తయారీదారులకు ఉండే ముఖ్యమైన ఒక ఆందోళన ఏమిటంటే, ప్రస్తుత పన్ను వ్యవస్థలో పని కోసం పంపించబడిన జూలై 1, 2017- గూడ్స్ మరియు సర్వీస్ టాక్స్ కు మార్పు చెందే తేదీనాటికి ఉద్యోగ కార్మికుని నిర్వహణలో . ఉండిపోయిన వాటిని పన్నులో ఎలాగ వ్యవహరిస్తారు అని. అటువంటి ప్రధాన తయారీదారుకి ఉండే రెండు ప్రశ్నలు –

  • ప్రస్తుత వ్యవస్థలో ఉద్యోగ పని కోసం పంపబడిన మరియు జిఎస్టి వ్యవస్థలో తిరిగి తీసుకురాబడిన లేదా సరఫరా చేయబడినప్పుడు ఆ వస్తువులపై పన్ను వర్తిస్తుందా?
  • 2017 వ సంవత్సరం జూలై 1 నాటికి ఉద్యోగ కార్మికులతో ఉన్న సరుకుకు అవసరమైన డాక్యుమెంటేషన్ ఏమిటి?

ఈ ప్రశ్నలకు మనం సమాధానం ఇద్దాం:

1. ప్రస్తుత వ్యవస్థలో ఉద్యోగ పని కోసం పంపబడిన మరియు జిఎస్టి వ్యవస్థలో తిరిగి తీసుకురాబడిన లేదా సరఫరా చేయబడిన ఆ వస్తువులపై పన్ను వర్తింపు

a. 1 జులై, 2017 నుండి 6 నెలల్లోపల తిరిగి తీసుకురాబడిన వస్తువులు

2017 జూలై 1 వ తేదీకి ముందు ఉద్యోగ కార్మికులకు ఉపయోగించేందుకు వస్తువులు (ఇన్పుట్లు), పాక్షికంగా పూర్తైన వస్తువులు లేదా పూర్తైన వస్తువులును పంపించడం జరిగి, 1 జూలై, 2017 నుండి 6 నెలల లోపల ప్రధాన వ్యాపార స్థానానికి తిరిగి తీసుకురాబడితే, అటువంటి వస్తువులకు ఏ పన్ను వర్తించదు.

b. 1 జులై, 2017నుండి 6 నెలల్లోపు ఉద్యోగ కార్మికుని ప్రాంగణం నుంచి సరఫరా చేయబడిన వస్తువులు

1 జూలైకి ముందు ఉద్యోగ కార్మికుడికి పంపబడిన వస్తువులు 1 జూలై 2017నుండి 6 నెలల కాలంలోపల, భారతదేశంలోపల సరఫరా అయితే పన్నుచెల్లింపుతో కలిపి చేయబడితాయి, మరియు ఎగుమతుల కోసం సరఫరా అయినప్పుడు పన్ను చెల్లించకుండా, ఉద్యోగ కార్మికుని ప్రాంగణం నుంచి సరఫరా చేయబడవచ్చు.

గమనిక: ఉద్యోగ కార్మికుని వ్యాపార స్థలంనుంచి వస్తువులను సరఫరా చేయడానికి, ఉద్యోగ కార్మికుని స్థలమును తన అదనపు వ్యాపార స్థానంగా యజమాని ప్రకటించాల్సి ఉంటుంది, ఈ క్రింది విధంగా అయితే తప్ప-

  • ఉద్యోగ కార్మికుడు రిజిస్టర్డ్ కాబడిన వారు లేదా
  • సరఫరా చేయబడుతున్నవి సూచించబడిన సరుకులు
c. 1 జులై, 2017నుండి 6 నెలల్లోపు తిరిగి తీసుకురాబడని లేదా సరఫరా చేయబడని వస్తువులు

1 జూలై 2017 కి ముందు ఉద్యోగ కార్మికుడికి పంపబడిన వస్తువులు 1 జూలై 2017 నుండి 6 నెలల కాలంలోపల ప్రధాన వ్యాపార స్థానానికి తిరిగి తీసుకురాబడని లేదా సరఫరా చేయబడని వాటికోసం గరిష్టంగా 2 నెలలు పొడిగింపును అర్ధించడం మినహా మరొకటి చేసేందుకు ప్రధానవ్యాపారికి అవకాశము లేదు . దీనికోసం, ప్రధానవ్యాపారి పొడిగింపుకు తగిన కారణం చూపించి కమిషనర్ నుండి అనుమతి పొందాలి.
1 జూలై 2017 నుండి 6 నెలల కాలంలోపల లేదా పొడిగించిన తేదీ నాటికి (కమీషనర్ ఆమోదించిన ప్రకారం) వస్తువులని తిరిగి తీసుకురావడం లేదా సరఫరా చేయడం జరగకపోతే, ఈ ఇన్పుట్లు లేదా పాక్షింగా పూర్తైన వస్తువులపై వ్యాపారస్తుడు వినియోగించుకున్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ వెనక్కు తీసుకోబడుతుంది.

ఉదాహరణ: బెంగుళూరులో నమోదైన వస్త్ర తయారీదారు అయిన రాజేష్ అప్పారల్స్, బెంగళూరులోని రిజిస్టరు చేయబడిన ఉద్యోగకార్మికుడైన రమేష్ ఎంబ్రాయిడెర్స్ కు 15 జూన్ 2017నాడు, వస్త్రం మీద ఎంబ్రాయిడరీ పని కోసం 100 కుర్తాలను పంపారు. జనవరి 1, 2018 నాటికి, ఎంబ్రాయిడరీ పని కోసం పంపిన కుర్తాల యొక్క స్థితి క్రింద చూపబడింది:

పరిస్తితి పరిమాణము పన్ను నిర్వహణ
ఆగష్టు 20, 2017 నాడు రాజేష్ అప్పారల్స్ ద్వారా తిరిగి పొందబడినది 40 ఏ పన్ను వర్తించదు
సెప్టెంబర్ 15, 2017 నాడు బెంగుళూరులోని కస్టమర్ కు రమేష్ ఎంబ్రాయిడర్స్ ప్రాంగణం నుంచి సరఫరా చేయబడినది 30 కస్టమర్ కు సరఫరా చేయబడ్డ కుర్తాల పై సిజిఎస్టి + ఎస్జిఎస్టి వర్తింపజేయబడుతుంది
తిరిగి తీసుకురాబడలేదు లేదా సరఫరా చేయబడలేదు 30 రాజేష్ అప్పారల్స్ ద్వారా కుర్తాలపై వినియోగించుకోబడిన ఐటిసి వెనక్కు తీసుకోబడుతుంది.

 

2. 1జూలై , 2017 నాటికి ఉద్యోగ కార్మికుని దగ్గర ఉండిపోయిన వస్తువులకు అవసరమైన దస్తావేజులు.

జూలై 1, 2017 నాటికి ఒక ప్రధాన తయారీదారు తరఫున ఉద్యోగ కార్మికుడు దగ్గర ఉండిపోయిన వస్తువులు కోసం తయారీదారు మరియు ఉద్యోగ కార్మికుడు (రిజిస్టర్ చేయబడితే) వస్తువుల వివరాలను ప్రకటించవలసి ఉంటుంది. ఈ ప్రకటన, జూలై 1, 2017 నుండి 90 రోజులలో ఫారం జిఎస్టి ట్రాన్-1 రూపంలో ఎలక్ట్రానిక్ గా సమర్పించాల్సి ఉంటుంది
ఈ క్రింద చూపిన విధంగా ఫారం జిఎస్టి ట్రాన్-1 యొక్క సెక్షన్ 9 (a) లో ఒక ఉద్యోగ కార్మికుని వద్ద ఉండిపోయిన వస్తువులను వివరంగా ప్రకటించాల్సి ఉంటుంది:

a. సెక్షన్ 141కింద ఉద్యోగ కార్మికునికి ప్రాధానవ్యాపారిగా పంపించబడిన వస్తువుల వివరాలు

Goods sent to principal Job Work

క్రింద చూపిన విధంగా ఒక ఉద్యోగ కార్మికుడు (రిజిస్టర్ చేయబడి ఉంటే), ఫారం జిఎస్టి ట్రాన్-1 యొక్క 9(b)) విభాగంలో ప్రధాన తయారీదారు-వారీగా తనదగ్గర ఉండిపోయిన సరుకు వివరాలను ప్రకటించవలసి ఉంటుంది.

b. సెక్షన్ 141 కింద ప్రధానవ్యాపారి తరఫున ఉద్యోగకార్మికునిగా తన దగ్గర స్టాక్ లో నిలిచిపోయిన సరుకు వివరాలు

Stock held principal manufacturer-wise

ముగింపు

జిఎస్టి వ్యవస్థలో, ,జిఎస్టికు మారే మరియు ఉద్యోగ కార్మికులదగ్గిర ఉండిపోయిన సరుకు నివేదించే విధానానం సులభతరం చేయబడింది.
1 జూలై 2017 నాటికి ఉద్యోగ కార్మికుడి దగ్గిర ఉన్న సరుకు వివరాలను, తయారీదారు మరియు ఉద్యోగ కార్మికుడు (రిజిస్టర్ చేయబడితే) ద్వారా ఫారం జిఎస్టి ట్రాన్-1 లో 90 రోజులలోపుగా ప్రకటించబడాలి. మరియు, ఆ సరుకుపై వినియోగించుకున్న ఐటీసీ వెనక్కు తీసుకోబడిపోకుండా 6 నెలల్లోపు వస్తువులని తిరిగి తీసుకు రావటం లేదా సరఫరా చేయడం చేయాలి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

123,151 total views, 91 views today