జిఎస్టి కింద, తయారీ పై పన్ను విధింపు, పన్ను పరిధిలోకి వచ్చే సేవల అంశం, మరియు వస్తువుల విక్రయాల యొక్క ప్రస్తుత వ్యవస్థ అనేది ‘సరఫరా’’ అనే భావనతో భర్తీ చేయబడుతుంది . జిఎస్టి కింద పన్ను పరిధిలోకి వచ్చే కార్యకలాపం అనేది వస్తువుల లేదా సేవల యొక్క ‘సరఫరా’. అందువల్ల, సరఫరాపై సరైన పన్ను విధింపును నిర్ధారించడంలో సరఫరా యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మోడల్ జిఎస్టి చట్టం సరఫరా స్థానాన్ని నిర్ధారించేందుకు ప్రమాణాలను సూచిస్తుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, మీరు వస్తువుల లేదా సేవల సరఫరాను ఇన్ట్రా-స్టేట్ (రాష్ట్రం లోపల) లేదా ఇంటర్ స్టేట్ (రాష్ట్రానికి వెలుపల) గా వ్యవహరించవచ్చు.
ఒక సరఫరాపై వసూలు చేయవలసిన పన్నును నిర్ణయించేందుకు రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి:
• సరఫరాదారు యొక్క స్థానం – ఇది సరఫరాదారు యొక్క వ్యాపారం యొక్క నమోదిత ప్రదేశం
• సరఫరా స్థలం – ఇది గ్రహీత యొక్క వ్యాపారం యొక్క నమోదిత ప్రదేశం

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
బ్రాడ్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వ్యాపారం యొక్క నమోదిత ప్రదేశం జైపూర్, రాజస్థాన్లో ఉంది. ఇది రవీంద్ర ఆటోమొబైల్స్ కు కార్లను సరఫరా చేస్తుంది, దీని యొక్క వ్యాపారం యొక్క నమోదిత ప్రదేశం ఉదయపూర్, రాజస్థాన్లో ఉంది.

GST Intra state supply

 
ఇక్కడ బ్రాడ్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రదేశం రాజస్థాన్లో ఉంది, సరఫరా స్థానం కూడా రాజస్థాన్లోనే ఉంది. అందువల్ల, ఇది ఒక ఇంట్రా-స్టేట్ సరఫరా, అంటే రాష్ట్రంలోపలి సరఫరా. ఒక రాష్ట్రం లోపలి సరఫరాలో, వసూలు చేయబడవలసిన పన్నులు >సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

ఇప్పుడు మనం మరొక ఉదాహరణ చూద్దాం.

బ్రాడ్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క నమోదిత వ్యాపార ప్రదేశం రాజస్థాన్లో ఉంది. ఇది రామ్ ఆటోమొబైల్స్ కు కార్లను సరఫరా చేస్తుంది, దీని నమోదిత వ్యాపార ప్రదేశం ఉత్తర ప్రదేశ్లో లక్నోలో ఉంది.

GST Inter state supply

ఈ ఉదాహరణలో, బ్రాడ్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రదేశం రాజస్థాన్లో ఉంది మరియు సరఫరా స్థానం ఉత్తర ప్రదేశ్లో ఉంది. ఇది ఒక ఇంటర్-స్టేట్ సరఫరా, అనగా రాష్ట్రం వెలుపల సరఫరా. ఒక రాష్ట్రం వెలుపల సరఫరాలో, వసూలు చేయబడవలసిన పన్ను ఐజిఎస్టి.
ఈ కింది వాటిని కూడా రాష్ట్రం వెలుపలి సరఫరాగా వ్యవహరిస్తారు:
• వస్తువుల లేదా సేవల దిగుమతి
• వస్తువుల లేదా సేవల ఎగుమతి
• సరఫరా రాష్ట్రం లోపల చేయబడుతున్నప్పటికీ ఒక ఎస్ఇజడ్(SEZ) డెవలపర్ లేదా ఎస్ఇజడ్(SEZ) యూనిట్ కు లేదా ద్వారా వస్తువుల లేదా సేవల సరఫరా.

లైన్ లో తర్వాత రానున్నవి:
వస్తువుల సరఫరా స్థానం నిర్ణయం- వస్తువుల తరలింపు కలిగి ఉంటుంది

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

103,759 total views, 33 views today