుకునే డీలర్ ద్వారా నిర్వహించబడతాయి.

 

 

 • నిర్ణీత తేదీకి ముందు అదే వస్తువులకు ఇన్వాయిస్ జారీ చేసిన డీలర్ కు సిటిడి జారీ చేయబడదు.

 

 

 • అటువంటి వస్తువులను సరఫరా చేసే సమయంలో, సిటిడి ఆధారంగా క్రెడిట్ వినియోగించుకుంటున్న డీలర్, అతని ద్వారా జారీచేయబడిన ఇన్వాయిస్లో సంబంధిత సిటిడి సంఖ్యను పేర్కొంటాడు

 

ముగింపు

మొత్తం మీద క్రెడిట్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ అనేది, ముఖ్యంగా ఎక్సైజ్ వారి ఇన్వాయిసో భాగంగా ఉండని డీలర్ల కోసం, ముగింపు స్టాక్ పై క్రెడిట్ లభ్యత సమస్యకు పరిష్కారంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అటువంటి డాక్యుమెంట్ పొందడం వీలుకాని సందర్భాల్లో, ఒక డీలర్ ఆదాయం కోల్పోకుండా లేదా నగదు ప్రవాహంపై ప్రతికూల ప్రభావం కలగకుండా ఉండటానికి ఈ క్రిందిది ఉత్తమ చర్యగా ఉంటుంది-

  • ఎక్సైజుకు గురైన కానీ ఎక్సైజ్ ఇన్వాయిస్ అందుబాటులో లేని వస్తువులను అన్నింటినీ స్టాక్ నుండి తీసివేయండి (డి-స్టాక్)

 

 • తయారీదారులు / 1 వ దశ డీలర్స్ / 2 వ దశ డీలర్స్ నుండి మాత్రమే కొనుగోలు చేయబడిందని నిర్ధారించుకోండి

 

 

 • ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ తీసుకోండి, ఒక దుర్భర ప్రక్రియ అయినప్పటికీ, అదికూడా పరిమిత సమయంలో, ఇది ఐటిసిగా లభించగల 100% ఎక్సైజ్ పరంగా సఫలమవగలదు.

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

72,407 total views, 23 views today

Pramit Pratim Ghosh

Author: Pramit Pratim Ghosh

Pramit, who has been with Tally since May 2012, is an integral part of the digital content team. As a member of Tally’s GST centre of excellence, he has written blogs on GST law, impact and opinions - for customer, tax practitioner and student audiences, as well as on generic themes such as - automation, accounting, inventory, business efficiency - for business owners.