జిఎస్టి రోల్-ఔట్ కి సిద్ధం కావడానికి మీకు కేవలం కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు మిమ్మల్ని మీరు వేసుకునే అనేక ప్రశ్నల్లో, ‘ జిఎస్టి కోసం మెరుగ్గా సిద్ధమై ఉండేటందుకు నా సిస్టమ్లో, నా పన్ను కన్సల్టెంట్ నుండి, లేదా వ్యాపార ప్రక్రియలలో నేను ఏ మార్పుల కోసం చూడాలి? అనేది బహుశా జాబితా పైన ఉండి ఉంటుంది.

ఈ వ్యాసం రాబోయే చట్టం కారణంగా కీలక ఆశలు మరియు మీ వ్యాపారంలో తలెత్తనున్న కొత్త నొప్పి పాయింట్లను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. జిఎస్టి చట్టం వరకు దారితీసిన రాజ్యాంగ సవరణ తర్వాత మేము మా ప్రయత్నాలను పునరుద్ఘాటించిన తర్వాత ఈ ఫలితాలు వెలికి వచ్చాయి. మార్కెట్లో ఉపయోగించటానికి అత్యంత సరళ జిఎస్టి పరిష్కారాన్ని అందించటానికి కొత్త వ్యాపార ప్రవర్తన మార్పులను గుర్తించటంలోనే మా పని అంతా జరిగింది.

మీకు ఇప్పటికే తెలిసినట్లుగా, జిఎస్టి అనేది ఇన్వాయిస్ మ్యాచింగ్ భావనపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ క్రింది విధాలుగా అది మీ వ్యాపార ప్రవర్తనను ప్రాథమికంగా మారుస్తుంది:

1. మీరు ‘ ఇన్వాయిస్ అప్లోడ్ పై చెల్లింపు ‘ ప్రవర్తనకు మారతారని మేము విశ్వసిస్తున్నాము

జిఎస్టి కి పూర్వపు యుగంలో; మీరు ఇన్వాయిస్ అందుకున్న తర్వాత మరియు మీ సరఫరాదారుకి చెల్లించవలసిన చెల్లింపును చేసినతర్వాత మీ లావాదేవీని పూర్తి చేయగలిగారు.. మీ పన్ను రిటర్నులను ఫైల్ చేయడానికి ముందే, ఇన్వాయిస్ పై పన్ను క్రెడిట్ వినియోగించుకోగలిగే సామర్ధ్యాన్ని కూడా ఎంతో భరోసాతో తీసుకోగలిగేవారు.
ఇప్పుడు జిఎస్టి నియమాలతో, ఇన్వాయిస్ మ్యాచింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే పన్ను క్రెడిట్ కు హామీ ఇవ్వబడుతుంది. మిమ్మల్ని మీరే వేసుకోవాల్సిన ప్రశ్న- పన్ను క్రెడిట్ తిరస్కరించబడలేదని లేదా అది తప్పు విలువను ప్రతిబింబిస్తోందని మీ నమ్మకాన్ని మీరు ఎలా పొందగలరు.

కాబట్టి, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. మొదట, మీ సరఫరాదారు ద్వారా జిఎస్టి వ్యవస్థకు ఒక ఇన్వాయిస్ అప్లోడ్ చేయబడుతుంది. అప్పుడు మీరు ఇన్వాయిస్లో ఉన్న మొత్తం డేటా సరియైనది మరియు మీ రికార్డులకు సరిపోతుందో లేదో తనిఖీ చేయడానికి ముందుకు సాగుతారు ( ఒకసారి ఇన్వాయిస్ మీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత). ఒకసారి ఇది ధృవీకరించబడిన తర్వాత మాత్రమే మీ సరఫరాదారుకి మీరు చెల్లింపు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పనిచేయడం, మొదలుపెట్టడానికి కొంతమంది సరఫరాదారులకు మొదలుకావచ్చు కానీ మీ సరఫరాదారులు అందరికీ ఇది ఒక సాధారణ ప్రక్రియ అవుతుంది.
మీకు చెల్లించే ముందు సంబంధిత అమ్మకాల ఇన్వాయిస్లను మీరు అప్లోడ్ చేయాలని మీ కస్టమర్లు కూడా ఆశిస్తారు. అందువల్ల, ‘ఇన్వాయిస్ అప్లోడ్ పై చెల్లింపు’ అనేది ఒక సాధారణ విషయంగా మారుతుందని మేము నమ్ముతున్నాము.

'Payment on Invoice Upload’ will become a common phenomenon under GST.Click To Tweet
2. మీరు ప్రభుత్వ పన్ను వ్యవస్థతో మరింత క్రమ పద్ధతిలో పరస్పరం స్పందిస్తూ వ్యవహరిస్తారు

జిఎస్టి యుగానికి ముందు, చాలా వ్యాపారాలకు ప్రభుత్వ పన్ను వ్యవస్థతో పరస్పర ప్రతిస్పందన అనేది ఏదో నెలలో ఒకసారి లేదా త్రైమాసికంలో ఒకసారి జరిగే విషయంగా ఉండేది.
అయితే, జిఎస్టి లో ‘ఇన్వాయిస్ అప్లోడ్ పై చెల్లింపు’ ప్రవర్తన ఇంతకుముందు ఎప్పటికంటే ఎక్కువగా ఈ పరస్పర ప్రతిస్పందనని మరింత తరచుగా చేస్తుంది.
ఇది మీరు, మీ వస్తువులు మరియు సేవల పన్ను ప్రాక్టీషనర్ (జిఎస్టిపి), లేదా మీ ఇద్దరి ద్వారా అప్లోడ్ చేయబడే ఒక ఇన్వాయిస్ తో ప్రారంభమవుతుంది. మరియు మీరు ఇద్దరూ కూడా అప్లోడ్ చేసే విషయంలో, డేటా గందరగోళానికి మూలం కావడం కంటే సమర్ధవంతంగా నిర్వహించబడి ఉండటం అవసరం.
మీరు మీ కొనుగోళ్ల కోసం ఇన్వాయిస్లను ఆమోదించడం కూడా ప్రారంభిస్తారు మరియు మీ సరఫరాదారుకు చెల్లించే ముందు ఇన్వాయిస్ల యొక్క వాస్తవ సమయ(రియల్ టైమ్) స్థితిని కోరతారు. వీటన్నింటి కోసం, మీరు ప్రభుత్వ పన్ను వ్యవస్థతో మరింత తరచుగా వ్యవహరించడానికి సిద్ధం కావాలి.

Prepare to engage more frequently with the Government Tax System under GST.Click To Tweet
3. కట్-ఆఫ్ తేదీలలో తీవ్ర స్థాయి ఆందోళన మీరు గమనిస్తారు

జిఎస్టి ముందు శకంలో, ఒక పన్ను రకం కోసం రిటర్న్ దాఖలు చేయడానికి ఒక్క కట్-ఆఫ్ తేదీ మాత్రమే ఉండేది. మీరు రిటర్నులను తయారు చేసి అప్లోడ్ చేసే, చెల్లించవలసిన పన్నులు చెల్లించే మరియు మీకు అక్నాలెడ్జెమెంట్లు అందజేసే మీ జిఎస్టిపికు సమాచారం అందించి ఉంటారు.

ఇప్పుడు, అప్లోడ్, మ్యాచింగ్, తప్పిపోయిన అప్లోడ్లు మరియు పన్ను చెల్లింపు ప్రక్రియకు వేర్వేరు కట్-ఆఫ్ తేదీలు, అంటే 10వ, 15వ, 17వ మరియు 20 వ తేదీల్లో ఉంటాయి. మరియు ఈ తేదీలలో ప్రతిఒక్క దానిలో, మీ రిటర్నులు విజయవంతంగా ప్రాసెస్ చేయబడ్డాయా లేదా అనే దానిపై ఆధారపడి ఆందోళన స్థాయిలు పెరిగే అవకాశాలున్నాయి.

ఇది ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికీ నెలలో వందల, వేయి లేదా ఇంకా లక్షలకొద్దీ ఇన్వాయిస్లు ఉంటాయి, మరియు అంతా ఒకచోటికి చేర్చబడిన జిఎస్టి వ్యవస్థకి సదరు నెలలో ప్రాసెస్ చేయబడవలసినవి అనేక బిలియన్ల ఇన్వాయిస్లు ఉంటాయి కాబట్టి. ఈ వ్యవస్థ సమాచారాన్ని నిల్వచేయడం మరియు అందించడం రెండింటికి చేస్తుందని భావిస్తే, అంత గొప్ప పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు జిఎస్టి నియమాల ఆధారంగా విజయం లేదా వైఫల్యం యొక్క ఫలితాలను అందించడానికి దానిని సమయం పడుతుంది. అటువంటి పరిష్కారాన్ని రూపొందించడానికి ఒక రెండు దశల ప్రక్రియ అవసరమవుతుంది; మొదటి దశ పన్ను చెల్లింపుదారు నుండి ప్రాసెస్ చేయడం కోసం డేటాను అందుకోవడం మరియు రెండో దశ ఏమిటంటే అందుకున్న డేటాకు (అసిన్క్రోనస్ ప్రవర్తనగా కూడా పిలుస్తారు) ఫలితాలను అందించడం.

దీనిని సరళీకృతం చేయడానికి ఒక ఉదాహరణ ఏంటంటే బ్యాంకు ఖాతాలో ఒక చెక్ ను జమ చేయడం మరియు ఆ మొత్తం క్రెడిట్ చేయబడిందని కాని క్లియరింగుకి లోబడి అనే సందేశాన్ని పొందడం. క్లియరెన్స్ విజయవంతమైందా లేదా అనేది మీరు తరువాతి సమయంలో తెలుస్తుంది.
ఈ అసమకాలిక (ఎసింక్రొనస్) ప్రవర్తనకు అర్ధం ఏమిటంటే కేవలం జిఎస్టి వ్యవస్థకు సమాచారాన్ని అప్లోడ్ చేయడం అనేది మీ కట్టుబడి ఉండే కార్యకలాపాన్ని పూర్తి చేయదు అని. ప్రాసెసింగ్ సమయం ఎక్కువ సేపు పడుతుంది కాబట్టి, ఆందోళన స్థాయిలు 4 కట్-ఆఫ్ తేదీలలో తారాస్థాయికి చేరతాయి. ఏవైనా వైఫల్యాలు లేదా విజయాల గురించి తెలియజేయబడతారని మీరు భావిస్తారు మరియు మీరు మీ సిస్టమ్ ని మూసివేసినప్పటికీ కూడా మీకు తెలియపరచబడాలి.

4. బహుళ స్థానాల నుండి ఎల్లలులేకుండా పనిచేసే ఒక వ్యవస్థ మీకు అవసరం

దాదాపు అన్ని వ్యాపారాలూ కూడా బహుళ ప్రాంతాల నుండి పనిచేస్తాయి. ఇది కనీసం రెండు స్థానాలతో మొదలవుతుంది; మీ వ్యాపార స్థానం మరియు మీ జిఎస్టిపి స్థానం. మీ వ్యాపారం గనక బహుళ స్థానాల నుండి పనిచేస్తూ ఉన్నట్లయితే, ఈ అసమకాలిక (ఎసింక్రొనస్) ప్రవర్తనకు అర్ధం ఏమిటంటే కేవలం జిఎస్టి వ్యవస్థకు సమాచారాన్ని అప్లోడ్ చేయడం అనేది మీ కట్టుబడి ఉండే కార్యకలాపాన్ని పూర్తి చేయదు అని. ప్రాసెసింగ్ సమయం ఎక్కువ సేపు పడుతుంది కాబట్టి, ఆందోళన స్థాయిలు 4 కట్-ఆఫ్ తేదీలలో తారాస్థాయికి చేరతాయి. ఏవైనా వైఫల్యాలు లేదా విజయాల గురించి తెలియజేయబడతారని మీరు భావిస్తారు మరియు మీరు మీ సిస్టమ్ ని మూసివేసినప్పటికీ కూడా మీకు తెలియపరచబడాలి.
కార్యాచరణ సంక్లిష్టత మరింత పెరుగుతుంది.
మీరు ఇన్వాయిసుల్లో కొన్ని మరియు మీ స్థానాల్లోని ప్రతిదాని నుండి ఇన్వాయిస్ మ్యాచింగును అప్లోడ్ చేయాలని ఆశించబడుతుంది. మీ జిఎస్టిపి అందుకోసం మీ నుండి సమాచారాన్ని మరియు ఇప్పటికే అప్లోడ్ చేయబడిన ఇన్వాయిస్ల కోసం జిఎస్టిఎన్ నుండి డేటాను తీసుకుంటారు. ఈ సేకరించిన సమాచారం ఆధారంగా, మీ జిఎస్టిపి రిటర్న్ లను సమర్పిస్తారు.
ఇది అంతా కూడా ఏకకాలంలో నిర్వహించబడే సంభావ్యత ఎంతగానో ఉంటుంది. బహుళ ప్రాంతాల నుండి ఏకకాలంలో కార్యకలాపాలలొ కట్టుబడి ఉండే డేటాలో ఎంతో అధిక స్థాయి సమగ్రత మరియు ఖచ్చితత్వం ఉండటం అవసరం. అందువల్ల, బహుళ వేర్వేరు వ్యవస్థలతో ఎల్లలు లేకుండా పనిచేసే మీ సామర్థ్యం అనేది మీ పుస్తకాలు మరియు కట్టుబడి ఉన్న రిటర్న్ లు మ్యాచ్ అయ్యేందుకు ఎంతో కీలకమైనది.

5. రిటర్నులను సంతకం చేయడంలో విశ్వాసానికి సహాయపడే ఒక వ్యవస్థ మీకు అవసరం

రిటర్న్ ఫైలింగ్ చేయడంలో చివరి దశకి మీరు సారాంశం (వ్యక్తిగత లావాదేవీలను కలిగి ఉండనిది) డౌన్లోడ్ చేసి ఒక రిటర్న్ సంతకం చేయడం అవసరం. మీరు సంతకం చేయడానికి ముందు, ఏదీ పెండింగ్లో లేదని మరియు మీరు సమర్పించినదానికి మరియు జిఎస్టిఎన్ మీకు పంపినదానికి మధ్య వ్యత్యాసం ఏదీ లేదని నిర్ధారించడం అనేది కీలకమైనది – ఇది ఒక సవాలుగా ఉంటుంది.
మీరు, మీ సరఫరాదారులు మరియు మీ కస్టమర్లు మీ రిటర్న్ లోకి వెళ్ళే సమాచారం యొక్క సంబంధిత విభాగాలను నవీకరించగలరని తెలుసుకోవడం ముఖ్యం. జిఎస్టిఎన్ వ్యవస్థ అసమకాలికంగా ఉన్నందున, దాని సారమంతా ప్రాసెసింగులో ఉండవచ్చు, అందువల్ల కొంత సమాచారం వెంటనే సారాంశంలో అందుబాటులో ఉండదు.
రిటర్నులను సంతకం చేయడంలో విశ్వాసం నెలకొల్పేందుకు పెంపొందించడానికి మీరు పైన పేర్కొన్న సమాచారం అంతా ఒక వ్యవస్థలో మిళితం చేయవలసి ఉంటుంది.

6. వ్యాపారాన్ని నడపడంపై దృష్టి కేంద్రీకరించి ఉండటానికి మీకు కట్టుబడి ఉండే సౌకర్యము అవసరం

ఈ నొప్పి పాయింట్లు మీ వ్యాపారంలో చాలా గందరగోళం కలిగించే అవకాశం ఉంది. వాస్తవానికి, సరిగ్గా నిర్వహించబడకపోతే, ఇది మిమ్మల్ని ఒక చెప్పుకోదగినంత సమయానికి బిజీగా ఉంచగలదు మరియు మీ వ్యాపారాన్ని నడపడం నుంచి సంభావ్యంగా మీ దృష్టని మరల్చగలదు.

జిఎస్టి వ్యవస్థకు సంబంధించిన అన్ని పెండింగ్ కార్యకలాపాలను సాధించడానికి “ఒక సరళమైన పారదర్శక దశ” కలిగి ఉండాలని మీరు కోరుకుంటారు. మరియు ఈ కట్టుబడి ఉండే సౌకర్యాన్ని తీసుకురావడం, తద్వారా మీ దృష్టి వ్యాపారం కొనసాగించడంలో మరియు అది జిఎస్టి కి కట్టుబడి ఉన్నదై ఉండేట్లుగా చూడటం అనేది టాలీ యొక్క లక్ష్యంగా ఉంటుంది
దయచేసి జిఎస్టి తీసుకొచ్చే వ్యాపార ప్రవర్తనలోని ఈ ఆరు మార్పుల పై మీ అభిప్రాయాలను పంచుకోండి.

మా తదుపరి వ్యాసం, మీ వ్యాపారానికి ఇంతముందు ఎప్పటికన్నా మరింత కీలకమై ఉండే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ (జిఎస్టిపి) యొక్క పాత్రను కవర్ చేస్తుంది,. దీని తర్వాత టాలీ ఇఆర్పి 9 యొక్క మా ఆరవ రిలీజ్ మీ కోసం ఈ ఆరు ప్రవర్తనా మార్పులను ఎలా సులభతరం చేస్తుంది అనే దానిపై మరొక వ్యాసం ఉంటుంది.
జిఎస్టి చట్టాలను మరియు మీ వ్యాపారంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరియు మా ఉత్పత్తి అప్డేట్లను పొందడానికి; దయచేసి మా బ్లాగుకు సబ్స్క్రైబ్ చేయండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

117,486 total views, 347 views today

Avatar

Author: Rakesh Agarwal

Head of Product Management