జఎస్టి రేట్లు ప్రకటించబడినప్పటి నుండి, ప్రయాణీకుల వాహనాల యొక్క సంభావ్య కొనుగోలుదారులు – జఎస్టి కాలంలో గనక వారు ఒకదాన్ని కొనుగోలు చేస్తే, వారికి లాభమా నష్టమా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ బ్లాగులో, జఎస్టి కౌన్సిల్ ప్రకటించిన జఎస్టి రేట్లు ఆధారంగా, ఆటోమొబైల్ రంగం ఎలా పనిచేస్తుందో మేము మిధ్యలు తొలగిస్తాము.

పాత వ్యవస్థలో పన్నులు
పాత వ్యవస్థలో, ఆటోమొబైల్స్ 12.5% నుండి 27% వరకు శ్రేణిలో (ఇంజిన్ సామర్థ్యం మరియు కారు పరిమాణం ఆధారంగా) ఎక్సైజ్ సుంకాన్ని ఆకర్షించింది; ఎక్సైజ్ అదనపు సుంకాలు అనగా ఎన్సీసిడి 1% వద్ద; ఆటోమొబైల్ సెస్ 0.125% వద్ద; మౌలిక సదుపాయాల సెస్ – 1% నుండి 4% వరకు (కారు రకం ఆధారంగా)శ్రేణిలో మరియు చివరికి సగటున 14.5% వద్ద వాట్ – ఇది కూడా రాష్ట్రం నుండి రాష్ట్రానికు భిన్నంగా ఉంటుంది.

ఆటోమొబైల్స్ కోసం జఎస్టి రేట్లు

మంచివి

మోటారు వాహనాలు

జఎస్టి , కింద, ప్రస్తుతం మోటారు వాహనాలపై విధించబడుతున్న పన్నులు, ఒక 28% ఏక పన్ను రేటు కింద ఒకటిచేయబడి- 1% నుంచి 15% పరిధిలో, జఎస్టి పరిహారం సెస్ నియమాల ద్వారా , క్రింది విధంగా నిర్వచించబడిన ఒక అదనపు సెస్ తో కూడి ఉంటాయి-

ఆటోమొబైల్ రకం పొడవ ఇంజన్ సామర్ధ్యం సెస్ రేటు
చిన్న కారు 4మీ కంటే తక్కువ 1200 సిసి కంటే తక్కువ 1%
చిన్న కారు 4మీ కంటే తక్కువ 1201 సిసి – 1500 సిసి 3%
మధ్య శ్రేణి కారు 4మీ కంటే ఎక్కువ 1500 సిసి కంటే తక్కువ 15%
పెద్ద కార్లు 4మీ కంటే ఎక్కువ 1500 సిసి కంటే ఎక్కువ 15%
హైడ్రోజెన్ వాహనాలు (ఇంధనం కణం (ఫ్యూయెల్ సెల్) సాంకేతికత ఆధారితమైన)4మీ కంటే ఎక్కువ 15%
మోటర్ సైకిళ్ళు 350 సిసి కంటే ఎక్కువ 3%
మోటర్ వాహనాలు (సామర్ధ్యం 10 నుంచి 13 మంది వ్యక్తులు)15%

ఒక్కసారిగా చూసినప్పుడు, పన్నులు పెరిగాయి అని అనిపించదు. కాని ప్రస్తుత వ్యవస్థ మరియు జిఎస్టి మధ్య మోటర్ వాహనాలపై విధించబడిన రేట్లను శీఘ్రంగ పోల్చి చూస్తే –

ప్రస్తుత వ్యవస్థ జఎస్టి
కారు రకం ఎక్సైజ్ సుంకం ఎన్సిసిడి ఇన్ఫ్రా సెస్
ఆటోమొబైల్ సెస్ వాట్ మొత్తం పన్ను (సుమారు) జఎస్టి అదనపు సెస్ మొత్తం పన్ను (సుమారు)
చిన్న కార్లు 12.5 %1 %1 %0.125 %14.5 %31 %28 %1% – 3%29 % –

32 %

లగ్జరీ కార్లు 27 %1 %4 %0.125 %14.5 %51 %28 %15 %43 %

ప్రస్తుత వ్యవస్థలో ఉన్న పన్నులు దొంతరపడుతూ పోయే స్వభావం కారణంగా, ఒక చిన్న కారు కొనుగోలుదారు దాదాపు 31% పన్ను కు గురి చేయబడతాడు, అయితే ఒక లగ్జరీ కారు కొనుగోలుదారు దాదాపు 51% పన్ను కు గురి చేయబడతాడు. అయితే జఎస్టి శకంలో, పన్నులు ఇంకెంత మాత్రమూ దొంతరపడుతూ పోవు . అత్యధిక పన్ను స్లాబ్ కింద బ్రాకెట్ చేయబడినప్పటికీ, చిన్న మరియు మధ్య తరహా సెగ్మెంట్ ఆటోమొబైల్స్ యొక్క కొనుగోలుదారులు దాదాపు అదే పన్ను రేటు చెల్లించడం కొనసాగిస్తారు. అయితే, పన్నుల రేట్లలో దాదాపు 8 శాతం పాయింట్ల ఒక సంభావ్య తగ్గింపుని ఆనందించగల, లగ్జరీ వాహనాలకు వెళ్దామని ఇష్టపడేవారికి వాస్తవిక లాభాల ఊపు చేకూరుతుంది, మరియు రాబోయే కాలంలో మనం మరిన్ని ఆడిలు మరియు మెర్సిలూ భారతీయ వీధులని ముంచెత్తడాన్ని చూస్తే మనమేమీ ఆశ్చర్యపోనవసరంలేదు.

విద్యుత్ వాహనాలు

అయితే, విద్యుత్ వాహనాలకు జఎస్టి యొక్క అవకలన రేటు ప్రవేశపెట్టబడింది – ఇది 12% జిఎస్టి వద్ద పన్ను విధించబడింది. విద్యుత్ వాహనాలు సంప్రదాయబద్ధంగా తగ్గించబడిన 6% ఎక్సైజ్ సుంకం కలిగి ఉన్నాయి మరియు చాలా రాష్ట్రాలలో తగ్గించబడిన 5% వాట్ రేట్లను కలిగి ఉంటాయి – మరియు ఈ ప్రయోజనం ఖచ్చితంగా జఎస్టి శకంలో కొనసాగుతుంది. మొత్తంమీద, ఒక తగ్గించబడిన జఎస్టి రేటు, భారతదేశం అంతటా విద్యుత్ చలనశీలత (మొబిలిటీ)కు ఒక ప్రేరణ అందించాలి మరియు ప్రభుత్వం పర్యావరణపరంగా స్నేహపూర్వక సాంకేతికతలను ప్రోత్సహిస్తోంది అనడానికి స్పష్టమైన సంకేతం.

చెడువి

హైబ్రిడ్ వాహనాలు
హైబ్రిడ్ వాహనాలు విద్యుత్ శక్తి మరియు సాంప్రదాయ ఇంధనం అంటే పెట్రోల్ లేదా డీజిల్ మిశ్రమం పై నడిచేవి కావడంతో – సామర్ధ్యంతో నిమిత్తం లేకుండా, హైబ్రిడ్లను 15% అత్యధిక సెస్ రేటులో ఉంచడం అనేది నిజానికి కొంత ఆశ్చర్యకరమైనదే. మధ్య శ్రేణి (మిడ్-సెగ్మెంట్) హైబ్రిడ్ వాహనాలు (1500 సిసి కంటే తక్కువ) అలాగే అధిక శ్రేణి (హై-సెగ్మెంట్) హైబ్రిడ్ వాహనాలు (1500 సిసి కంటే ఎక్కువ) రెండూ కూడా ఇప్పుడు సమర్థవంతంగా 43% పన్నును కలిగి ఉంటాయి – అనే విషయం చాలామంది హైబ్రిడ్ వాహన తయారీదారులు, అలాగే హైబ్రిడ్ కి వెళ్ళడానికి ప్రణాళిక చేసుకునంటున్న వినియోగదారులకి అంతగా నచ్చలేదు.

బాగాలేనివి

ఆటో భాగాలు
ఆటోమొబైల్ విభాగానికి ప్రత్యక్ష విరుద్ధంగా, కారు భాగాలు, ట్రాక్టర్ భాగాలు మరియు కారు ఉపకరణాల కోసం ప్రకటించబడిన జఎస్టి రేట్లత వ్యాపారులు ఏమంత సంతోషంగా లేరు – ఇవి అత్యధిక స్లాబ్ అయిన 28% వద్ద పెట్టబడ్డాయి. ప్రస్తుత వ్యవస్థలో, విడిభాగాలు 12.5% ఎక్సైజ్ మరియు అత్యధిక రాష్ట్రాల్లో 5% వాట్ కు గురి అవుతూ ఉండగా, ప్రస్తుత వ్యవస్థలో సమర్థవంతమైన 18.13% పన్ను రేటు జఎస్టి వ్యవస్థలో 28% కి చేరుకుంటుంది. ఈ పెరుగుదల అనేది విడిభాగాల వ్యాపార వ్యవస్ధను ప్రభావితం చేయగలదు మరియు మొత్తంమీద పరిశ్రమని ధెబ్బకొట్టే అవకాశం ఉంది.

ముగింపు

దొంతరపడిపోయే పన్నుల తొలగింపు కారణంగా గణనీయమైన ప్రయోజనాలు ఉండగా, ఇన్పుట్లు, అనగా భాగాలపై అధిక పన్ను కారణంగా పరిశ్రమ మొత్తంమీద ప్రభావితమవుతుంది. లగ్జరీ వాహనాలు మరియు విద్యుత్ వాహనాలు ప్రయోజనకరమైన స్థితిలో ఉండటంతో, పన్నుల స్థితిని యథాతథంగా కొనసాగించే చాలావరకు ప్రామాణిక వాహనాలు, హైబ్రిడ్ లు మరియు ఆటో భాగాలు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి, జఎస్టి రేట్లు ఖచ్చితంగా ఆటోమొబైల్ పరిశ్రమ కోసం మిశ్రమ ఫలితాలను కొనితెచ్చాయి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

67,853 total views, 26 views today