జిఎస్టి కింద అనువర్తించకపోవడాన్ని తనిఖీ చేయడానికి ఎన్నో చర్యలు స్థానంలో ఉన్నాయి. ఇవి నేరం యొక్క తీవ్రతని బట్టి మారతాయి. ప్రస్తుత వ్యవస్థతో పోలిస్తే జిఎస్టి కింద పన్ను ఎగవేతదారులకు జరిమానాలు మరింత కఠినంగా చేయబడ్డాయి. ప్రస్తుత వ్యవస్థలో, ఎక్సైజ్ మరియు సర్వీస్ పన్ను కింద ఎగవేసిన పన్ను మొత్తం గనక రూ .2 కోట్లకు మించితే పన్ను అధికారులు ఒక పన్ను విధించదగిన వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. వేట్ (VAT)లో, గుజరాత్ మినహాయించి, ఏ ఇతర రాష్ట్రంలోనూ అరెస్ట్ నిబంధన లేదు
జిఎస్టి కింద, రూ. 50 లక్షల పన్ను ఎగవేత జైలు శిక్ష జరిమానాతో 1 సంవత్సరం వరకు జైలు శిక్షను ఆకర్షించవచ్చు. పన్ను ఎగవేత విలువ గనక 1 కోటి రూపాయలకు మించిపోతే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాతో నాన్ బెయిలబుల్ అరెస్టు, చేయబడవచ్చు.
జిఎస్టి కింద అనువర్తించకపోవడం కోసం విధించబడిన వివిధ జరిమానాలను మనం అర్థం చేసుకుందాం.

ఆలస్యం ఫీజు

నేరం ఆలస్యం ఫీజు
బయటివైపు లేదా లోపలివైపుకి సరఫరా వివరాలు, నెలవారీ రిటర్న్ లేదా ఫైనల్ రిటర్న్ గడువు తేదీలోగా అందజేయడంలో విఫలమవుతారువిఫలమవడం కొనసాగే రోజుల్లో రూ. 100 ప్రతి రోజుకి చొప్పున, గరిష్టంగా రూ. 5,000 కు లోబడి
ఒక వ్యక్తి గడువు తేదీ లోగా వార్షిక రిటర్న్ అందజేయడంలో విఫలమవుతారు విఫలమవడం కొనసాగే రోజుల్లో రూ. 100 ప్రతి రోజుకి చొప్పున, అతను / ఆమె నమోదు చేయబడిన రాష్ట్రంలో వ్యక్తి యొక్క టర్నోవర్ యొక్క గరిష్టంగా పావు శాతానికి లోబడి

వడ్డీ

వర్తించే నేరాలపై వడ్డీ రేటు ఇంకా తెలియజేయబడవలసి ఉంది. వడ్డీ విధించబడటం కోసం పరిస్థితులు:

నేరం వడ్డీ
పన్ను చెల్లించవలసిన బాధ్యతగల ఒక వ్యక్తి పన్ను చెల్లించడంలో విఫలమౌతారు పన్ను చెల్లించాల్సిన మొదటి గడువు రోజు నుండి బాకీ ఉన్న పన్ను పై వడ్డీ లెక్కించబడుతుంది
ఒక వ్యక్తి ఇన్పుట్ పన్ను క్రెడిట్ యొక్క అసమంజసమైన లేదా మితిమీరిన క్లెయిమ్ లేదా అవుట్పుట్ పన్ను బాధ్యతలో అసమంజసమైన లేదా మితిమీరిన మినహాయింపు చేస్తారు మితిమీరిన అదనపు క్లెయిమ్ లేదా మితిమీరిన లేదా అదనపు మినహాయింపు పై వడ్డీ
ఒక సేవా గ్రహీత, సరఫరాదారు ద్వారా ఇన్వాయిస్ జారీ చేయబడిన తేదీ నుండి 3 నెలల్లో సేవ యొక్క విలువకై మొత్తాన్ని దానితోపాటు చెల్లించవలసిన పన్నుతో సేవ సరఫరాదారుకి చెల్లించడంలో విఫలమౌతారు, బాకీ ఉన్న మొత్తం మీద వడ్డీ గ్రహీత బాధ్యతకు చేర్చబడుతుంది

రిజిస్ట్రేషన్ రద్దు

ఒక వ్యక్తి యొక్క నమోదు రద్దు చేయబడే పరిస్థితులు:
• ఒక రెగ్యులర్ డీలర్ వరుసగా 6 నెలలపాటు రిటర్న్ లను సమర్పించలేదు.
• ఒక కాంపొజిషన్ డీలర్ 3 త్రైమాసికాలకి రిటర్న్ లను సమర్పించలేదు.
• స్వచ్ఛంద రిజిస్ట్రేషన్ తీసుకున్న ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ తేదీ నుండి 6 నెలల లోపల వ్యాపారం ప్రారంభించలేదు.
• మోసం, ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు లేదా వాస్తవాలను అణచివేత ద్వారా రిజిస్ట్రేషన్ పొందబడింది

జరిమానా

జరిమానా విధించబడే నేరాలు జిఎస్టి కింద ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి.

నేరం జరిమానా
ఒక వ్యక్తి ఒకవేళ:

• ఇన్వాయిస్ జారీ చేయకుండా వస్తువులు మరియు / లేదా సేవలు సరఫరా చేస్తే లేదా తప్పుడు లేదా అబధ్ధపు ఇన్వాయిస్ జారీ చేస్తే
• వస్తువులు మరియు / లేదా సేవల సరఫరా లేకుండా ఇన్వాయిస్ జారీ చేస్తే
• పన్నును సేకరించి కానీ చెల్లింపు గడువు తేదీ నుంచి 3 నెలలు దాటేటంతవరకు ప్రభుత్వానికి దాన్ని చెల్లించడంలో విఫలమైతే
• ఒక ఇ-కామర్స్ ఆపరేటర్ పన్ను వసూలు చేయడంలో విఫలమై లేదా వసూలు చేయవలసిన మొత్తం కన్నా తక్కువగా వసూలుచేసి లేదా ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలో విఫలమైతే
• పూర్తిగా లేదా పాక్షికంగా వస్తువుల మరియు / లేదా సేవల వాస్తవ రశీదు లేకుండా ఇన్పుట్ పన్ను క్రెడిట్ తీసుకుంటే
• మోసం ద్వారా పన్నును రిటర్న్ పొందితే
• ఆర్థిక రికార్డులను తప్పుదారి పట్టించి లేదా ప్రత్యామ్నాయం కల్పించి లేదా నకిలీ ఖాతాలను మరియు / లేదా పత్రాలను సమర్పించి లేదా ఒక తప్పుడు రిటర్న్ సమకూర్చితే
• రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ పొందడం విఫలమైతే
• రిజిస్ట్రేషన్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందిస్తే
• పత్రాలు లేకుండా పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులను రవాణా చేస్తే
• పన్ను ఎగవేతకు దారితీస్తూ టర్నోవర్ అణిచివేస్తే
• ఖాతాలు మరియు పత్రాల పుస్తకాలను నిర్వహించడంలో విఫలమయితే
మరొక వ్యక్తి యొక్క గుర్తింపు సంఖ్యను ఉపయోగించడం ద్వారా ఇన్వాయిస్ లేదా పత్రాన్ని జారీచేస్తే

రూ. 10,000 లేదా పన్ను ఎగవేసినదానికి సమానమైన మొత్తం
పైన పేర్కొన్న నేరాలకు సహాయపడే లేదా ప్రోత్సహించే వ్యక్తి ఎవరైనాజరిమానా రూ. 25,000 వరకు పొడిగించబడవచ్చు
చట్టం ప్రకారం ప్రత్యేకంగా ఒక జరిమానా అందజేయబడని ఏదైనా నేరం జరిమానా రూ. 25,000 వరకు పొడిగించబడవచ్చు

వస్తువులను జబ్తు చేసుకోవడం మరియు / లేదా రవాణాలు మరియు జరిమానా

వస్తువులను జబ్తు చేసుకోవడం మరియు / లేదా రవాణాలు మరియు జరిమానా విధించబడటానికి దారితీసేవిగా కొన్ని నేరాలు పేర్కొనబడ్డాయి. జరిమానా రూ. 10,000 లేదా పన్ను ఎగవేసినదానికి సమానమైన మొత్తం అయి ఉంటుంది. ఈ నేరాలు ఇవి:
• తను పన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగిన వస్తువులకు ఒక వ్యక్తి లెక్క చెప్పరు
• పన్ను చెల్లింపును ఎగవేయాలనే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి ఏవైనా నిబంధనలను లేదా నియమాలను ఉల్లంఘిస్తూ సరఫరా చేస్తారు లేదా వస్తువులను అందుకుంటారు
• రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయకుండా ఒక వ్యక్తి పన్ను విధించబడతగిన వస్తువులను సరఫరా చేస్తారు
• ఏదైనా నిబంధనలను లేదా నియమాలను ఉల్లంఘించినందుకు పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల రవాణాకు ఒక వ్యక్తి ఒక వాహనాన్ని ఉపయోగిస్తారు

ఖైదు మరియు జరిమానా

జైలు శిక్ష వర్తించే పరిస్థితులు ఇవి:

నేరం జైలు శిక్ష
కింది విషయాల్ని చేస్తారు లేదా ప్రోత్సహిస్తారు:

• తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఏ అధికారినైనా నిరోధించడం లేదా అడ్డుకోవడం
• ఏవైనా సాక్ష్యాలను లేదా పత్రాలను చెరపడం లేదా నాశనం చేయడం
చట్టం క్రింద అతని నుంచి అవసరమైన ఏదైనా సమాచారం అందించటంలో విఫలమవడం లేదా తప్పుడు సమాచారం అందించడం

జరిమానాతో 6 నెలల జైలు శిక్ష
పన్ను ఎగవేయటం లేదా ఇన్పుట్ పన్ను క్రెడిట్ తప్పుగా వినియోగించుకోవటం లేదా రూ. 50 లక్షలు మించిన కానీ రూ. 1 కోటి కి మించని మొత్తానికి తప్పుగా రిఫండ్ పొందటం జరిమానాతో 1సంవత్సరం వరకు పొడిగించబడగల జైలుశిక్ష
పన్ను ఎగవేయటం లేదా ఇన్పుట్ పన్ను క్రెడిట్ తప్పుగా వినియోగించుకోవటం లేదా రూ. 100లక్షలు మించిన కానీ రూ. 2.5 కోట్లకి మించని మొత్తానికి తప్పుగా రిఫండ్ పొందటం జరిమానాతో 3 సంవత్సరాల వరకు పొడిగించబడగల బెయిల్-లభించని జైలుశిక్ష
పన్ను ఎగవేయటం లేదా ఇన్పుట్ పన్ను క్రెడిట్ తప్పుగా వినియోగించుకోవటం లేదా రూ. 2.5 కోట్లకి మించిన మొత్తానికి తప్పుగా రిఫండ్ పొందటం జరిమానాతో 5 సంవత్సరాల వరకు పొడిగించబడగల బెయిల్-లభించని జైలుశిక్ష

స్పష్టంగా చెప్పాలంటే, జిఎస్టి కింద దానిని పాటించకుండా ఉండటం అనేది కఠినంగా వ్యవహరించబడుతుంది. అయితే, డీలర్స్ కొరకు అనువర్తించడం సులభతరం చేయడానికి పలు చర్యలు తీసుకోబడ్డాయి. గడువు తేదీ నాటికి నెలవారీ రిటర్న్ సమకూర్చని ప్రతి డీలర్ కు ఫారం జిఎస్టిఆర్-3ఎ లో ఒక నోటీసు పంపించబడుతుంది. ఒక సరఫరాదారు మరియు గ్రహీత ద్వారా నివేదించబడిన సరఫరాల మధ్య ఏదైనా అసమతుల్యత ప్రతి నెల జిఎస్టి ఐటిసి-1 లో తెలియపరచబడుతుంది. ఇన్వాయిస్-వారీగా మ్యాచింగ్ మరియు గ్రహీత యొక్క ఇన్పుట్ పన్ను క్రెడిట్ అనేవి సరఫరాదారు కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి, కట్టుబడి ఉండకుండా ఉండని కారణంగా జరిమానాలను నివారించగలగడాన్ని నిర్ధారించడానికి జిఎస్టి ప్రక్రియ ఒక అంతర్నిర్మిత తనిఖీ మరియు బ్యాలెన్స్ కలిగి ఉంటుంది.
జిఎస్టి అనేది సాంకేతిక ఆధారిత పన్ను కూడా, దీనితో కట్టుబడి ఉండటం అనేది వేగంగా మరియు సులభంగా అవుతుంది. అందువల్ల, జిఎస్టి కింద కట్టుబడి ఉండటాన్ని నిర్ధారించడానికి వ్యాపారాలు అందజేయబడిన వివిధ సౌకర్యాలు మరియు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరపతిని పొందాలి.

రానున్నది

జిఎస్టి కింద అసెస్మెంట్లు

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

105,244 total views, 322 views today