ప్రతి రిజిస్టర్ చేయబడిన రెగ్యులర్ పన్ను చెల్లింపుదారు నెలవారీ ప్రాతిపదికన జిఎస్టి రిటర్న్ లను సమకూర్చాలి మరియు ఆ నెల 20 వ తేదీ నాటికి పన్ను చెల్లించాలి. ఒక పన్ను చెల్లింపుదారు గనక బాకీ ఉన్న పన్ను చెల్లించకపోతే, చెల్లించవలసిన పన్ను పై పన్ను చెల్లించవలసిన గడువు తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది.

ప్రతి రిజిస్టర్ చేయబడిన రెగ్యులర్ పన్ను చెల్లింపుదారు నెలవారీ ప్రాతిపదికన జిఎస్టి రిటర్న్ లను సమకూర్చాలి మరియు ఆ నెల 20 వ తేదీ నాటికి పన్ను చెల్లించాలి. ఒక పన్ను చెల్లింపుదారు గనక బాకీ ఉన్న పన్ను చెల్లించకపోతే, చెల్లించవలసిన పన్ను పై పన్ను చెల్లించవలసిన గడువు తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది.

Without furnishing the return for a month and paying the tax due, the subsequent month’s return cannot be furnished.Click To Tweet

పన్ను చెల్లించే ఉద్దేశం కోసం, ప్రతి రిజిస్టరు చేయబడిన డీలర్ కు జిఎస్టి పోర్టల్ లో 3 లెడ్జర్స్ ఉంటాయి:

1. ఎలక్ట్రానిక్ పన్ను బాధ్యత రిజిస్టర్
పన్ను, వడ్డీ, జరిమానా, ఆలస్యం రుసుము లేదా ఏదైనా ఇతర మొత్తం పట్ల ఒక వ్యక్తికి ఉండే బాధ్యతలు అన్నీ ఇక్కడ డెబిట్ చేయబడతాయి

2. ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్

ఒక వ్యక్తి ద్వారా పన్ను, వడ్డీ, జరిమానా, ఆలస్యం రుసుము లేదా ఏదైనా ఇతర మొత్తం కోసం చేయబడే డిపాజిట్ ప్రతి ఒక్కటి ఇక్కడ క్రెడిట్ చేయబడుతుంది.

3. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్

ఒక వ్యక్తి ద్వారా ఫారం జిఎస్టిఆర్-2 లో స్వీయ-అంచనా వేయబడి మరియు క్లెయిమ్ చేయబడిన విధంగా, ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఇక్కడ క్రెడిట్ చేయబడుతుంది. ఇది పన్ను చెల్లించడం కోసం మాత్రమే ఒక వ్యక్తి ద్వారా ఉపయోగించబడవచ్చు కాని, వడ్డీ, ఆలస్యం రుసుము లాంటి ఇతర ఇతర మొత్తాలకు మాత్రం కాదు.

For the purpose of paying tax, every registered dealer will have 3 ledgers in the GST portalClick To Tweet

ఎలక్ట్రానిక్ పన్ను బాధ్యత రిజిస్టర్లో చూపించిన బాధ్యతలను చెల్లించడానికి, ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ మరియు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఒక బాధ్యత చెల్లించబడినప్పుడు,
• చెల్లించబడిన మొత్తంతో ఎలక్ట్రానిక్ పన్ను బాధ్యత రిజిస్టర్ క్రెడిట్ చేయబడుతుంది.
• చెల్లింపు చేయడానికి ఉపయోగించే క్రెడిట్ తో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ డెబిట్ చేయబడుతుంది.
• చెల్లింపు చేయడానికి ఉపయోగించిన డిపాజిట్ మొత్తంతో ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ డెబిట్ చేయబడుతుంది.

దీన్ని మనం ఒక దృష్టాంతంలో అర్థం చేసుకుందాం.

దృష్టాంతం

20 డిసెంబర్ 17 నాడు రవీంద్ర అప్పారెల్ కు క్రింది బ్యాలెన్సులు ఉన్నాయి:

GST Tax Payment

1.ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో అందుబాటులో ఉన్న క్రెడిట్ ఉపయోగించడం ద్వారా పన్ను బాధ్యతను ఎత్తివేయండి (సెట్ ఆఫ్ చేయండి)

జిఎస్టి వ్యవస్థలో పన్ను బాధ్యతకు వ్యతిరేకంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఎత్తివేయడం (సెట్-ఆఫ్ చేయడం)ఎలాగ’ అనే మా బ్లాగులో చర్చించిన విధంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఉపయోగించడం ద్వారా పన్ను బాధ్యత ఎత్తివేయవచ్చు.

మా దృష్టాంతంలో, క్రింద చూపిన విధంగా రవీంద్ర అప్పారెల్ యొక్క పన్ను బాధ్యత వారి ఇన్పుట్ పన్ను క్రెడిట్ ద్వారా సెట్ ఆఫ్ చేయబడింది:

Electronic Cash Ledger - GST

అందువల్ల రవీంద్ర అప్పారెల్ కు రూ. 60,000 (10,000 + 10,000 + 40,000) చెల్లించవలసిన బ్యాలెన్స్ బాధ్యత ఉంటుంది.

2. బ్యాలెన్స్ పన్ను బాధ్యత చెల్లించడానికి ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ లో డబ్బు డిపాజిట్ చేయడం

బ్యాలెన్స్ పన్ను బాధ్యత చెల్లించడానికి, రవీంద్ర అప్పారెల్ ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్లో పన్ను బాధ్యత మొత్తాన్ని జమ చేయాలి. దీనికి, రవీంద్ర అప్పారెల్:

a. చెల్లింపు చేయడం కోసం చలాన్ని సృష్టించాలి strong>
ఫారం జిఎస్టి పిఎంటి-06 ఉపయోగించి జిఎస్టి పోర్టల్ నుండి చెల్లింపు కోసం చలాన్ ఉత్పత్తి చేయబడవచ్చు. పన్ను, వడ్డీ, జరిమానా, రుసుము లేదా ఏదైనా ఇతర మొత్తం కోసం డిపాజిట్ చేయవలసిన మొత్తం యొక్క వివరాలను ఛలాన్లో నమోదు చేయాలి. ఉత్పత్తి చేయబడిన ఛలాన్ 15 రోజులపాటు చెల్లుతుంది.
b. ఇచ్చిన విధానాల (మోడ్)ను ఉపయోగించి చెల్లింపు చేయాలి

క్రింది విధానాలను ఉపయోగించి చెల్లింపు చేయబడవచ్చు:
• అధీకృత బ్యాంకుల ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్
• అధీకృత బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు
• ఏదైనా బ్యాంకు నుండి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఇఎఫ్టి) లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టిజిఎస్)
• నగదు, చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ద్వారా ప్రతి చలాన్ కు ప్రతి పన్ను వ్యవధికి రూ .10,000 వరకు డిపాజిట్ల కోసం అధీకృత బ్యాంకుల ద్వారా ఓవర్ ద కౌంటర్ (ఓటిసి) చెల్లింపు
• గమనిక: చెల్లింపు గనక ఎన్ఇఎఫ్టి లేదా ఆర్టిజిఎస్ ద్వారా చేయబడవలసి ఉంటే,, జిఎస్టి పోర్టల్ లో ఛలాన్తో పాటు ఒక మేండేట్ ఫారం ఉత్పన్నం చేయబడుతుంది. చెల్లింపు ఎక్కడ చేయబడుతుందో అక్కడ బ్యాంకుకు మేండేట్ ఫారం సమర్పించవలసి ఉంటుంది. మేండేట్ ఫారం 15 రోజులపాటు చెల్లుతుంది

సిఐఎన్ ఉత్పన్నం చేసి ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ కు క్రెడిట్ చేయాలి
ఒకసారి డీలర్ చెల్లించిన మొత్తం గనక సంబంధిత ప్రభుత్వ ఖాతాకు చెల్లించబడితే ఒక చలాన్ ఐడెంటిఫికేషన్ (గుర్తింపు) నంబర్ (సిఐఎన్) ఉత్పన్నం చేయబడుతుంది మరియు జిఎస్టి పోర్టల్ లో చాలన్ లో ఇదే పేర్కొనబడుతుంది. సిఐఎన్ అందుకున్న మీదట, చెల్లించబడిన మొత్తం ఆ వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ కు క్రెడిట్ చేయబడుతుంది.
మన దృష్టాంతంలో, 20 డిసెంబర్ ’17 నాడు బ్యాలెన్స్ పన్ను బాధ్యత చెల్లింపు కోసం రవీంద్ర అప్పారెల్ రూ. 60,000 జమా చేసింది. ఒకసారి చెల్లింపు క్రెడిట్ చేయబడిన తర్వాత ఆ మొత్తాన్ని బ్యాలెన్స్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి మరియు ఐజిఎస్టి బాధ్యతలు చెల్లించడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. బాకీ ఉన్న పన్ను చెల్లించిన తర్వాత, రవీంద్ర అప్పారెల్ యొక్క లెడ్జర్లు క్రింద చూపిన విధంగా కనిపిస్తాయి:

Tax Payment under GST

జిఎస్టి క్రింద పన్ను చెల్లింపుకి సంబంధించిన ఫారంలు

ఫారం జిఎస్టి పిఎంటి-01ఫారం జిఎస్టి పిఎంటి-01 లో ఎలక్ట్రానిక్ పన్ను బాధ్యత రిజిస్టర్ నిర్వహించబడుతుంది
ఫారం జిఎస్టి పిఎంటి-02 ఒక అధీకృత అధికారి ద్వారా జారీ చేయబడిన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ / ఎలెక్ట్రానిక్ నగదు లెడ్జర్ లో బ్యాలెన్స్ వాపసు కోసం క్లెయిమ్
ఫారం జిఎస్టి పిఎంటి-03ఒక వ్యక్తి గనక తన ఎలెక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఏదైనా వ్యత్యాసాన్ని గమనిస్తే, అదే విషయాన్ని అతను జిఎస్టి పిఎంటి-04 ను ఉపయోగించి కమ్యూనికేట్ చేయవచ్చు
ఫారం జిఎస్టి పిఎంటి-04 ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ ఫారం జిఎస్టి పిఎంటి-05 లో నిర్వహించబడుతుంది
ఫారం జిఎస్టి పిఎంటి-05 ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్ ఫారం జిఎస్టి పిఎంటి-05 లో నిర్వహించబడుతుంది

ఫారం జిఎస్టి పిఎంటి-06 పన్ను, వడ్డీ, జరిమానా, ఫీజు లేదా ఏదైనా ఇతర మొత్తాన్ని చెల్లించటానికి చలాన్
ఫారం జిఎస్టి పిఎంటి-07 ఒక వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతా డెబిట్ చెయ్యబడి కానీ సిఐఎన్ ఉత్పత్తి చేయబడి ఉండకుండా లేదా సిఐఎన్ ఉత్పన్నం చెయ్యబడి కానీ జిఎస్టి పోర్టల్ కు తెలియపరచబడకుండా ఉండి ఉంటే, ఫారం జిఎస్టి పిఎంటి-07 ఉపయోగించి ఆ వ్యక్తి అదే విషయాన్ని తెలియపరచవచ్చు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

215,738 total views, 373 views today