2017 మే 18నాడు, జిఎస్టి కౌన్సిల్ 98 కేటగిరీల్లో 1211 వస్తువుల కోసం ఎంతగానో ఎదురుచూసిన జిఎస్టి రేట్లను నిర్ధారించి ఖరారు చేయడానికి సమావేశమైంది. సరిగ్గా ఆ మరుసటిరోజు, 36 వర్గాల సేవల కోసం జిఎస్టి రేట్లను ఖరారు చేయడానికి కౌన్సిల్ తిరిగి సమావేశమైంది.
ప్రారంభించడానికి, , భారతప్రభుత్వపు ఆర్ధిక మంత్రిత్వశాఖ, రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆధియా దాదాపు 81% వస్తువులు 18% జిఎస్టి రేటు స్లాబ్ మరియు అంతకు తక్కువగా వర్గీకరించబడతారని పేర్కొన్నరు; మిగిలిన 19% అంశాలకి 28% ఇంకా ఆపైన పన్ను విధించబడతాయి

GST Rates
జిఎస్టి పన్ను స్లాబుల వ్యాప్తంగా వర్గీకరించబడిన కొన్ని ముఖ్య వస్తువులు మరియు సేవల గురించి మీరు తెలుసుకోవలసింది ఇది.

జిఎస్టి నుంచి మినహాయించబడినవి

వస్తువులు

• కోళ్ళ (పౌల్ట్రీ) ఉత్పత్తులు – తాజా మాంసం, చేప, చికెన్, గుడ్లు
• పాల ఉత్పత్తులు – పాలు, పెరుగు, మజ్జిగ, బెల్లం, లస్సీ, ప్యాక్ చేయబడని పనీర్
• తాజా పళ్ళు & కూరగాయలు
• ఆహార పదార్థాలు – సహజ తేనె, పిండి (గోధుమపిండి & మైదా), పప్పుధాన్యాలు, బాస్మతి బియ్యం, శనగ పిండి (బీసన్), బ్రెడ్, వెజిటేబుల్ ఆయిల్, ధార్మిక మిఠాయిలు (ప్రసాదాలు) , మామూలు ఉప్పు
• సౌందర్య సాధనాలు & ఉపకరణాలు – బొట్టు బిళ్ళలు, సింధూరం, గాజులు
• స్టేషనరీ – స్టాంపులు, జుడిషియల్ (న్యాయవిచారణ సంబంధిత) పత్రాలు, ముద్రిత పుస్తకాలు, వార్తాపత్రికలు
• చేతిపని ఉత్పత్తులు
• వస్త్రం – జనపనార, పట్టు
• గర్భనిరోధకాలు

సేవలు

• ఐఎన్ఆర్.1000 కంటే తక్కువ ధర కలిగి ఉండే హోటల్ సర్వీసులు
• విద్య (మినహాయింపు ఇంతకుముందు నుండి కొనసాగించబడింది)
• ఆరోగ్య సంరక్షణ (మినహాయింపు ఇంతకుముందు నుండి కొనసాగించబడింది)

జిఎస్టి 5%

వస్తువులు

• పాల ఉత్పత్తులు – స్కిమ్డ్ మిల్క్ పౌడర్, శిశువుల పాల ఆహారం, ఘనీభవించిన పాలు, ప్యాక్ చేసిన పనీర్, క్రీమ్
• ఘనీభవించిన కూరగాయలు
• ఆహార పదార్థాలు – చక్కెర, సుగంధ ద్రవ్యాలు, తినదగిన నూనె, పిజ్జా బ్రెడ్, రస్క్, మిఠాయిలు, ఫిష్ ఫిల్లెట్లు, టాపియోకా (సగ్గుబియ్యం)
• పానీయాలు – కాఫీ, టీ, పండ్లరసాలు
• దుస్తులు – ఐఎన్ఆర్.1000 కంటే తక్కువగా
• పాదరక్షలు – ఐఎన్ఆర్.500 కంటే తక్కువగా
• ఇంధనం – కిరోసిన్, ఎల్పిజి, బొగ్గు
• సౌరశక్తి ఫలకాలు
• సాధారణ ఉపకరణాలు – చీపురు
• వైద్యపరమైన వస్తువులు – మందులు, స్టెంట్స్
• న్యూస్ ప్రింట్
• లైఫ్ బోట్లు
• వస్త్రం – పత్తి, సహజ ఫైబర్ మరియు నూలు

సేవలు

• రైల్వే ప్రయాణం
• ఎకానమీ శ్రేణి విమాన ప్రయాణం
• క్యాబ్ అగ్రిగేటర్స్ (ఉదా. ఉబెర్ & ఓలా)

12% జిఎస్టి

వస్తువులు

• పాల ఉత్పత్తులు – వెన్న, చీజ్ (జున్ను), నెయ్యి
• ప్యాక్ చేయబడిన ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్)
• ఆహార పదార్థాలు – చిరుతిండ్లు (నామ్కీన్ & భుజియా), ప్యాక్ చేయబడిన చికెన్, సాసేజ్లు
• పానీయాలు – పండ్లరసాలు, ప్యాక్ చేయబడిన కొబ్బరి నీరు
• దుస్తులు- ఐఎన్ఆర్ 1000 కి పైగా
• వ్యక్తిగత పరిశుభ్రత – పళ్ళ పొడి
• స్టేషనరీ – కలరింగ్ బుక్స్, బొమ్మల పుస్తకాలు
• సామాన్య ఉపకరణాలు – కుట్టు మిషన్, గొడుగు
• ఆయుర్వేద మందులు
• అగర్బత్తీ
• మొబైల్ ఫోన్లు

సేవలు

• నాన్-ఎసి హోటల్స్ & రెస్టారెంట్లు
• బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం

18% జిఎస్టి

వస్తువులు

• పాల ఉత్పత్తులు – ఐస్ క్రీం
• నిల్వచేయబడిన కూరగాయలు
• ఆహార పదార్థాలు – ఫ్లేవర్డ్ శుద్ధి చేయబడిన చక్కెర, పాస్తా, కార్న్ ఫ్లాక్స్, పేస్ట్రీస్, కేకులు, జామ్స్, సాస్, సూప్స్, తక్షణ ఆహార మిశ్రమాలు, ప్రాసెస్డ్ ఆహారాలు
• పానీయాలు – మినరల్ వాటర్
• బ్రాండెడ్ దుస్తులు
• పాదరక్షలు- ఐఎన్ఆర్ 500 కు పైన
• వ్యక్తిగత పరిశుభ్రత – టిష్యూలు, టాయిలెట్ పేపర్, తలనూనె, సబ్బు బార్స్, టూత్‌పేస్ట్
• స్టేషనరీ – నోట్ పుస్తకాలు, ఎన్వలప్‌లు, సిరా (ఫౌంటెన్) పెన్నులు
• ఎలక్ట్రానిక్ సామగ్రి – ముద్రిత సర్క్యూట్లు, మానిటర్లు
• ఇనుము & స్టీల్ ఉత్పత్తులు
• బిడి చుట్టే ఆకులు (టెండు ఆకు)
• బిస్కట్లు
• వస్త్రాలు – మానవనిర్మిత ఫైబర్ మరియు నూలు

సేవలు

• మద్యం సేవలను అందించే ఎసి హోటల్స్ & రెస్టారెంట్లు
• టెలికాం సేవలు
• ఐటి సేవలు
• ఆర్థిక సేవలు
• పనుల కాంట్రాక్ట్

28% జిఎస్టి

వస్తువులు

• ఆహార పదార్థాలు – చాక్లెట్లు, చూయింగ్ గమ్, కస్టర్డ్ పౌడర్
• పానీయాలు – ఎరియేటెడ్ నీరు
• వ్యక్తిగత పరిశుభ్రత – డెయోడెరెంట్లు, షేవింగ్ క్రీమ్, షేవ్ అనంతర, హెయిర్ షాంపూ, డై, సన్‌స్క్రీన్, పెర్ఫ్యూమ్, ఫేస్ క్రీంస్, డిటర్జెంట్లు
• తెల్ల సరుకులు –వాక్యూమ్ క్లీనర్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, వాషింగ్ మెషీన్స్, డిష్ వాషర్స్, వాటర్ హీటర్స్ & ఇతర గృహోపకరణాలు
• స్పీకర్లు
• కెమెరాలు
• ఆటోమొబైల్స్ & మోటార్ వాహనాలు*
• హౌసింగ్ మెటీరియల్స్ – పెయింట్, వాల్‌పేపర్, సెరామిక్ టైల్స్, సిమెంటు
• బరువు తూచే యంత్రాలు, వితరణ (వెండింగ్) యంత్రాలు, ఎటిఎం
• బాణసంచా
• లగ్జరీ / అయోగ్య(డిమెరిట్) వస్తువులు * – పాన్ మసాలా, పొగాకు, బిడిస్, ఎరియేటెడ్ డ్రింక్స్ & మోటార్ వాహనాలు

సేవలు
  • స్టార్ హోటల్స్ లో రూములు మరియు రెస్టారెంట్లు
  • రేస్ కోర్సు బెట్టింగ్
  • సినిమా మొదలైనవి

*గమనిక – పైన జాబితాగా ఇవ్వబడినట్లుగా లగ్జరీ / అయోగ్య వస్తువులు జిఎస్టి రేటు 28% కు పైగా మించి పరిహారం సుంకాన్ని కూడా ఆకర్షిస్తాయి.

జిఎస్టి పన్ను రేట్ స్లాబ్ వెలుపలి వస్తువులు

• బంగారం, రత్నాలు, ఆభరణాలు – 3%
• ముతక వజ్రాలు – 0.25%

లగ్జరీ / అయోగ్య (డెమెరీట్) వస్తువులు వ్యవహరించబడే విధానం

వస్తువుల మరియు సేవల ప్రధాన విభాగానికి నిర్ణయించిన రేట్లకు అదనంగా, జిఎస్టి కౌన్సిల్ 5 లగ్జరీ / డెమెరీట్ అంశాలకు పరిహారం రేట్లు ఆమోదించింది. ఈ సుంకం ద్వారా వచ్చే ఆదాయం పరిహారం ఫండ్‌లోకి వెళ్తుంది, ఇది జిఎస్టి యొక్క మొదటి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాలకు కలిగే ఏదైనా పన్ను రాబడి మధ్య తేడాని పూరించడం కోసం ఉపయోగించబడుతుంది.

వాటిపై వర్తించే జిఎస్టి రేట్లకు పైన మరియు మించి పరిహారం సుంకం విధించబడేన వస్తువులు కింది విధంగా ఉంటాయి:

వస్తువులు వర్తించే జిఎస్టి రేటు ఆమోదించబడిన సుంకం రేంజ్
సుంకం సీలింగ్
బొగ్గు 5% ఐఎన్ఆర్ 400 / టన్ను ఐఎన్ఆర్ 400 / టన్ను
పాన్ మసాలా 28%60%135%
పొగాకు 28%61% – 204% ఐఎన్ఆర్ 4170 / వెయ్యి
ఎరియేటెడ్ డ్రింక్స్ 28%12%15%
మోటారు వాహనములు**28%1% – 15%15%

** గమనిక – 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యంగల కార్లు, ఇతర క్రీడలు మరియు లగ్జరీ కార్ల కోసం సుంకం 15% ఉంటుంది. చిన్న కార్లు కోసం సుంకం 1% ఉంటుంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

261,864 total views, 58 views today